5, మార్చి 2025, బుధవారం

సమస్య - 5053

6-3-2025 (గురువారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సర్పంబును ముద్దులాడెఁ జాన ముదమునన్”
(లేదా...)
“సర్పముఁ బట్టి ముద్దిడెను చాన ముదంబున నిర్భయమ్మునన్”

22 కామెంట్‌లు:

  1. కందం
    దర్పణమునఁ జూచి ముఖము
    నర్పణఁ జేయంగ తనువు నాలియె తీరన్
    జేర్పున గని పతి చంపఁగ
    సర్పంబును, ముద్దులాడెఁ జాన ముదమునన్

    ఉత్పలమాల
    అర్పణఁ జేయఁగన్ బతికి నాలియె సోయగమంద చందమున్
    దర్పణమందునన్ గనుచు, దాపున నూర్పుల విన్న భర్తయే
    చేర్పున బుస్సు బుస్సుమని చేరగ వచ్చుట జూచి చంపఁగన్
    సర్పముఁ, బట్టి ముద్దిడెను చాన ముదంబున నిర్భయమ్మునన్

    రిప్లయితొలగించండి
  2. ఓర్పున చాక చక్యమున నొప్పగ
    కప్పల భక్షణార్థమై
    నేర్పున తిర్గుచుండగను నిత్యము
    గాంచి పొలంబునందునన్
    దర్పము తోడ బట్టుకొని తథ్యము
    తాను విషారికాని యా
    సర్పము బట్టి ముద్దిడెను చాన
    ముదంబున నిర్భయమ్మునన్.

    రిప్లయితొలగించండి
  3. దర్పము జుపుచు దేవుని
    కర్పించుటకొర కు పైడి యగమపు శయమున్
    తర్పణముగ జేయించిన
    సర్పంబును ముద్దులాడెఁ జాన ముదమునన్

    రిప్లయితొలగించండి
  4. అర్పించె మనసు వాడొక
    సర్పంబని తెలియరాక చాన యతనికిన్
    దర్ప మతిశయించిన నా
    సర్పంబును ముద్దులాడెఁ జాన ముదమునన్

    రిప్లయితొలగించండి

  5. కార్పణ్యము లేని హరిని
    తూర్పుదిశనుగాంచి యచట తోయలి యడలన్
    నేర్పునుజూపి పతి యడచ
    సర్పంబును, ముద్దులాడెఁ జాన ముదమునన్.


    దర్పణమందు బింబమును తా గనుచుండెడి పాళమందునన్
    తూర్పున కానవచ్చెనొక దుక్శృతి యంచును భీతిచెందగా
    నేర్పును జూపి భర్తయొక నేజ ధరించి క్రమించి నంతటన్
    సర్పముఁ బట్టి , ముద్దిడెను చాన ముదంబున నిర్భయమ్మునన్.

    రిప్లయితొలగించండి
  6. సర్పము వంటి వాఁడతఁడు, చాన యెరుంగక మోరకమ్ముగన్
    యర్పణ జేసి మానసము నాతని పత్నిగనయ్యె నక్కటా
    దర్పము పాదుకొన్న నొక ద్రాపుఁడు వాఁడను దెల్విమాలి యా
    సర్పముఁ బట్టి ముద్దిడెను చాన ముదంబున నిర్భయమ్మునన్

    రిప్లయితొలగించండి
  7. రిప్లయిలు
    1. కం॥ ఓర్పుగఁ బాములఁ బట్టెడు
      నేర్పును పొందిన మడతుక నెమ్మినిఁ గనుచున్
      జేర్పునఁ గనఁబడఁ బట్టుచు
      సర్పంబును ముద్దులాడెఁ జాన ముదమునన్

      ఉ॥ ఓర్పును గాంచి యింతి శ్రమకోర్చుచుఁ బాములఁ బట్టు రీతులన్
      నేర్పును బొంది యుండఁగను నెమ్మదిగాఁ దమ చేనుగట్టుకున్
      జేర్పునఁ బ్రాకు చుండఁగను శీఘ్రము చూపుచు జాకచక్యమున్
      సర్పముఁ బట్టి మద్దిడెను చాన ముదంబుగ నిర్భయమ్మునన్

      మడతుక స్త్రీ కుండలిని పాము (నిఘంటువు సహాయమండి)
      స్త్రీలకు రాని విద్యంటూ లేదండి


      తొలగించండి
  8. తూర్పున పద్మబాంధవుడె త్రోలగ తేరును వెల్గులేర్పడన్
    దర్పిత భావమగ్నమున దాగిన నాగము కాన వచ్చినన్
    నేర్పున భర్తకున్ఁదెలుప నిక్కము, నాథుఁడు సంపినంతటన్
    సర్పముఁ బట్టి, ముద్దిడెను చాన ముదంబున నిర్భయమ్మునన్!!

    రిప్లయితొలగించండి
  9. ఓర్పుగ తిలకించిరచట
    తర్పణమిడు పాములాట దర్పము తోడన్
    నేర్పున చేబూని మహా
    సర్పంబును ముద్దులాడెఁ జాన ముదమునన్

    దర్పము తోడనచ్చట ప్రదర్శితమయ్యెడు పాములాటనే
    యోర్పునఁ జూడనేర్పడిరహోయని పల్వురు బాటసారులే
    నేర్పుగ సాగినట్టిదగు నిత్యవినూతన కేళి యందునన్
    సర్పముఁ బట్టి ముద్దిడెను చాన ముదంబున నిర్భయమ్మునన్

    రిప్లయితొలగించండి
  10. సర్పముఁ జూచి భీతిలిన చక్కని చుక్కను గావనెంచుచున్
    నేర్పరియౌ ప్రియుండు గడు నిబ్బరమున్ జని ప్రక్కనున్న యా
    కర్పట మొక్క పట్టు నటు గప్పి చటుక్కున జుట్టి నిల్వగా
    సర్పముఁ బట్టి; ముద్దిడెను చాన ముదంబున నిర్భయమ్మునన్

    రిప్లయితొలగించండి
  11. నేర్పరి యగు ముదిత యొ కతె
    సర్పంబు ల బట్టి తె చ్చి చతురత మీరన్
    దర్పం బు ను జూపు చు నొ క
    స ర్పంబు ను ముద్దు లా డె జాన ముదము నన్

    రిప్లయితొలగించండి
  12. సర్పము నాడించి,నొకడు
    కర్పూర సువాసన పొడ కదలక నుండెన్
    దర్పముగను దరిచేరియు
    సర్పంబును ముద్దులాడెఁ జాన ముదమునన్

    రిప్లయితొలగించండి
  13. కం:అర్పించ మ్రొక్కు విగ్రహ
    మేర్పరచుచు నాగరాజు కెంతో తృప్తిన్
    కర్పూర హారతుల నిడి
    సర్పంబును ముద్దులాడెఁ జాన ముదమునన్”
    (నాగేంద్రుని విగ్రహం పెట్టించింది.ఆ విగ్రహాన్ని తృప్తి తో ముద్దాడింది.)

    రిప్లయితొలగించండి
  14. ఉ:సర్పనృపుండు వాసుకియె సంద్రము జిల్కగ తాడు కాగ,క
    న్నార్పక మోహినిన్ గన సురాసురు లెల్లరు, ముగ్ధనృత్యసం
    తర్పణ జేసి యెల్లరకు
    తాను విచిత్రపు దృశ్య మీయ నా
    సర్పముఁ బట్టి ముద్దిడెను చాన ముదంబున నిర్భయమ్మునన్”
    (క్షీతసాగరమథనం లో వాసుకి అనే సర్పరాజు ఉపయోగ పడ్డాడు.మోహినీ రూపం లో ఉన్న విష్ణువు అందరికీ వినోదాన్నిచ్చి నృత్యాలు చేస్తూ మధ్యలో ఆ పాముని ముద్దు పెట్టుకున్నాడు. విష్ణువు కాబట్టి ధైర్యం.నిజమైన స్త్రీ కాదు కాబట్టి అక్కడ తప్పు పట్ట వలసిందీ లేదు.)

    రిప్లయితొలగించండి
  15. (3)ఉ:ఆర్పెను వంశ గౌరవము నక్కట !నాగులు నీదు బిడ్డ నే
    నేర్పున వేసెనో వలను నీచకులమ్మను చింత లేక తా
    నర్పణ జేసె ప్రేమ జను లందరు జూడగ నిన్న పెండ్లి లో
    సర్పముఁ బట్టి ముద్దిడెను చాన ముదంబున నిర్భయమ్మునన్
    (ఆమె కులం కాని వాణ్ని ప్రేమించిందని ఆక్షేపణ.అతడి పేరు నాగులు.కోపం కొద్దీ ఆ సర్పం అన్నారు.)

    రిప్లయితొలగించండి
  16. రిప్లయిలు
    1. ఏర్పడఁ బ్రేమాతిశయము
      కార్పణ్యమ్మునను జేరి కాంచుచు నిజ ప
      త్యర్పిత శునకపు టా నుప
      సర్పంబును ముద్దులాడెఁ జాన ముదమునన్

      [ఉపసర్పము = సమీపించుట]


      దర్పము నూను నిత్యమును ధారుణి లోఁ దన కన్న మిన్న యౌ
      వార్పువుఁ బోడు లుండిన నవశ్యము దెల్పుఁ డటంచు నాకుఁ గం
      దర్ప సమాను నందమునఁ దద్దయుఁ బ్రీతి ఫణీంద్రుఁ బెన్మిటిన్
      సర్పముఁ బట్టి ముద్దిడెను జాన ముదంబున నిర్భయమ్మునన్

      తొలగించండి
  17. కూ ర్పది వెల్గగా నమరకోటి శుభమ్మన శీతశైలమం
    దర్పిత యయ్యె శంకరుని కా నగజాత తదర్ధదేహమై
    వేర్పడ నట్టి ధైర్య మని వెల్లడిఁజేన్ శివకంఠభూషయౌ
    సర్పము బట్టి ముద్దిడెను చాన ముదంబున నిర్భయమ్మునన్ !

    రిప్లయితొలగించండి
  18. సమస్య:
    సర్పముఁ బట్టి ముద్దిడెను చాన ముదంబున నిర్భయమ్మునన్”

    ఉ.మాల

    దర్పము మీరు బల్కులను దంబపు మారుడు పూ శరంబులన్
    నేర్పున వేయ, క్రోధమున నీల్గుచు, ముక్కను దెర్చి గాల్చగన్
    ఊర్పును నీయ వేడ రతి యూపిరి పోసియు నిల్పె సూత్రమున్
    చేర్పున రాగ గౌరి, హర చేసిన సైగల ఫణాగ్రమెత్తు నా
    సర్పముఁ బట్టి ముద్దిడెను, చాన ముదంబున, నిర్భయమ్మునన్”

    రిప్లయితొలగించండి

  19. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    తూర్పు దిశను జూచి సతియె
    సర్పము నొక్కటి భయపడి సామిని పిలిచెన్
    నేర్పుగ నాతడు చంపగ
    సర్పంబును;ముద్దులాడెఁ జాన ముదమునన్.

    రిప్లయితొలగించండి
  20. నేర్పుగ చక్కెర తోడను
    సర్పములను చేసి వనిత సంతోషముతో
    నోర్పుగ వేచి తుదకునా
    సర్పంబును ముద్దులాడె జానముదమువవ్





    సర్పము భర్తకంఠమున చక్కగ నాడుచు నుండగాంచుచున్
    సర్పమువంటిహైమజడశంకరు తాకినయంతవేగకం
    దర్పహరుంనపర్ణయునుతానట మోహము హెచ్చుచుండనా
    సర్పముబట్టిముద్దిడెనుచానముదంబుననిర్భయమ్మునన్

    రిప్లయితొలగించండి