18, మార్చి 2025, మంగళవారం

సమస్య - 5066

 19-3-2025 (బుధవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సరస మెఱుఁగని భర్తను సతియె మెచ్చె”
(లేదా...)
“సరస మెఱుంగనట్టి పతి సత్పురుషుండని మెచ్చె భార్యయే”

29 కామెంట్‌లు:

  1. తేటగీతి
    సరస విరసములన్నవి సతిపతులకుఁ
    చాటుమాటున చెల్లును సభ్యతయన
    మురిపెములఁదీర్చి, నల్గురిముందునెపుడు
    సరస మెఱుఁగని భర్తను సతియె మెచ్చె!


    చంపకమాల
    సరసములాడ దంపతులు సభ్యసమాజమునందు చాటుగన్
    సరియగు నంచు లోకమున సర్వులు పల్కెదరాలకింపఁగన్
    మురిపెము లెన్నొ పంచి తన ముచ్చటఁ దీరిచి, నల్గురుండగన్
    సరస మెఱుంగనట్టి పతి సత్పురుషుండని మెచ్చె భార్యయే!

    రిప్లయితొలగించండి
  2. తే॥ వ్యంగ్యమునె సరసమనుచు బాధ పెట్ట
    కుండ సామాన్వ వర్తనఁ గొంత ప్రేమఁ
    గలిగి కష్టనష్టములకుఁ గలత పడని
    సరస మెఱుఁగని భర్తను సతియె మెచ్చె

    చం॥ సరసమటంచు వ్యంగ్యమును సంఘటియించుచు బాధ కల్గెడున్
    విరుపుల తాను వర్తిలక వేడిన కోర్కెల వీలు నెంచుచున్
    మరువకఁ దీర్చు మానుషుఁడు మన్నన సేయు మగండు నంతగా
    సరసమెఱుంగనట్టి పతి సత్పురుషుండని మెచ్చె భార్యయే

    రిప్లయితొలగించండి
  3. వరసలు గల్పి పిల్చినను వాడల జాడకు పోడు నిష్ఠతో
    కురుల సుమంబులన్ విసిరి కూడగఁ బిల్వ నిరాకరించు తాన్
    నిరతము ధర్మచారిణికి నీమము తప్పక వారకాంత తో
    సరస మెఱుంగనట్టి పతి సత్పురుషుండని మెచ్చె భార్యయే!!

    రిప్లయితొలగించండి
  4. సరసము సతిపతుల మధ్య సాగుచుండు
    సహజ లక్షణమిది సర్వ సమ్మతంబు
    సున్నితపు సరమును గాక, సుద్ద మొరటు
    సరస మెఱుఁగని భర్తను సతియె మెచ్చె!

    రిప్లయితొలగించండి

  5. సద్గుణమ్ములు గలిగిన సహచరుండు
    ధరణిని పరకాంతలనిన తల్లులనుచు
    గౌరవించుచు నెప్పుడున్ వారితోడ
    సరస మెఱుఁగని భర్తను సతియె మెచ్చె.


    పరమము నందు భూరిగను భక్తిని గల్గి నిరాశ్రయుండ్రనన్
    గరుణను జూపుచున్ జనుల కష్టము దీర్చెడి వాడెయై భువిన్
    దరుణుల గౌరవించి యిల తల్లిసమానులటంచు వారితో
    సరస మెఱుంగనట్టి పతి సత్పురుషుండని మెచ్చె భార్యయే.

    రిప్లయితొలగించండి
  6. జీవితమున నేసతియైన చీదరించు
    సరస మెఱుఁగని భర్తను ; సతియె మెచ్చె
    చనవుతోపాటు తనమీద సమయమైన
    వలపు జూపించు చుండెడి పతిని సతము

    రిప్లయితొలగించండి
  7. సరసుడు బహు చక్కనివాడు శంబరారి
    మరియొక నెలతను గనని మంచివాడు
    రాణికర్పించు కాన్కలు క్రయమొనర్చ
    సరస మెఱుఁగని భర్తను సతియె మెచ్చె

    సరసుడు ప్రేమికుండు బహు చక్కని రూపసి మీనకేతుడే
    మరియొక కాంతకెప్డు తన మానసమందునఁ స్థానమీయడ
    ప్సరనయినన్ వరించడని భార్యకు కాన్కలకై క్రయంబులో
    సరస మెఱుంగనట్టి పతి సత్పురుషుండని మెచ్చె భార్యయే

    [సరసము = చవుక]

    రిప్లయితొలగించండి
  8. మధుర మంజుల భావాల మాట కారి
    సమయ సందర్బ మెరిగె డు సౌమ్య శీలి
    వలపు జూపించి మెలిగె డు వాడు మొ రటు
    సరస మెఱు గని భర్తను సతి యె మె చ్చె

    రిప్లయితొలగించండి
  9. తే.గీ:విటుని తో నిట్లు పలికెను వేశ్య యొకతె
    సరసునిన్ నిన్ను మే మెల్ల సన్నుతింప
    చచ్చు మొగ మైన మీ యిష్ట సఖుని జూడు
    సరస మెఱుఁగని భర్తను సతియె మెచ్చె”
    (నువ్వు సరసం తెలిసిన వాడివి కాబట్టి ఇంత మంది ఆడవాళ్కం మెచ్చుకున్నాం.అది లేని నీ స్నేహితుణ్ని పెళ్లాం ఒక్కతి తప్ప ఎవరూ మెచ్చరు అంది వేశ్య.ఆమె లాజిక్ ఆమెది.)

    రిప్లయితొలగించండి
  10. అందచందముల్ గల్గిన చంద్రుడతడు
    పెక్కు భాషలు మాట్లాడు ప్రేమి కుండు
    మంచి గుణములు కల్గిన మాని,మోటు
    సరస మెఱుఁగని భర్తను సతియె మెచ్చె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో ప్రాసయతి తప్పింది. *...గల్గిన చందురుండు* అనండి.

      తొలగించండి
  11. (3)చం:సరసుడు,సత్కవీంద్రు డని సర్వుల మెప్పులు బొందు బావగా
    రెరుగడు తోటికోడలికి నెన్నడు ప్రేమ నొసంగ గాని యే
    బిరుదులు లేని నా మగడె ప్రేమగ జూచును నన్ను కైతలన్
    సరస మెఱుంగనట్టి పతి సత్పురుషుండని మెచ్చె భార్యయే”
    (బావగారు కవిత్వం లో సరసత కానీ పెళ్లాన్ని పట్టించుకోడు.ఆ కవిత్వపు సరసాలు లేని మా ఆయన నయం అని తోటికోడలి ఎక్కిరింత.)

    రిప్లయితొలగించండి
  12. (4)చం;"సరసుడు కృష్ణుడే,తనను సత్యయె తన్నగ బ్రేమ జూపె, నెం
    దరు సతు లున్ననేమి? యొక దారకె కష్టము లిచ్చె రాముడం
    చెరుగరు స్త్రీ" లనంగ పతి, యిట్లన రాదయ పల్వు రాండ్లతో
    సరస మెఱుంగనట్టి పతి సత్పురుషుండని మెచ్చె భార్యయే”
    (ఎందరు భార్య లుంటేనే? భార్యా కాలితో తన్నినా కృష్ణుడు ఓపిక పట్టాడు.రాముడు కట్టుకున్న ఒక్క భార్యనే కష్ట పెట్టాడు.అంటే "ఏమైనా సరే.ఒక్క భార్య అనేదే గొప్పదనం అని భార్య అంది.)

    రిప్లయితొలగించండి
  13. భాషణమ్ములఁ జతురుని రోష మన్న
    దెఱుఁగని తనకు సంతత మెలమి నొసఁగు
    సుదతులఁ గడింది గౌరవించు వికటంపు
    సరస మెఱుఁగని భర్తను సతియె మెచ్చె


    తరుణుల పైన గౌరవము తప్పక చూపును జిత్త శుద్ధితోఁ
    గరుణ గలట్టి యుత్తముఁడు కైతవ మన్నది నేరఁ డెన్నఁ డే
    నరయగ స్వప్నమం దయిన నన్య లతాంగుల చెంత నాడఁగా
    సరస మెఱుంగ నట్టి పతి సత్పురుషుండని మెచ్చె భార్యయే

    రిప్లయితొలగించండి
  14. తే.గీ.॥
    ఇంతి నెక్కుడు ప్రేమగా నేలుకొనుచు
    కోర్కెలన్నియు దీర్చును కూర్మితోడ
    నెపుడుఁ గోపించి యెఱుఁగడు కపటమైన
    సరస మెఱుఁగని భర్తను సతియె మెచ్చె

    చంపకమాల:
    నిరతము నాలి సేమమును నిండు మనంబున వాంఛ చేయుచున్
    మరువక నామె యక్కఱను మాన్యముగా నెరవేర్చుచున్ సుధా
    భరితమొనర్చు కాపురము పత్నికి తోడుగనుండి కల్కమౌ
    సరస మెఱుంగనట్టి పతి సత్పురుషుండని మెచ్చె భార్యయే

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఇంటి పనులందు సాయము నెంతొ చేసి
    కూర్మిని మెలగి తీర్చుచు కోర్కెలన్ని
    కినుక చూపక నెప్పుడు కృత్రిమమగు
    సరస మెఱుగని భర్తను సతియె మెచ్చె.

    రిప్లయితొలగించండి
  16. బుద్ధిమంతు డతడు కోర బోడు పరుల
    నేదియైననుగానితా నెప్పుడైన
    వలపు పంచు సతికెపుడు పర పడతుల
    *"సరస మెఱుఁగని భర్తను సతియె మెచ్చె”*
    మురిపెము చూపుచున్ సతము ముచ్చటలాడుచు తీర్చుకోర్కెలన్
    దురుసుగ మాటలాడకనుతోషము నింపుచు నల్ల వేళలన్
    కరమతి ప్రీతిచూపుచును కాంక్షనుచూపక నన్యకాంతతో
    *“సరస మెఱుంగనట్టి పతి సత్పురుషుండని మెచ్చె భార్యయే”*

    రిప్లయితొలగించండి