జల్పము ఊరకమాటలాడెడి యుపయుక్తము కాని మాట (నిఘంటువు సహాయమండి)
ధర్మజుని నుండి మనము నేర్వవలసిన పాఠమిదే! (కన్నడ భాషలో అంతూ ఇంతూ కుంతీ మక్కళిగె రాజ్య యిల్ల - ఏది ఏమైన కుంతీ పిల్లకు రాజ్యము లేదు అనే సామెత ఉన్నదండి) జూదమాడి గెలుచుట కల్ల. ఒకరోజు గెలిచినా తరువాత పోవడం ఖాయమండి.
(1)కం:రైతన్నకు,కాలమునకు ద్యూతమ్మే విధిగ నుండు నో కర్షకుడా యీ తరి నీదే గెలుపగు ద్యూతమునన్ దొలఁగిపోవు దుఃఖములెల్లన్” (వ్యవసాయాన్ని గూర్చి "అగ్రికల్చర్ ఈజ్ ఎ స్పెక్యులేషన్ విత్ మాన్సూన్" అని ఒక సామెత ఉంది.జూదం లో ఈసారి నువ్వు గెలుస్తావు లే అని ఆశావాదం.) (2)చం:వగ పది యేల యల్లుడ! జవమ్మున గెల్తువె పాండుసూనులన్? పగ యొకటున్న చాలునె ?యుపాయము సేమము, ద్యూత మన్న నిం పగు గద ధర్మసూనునకు నా బలహీనత నీ వరమ్మె గా! అగణిత దుఃఖజాలముల నంత మొనర్చెడి దొక్క ద్యూతమే” (అని శకుని దుర్యోధనునికి ఒక హింట్ ఇచ్చాడు. )
కౌతుకమన్నది పూర్తిగ
రిప్లయితొలగించండిద్యూతమునన్ దొలఁగిపోవు; దుఃఖములెల్లన్
ద్యోతకమౌ నిశ్చయముగ
ద్యూతము విడువంగవలయు దుండగులైనన్
సుగుణములెన్నియున్న పొడచూపుట తథ్యము కష్టనష్టముల్
తొలగించండిజగడము తప్పకుండు గద జాతకమే మరి క్రిందుమీదగున్
బగలకు తావుగాదె మరి పండితులివ్విధి తెల్పియుండిరా
'అగణిత దుఃఖజాలముల నంత మొనర్చెడి దొక్క ద్యూతమే'
ద్యూతము మార్చు బికారిని
రిప్లయితొలగించండిభూతలమున భాగ్యములకు భూమమువోలెన్
చేతమున శంక వీడుము
ద్యూతమునన్ దొలఁగిపోవు దుఃఖములెల్లన్
జగమున నెల్లమానవులు జర్గిన
రిప్లయితొలగించండిసత్యము నెర్గి నట్టిదే
వగచిరి పాండవేయులును బాపము
ద్యూతములోన నోడియున్
తగదిటలాడ నెవ్వరు నధర్మపు
మాటలు సత్యహీనులై
"అగణిత దు:ఖజాలముల నంతమొ
నర్చెడు ద్యూతమొక్కటే."
తగని విచారమెందులకు తప్పక నీపరి గెల్పు నీదెలే
రిప్లయితొలగించండిమిగిలిన పైకమంతయును మేలుగనొడ్డుము ద్యూతమందునన్
వగపు లయించు నీకికను భాగ్యములబ్బును నిశ్చయమ్ముగా
నగణిత దుఃఖజాలముల నంత మొనర్చెడి దొక్క ద్యూతమే
రిప్లయితొలగించండినాతి దయాభిక్ష యనె యప
ఖ్యాతిని భరియింప నేల గరలను గొను జా
మాతా యిప్పుడు గెలచిన
ద్యూతమునన్ దొలఁగిపోవు దుఃఖములెల్లన్.
వగచు కులాంగనన్ గని నృపాలుడు సాకతమున్ వరమ్ముని
చ్చెగద పడంతివల్ల దరిచేరిన సాధనమున్ గ్రహింతురే
జగతిని వీరుడెవ్వడును సారెల నందుకొ పాండునందనా
యగణిత దుఃఖజాలముల నంత మొనర్చెడి దొక్క ద్యూతమే.
దుర్యోధనుడు ధర్మరాజును ప్రాణములతో పట్టి తెమ్మని ద్రోణుని కోరుట:-
రిప్లయితొలగించండిమిగలము పాండవేయులిట మేటిగ యుద్ధముఁ జేయుచుండగన్
తగవున ద్రోణ!నీవికను ధర్మనృపాలుని కట్టి దెచ్చినన్
సొగసుగ పంపమే మరల జూదమునందున గెల్చి కానకే
యగణిత దుఃఖజాలముల నంత మొనర్చెడి దొక్క ద్యూతమే!!
రారాజుతో శకుని:
రిప్లయితొలగించండికందం
ఘాతకి నవ్వ మయసభన్
యాతనఁ బడఁబోకు, పాండవాగ్రజు నోడన్
జేతును నాదగు మాయా
ద్యూతమునన్ దొలఁగిపోవు దుఃఖములెల్లన్!
చంపకమాల
వగవకు ద్రౌపదిన్ దలచి, వారి నరణ్యపు దారి పంపెదన్
దిగులిక మానుమా! వినుము తీరిచినాడను వ్యూహ మొక్కటిన్
సుగమపు రీతి ధర్మజుని జూదరి మాయల నోడఁ జేతు నీ
యగణిత దుఃఖజాలముల నంత మొనర్చెడి దొక్క ద్యూతమే!
ఏ తీరుగ పొడగనినను
రిప్లయితొలగించండిచాతుర్యము జూపుచుండి చక్కగ వలనౌ
భాతిగ నాడెడు జీవిత
ద్యూతమునన్ దొలఁగిపోవు దుఃఖములెల్లన్
కం॥ యాతనఁ బడి పాండవులటు
రిప్లయితొలగించండినీతినిఁ బాసిన పతనమనిఁ దెలిపిరి కదా
ద్యోతక మయ్మె నిజమెటుల
ద్యూతమునన్ దొలఁగిపోవు దుఃఖములెల్లన్
చం॥ అగణిత దుఃఖజాలముల నంతమొనర్చెడి దొక్క ద్యూతమే!
జగమున సత్యదూరమగు జల్పమునాడ ఫలమ్ము నెద్దియో
సుగుణపు ప్రోవు ధర్మజుఁడు సూక్ష్మముఁ దెల్పనె తానె యాడుచున్
వగపులు మాయఁ జేసి యిడు భార్యకు సంతుకు నిల్లు గుల్లయౌ!
జల్పము ఊరకమాటలాడెడి యుపయుక్తము కాని మాట (నిఘంటువు సహాయమండి)
ధర్మజుని నుండి మనము నేర్వవలసిన పాఠమిదే!
(కన్నడ భాషలో అంతూ ఇంతూ కుంతీ మక్కళిగె రాజ్య యిల్ల - ఏది ఏమైన కుంతీ పిల్లకు రాజ్యము లేదు అనే సామెత ఉన్నదండి)
జూదమాడి గెలుచుట కల్ల. ఒకరోజు గెలిచినా తరువాత పోవడం ఖాయమండి.
కం॥ పద్యము 3 వపాదము ద్యోతక మయ్యె నండి పొరపాటున మయ్మ అని వ్రాసాను
తొలగించండి(శకుని దుర్బోధ)
రిప్లయితొలగించండిఅగణిత దుఃఖజాలముల నంత మొనర్చెడి దొక్క ద్యూతమే
తగిన ప్రతిక్రియావిధియు తప్పక నార్పు పరాభవాగ్ని నీ
పగతుర భోగ భాగ్యములవశ్యము వశ్యమొనర్చు పాచికల్
మగువయు నీదు దాసి యగు మానధనా విను మామ మాటలన్
జీతము చాలక మిక్కిలి
రిప్లయితొలగించండియాతన తో కుములు వాడు నార్తి గ నడుగన్
జ్యోతి ష్యు డి ట్లు చె ప్పెను
" ద్యూ త ముతో తొలగి పోవు దుఃఖ ము లెల్లన్ "
నీతిగ బ్రతుకుచు నుండగ
రిప్లయితొలగించండినాతియు రోజూ తగవులు నగదుయు కొరకున్
క్షేత్రియు చేసెను యోచన
ద్యూతమునన్ దొలఁగిపోవు దుఃఖములెల్లన్
(1)కం:రైతన్నకు,కాలమునకు
రిప్లయితొలగించండిద్యూతమ్మే విధిగ నుండు నో కర్షకుడా
యీ తరి నీదే గెలుపగు
ద్యూతమునన్ దొలఁగిపోవు దుఃఖములెల్లన్”
(వ్యవసాయాన్ని గూర్చి "అగ్రికల్చర్ ఈజ్ ఎ స్పెక్యులేషన్ విత్ మాన్సూన్" అని ఒక సామెత ఉంది.జూదం లో ఈసారి నువ్వు గెలుస్తావు లే అని ఆశావాదం.)
(2)చం:వగ పది యేల యల్లుడ! జవమ్మున గెల్తువె పాండుసూనులన్?
పగ యొకటున్న చాలునె ?యుపాయము సేమము, ద్యూత మన్న నిం
పగు గద ధర్మసూనునకు నా బలహీనత నీ వరమ్మె గా!
అగణిత దుఃఖజాలముల నంత మొనర్చెడి దొక్క ద్యూతమే”
(అని శకుని దుర్యోధనునికి ఒక హింట్ ఇచ్చాడు. )
ఆతతముగ నరులకు సం
రిప్లయితొలగించండిపాతము లిక్కట్టు లెల్లఁ బాచిక లాడన్
జ్ఞాతులతో దూరీకృత
ద్యూతమునన్ దొలఁగిపోవు దుఃఖము లెల్లన్
జగతిని నున్నఁ బ్రాణములు సంకట సంచయ ముండు నేరికిన్
వగ లవి మాయ మౌను గద ప్రాణము లాత్మను వీడిపోవఁగా
విగత నిజాసు జాలముల వేగమ కాంచ యమాలయమ్మునే
యగణిత దుఃఖజాలముల నంత మొనర్చెడి దొక్క ద్యూతమే
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
పాతకమగు పాలుగొనిన
ద్యూతమునన్; దొలగిపోవు దుఃఖములెల్లన్
గీతను నమ్మిక తోడను
ప్రాతఃకాలమున రోజు పఠియించినచో.