ఉ:నమ్మక మెంతొ గల్గునటు నవ్వుచు ద్రౌపది యిట్లు బల్కె "పా కమ్ముల లోన నీ వలలు కమ్మని రీతులె పేరు గాంచె, పూ ర్వమ్మున నెవ్వరున్ విరట రాజ జయించిరె? వీని మించుచున్ కమ్మగ వండి పెట్టఁగల కాంతలు గానఁగ రారు మేదినిన్” (విరటుడి ముందు భీముని వంట గొప్పదని ద్రౌపది ప్రశంసించింది.ఇతని కంటే మంచి వంట మా ఆడవాళ్లమే చెయ్య లేము అనిచమత్కారం గా నవ్వింది.)
కందం
రిప్లయితొలగించండిఇమ్ముగ రాగము వంచుచు
నెమ్మది రుచిలెన్నొ వండు నీమముతోడన్
నమ్మగ శ్రీమతి మించుచు
కమ్మగ వండెడి వనితలు గలరే భువిపై?
ఉత్పలమాల
ఇమ్ముగ రాగమున్ గురిసి యింతిగ నా గృహమందు నిత్యమున్
నెమ్మది వండుచున్ రుచులు నీమముదప్పక వండివార్చఁగన్
నమ్ముడు నాదు దృష్టిఁగని నర్మిలి నాదగు దార మించుచున్
గమ్మగ వండి పెట్టఁగల కాంతలు గానఁగ రారు మేదినిన్?
గుమ్మడి నిదెచ్చి సతికిడి
రిప్లయితొలగించండిఅమ్మ సలిపెడు విధముగనె నమరుచు మనగా
కిమ్మన కుండ తినునటుల
కమ్మగ వండెడి వనితలు గలరే భువిపై
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం॥ నెమ్మిని భోజన మెఱుఁగక
తొలగించండిసొమ్ముల నిడి తిండిఁ గొనెడు చోద్యము విరియన్
గొమ్మల పాకము నరుదై
కమ్మగ వండెడి వనితలు గలరే భవిపై
ఉ॥ ఇమ్ముగ నమ్మ వంటకముల నెప్పుడు మెచ్చెడి వారు చూడఁగన్
గ్రమ్మిన కాలమార్పులను కాంతలు ద్రవ్యముఁ బొందఁ దల్చఁగన్
సొమ్ములఁ బోసి తిండికొను చోద్యమె మించగ సత్యవాక్కెయౌ
కమ్మగ వండి పెట్టగల కాంతలు గానఁగ రారు మేదినిన్
బమ్మెర పోతన వ్రాసిన
రిప్లయితొలగించండికమ్మని భాగవతము సరి కావ్యము నేదీ?
అమ్మగ మిన్నగ వారలు
కమ్మగ వండెడి వనితలు గలరే!భువిపై?
రిప్లయితొలగించండినెమ్మదిగ జేయనేమిర
పమ్మని భావింపబోకు వంటలలో నా
కొమ్మ, కళత్రము మించుచు
కమ్మగ వండెడి వనితలు గలరే భువిపై.
ఇమ్మహి నెన్నొ ప్రాంతములకేగితి నాప్తులు మిత్రబృందముల్
రమ్మని పిల్వగా నొడయురాలిని గైకొని దేశమంతటన్
కొమ్మలు వండినట్టి పలుకూరలు నాసతి కన్న నించుకన్
గమ్మగ వండి పెట్టఁగల కాంతలు గానఁగ రారు మేదినిన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఇమ్మహిలో కీర్తిగొనిరి
రిప్లయితొలగించండికమ్మని పాకపు పచనముకై నలభీముల్
నమ్మక తప్పని భావన
కమ్మగ వండెడి వనితలు గలరే భువిపై
ఇమ్మహిలో ప్రసిద్ధమన నిద్దరివే నలభీమపాకముల్
నమ్మక తప్పదీనిజము నవ్యవరానన లొప్పకుండినన్
గొమ్మలు వంటయిల్లుఁ విడి కోరిన కొల్వులఁ జేరినారుగా
కమ్మగ వండి పెట్టఁగల కాంతలు గానఁగ రారు మేదినిన్
ఇమ్మహిఁ నమ్మల వంటలు
రిప్లయితొలగించండిపమ్మిన పెమ్మెమ్మునిమ్ము పరికించంగన్
అమ్మల వంటల కన్నను
కమ్మగ వండెడి వనితలు గలరే భువిపై
అమ్మగ నాకలి తీర్చుచు
రిప్లయితొలగించండిసమ్మతి గల యో గిరములు చవు లూ రించ న్
గమ్మత్తు గ చే య గలుగు
కమ్మగ వండె డి వనితలు గలరే భువి పై?
అమ్మయెఁదాభరించెనననాగని నొప్పులుఁ గన్ననాడు హే
రిప్లయితొలగించండిమమ్ముగ గోఱుముద్దలవి మాయపు మాటల మూటలయ్యె లే!
నమ్ముమనమ్ముతోడు నవినాశము లేకయె సాటిలేనివై
కమ్మగ వండి పెట్టఁగల కాంతలు గానఁగ రారు మేదినిన్
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
కం:అమ్మ యొకతె వంకాయను
రిప్లయితొలగించండికమ్మగ వండ ,నొక కాంత కాకర కాయన్
కమ్మగ వండును సకలము
కమ్మగ వండెడి వనితలు గలరే భువిపై”
ఉ:నమ్మక మెంతొ గల్గునటు నవ్వుచు ద్రౌపది యిట్లు బల్కె "పా
రిప్లయితొలగించండికమ్ముల లోన నీ వలలు కమ్మని రీతులె పేరు గాంచె, పూ
ర్వమ్మున నెవ్వరున్ విరట రాజ జయించిరె? వీని మించుచున్
కమ్మగ వండి పెట్టఁగల కాంతలు గానఁగ రారు మేదినిన్”
(విరటుడి ముందు భీముని వంట గొప్పదని ద్రౌపది ప్రశంసించింది.ఇతని కంటే మంచి వంట మా ఆడవాళ్లమే చెయ్య లేము అనిచమత్కారం గా నవ్వింది.)
కొమ్మా వినుమ సకల జన
రిప్లయితొలగించండిసమ్మతమౌ రీతిఁ బంచ సంచిత నక్ష
త్రమ్ముల యన్నాలయమునఁ
గమ్మగ వండెడి వనితలు గలరే భువిపై
పమ్మిన వేడ్క హెచ్చిన కృపా రస వీక్షల వారి వారి డెం
దమ్ముల సుంతయున్ విసుగు దాల్పక మిక్కుట మైన ప్రీతితో
నిమ్మన కెట్టి జీతమును నెన్నఁడు సాటిగ దార కమ్మకుం
గమ్మగ వండి పెట్టఁ గల కాంతలు గానఁగ రారు మేదినిన్
సమస్య:
రిప్లయితొలగించండికమ్మగ వండి పెట్టఁగల కాంతలు గానఁగ రారు మేదినిన్
గమ్మున సీమ దారి చని గాయపు పెద్దల లెక్కచేయకన్
ఇమ్మడి ముమ్మిడౌ ధనము నీయక దాచిరి కన్నవారికిన్
కమ్మని తల్లి చేతి రుచి కాంతయు మర్వగ చేయనచ్చటన్
కమ్మగ వండి పెట్టఁగల కాంతలు గానఁగ రారు మేదినిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండినెమ్మిని పంచుచు సతతము
నిమ్ముగ చూపుచు మమతను నెల్లరి పైనన్
నమ్మగ ననవరతంబును
*కమ్మగ వండెడు వనితలు కలరే భువిపై*
సమ్మతమయ్యె నేడిదియు సత్త్వము తగ్గుట తోడ హెచ్చెగా
సొమ్మది వెచ్చమైన నిక చూడక నింటికె వంట లెల్లయున్
నమ్మిక తోడ వచ్చునను నాతుల సంఖ్యయురోజురోజుకున్
*కమ్మగ వండి పెట్టగల కాంతలు గానగ రారు మేదినిన్*