మ:వినతానందన వాహనుండు హరి యే వేడన్ గృపన్ గాచె గా! వినతానందను డగ్రజుండయి హరిన్ బ్రేమించె గా రాముడై! వినతానందనుఁ డాగ్రహించి హరిఁ జంపెన్ గ్రుద్ధుఁడై పోరునన్” డన యాహారము గాన నే హరికి నర్థమ్మేదొ యూహిమింపుమా! (మొదటి పాదం లో హరి కి ఏనుగు అని,రెండవ పాదం లో హరికి విష్ణువు అని,రాము డంటే బలరాము డని,మూడవ పాదం లో హరి అంటే పాము అని అర్థం.)
వైనతేయుఁడు విష్ణుని వాహనమ్ము
రిప్లయితొలగించండిబంటువలె సేవలందించు భక్తవరుఁడు
పాలసునివోలె యిట్టుల పలుకనగునె
విష్ణువునుఁ జంపెఁ గోపించి వినత కొడుకు
తేటగీతి
రిప్లయితొలగించండితల్లి దాసీత్వమున్ బాప దల్మిగెలిచి
యమృతమున్ దెచ్చు సమయాన నాకలిఁగొని
జనని యాజ్ఞ పుళిందుల తినఁగ, వేడి
విష్ణువునుఁ, జంపెఁ గోపించి వినత కొడుకు
మత్తేభవిక్రీడితము
ఘనతన్ గెల్చి గ్రహింప కంజమును సంగ్రామమ్మునన్ బల్మితో
జననిన్ దాసిగఁ జూడలేక తదవస్థన్ బాప నోడించుచున్,
వినతానందనుఁ డాగ్రహించి హరిఁ, జంపెన్ గ్రుద్ధుఁడై పోరునన్
తినగా నెంచి, విభావసున్ గజముగన్ దీరన్, క్షుదాత్రంబునన్
రిప్లయితొలగించండిపతగ సమ్రాట్టు శాల్మలి పాపమేపు
డనవరతము వాహనమయి యక్షధరుని
భక్తితో కొలుచు కనక పక్షుడెట్లు
విష్ణువునుఁ జంపెఁ గోపించి వినత కొడుకు.
జననీకద్రువ యానతిన్ గొనుచు నాజానేయ లాంగూలమున్
తనయుండ్రాధ్వజులెల్ల కప్పుచును మాతన్ వారు వంచింపగా
గని పంతమ్మునుబూని వంచకులు గోకర్ణమ్ము లంచున్ గదా
వినతానందనుఁ డాగ్రహించి హరిఁ జంపెన్ గ్రుద్ధుఁడై పోరునన్.
(హరి .. పాము)
తే||గీ||
రిప్లయితొలగించండిపురము నందలి నాటక మున , పలు రక
వేష ధారుల మధ్యన వేరముండి
తనకు మించి వా నికధిక ధనమమరగ
“విష్ణువునుఁ జంపెఁ గోపించి వినత కొడుకు”
ఘనుడా కస్యప నందనుండు హరికిన్ గణ్యంపు దాసుండు పా
రిప్లయితొలగించండివనుడాతండు నిరంతరంబజునకున్ భక్తుండు తానెన్నడున్
వినయుండై చరియించు వాహనముగా విశ్వాత్మకున్, యెవ్విధిన్
వినతానందనుఁ డాగ్రహించి హరిఁ జంపెన్ గ్రుద్ధుఁడై పోరునన్
కశ్యప
తొలగించండిమును కౌటిల్యముఁ జూపి బానిసలుగా మోసంబునన్ జేసెఁ గా
రిప్లయితొలగించండివున సర్పంబుల పైన కోపధరుడై పుణ్యంబు పాపంబులన్
మునకల్ వేయక గట్టి పాత పగతో మూర్ధంబు పైకెత్తగా
వినతానందనుఁ డాగ్రహించి హరిఁ జంపెన్ గ్రుద్ధుఁడై పోరునన్!!
హరి= పాము
'విష్ణువునుఁ జంపెఁ గోపించి వినత కొడుకు'
రిప్లయితొలగించండివిబుధులెవ్వరు తెల్పిరీ వింతకథను
తల్లి దాస్య విముక్తికై తార్క్ష్యుడేగి
వేల్పుబువ్వను గొనితెచ్చె వేగిరమ్ము
'వినతానందనుఁ డాగ్రహించి హరిఁ జంపెన్ గ్రుద్ధుఁడై పోరునన్'
వినలేదెన్నడు నివ్విధంబగు కథన్ విద్వన్మణుల్ తెల్పగా
జననీదాస్యవిముక్తి నెంచి సుధకై సంగ్రామమే సల్పగా
వినతానందనుడౌ త్రిశంకువు భళా! విఖ్యాతినొందెంగదా
తే.గీ:అమృతభాండమ్ము దెచ్చె, దాస్యమును బాపె
రిప్లయితొలగించండిదల్లికిన్, భక్తి తోడుత దాను మోసె
విష్ణువునుఁ, జంపెఁ గోపించి వినత కొడుకు
సర్పముల వాని గర్వముల్ సడల జేసి
వినిన వారంత నవ్వరే వింత యనుచు
రిప్లయితొలగించండినె చట జరుగక కల్పించి యిటుల బల్క
నుచిత మే కాదు వాగుకు మో యి యె ప్పు డు
విష్ణువు ను జంపె గోపించి వినత కొడుకు?
మ:వినతానందన వాహనుండు హరి యే వేడన్ గృపన్ గాచె గా!
రిప్లయితొలగించండివినతానందను డగ్రజుండయి హరిన్ బ్రేమించె గా రాముడై!
వినతానందనుఁ డాగ్రహించి హరిఁ జంపెన్ గ్రుద్ధుఁడై పోరునన్”
డన యాహారము గాన నే హరికి నర్థమ్మేదొ యూహిమింపుమా!
(మొదటి పాదం లో హరి కి ఏనుగు అని,రెండవ పాదం లో హరికి విష్ణువు అని,రాము డంటే బలరాము డని,మూడవ పాదం లో హరి అంటే పాము అని అర్థం.)
తల్లి వినత చెప్పిన దంత తలఁచి తలఁచి
రిప్లయితొలగించండిదోషముల నెంచి మది లోనఁ దొడరి తొడరి
పేరున హరి యయి నడతఁ గ్రూరుఁ డైన
విష్ణువునుఁ జంపెఁ గోపించి వినత కొడుకు
చనునే చేసిన పాప మూరకను విశ్వంబందు నెవ్వారికిన్
వినినన్ మాతృక దాస్య కారణమహో వేవే ప్రదర్శించి చే
వను గద్రూ ప్రియ సూను స్వీయ జననీ బాధా ప్రదాయిన్ ఖలున్
వినతానందనుఁ డుద్యమించి హరిఁ జంపెం గ్రుద్ధుఁడై పోరునన్
[హరి = పాము]
ఆగ్రహించి- క్రుద్ధుఁడై – పునరుక్తి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి“వినతానందనుఁ డాగ్రహించి హరిఁ జంపెన్ గ్రుద్ధుఁడై పోరునన్”
రిప్లయితొలగించండిజననీదాస్యవిముక్తి కై సుతుడు తాఁ స్వర్గంబు కేగంగగన్
అనుపాల్యంబగు నాసుధన్ యురగముల్ సంరక్షణే చేయగన్
తన వేగంబున వాటినాపుచు గరుత్మంతుండు చెండాడెనే
వినతానందనుఁ డాగ్రహించి హరిఁ జంపెన్ గ్రుద్ధుఁడై పోరునన్'
తే॥ వాహనమగుచుఁ దనిసి దాసోహమనుచు
రిప్లయితొలగించండినిర్మల మనమున నెపుడు నిలిపి కొలచె
విష్ణువునుఁ, జంపె గోపించి వినత కొడుకు
సర్పములఁ దల్లి యాతన సంగతి విని
మ॥ మనసా రీతిని కష్టమెుందఁగను ధర్మాధర్మ మేమాత్రమున్
గనకన్ దల్లిని మార్చ బానిసగ హూంకారంబుతో రెక్కలన్
ఘనుఁడాడించుచు మాఱుసేఁతఁ గన నాకాంక్షా వితాకుండునై
వినతానందనుఁ డాగ్రహించి హరిఁ జంపెన్ గ్రుద్ధుఁడై పోరునన్
హరి పాము
మాఱుసేత ప్రతీకారము వితాకుడు నిశ్చేష్టితుడు (నిఘంటువు సహాయమండి)
తల్లి దాస్యము బాపంగ తరలె దివికి
రిప్లయితొలగించండివాహనమ్మగుచును మ్రొక్కె భక్తితోడ
*విష్ణువును,, జంపె గోపించి వినత కొడుకు*
కద్రువయదిగనుచుమదికలతనొందె
జననిన్ దాసిగ గాంచనోపకను దాస్యమ్మెవ్విధిన్తీరునం
చనయమ్మాపినతల్లినడ్గుచునుతానావేశమున్బూనుచున్
మనమందున్ యవకాశమందగనెనేమాత్రమ్ముయోచింపకన్
*“వినతానందనుఁ డాగ్రహించి హరిఁ జంపెన్ గ్రుద్ధుఁడై పోరునన్”
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
పాల కడలి దేవుడని యెవ్వరిని యంద్రు;
కృష్ణుడు శిశుపాలుని తుదకేమి చేసె?;
హరిని మోసెడు గరుడు డెవరి సుతుండు?;
విష్ణువునుఁ; జంపెఁ గోపించి; వినత కొడుకు.