పావకోళ్ల నూని పాద ద్వయమ్మున గొడుగుఁ పట్టి వింత వడు గెడందఁ గాశి యాత్రకుఁ జన నాశ జనించెను వరుఁడు దనకు వధువు వల దనియెను
దురితము మూట కట్టుకొనఁ దొందరపాటు వహింప నేల ని ష్కరుణను మోప నిందలను గర్జము కాదు శుభాంగి కింపుగా సిరి కళ యున్న దాస్యమున శీల పరీక్ష నిమిత్త మౌర దే వరుఁడు వచించె నీ వధువు వద్దని పచ్చని పెండ్లి పందిటన్
ఆటవెలది
రిప్లయితొలగించండిమనములు గలియంగ మనువాడనొప్పితి
కుందనంపు బొమ్మ చెందనాకు
కట్నకాన్కలంచు కట్టివేయఁ దలఁచ
వరుఁడు దనకు వధువు వల దనియెను!
చంపకమాల
పరిణయ వేళ మామయె యపారధనమ్మొసగంగఁ బేర్చఁగన్
గరములకన్నముందుగనె కమ్మని రాగము తాకె మా మదిన్
వరమదె మాకుచాలని, నవాంఛిత కట్నమునందనొప్పకే
వరుఁడు వచించె నీ వధువు వద్దని పచ్చని పెండ్లి పందిటన్!
ఒంటి బ్రతుకు నీడ్చు యువకుని దోడుగ
రిప్లయితొలగించండినింటిని సరిదిద్ద నింతి నొసగ
దైవ చింతనమున దగులుకొ నెడి ప్రాజ్ఞ
వరుఁడు దనకు వధువు వలదనియెను”
పెండ్లి చూపులందు పిల్ల ధరించిన
రిప్లయితొలగించండిగళమునందు నగలు గానరాక
పరుల నగలఁ దొడిగి వంచించిన దనుచు
వరుఁడు దనకు వధువు వల దనియెను
శశిరేఖా పరిణయము:-
రిప్లయితొలగించండివర శశిరేఖ కోరె మరి బావను భర్తగ, గాని లక్ష్మణున్
స్థిరముగ నిర్ణయింప బలదేవుడు, ధీర ఘటోత్కచుండు తాన్
సరసిజ నేత్రియై మనువు సాగగ రక్కసిరూపుఁ జూపగన్
వరుఁడు వచించె నీ వధువు వద్దని పచ్చని పెండ్లి పందిటన్!!
కరమున దాల్చి వీడకను కన్నియ తా చరవాణిఁ బెండ్లిలో
రిప్లయితొలగించండివరలుచు నుండసాగినది వద్దని పెద్దలు చెప్పబోయినన్
పరిణయవేళ నాపె చరవాణిని వాడుట మానకుండుటన్
వరుఁడు వచించె నీ వధువు వద్దని పచ్చని పెండ్లి పందిటన్
మరవక పెండ్లి కట్నమును మామ
రిప్లయితొలగించండియొసంగెద నంచు బెండ్లిలో
నరయగ మాటయిచ్చి మరి యాడిన
మాటను తప్ప కిన్కతో
వరుడు వచించె నీ వధువు వద్దని
పచ్చని పెండ్లి పందిటన్
అరసియు పెద్దలందరు గడచ్చెరు
వంద్రి విచిత్ర చేష్టకున్.
రిప్లయితొలగించండిగర్భవతినటంచు కలికి యొకతె వచ్చి
భర్తవీవటంచు పలికినంత
నిన్నెరుగనటంచు నృపతి యైనట్టి కా
వరుఁడు దనకు వధువు వల దనియెను.
పరిణయ మంచు బిల్చిరని ప్రశ్రయ మందుచు చేరి రెల్లరున్
విరివిగ బంధుమిత్రులును వేడ్కగ, కోరిన కట్నమీయ ని
త్వరుడగు కన్యదాతకట భారమటంచును తెల్పినంత కా
వరుఁడు వచించె నీ వధువు వద్దని పచ్చని పెండ్లి పందిటన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపెండ్లి బృందమచట వేచిన సమయము
రిప్లయితొలగించండిగతము మొత్తము తనకవగతమని
తరుణి వలన తనదు పరువు పోవునని కా
వరుఁడు దనకు వధువు వల దనియెను
అరువము తోడనావధువు యౌవన రూపసి వేచియుండగా
తరుణిది నీచవర్తనము తానువరింప సమాజమందునన్
బరువుకు భంగమంచు తన వారిని వైళమె చేరబిల్చి కా
వరుఁడు వచించె నీ వధువు వద్దని పచ్చని పెండ్లి పందిటన్
సరససరాగమాలికలజల్లులుఁగుర్యుచు మంగళారతుల్
రిప్లయితొలగించండివరుసన నాడబిడ్డలటు వంకలు జెప్పుచు గేలిసేయుచున్
నిరసన దెల్పుఁబాన్పునను నీమము దప్పని నాటివేడుకన్
“వరుఁడు వచించె నీ వధువు వద్దని పచ్చని పెండ్లి పందిటన్”
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
పెళ్ళి చూపు లందు పిల్లను జూపించి
రిప్లయితొలగించండిమార్పు జేసి మిగుల మాయ జేయ
తెలిసి కొనియు దాని తెలివిగ న య్యె డ
వరుడు దనకు వధువు వల ద ని యె ను
మరు గను మాట లేక పదిమంది కనంగను ప్రేమపక్షులై
రిప్లయితొలగించండితరుణులు కొంద రుండ పెడదారిని బట్టుౘు, వేరు రీతిగా
స్మరసఖి మించు నీ రమణి ౘక్కగ సిగ్గిలి, బుగ్గగిల్లగా
వరుఁడు, వచించె నీ వధువు వద్దని పౘ్చని పెండ్లిపందిటన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపావకోళ్ల నూని పాద ద్వయమ్మున
రిప్లయితొలగించండిగొడుగుఁ పట్టి వింత వడు గెడందఁ
గాశి యాత్రకుఁ జన నాశ జనించెను
వరుఁడు దనకు వధువు వల దనియెను
దురితము మూట కట్టుకొనఁ దొందరపాటు వహింప నేల ని
ష్కరుణను మోప నిందలను గర్జము కాదు శుభాంగి కింపుగా
సిరి కళ యున్న దాస్యమున శీల పరీక్ష నిమిత్త మౌర దే
వరుఁడు వచించె నీ వధువు వద్దని పచ్చని పెండ్లి పందిటన్
ఆ॥ పడతి వలచె నొకనిఁ గడు పొలుపుగఁ గూర్చ
రిప్లయితొలగించండిదల్లిదండ్రులు తమ తనయ మనువు
వేరు వరుని మెచ్చి విషయ మరసినంత
వరుఁడు దనకు వధువు వలదనియెను
చం॥ మురిపెము తోడఁ బ్రీతిఁ గన పుత్తడి బొమ్మయె తల్లిదండ్రులున్
సరియగు జోడు కాదనుచుఁ జక్కని వాఁడనిఁ గూర్చ వేరుగా
సరుగున చేర వేయఁగను సారసలోచని యిచ్ఛనెవ్వరో
వరుఁడు వచించె నీ వధువు వద్దని పచ్చని పెండ్లి పందిటన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
పెళ్లి చూపులందు పిల్ల యందము వేరు
పిల్ల మారిపోయె పెళ్లికిప్పు
డంద హీనమైన యతివను గాంచిన
వరుడు దనకు వధువు వలదనియెను.
[
రిప్లయితొలగించండిపెళ్లి చూపులందు పిచ్చి ప్రశ్నలు వేసి
తలను చెరుపు చుండ తాళలేక
గంటలోనె మదికకావికలముకాగ
*“వరుఁడు దనకు వధువు వల దనియెను”*
స్థిరముగ నొక్క మాట యును తీరుగ నాడక పిచ్చి మాటలన్
నిరతము తాను పల్కుచును నిక్కును చూపుచు లెక్క చేయకన్
కరములు త్రిప్పుచున్ సతము గంతులు వైచుచునుండ గాంచుచున్
*“వరుఁడు వచించె నీ వధువు వద్దని పచ్చని పెండ్లి పందిటన్”*