25, మార్చి 2025, మంగళవారం

సమస్య - 5073

26-3-2025 (బుధవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కరివరదుఁ డొసఁగఁడు గామితముల”
(లేదా...)
“కామితమెట్లు దీరుఁ గరిఁ గాచిన వానిని వేడుకొన్నచో”

21 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    పూర్వజన్మకృతపు పుణ్యమ్ము పాపమ్ము
    ననుభవించకుండ నాపునెవరు?
    పాపమె మనదైన పరిహారమగుదాక
    కరివరదుఁ డొసఁగఁడు గామితముల!

    ఉత్పలమాల
    రాముని జన్మఁ బాపమది రాక్షసవైరిని మ్రింగె మీదటన్
    నీమము దప్పలేరెవరు నీదగు పాపము పూర్వజన్మలో
    నేమది చేసితో నదియు నిక్కడయే పరిహారమొందకే
    కామితమెట్లు దీరుఁ గరిఁ గాచిన వానిని వేడుకున్నచో?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఒసఁగఁడు గామితముల - ఇది ముద్రాదోషము. ఒసఁగఁడు కామితముల - సాధువు. ఇక్కడ గసడదవలు వచ్చుట కవకాశము లేదు.

      తొలగించండి
  2. కోర్కె లన్ని దీర్చు కొ లువంగ శాపాల
    కరి వర దు డొ సగ డు :: గామిత ముల
    నన్నిటి నెర వేర్చు నార్తి తో భజియింప
    నాదు కొనును గాదె య చ్యు తుండు

    రిప్లయితొలగించండి
  3. మకరి పాలపడిన మాతంగమును రక్ష
    సలిపెనుహరి తనను శరణు వేడ
    భారమంత నీదె ప్రాపునిమ్మనకనే
    కరివరదుఁ డొసఁగఁడు గామితముల

    రిప్లయితొలగించండి
  4. నీమముతోడ శ్రీహరిని నిక్కఁపు భక్తిని వేడినన్ పరం
    ధాముడు దీర్చు నీప్సితము దప్పక భక్తజనావనుండునై
    వేమరు యోచనల్సలిపి వేడఁగ నమ్మిక లుప్తమైనచో
    కామితమెట్లు దీరుఁ గరిఁ గాచిన వానిని వేడుకున్నచో

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. క్షేమముఁ గూర్చు విష్ణు గడిఁ జేరగఁ జూపెను ద్వారపాలకుల్
      నీమముఁ దప్పకుండ పగ, నీరజనాభుడు నారసింహుడై
      రామశశాంక కృష్ణులుగఁ బ్రాణములన్ గొని యిచ్చె మోక్షమున్
      కామితమెట్లు దీరుఁ గరిఁ గాచిన వానిని వేడుకున్నచో!!

      తొలగించండి
  6. ప్రార్ధన సలుపగనె వర్షము నిడు తొల
    కరివరదుఁ డొసఁగఁడు గామితముల ,
    యెటుల వేడుకొనిన నేదేవుడైనను
    దన పరిమితి నెపుడు దాట కుండు

    రిప్లయితొలగించండి

  7. రక్షకుండటంచు ప్రహ్లాద నీవిట్లు
    దాయయైన వాని దలువ దగునె
    దనుజులగని పాఱి దాగిన వాడైన
    కరివరదుఁ డొసఁగఁడు గామితముల.


    ఏమది కండకావరము హీనగుణాత్ముడవౌచు శత్రువున్
    క్షేమము గూర్చువాడనుచు చెప్పుచు నుంటివె యాలకింపుమా
    గాములమంచు మమ్ములను గాంచి భయమ్మున దాగె కాదుటే
    కామితమెట్లు దీరుఁ గరిఁ గాచిన వానిని వేడుకున్నచో.

    రిప్లయితొలగించండి
  8. పరహితంబు మరచి పాపకృత్యంబులు
    నిరవధికము సల్పు నీఛులకును
    వరములడుగనట్టి భక్తజనులకైన
    కరివరదుఁ డొసఁగఁడు గామితముల

    నీమము లేనివాడు పలునేరములే తన వృత్తిగా ప్రజా
    క్షేమము విస్మరించి పనిచేసెడు నాయక ముఖ్యుడై సదా
    వామముకై తపించి తన వంకర బుద్ధిని చాటువానికిన్
    గామితమెట్లు దీరుఁ గరిఁ గాచిన వానిని వేడుకున్నచో

    రిప్లయితొలగించండి
  9. పామర! బుద్ధి హీనతను భాగ్యమె
    ముఖ్యమటంచు నెంచియున్
    నీమము వీడి దోచితివి నీతి
    విహీనుడ! యొరుల సంపదన్
    సోమరి! సర్వదా హరిని సుస్థిర
    పాత్మచె కొల్వకున్న నీ
    కామిత మెట్లు దీరు గరి గాచిన
    వానిని వేడకున్నచో

    రిప్లయితొలగించండి
  10. సామము జెప్పుకుంటు కడు సాధువుగా నటియించువానికిన్
    నీమము లేకయుండి పలు నీచపు కర్మలు జేయు శుంఠకున్
    పామరుడైనవాడు పనిపాటుగ పూజల నెంతజేసినన్
    కామితమెట్లు దీరుఁ గరిఁ గాచిన వానిని వేడుకున్నచో

    సదానందం కందారపు, హైదరాబాద్

    రిప్లయితొలగించండి
  11. ఆ.వె:తిండి,గుడ్డ,వసతి,మెండైన యారోగ్య
    మిడగ హరిని వేడ నిచ్చు గాని
    కోట్ల ధనము నడుగ,గొప్ప పదవి వేడ
    కరివరదుఁ డొసఁగఁడు గామితముల”
    (భగవంతుని ఏదో కోరుకోవటం న్యాయమే కానీ కనీసావసరాలనే కోరుకోవాలి.విపరీతవాంఛలు తీర్చటం ఆయన పని కాదు.)

    రిప్లయితొలగించండి
  12. బిల్వ దళము తోటి విశ్వ నాధునకును
    సేవ చేయగ నభి షేకముయును,
    భక్తి లేని పూజ పత్రితో చేయంగ
    కరివరదుఁ డొసఁగఁడు గామితముల

    రిప్లయితొలగించండి
  13. ఉ:కాముడు పెండ్లి జేయుటకు గట్టి ప్రయత్నము జేయ గ్రుద్ధుడై
    కాముని జంపె నా హరుడు,కాగ వివాహము రుద్రు వేడగా
    కామితమెట్లు దీరుఁ? గరిఁ గాచిన వానిని వేడుకొన్నచో
    సేమము,రుక్మిణీపతియె చేయును నీకు వివాహ మింతటన్.
    (కాముణ్ని చంపిన వాడు కామితం తీర్చడు.గజేంద్రిని రక్షించిన వాడు,రుక్మిణి ప్రేమని స్వీకరించిన వాడు నీకు పెళ్లి అయ్యేటట్టు చేస్తాడు.పెళ్లి కాని పిల్లల్ని రుక్మిణీకళ్యాణం చదివిస్తారు కూడా.)

    రిప్లయితొలగించండి
  14. ఆ॥ సుగుణముల నొదవుచు నగణిత భక్తిని
    నిత్యము కొలువంగ సత్యమతఁడు
    కాయుట కొలిచినను కడు దుష్టులనఘును
    గరి వరదుఁ డొసఁగఁడు గామితముల

    ఉ॥ సామము వీడి దూషణను సర్వులఁ జేయుచు దుష్టబుద్ధియై
    నేమముఁ దప్పి కాంచఁగను నిత్యము సంపద కాంచనాదులన్
    దామస రూపుఁడై చనఁగ దామర లోచనుఁ డొప్పి ప్రోచునే!
    కామితమెట్లు దీరుఁ గరిఁ గాచిన వానిని వేడుకున్నచో

    రిప్లయితొలగించండి
  15. కన్ను మిన్ను సుంత గానక నిత్యము
    విఱ్ఱవీఁగి కరము విత్త రాశి
    గర్వమునఁ జెలంగ నుర్వి దుష్కృతములఁ
    గరివరదుఁ డొసఁగఁడు కామితముల


    ఏమని చెప్ప నేర్తుఁ గలి నెవ్వరు దిక్కు నరాళికిం బరం
    ధాముఁడు నిద్రలో మునిఁగి తద్దయు వార్ధిని మఱ్ఱియాకుపైఁ
    గాముక కోటి కోరికలు గాంచి రమేశుఁ డగోచరుండు గాఁ
    గామిత మెట్లు దీరుఁ గరిఁ గాచిన వానిని వేఁడుకున్నచో

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    వక్ర బుద్ధి తోడ వంచన చేయుచు
    మాటలాడు చుండి మధురముగను
    మనసు నొకటి పైకి మరియొకటి పలుక
    కరివరదు డొసగడు కామితముల.

    రిప్లయితొలగించండి