ఉ:రాముడు కూల్చె వాలి ,నిక రాముని తో పని యేమి ? యంచు దా నీమము లేని భోగముల నెయ్యపు బాసను వీడి చక్కగా భామల తోడ గుల్కు గద !భ్రాతను మోసము జేసె,నెట్టులీ కామకళావినోది దశకంఠవిరోధికిఁ బ్రీతిపాత్రుఁడౌ” (సుగ్రీవుడికి రాముడు సహాయం చేసాక అతడు హాయిగా దంతోషిస్తూ రాముడి సమస్యని పట్టించుకోకుండా ఉంటే లక్ష్మణుని ఆగ్రహం.)
ఏక పత్నీ వ్రతునకు నరేంద్ర నంద నునకు నిద్ధ కోదండ రామునకు నిత్య సత్య వాక్పాలకున కిల నిత్య ధర్మ కాముకుండు బ్రీతుఁడు రఘు రామునకును
రామున కార్త దీన జన రక్షణ కార్య వితాన ఖేల నా రామున కంబుదాభ తను రాగ విరాజికి నెన్నఁ డేనియుం బామర పండితప్రవర పౌరజ నమ్ముల ధర్మ విత్త స త్కామ కళావినోది దశకంఠ విరోధికిఁ బ్రీతి పాత్రుఁడౌ
తేటగీతి
రిప్లయితొలగించండిసీతఁ గాంచిన మారుతి చింతఁ జెంది
మాతఁ దండ్రిఁ జేర్చెడు వ్యూహమూతమనఁగ
నెంచి జలధి వారధినినిర్మించు కార్య
కాముకుండు బ్రీతుఁడు రఘురామునకును
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిఉత్పలమాల
తొలగించండిభీమబలంబునన్ గగన వీధులఁ దేలుచు లంక వాలుచున్
శ్రీమహనీయమూర్తిగను సీతను గాంచియు నాంజనేయుఁడున్
సేముముగన్ బ్రభున్ దరికిఁ జేర్చఁగ వారధిఁగట్టనెంచు స
త్కామకళావినోది దశకంఠవిరోధికిఁ బ్రీతిపాత్రుఁడౌ
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండితే||గీ||
రిప్లయితొలగించండిపితృవాక్య పాలనయందు బ్రీతినొంది
తనవలె దొరతనము వీడి , తగు విధముగ
పెద్దల పలుకులను గౌరవించు టందు
కాముకుండు , బ్రీతుఁడు రఘురామునకును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'పితృ' అన్నపుడు రెండూ లఘువులే. అందువల్ల గణభంగం. "పితరు వాక్య..." అనండి.
🙏
తొలగించండిరాముడు సెప్పినట్టుల ధరాసుత
రిప్లయితొలగించండిసీతను వెద్కబోయి తా
నామెను లంకలోనగని యా శుభ
వార్తను దెల్ప రాముతో
క్షేమపు వార్తవిన్నపుడు జిత్తము
సంతస మొందె నట్టి స
త్కామకళా వినోది దశకంఠు
విరోధిక ప్రీతి పాత్రుడౌ.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వెద్కు' అనడం సాధువు కాదు.
ఆమని పచ్చవింటిదొర యాగమనంబును శోభపంచగన్
రిప్లయితొలగించండిభూమిజ నాస్వయంవరముఁ పొంద ముహూర్తము చైత్రమవ్వగన్
కామకళావినోది దశకంఠవిరోధికిఁ బ్రీతిపాత్రుఁడౌ
గోమిని సూనుడాతడని కూరిమి చూపడె రాఘవేంద్రుడున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిస్వయంవరము తర్వాత అరసున్న అవసరం లేదు.
బాధ లందున నుండెడి వారి గాంచి
రిప్లయితొలగించండిచేత నైనట్టి సాయమ్ము చేయ బూని
సత్వ రంబున స్పందించి సహ క రించు
కాముకుడు బ్రీతుడు రఘు రామున కు ను
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభక్తి కదుర మనమునందు బవలురేయి
రిప్లయితొలగించండిరామ నామామృతము ననురక్తి తోడఁ
గ్రోలు సద్భక్తవర్యుడు, గుణియు, ముక్తి
కాముకుండు బ్రీతుఁడు రఘురామునకును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిభామల సంగతమ్మున నవారితమౌ విధి కామకేళిలో
రిప్లయితొలగించండిమైమఱపొందు దుర్మతిని మందుని మెచ్చడు దైవమెన్నడున్
నీమముగా నిరంజనుని నెమ్మనమందున నూన్చునట్టిస
త్కామకళావినోది దశకంఠవిరోధికిఁ బ్రీతిపాత్రుఁడౌ
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపంతమూనుచు రాజ్యసంపదను వీడి
తపమునాచరించెడి ముని దరికి జేర
కలికి మేనకన్ గాంచిన గాధి సుతుడు
సంగమనమును గోరెనా సంయమి కన
కాముకుండు బ్రీతుఁడు రఘురామునకును
ప్రేముని యాజ్ఞనొంది సుర వేశ్య ధరిత్రికి జేరవచ్చి తా
నాముని చెంతజేరగనె యచ్చర మేనక గాంచి యామెతో
ప్రేమను మున్గి లక్ష్యమును వీడిన వాడగు గాధి పుత్రుడా
కామకళావినోది, దశకంఠవిరోధికిఁ బ్రీతిపాత్రుఁడౌ.
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిభీమబలుం డజేయు డరివీరపరాక్రము డాంజనేయుడా
రిప్లయితొలగించండితామస భంజనుం డఖిల ధర్మ విచార విశారదుండహా
ధీమతి కామరూపి విజితేంద్రియుడా మహనీయమూర్తి ని
ష్కామకళావినోది దశకంఠవిరోధికిఁ బ్రీతిపాత్రుఁడౌ
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండికామనలెల్ల పోవిడిచి కల్మషశూన్యమునైన డెందమున్
నీమము తప్పకుండ ననునిత్యము నొప్పుగ శౌరి నామమున్
స్థేమముగా వచించి కడుదీక్షను యాగములన్ ఘటించు ని
ష్కామకళావినోది దశకంఠవిరోధికి బ్రీతిపాత్రుడౌ.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికోరి సుగ్రీవుని చెలిమి దారుణముగ
రిప్లయితొలగించండిచంపె రాముడు వాలిని చాటునుండి
వాలి సోదరుడా భోగలాలసుండు
కాముకుండు బ్రీతుఁడు రఘురామునకును
భామిని సీతకై వగచి వానర సైన్యపు తోడుకోరుచున్
రాముడు చంపివాలిని విరామము కూర్చగ వాలితమ్ముడా
కామ కళావినోది దశకంఠవిరోధికిఁ బ్రీతిపాత్రుఁడౌ
రాముని భార్యనే వెదకిరమ్మని వానర సేన నంపగా
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండితే॥ ఆర్త గణశరణాధృతి యలరి విరియ
రిప్లయితొలగించండినిర్మల హృదయ సంతృప్త నిత్య శుద్ధ
వాగ్వివేచనా సంపన్న వర సుభక్తి
కాముకుండు బ్రీతుఁడు రఘురామునకు
ఉ॥ ఏమరుపాటు వీడి ఘనునీశుని భక్తినిఁ గొల్చి కార్యముల్
ప్రేమగఁ గాంచి యార్తులకుఁ బెన్నిధి యాశ్రయ ధామమై సదా
కోమల వర్తనన్ గలిగి కూరిమిఁ జూపెడు జ్ఞాన పాథి స
త్కామకళావినోది దశకంఠవిరోధికిఁ బ్రీతిపాత్రుఁడౌ
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండితే.గీ:కాముకుడు రావణుండని కక్ష బూని
రిప్లయితొలగించండిశరణు గోరు నతని సహోదరుని గూడ
దూరముంచడు కలుషవిదూర ధర్మ
కాముకుండు బ్రీతుఁడు రఘురామునకును”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ:రాముడు కూల్చె వాలి ,నిక రాముని తో పని యేమి ? యంచు దా
రిప్లయితొలగించండినీమము లేని భోగముల నెయ్యపు బాసను వీడి చక్కగా
భామల తోడ గుల్కు గద !భ్రాతను మోసము జేసె,నెట్టులీ
కామకళావినోది దశకంఠవిరోధికిఁ బ్రీతిపాత్రుఁడౌ”
(సుగ్రీవుడికి రాముడు సహాయం చేసాక అతడు హాయిగా దంతోషిస్తూ రాముడి సమస్యని పట్టించుకోకుండా ఉంటే లక్ష్మణుని ఆగ్రహం.)
రిప్లయితొలగించండిఏక పత్నీ వ్రతునకు నరేంద్ర నంద
నునకు నిద్ధ కోదండ రామునకు నిత్య
సత్య వాక్పాలకున కిల నిత్య ధర్మ
కాముకుండు బ్రీతుఁడు రఘు రామునకును
రామున కార్త దీన జన రక్షణ కార్య వితాన ఖేల నా
రామున కంబుదాభ తను రాగ విరాజికి నెన్నఁ డేనియుం
బామర పండితప్రవర పౌరజ నమ్ముల ధర్మ విత్త స
త్కామ కళావినోది దశకంఠ విరోధికిఁ బ్రీతి పాత్రుఁడౌ
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
జానకిని కన్గొనగ లంక చనగ హనుమ
వాయు మార్గాన నేగుచు వార్ధి దాటి
సఫలతను బొంది కనె సీత జాడ, కార్య
కాముకుండు బ్రీతుడు రఘురామునకును.