నిద్రలో వచ్చేవి కలలు కాదు నిద్ర పోకుండా చేసేవి కలలు అని డా॥ కలాంగారు చెప్పినట్టు గుర్తు.
పద్మభూషణ్ అవార్డు గ్రహీతయైన ఒక శాస్త్రజ్ఞులు పడిన శ్రమ, నోబెల్ బహుమతి నాశించిన (అందరూ అలాభావించేవారు మరి) మరొక శాస్త్రజ్ఞులు పడిన శ్రమ నేను కనులారా చూసానండి, కొంతకాలం పాటు. పేర్లు వ్రాయడం భావ్యంకాదు
మొదటి పద్యము సమస్వను ఒక పాదములో పూర్తిగా పెట్టలేదు కనుక తేటగీతి కూడ చేయవచ్చు. నేను ఆటవెలదిగానే ముందుకు సాగినానండి.
తే.గీ:జాగరణమని నే నన జాలి పడకు వృద్ధు నని, నేను భక్తికి బద్ధుడ నయి కనులు మూయకుండఁ గలనుఁ గంటి శాస్త్రి! శంభుడే నాకు మేల్కొను శక్తి నిచ్చు. (కనులు మూయక+ఉండ గలను=కనులు మూయకుండ గలను. గంటి శాస్త్రి=అతని ఇంటి పేరు గంటి.ఆయన పేరు శాస్త్రి.గంటి వారు నిజం గానే ఉన్నారు.)
ఉ:ఎన్నడు నర్ధరాత్రి తిలకించని నే యమగోల చిత్రమున్ నిన్ననె జూచితిన్,కథను నిక్కము వోలెనె జూచుచుండగా నన్నియు స్వప్నదృశ్యములె యంచు ముగింపున నుండు శ్రద్ధగా కన్నులు మూయకుండఁ గలఁ గాంచితి, మంచి దటంచు మెచ్చితిన్” (యమగోల సినిమా నానా అభూతకల్పనల తో ఉంటుంది.చివరికి అది హీరో కి వచ్చిన కల గా తేలుతుంది.మనం సినిమాలో కళ్లు మూయకుండా కల చూసినట్టు.)
దివమునందు నేను దేశ ప్రధానిగ
రిప్లయితొలగించండిపదవి నొందునటుల వలచు చుండ
తలపు దారి దప్పి తరలుచు నుండగ
కనులు మూయకుండఁ గలనుఁ గంటి
ధనమును గూడబెట్టుటకు తప్పక
రిప్లయితొలగించండిజేసెద కాయ కష్టమున్
మనమున నిశ్చయించితిని మానను
బాధలు సుట్టుముట్టినన్
వినయము తోడ తండ్రికి వివేకముతో
వివరించె నిట్టులన్
కనులను మూయకుండ కల గాంచితి
మంచి దటంచు మెచ్చితిన్.
కన్నుల పండగేయగును కాంచఁగ దేశపురోభివృద్ధి సం
రిప్లయితొలగించండిపన్నులు పేదవారనెడు వ్యత్యయముండక నెల్లరొక్కటై
మిన్నగ దేశసంపదను మేఘపథమ్మును జేర్చిరంచు నే
కన్నులు మూయకుండఁ గలఁ గాంచితి మంచి దటంచు మెచ్చితిన్
రిప్లయితొలగించండిరాత్రి కలను గంటి రమణీయ రూపుడౌ
శ్రీనివాసుని గుడి జేరకుండ
తరుణి కోర నేడు తిరుమల జని యట
కనులు మూయకుండఁ గలనుఁ గంటి.
మొన్నటి రాత్రి స్వప్ననున మొక్కులు తీర్చెడి శ్రీనివాసునిన్
జెన్నగు రూపు గాంచితిని క్షేత్రము కేగక యద్భుతమ్ముగా
నన్నువు కోరనేగితిని యంబుజనాభుని జేరి నేడటన్
కన్నులు మూయకుండఁ గలఁ గాంచితి మంచి దటంచు మెచ్చితిన్.
రుక్మిణీ దేవి అగ్నిద్యోతనునితో....
రిప్లయితొలగించండిఆటవెలది
కోరుకొంటి నేను గోవిందు మదినిండ
బ్రాహ్మణోత్తమా! వివాహమాడ
నందనందను గరమందిన ముచ్చట
కనులు మూయకుండఁ గలనుఁ గంటి
ఉత్పలమాల
వెన్నుని పైన మానసము విప్రవరేణ్య! భ్రమించుచుండ మి
మ్మెన్నితి వాస్తవమ్ము వివరింపగ తక్షణమేగుదెంచఁగా!
నున్నతునందినట్లుమనువొందిన యట్లు మహోత్సవంబునన్
గన్నులు మూయకుండఁ గలఁ గాంచితి మంచి దటంచు మెచ్చితిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిస్వార్థమెరుగనట్టి సన్మార్గ గాములు
రిప్లయితొలగించండిమమ్మునేలునట్టి మంత్రులనుచు,
పేద యన్నమాట లేదని జగతిలో
కనులు మూయకుండఁ గలనుఁ గంటి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅన్నెము జేయకుండగనె నార్జన జేసితి
రిప్లయితొలగించండినింతవిత్తమున్
పున్నెము సాధ్యయ్యెగద మోసము జేసిన
కారణంబునన్
నిన్నటి పొద్దునందుననె నేను దలంచితి
నట్టిరీతిగా
కన్నులు మూయకుండఁ గలఁ గాంచితి మంచి దటంచు మెచ్చితిన్
కన్నకొడుకు పూన్చె నున్నత లక్ష్యమే
రిప్లయితొలగించండిసంతసించి మదిని సమ్మతించి
దీవెనలిడి పిదప భావితలపులతో
కనులు మూయకుండఁ గలనుఁ గంటి
ఉన్నతమైన లక్ష్యమును యోచన చేసిన హర్షయిత్నువే
క్రన్నన నాకుఁ దెల్ప పొడగాంచితి భావిని యూహలందునన్
గన్నులు మూయకుండఁ గలఁ గాంచితి మంచి దటంచు మెచ్చితిన్
మన్నన లభ్యమౌననుచు మానసమందు నొసంగి దీవెనల్
తాత దాచిన లంకె బిందెలు (కుండలు) మనవడికి కలలో కనబడటము:-
రిప్లయితొలగించండిపెన్నిధి దాచెనంట పెను పేరిమి తోడ పితామహుండు తాన్
సన్నని కుండలో మిగుల చక్కగ స్వర్ణము నింపెనంట యా
సన్నిధి బోధజేయకయె స్వర్గముఁ జేరగ నొక్క నాడు నే
కన్నులు మూయ, కుండఁ గలఁ గాంచితి మంచి దటంచు మెచ్చితిన్!!
వనజ భవుని రాణి ప్రత్యక్ష మై నాకు
రిప్లయితొలగించండివరము నొస గ నాకు ప్రముఖ కవిగ
రాణ కెక్కి నట్లు రమ్యంపు భావంపు
కనులు మూయ కుండ కలను గంటి
గత వరుసము నందు కళ్యాణ ఘడియ కై
రిప్లయితొలగించండికనులు మూయకుండఁ గలనుఁ గంటి
కల్లలాయె నవియు; కలయు కాలము ముందు
వచ్చునా!వగచెనె బ్రహ్మ చారి
(నేను చూచిన కొందరు శాస్త్రజ్ఞుల మనోభావమని నా నమ్మిక)
రిప్లయితొలగించండిఆ॥ కనులు మూయకుండఁ గలనుఁ గంటి కలనుఁ
గాంచి బలిమి వడసి కష్టపడుచు
కఠిన శ్రమముఁ జేయఁ గల ఫలియించఁగ
శాస్త్ర విద్య యందు సవితృఁడైతి
ఉ॥ కన్నులు మూయకుండఁ గలఁ గాంచితి మంచి దటంచు మెచ్చితిన్
దన్నుగ స్వప్న సారమటు ధైర్యముఁ బంచఁగఁ గష్టసాధనన్
వెన్నునిఁ గొల్చి నిత్యమటు ప్రీతిగఁ జేయఁగ శాస్త్రవిద్యలన్
మిన్నగు శోధనా గరిమ మేటిగ నొప్పఁగఁ గీర్తిఁ బొందితిన్
నిద్రలో వచ్చేవి కలలు కాదు నిద్ర పోకుండా చేసేవి కలలు అని డా॥ కలాంగారు చెప్పినట్టు గుర్తు.
పద్మభూషణ్ అవార్డు గ్రహీతయైన ఒక శాస్త్రజ్ఞులు పడిన శ్రమ, నోబెల్ బహుమతి నాశించిన (అందరూ అలాభావించేవారు మరి) మరొక శాస్త్రజ్ఞులు పడిన శ్రమ నేను కనులారా చూసానండి, కొంతకాలం పాటు. పేర్లు వ్రాయడం భావ్యంకాదు
మొదటి పద్యము సమస్వను ఒక పాదములో పూర్తిగా పెట్టలేదు కనుక తేటగీతి కూడ చేయవచ్చు. నేను ఆటవెలదిగానే ముందుకు సాగినానండి.
పెనుకొండ రామబ్రహ్మం ఎల్ డొరాడో హిల్స్
తే.గీ:జాగరణమని నే నన జాలి పడకు
రిప్లయితొలగించండివృద్ధు నని, నేను భక్తికి బద్ధుడ నయి
కనులు మూయకుండఁ గలనుఁ గంటి శాస్త్రి!
శంభుడే నాకు మేల్కొను శక్తి నిచ్చు.
(కనులు మూయక+ఉండ గలను=కనులు మూయకుండ గలను. గంటి శాస్త్రి=అతని ఇంటి పేరు గంటి.ఆయన పేరు శాస్త్రి.గంటి వారు నిజం గానే ఉన్నారు.)
ఉ:ఎన్నడు నర్ధరాత్రి తిలకించని నే యమగోల చిత్రమున్
రిప్లయితొలగించండినిన్ననె జూచితిన్,కథను నిక్కము వోలెనె జూచుచుండగా
నన్నియు స్వప్నదృశ్యములె యంచు ముగింపున నుండు శ్రద్ధగా
కన్నులు మూయకుండఁ గలఁ గాంచితి, మంచి దటంచు మెచ్చితిన్”
(యమగోల సినిమా నానా అభూతకల్పనల తో ఉంటుంది.చివరికి అది హీరో కి వచ్చిన కల గా తేలుతుంది.మనం సినిమాలో కళ్లు మూయకుండా కల చూసినట్టు.)
రయము మీఱఁ గడిఁది పయనించు చుండంగఁ
రిప్లయితొలగించండిజల్ల గాలి తనువు నెల్లఁ దాఁకఁ
బగటి పూఁటఁ జేఁప పగిది నే నప్పుడు
కనులు మూయకుండఁ గలనుఁ గంటి
తిన్నను జన్న నెన్నఁడును దెన్నులఁ గొన్నను మందు లెన్నిటిన్
జొన్నలు సన్నబియ్య మిఁక సున్నము గిన్నెలు మన్ను సొన్నముల్
పన్నులు లేవు లే వనుచు భారత దేశ విభుత్వ మన్నదా
కన్నులు మూయకుండఁ గలఁ గాంచితి మంచి దటంచు మెచ్చితిన్
పన్నుల మోతలున్ మిగుల వాతలెగా తలరాతలెన్నగా
రిప్లయితొలగించండినెన్నడు గానినీ వరుసమెంత విచిత్రము కేంద్రమిట్టులన్
మిన్నగ దించె పన్నులను మేలొనగూర్ప జనాళికయ్యహో
కన్నులు మూయకుండఁ గలఁ గాంచితి మంచి దటంచు మెచ్చితిన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ఉన్నత చదువైన నుద్యోగమే లేదు
కొలువు గూర్చి సతము తలచుచుండ
వచ్చె కొలువటంచు పట్టపగలు నేను
కనులు మూయకుండఁ గలనుఁ గంటి.
దేవమునియు దెలుప తీరుగా హరికథన్
రిప్లయితొలగించండిమదిని తలచి తేను మాధవుండె
వలయు పతిగ ననుచు పగలు రేయియనక
*“కనులు మూయకుండఁ గలనుఁ గంటి”*
వెన్నుని గాధలన్ వినుచు వీనుల విందుగ బాల్య మాదిగా
చెన్నగురూపుతోనలరు శ్రీశుడె నాకును భర్త యంచు నా
యన్నులమిన్న రుక్మిణియు నాదర మొప్పగ పల్కె విప్రుతో
*“కన్నులు మూయకుండఁ గలఁ గాంచితి మంచి దటంచు మెచ్చితిన్”*