4-3-2025 (మంగళవారం)ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“పువ్వులోన రెండు పూలు పుట్టె”(లేదా...)“పుష్పంబందున రెండు పుష్పములవే పుట్టెన్ మనోజ్ఞమ్ములై”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఆటవెలదిశంబురాణిఁ గన ముఖాంభోజమందునభక్తవత్సలత్వ యుక్తమగుచుకరుణఁజింద విరిసె కమలనయనములుపువ్వులోన రెండు పూలు పుట్టె!శార్దూలవిక్రీడితమునిష్పన్నంబగు రూపమంచుఁ బొగడన్ నీలాంగుడౌ కృష్ణుడున్బాష్పంబుల్ ముఖమందు చిందవెతలన్ భక్తాదులన్ బ్రోవగన్పుష్పంబుల్ కనులౌచు విచ్చఁగ ముఖాంభోజమ్మునన్ గావఁగన్పుష్పంబందున రెండు పుష్పములవే పుట్టెన్ మనోజ్ఞమ్ములై!
ప్రియుని గాంచినంత వికసిత మైనట్టిపద్మమదియె యామె వదనమవగకలువలట్లు బోలు కనుగవ నేగాంచపువ్వులోన రెండు పూలు పుట్టె.పుష్పాలంకృత భవ్యరూపమనుచున్ మోక్షార్థులౌ భక్తులేభాష్పంబుల్ కనులందుజేరు తరి యా భారూపమున్ గాంచగాపుష్పంబంటి ముఖంబునందు గనగన్ బూరెమ్మలే కన్నులై పుష్పంబందున రెండు పుష్పములవే పుట్టెన్ మనోజ్ఞమ్ములై.
పద్మమువలె ముఖము పడతి కుండగ నామెవయసు మీరినంత వదన మందుకనల గుడ్లపైని కంటి పూలనుగనపువ్వులోన రెండు పూలు పుట్టె
ఆ॥ శాస్త్ర విజ్ఞతనటు సంధించి యుత్పత్తిపెంచ నెంచి చనుచు విస్తృతముగఁ గన ప్రయోగములను గలలు పండి విరిసిపూవ్వులోన రెండు పూలు పుట్టెశా॥ పుష్పంబన్నను బీత్రి యందరకిలన్ బూజించ విశ్వేశ్వరున్బుష్పంబుల్ సిగలోన ముచ్చటగనా పూఁబోణి యందమ్ముకున్బుష్పంబుల్ గద శాస్త్ర విజ్ఞతనటుల్ పూనించి యత్నించఁగన్పుష్పంబందున రెండు పుష్పములవే పుట్టెన్ మనోజ్ఞమ్ములైనేను శాస్త్ర విద్యార్థి నండి
వృత్తము చివరి పాదము ద్రుతసంధి చేయగాబుప్షంబందున రెండు పుష్పములవే పుట్టెన్ మనోజ్ఞమ్ములైఅవుతుందండి మరొక పూరణశా॥ నిష్పత్తిన్ జన సాంద్రతాధికతనే నేమమ్ము గానెంచుచున్బుష్పించంగను సంపదాదులటు సంపూర్ణమ్ముగన్ బంచఁగన్బాష్పంబుల్ గను దక్షిణాది ధన లభ్యంబెచ్చటో యచ్చటన్బుష్పంబందున రెండు పుష్పములవే పుట్టెన్ మనోజ్ఞమ్ములైఇది దక్షిణాది రాష్ట్రాలు పెడుతున్న గోలండి
పువ్వువింటిజోదు పుట్టెఁ విష్ణు సుతుడైపువ్వువంటిమోముఁ బొందెనతడుపువ్వులనెడు కనులు మోముపై వెలుగొందపువ్వులోన రెండు పూలు పుట్టెపుష్పాస్త్రుండుదయించె విష్ణుసుతుడై పుష్పంబునేబోలుచున్నిష్పాదించు నతండు మానసములో నీకున్న సంకల్పమేనిష్పాపుండగు వానిమోము సుమమై నేత్రాలు పుష్పంబులైపుష్పంబందున రెండు పుష్పములవే పుట్టెన్ మనోజ్ఞమ్ములై
శాస్త్ర వేత్త కృషికి జరిగి న ద్భు త మది పువ్వు లోన రెండు పూలు పుట్టె విశ్వ మంత గాంచె వేడ్క గా నయ్యె డ మెచ్చు కొనుచు మిగుల మిన్న గాను
పువ్వుబోడి మోము పుండ్రమై యలరారెకలువపూల వంటి కన్నుదోయిజూడనిట్లుఁ దోచె ప్రోడ వదనమునపువ్వులోన రెండు పూలు పుట్టె
ఆ.వె:చక్క నైన మల్లె జాజుల నెంచకనా విదేశ తరుల నేవొ నాటతావి,యంద మేది తనరక నే యొక్కపువ్వు లోన ,రెండు పూలు పుట్టె
శా:పుష్పమ్ముల్ చెవి లోన బెట్టుకొను విప్రుండయ్యు,మంత్రమ్ముతోపుష్ప మ్మిచ్చెడు వాడు నై పెరటిలో పోషించె మత్స్యమ్ము నేపుష్ప మ్మం చొక ముద్దు పేరు నిడి విప్రుం డుల్లసిల్లంగ నా పుష్పంబందున రెండు పుష్పములవే పుట్టెన్ మనోజ్ఞమ్ములై”(అతడు చెవిలో పువ్వు పెట్టుకొనే బ్రాహ్మణుడు.మంత్రపుష్పం సమర్పించే బ్రాహ్మణుడు.చేపకి పుష్పం అనే పేరు పెట్టిన బ్రాహ్మణుడు.అనగా బెంగాలీ,లేక ఒరియా బ్రాహ్మణుడు.అతడు పెంచిన జలపుష్పానికి రెండు జలపుష్పాలు పుట్టాయి.)
"శంకరాభరణ"న శత పూరణంబులు పూర్తి జేసి జనక కీర్తి పొందె సుతులిరువురు నుండె పితర సరణి లోన పువ్వులోన రెండు పూలు పుట్టె
నిష్పందంబగు నీ ముఖాంబుజము నీ నేత్రారవిందంబులోపుష్పాఖ్యా సృజియించె బ్రహ్మ నిను సమ్మోహంబుగా నెన్నగాపుష్పంబందున రెండు పుష్పములవే పుట్టెన్ మనోజ్ఞమ్ములైనిష్పన్నంబయె నా మనోరథమహా నీ ప్రేమ బంధంబునన్
పావు సేరు పాల లో విను పా లెన్ని యన్న నేను రెండె యన్న సత్య మరయ వింతఁ దొంటి యక్షరములు పుచ్చ పువ్వు లోన రెండు పూ లు పుట్టె విష్పందక్రియ వెల్గుచుండ వనితా విశ్వంక రాంభోజముల్ నిష్పందక్రియ నిల్వఁ జూపఱు తమిన్ నీరేజ తుల్యమ్ము జ్యోతిష్పూర్ణాస్యము కాంతులం దనరుచున్ దీపింపఁ జోద్యమ్ముగాఁ బుష్పం బందున రెండు పుష్పము లవే పుట్టెన్ మనోజ్ఞమ్ములై
పుష్పాస్త్రంబులు చేతబూని మరుఁడే పూబోడి చుబ్రమ్మునన్నిష్పందంబుగ గొల్వుదీరినటులన్ నేత్రంబులొప్పారె నాపుష్పంబున్ సరిపోలు యాననమునన్ బొల్పారగా కన్నులేపుష్పంబందున రెండు పుష్పములవే పుట్టెన్ మనోజ్ఞమ్ములై
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.సుందరమగు వదనమందున చూడగకమలములను బోలు కనులు రెండునట్టి లలనఁ గాంచి యనిరి కవులిటులపువ్వులోన రెండు పూలు పుట్టె.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఆటవెలది
తొలగించండిశంబురాణిఁ గన ముఖాంభోజమందున
భక్తవత్సలత్వ యుక్తమగుచు
కరుణఁజింద విరిసె కమలనయనములు
పువ్వులోన రెండు పూలు పుట్టె!
శార్దూలవిక్రీడితము
నిష్పన్నంబగు రూపమంచుఁ బొగడన్ నీలాంగుడౌ కృష్ణుడున్
బాష్పంబుల్ ముఖమందు చిందవెతలన్ భక్తాదులన్ బ్రోవగన్
పుష్పంబుల్ కనులౌచు విచ్చఁగ ముఖాంభోజమ్మునన్ గావఁగన్
పుష్పంబందున రెండు పుష్పములవే పుట్టెన్ మనోజ్ఞమ్ములై!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిప్రియుని గాంచినంత వికసిత మైనట్టి
పద్మమదియె యామె వదనమవగ
కలువలట్లు బోలు కనుగవ నేగాంచ
పువ్వులోన రెండు పూలు పుట్టె.
పుష్పాలంకృత భవ్యరూపమనుచున్ మోక్షార్థులౌ భక్తులే
భాష్పంబుల్ కనులందుజేరు తరి యా భారూపమున్ గాంచగా
పుష్పంబంటి ముఖంబునందు గనగన్ బూరెమ్మలే కన్నులై
పుష్పంబందున రెండు పుష్పములవే పుట్టెన్ మనోజ్ఞమ్ములై.
పద్మమువలె ముఖము పడతి కుండగ నామె
రిప్లయితొలగించండివయసు మీరినంత వదన మందు
కనల గుడ్లపైని కంటి పూలనుగన
పువ్వులోన రెండు పూలు పుట్టె
ఆ॥ శాస్త్ర విజ్ఞతనటు సంధించి యుత్పత్తి
రిప్లయితొలగించండిపెంచ నెంచి చనుచు విస్తృతముగఁ
గన ప్రయోగములను గలలు పండి విరిసి
పూవ్వులోన రెండు పూలు పుట్టె
శా॥ పుష్పంబన్నను బీత్రి యందరకిలన్ బూజించ విశ్వేశ్వరున్
బుష్పంబుల్ సిగలోన ముచ్చటగనా పూఁబోణి యందమ్ముకున్
బుష్పంబుల్ గద శాస్త్ర విజ్ఞతనటుల్ పూనించి యత్నించఁగన్
పుష్పంబందున రెండు పుష్పములవే పుట్టెన్ మనోజ్ఞమ్ములై
నేను శాస్త్ర విద్యార్థి నండి
వృత్తము చివరి పాదము ద్రుతసంధి చేయగా
తొలగించండిబుప్షంబందున రెండు పుష్పములవే పుట్టెన్ మనోజ్ఞమ్ములై
అవుతుందండి
మరొక పూరణ
శా॥ నిష్పత్తిన్ జన సాంద్రతాధికతనే నేమమ్ము గానెంచుచున్
బుష్పించంగను సంపదాదులటు సంపూర్ణమ్ముగన్ బంచఁగన్
బాష్పంబుల్ గను దక్షిణాది ధన లభ్యంబెచ్చటో యచ్చటన్
బుష్పంబందున రెండు పుష్పములవే పుట్టెన్ మనోజ్ఞమ్ములై
ఇది దక్షిణాది రాష్ట్రాలు పెడుతున్న గోలండి
పువ్వువింటిజోదు పుట్టెఁ విష్ణు సుతుడై
రిప్లయితొలగించండిపువ్వువంటిమోముఁ బొందెనతడు
పువ్వులనెడు కనులు మోముపై వెలుగొంద
పువ్వులోన రెండు పూలు పుట్టె
పుష్పాస్త్రుండుదయించె విష్ణుసుతుడై పుష్పంబునేబోలుచున్
నిష్పాదించు నతండు మానసములో నీకున్న సంకల్పమే
నిష్పాపుండగు వానిమోము సుమమై నేత్రాలు పుష్పంబులై
పుష్పంబందున రెండు పుష్పములవే పుట్టెన్ మనోజ్ఞమ్ములై
శాస్త్ర వేత్త కృషికి జరిగి న ద్భు త మది
రిప్లయితొలగించండిపువ్వు లోన రెండు పూలు పుట్టె
విశ్వ మంత గాంచె వేడ్క గా నయ్యె డ
మెచ్చు కొనుచు మిగుల మిన్న గాను
పువ్వుబోడి మోము పుండ్రమై యలరారె
రిప్లయితొలగించండికలువపూల వంటి కన్నుదోయి
జూడనిట్లుఁ దోచె ప్రోడ వదనమున
పువ్వులోన రెండు పూలు పుట్టె
ఆ.వె:చక్క నైన మల్లె జాజుల నెంచక
రిప్లయితొలగించండినా విదేశ తరుల నేవొ నాట
తావి,యంద మేది తనరక నే యొక్క
పువ్వు లోన ,రెండు పూలు పుట్టె
శా:పుష్పమ్ముల్ చెవి లోన బెట్టుకొను విప్రుండయ్యు,మంత్రమ్ముతో
రిప్లయితొలగించండిపుష్ప మ్మిచ్చెడు వాడు నై పెరటిలో పోషించె మత్స్యమ్ము నే
పుష్ప మ్మం చొక ముద్దు పేరు నిడి విప్రుం డుల్లసిల్లంగ నా
పుష్పంబందున రెండు పుష్పములవే పుట్టెన్ మనోజ్ఞమ్ములై”
(అతడు చెవిలో పువ్వు పెట్టుకొనే బ్రాహ్మణుడు.మంత్రపుష్పం సమర్పించే బ్రాహ్మణుడు.చేపకి పుష్పం అనే పేరు పెట్టిన బ్రాహ్మణుడు.అనగా బెంగాలీ,లేక ఒరియా బ్రాహ్మణుడు.అతడు పెంచిన జలపుష్పానికి రెండు జలపుష్పాలు పుట్టాయి.)
"శంకరాభరణ"న శత పూరణంబులు
రిప్లయితొలగించండిపూర్తి జేసి జనక కీర్తి పొందె
సుతులిరువురు నుండె పితర సరణి లోన
పువ్వులోన రెండు పూలు పుట్టె
నిష్పందంబగు నీ ముఖాంబుజము నీ నేత్రారవిందంబులో
రిప్లయితొలగించండిపుష్పాఖ్యా సృజియించె బ్రహ్మ నిను సమ్మోహంబుగా నెన్నగా
పుష్పంబందున రెండు పుష్పములవే పుట్టెన్ మనోజ్ఞమ్ములై
నిష్పన్నంబయె నా మనోరథమహా నీ ప్రేమ బంధంబునన్
పావు సేరు పాల లో విను పా లెన్ని
రిప్లయితొలగించండియన్న నేను రెండె యన్న సత్య
మరయ వింతఁ దొంటి యక్షరములు పుచ్చ
పువ్వు లోన రెండు పూ లు పుట్టె
విష్పందక్రియ వెల్గుచుండ వనితా విశ్వంక రాంభోజముల్
నిష్పందక్రియ నిల్వఁ జూపఱు తమిన్ నీరేజ తుల్యమ్ము జ్యో
తిష్పూర్ణాస్యము కాంతులం దనరుచున్ దీపింపఁ జోద్యమ్ముగాఁ
బుష్పం బందున రెండు పుష్పము లవే పుట్టెన్ మనోజ్ఞమ్ములై
పుష్పాస్త్రంబులు చేతబూని మరుఁడే పూబోడి చుబ్రమ్మునన్
రిప్లయితొలగించండినిష్పందంబుగ గొల్వుదీరినటులన్ నేత్రంబులొప్పారె నా
పుష్పంబున్ సరిపోలు యాననమునన్ బొల్పారగా కన్నులే
పుష్పంబందున రెండు పుష్పములవే పుట్టెన్ మనోజ్ఞమ్ములై
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
సుందరమగు వదనమందున చూడగ
కమలములను బోలు కనులు రెండు
నట్టి లలనఁ గాంచి యనిరి కవులిటుల
పువ్వులోన రెండు పూలు పుట్టె.