హోళిగ నిఘంటువులో ఉన్నదండి. అనంతపురం జిల్లా నుండి కర్నాటక ప్రాంతములోనూ హోళిగ చాలా ప్రియమైన వంటకమండి. కొన్ని ప్రాంతలలో ఒబ్బట్టు అంటారు. వీటికి గోదావరి జిల్లాలలోని బొబ్బట్లకు తేడా ఉంటుందండి.
తే.గీ:అల్లు డను గౌరవమ్మునే యవల నుంచి తనకు బెట్టక నెదురుగా తన తనయున కెంతొ బ్రేమతో నత్త సంక్రాంతి వేళ నరిసెలం బెట్టి తినుమన్న నలుకఁ బూనె” (అత్త తనకి పెట్టకుండా తన ఎదురుగా కొడుక్కి పెట్టి తినమంటే కోపం వచ్చింది.ఆంధ్రప్రాంతం లో సంక్రాంతి కాలం లో అరిసెలు,జంతికలు మొద లైన బియ్యపు పిండి వంట లెక్కువ చేస్తారు.)
చం:అరువది దాటి వృద్ధు డయి నందున నేదియు వెట్ట దంతముల్ కరకర వేగమే నవల గల్గునొ లేదొ ప్రభాత వేళ లో నరిగెడు నిడ్లి కాని పెసరట్టును కాని యొసంగ ధర్మ మౌ అరిసెలు ముందుఁ బెట్టి తినుమన్నఁ గడుం గుపితుండు గాఁడొకో!” (అరిసెలు పెట్టటం మర్యాదే కానీ నమల లేని పెద్దాయనకి,ఉదయం టిఫెన్ గా అరిసెలు పెడితే ఏం బాగుంటుంది?.)
(3)తే.గీ:వినుము ధృతరాష్ట్ర నృప!మామ!వినయ మొప్ప పాండుసూను లై దూళ్లకే పట్టు విడువ నీ కొమరు డింక సంధికి నీల్గు చుండె నరిసెలం బెట్టి తినుమన్న నలుకఁ బూనె” (రాయబారానికి వెళ్లిన శ్రీకృష్ణుడు ప్రొటో కాల్ ప్రకారం "నృపా!" అన్నాడు.ప్రేమతో "మామా!" అనీ అన్నాడు.ఐదూ ళ్లిస్తే చాలని పాండవులు అన్నారంటే అది నీ కొడుక్కి అరిసెలు పెట్టినంత సాయం అని ,నీ కొడుకు మూర్ఖుడు కనుక సంధికి ఒప్పుకోవటం లేదని అన్నాడు.దుర్యోధనుడు ఐదూళ్లు ఇస్తే అది వాడి దాతృత్వ మేమీ కాదని ఐదూళ్లతో సరిపెట్టుకోవటం పాండవులే ఇచ్చే అరిసె ముక్క లని అనటం శ్రీకృష్ణుని దౌత్యం లోని చాకచక్యం.వినయం గా ప్రదర్శించే దర్పం.)
తేటగీతి
రిప్లయితొలగించండివిరహము విరహమంచును వేగిపోవు
పతిని శుక్రవారమనుచు పడతి వీడి
యధరమధురామృతము గోర నతివనిడక
యరిసెలం బెట్టి తినుమన్న నలుకఁ బూనె!
చంపకమాల
విరహము నోపలేని పతి, వేడిగ కౌగిళి నీయమంచు నా
సరసము నందునన్ పెదవి చప్పున గ్రోలగ తీపి తేనెకై
బిరబిర శుక్రవారమని వేపుచు దూరము నుంచి తీయగా
నరిసెలు ముందుఁ బెట్టి తినుమన్నఁ గడుం గుపితుండు గాఁడొకో!
పండుగ దినమనుచు దీపి వంటకమును
రిప్లయితొలగించండిపతికి దినిపించ గోరుచు భార్య చేసి
అరిసెలం బెట్టి తినుమన్న నలుకఁ బూనె !
యికపయిన యేమగుననగ నెవరికెరుక ?
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమురియుచు నెంతగానొ కడు ముచ్చట
రిప్లయితొలగించండిపడ్చు ధనాఢ్యు పెండ్లికిన్
పరిణయ విందు భోజనము బాగుగ
నుండునటంచు దల్చి వా
డరిగెను బ్రీతితో మిగుల నచ్చెరు
వందెను, నెయ్యిలేని యా
యరిసెలు ముందు బెట్టి తినుమన్న
గడుంగుపితుండు గాడొకో
మగడు రసికత నెరుఁగని మందబుద్ధి
రిప్లయితొలగించండిసరసము విరసమవ్వఁగ సరసిజాక్షి
పతిని నర్మిలి దనరార పలకరించి
అరిసెలం బెట్టి తినుమన్న నలుకఁ బూనె
సరస మెరుంగనట్టి పతి సారసలోచన మేలమాడగా
రిప్లయితొలగించండిసరగున మందుడౌ నతడు శాలినిపై గడు కిన్కబూనె నా
విరసము బాపగా వనిత వేడుకగా నుపలాలనమ్ముతో నరిసెలు ముందుఁ బెట్టి తినుమన్నఁ గడుం గుపితుండు గాఁడొకో
అల్లుడరుదెంచినంతనె యత్తగారు
రిప్లయితొలగించండి*"అరిసెలం బెట్టి తినుమన్న నలుకఁ బూనె”*
యల్లుడచ్చోట సతిగాక యత్త యొసగ
తినకచూచుచునుండెసతికొరకచట
హర హర శంకరా యనుచునా శివ భక్తుడనన్య దీక్షతో
రిప్లయితొలగించండివర శివరాత్రి పర్వము నుపాసము సేయు దలంపునుండగా
కరకర లాడు జంతికలు గారెలు బూరెలు నేతి పాయసం
బరిసెలు ముందుఁ బెట్టి తినుమన్నఁ గడుం గుపితుండు గాఁడొకో
తే॥ ఒకరు ప్రీతిగ తినఁగ వేరొకరు వలదు
రిప్లయితొలగించండివలదనుచుఁ ద్రోసి పుచ్చుట వగపుఁ గనుట
విదతమే! హోళిగలఁ దిను విభునకు సతి
యరిసెలం బెట్టి తినుమన్న నలుకఁ బూనె
చం॥ ధరణిని భోజనాదులను దారులు వేరగు మానవాళిలో
మరయుచు హోళిగల్ మిగుల మక్కువ మీరఁగ నారగించెడిన్
సరసున కత్తవారటులఁ జక్కఁగ మెప్పును బొందగా నహో
యరిసెలు ముందుఁ బెట్టి తినుమన్నఁ గడుం గుపితుండు గాడొకో
హోళిగ నిఘంటువులో ఉన్నదండి.
అనంతపురం జిల్లా నుండి కర్నాటక ప్రాంతములోనూ హోళిగ చాలా ప్రియమైన వంటకమండి. కొన్ని ప్రాంతలలో ఒబ్బట్టు అంటారు. వీటికి గోదావరి జిల్లాలలోని బొబ్బట్లకు తేడా ఉంటుందండి.
జాడ్యము వలన మంచి భోజనము వీడి
రిప్లయితొలగించండియద్భుత కఠోర పథ్యము నాచరించు
వేళ మధుమేహ రోగిని బిల్చి వాని
కరిసెలం బెట్టి తినుమన్న నలుకఁ బూనె
సరియగు తీరటంచు మరి చక్కని భోజనమే త్యజించుచున్
నిరతము నంగలార్చి కడు నిష్ఠుర పథ్యముచేయువానినే
మురిపెము తోడఁ బిల్చి కడు మూర్ఖతతో మధుమేహరోగికి
న్నరిసెలు ముందుఁ బెట్టి తినుమన్నఁ గడుం గుపితుండు గాఁడొకో
వైద్యు సలహాను పాటించి వాంఛ లుడుగ
రిప్లయితొలగించండితీపి మానిన వానికి తిను మటంచు
నరిశ లం బె ట్టి తినుమన్న నలుక బూనె
నను ట సరికాదు నిజముగ నవని యందు
ఆరు నెలల పూర్వపు రోగమైన గాని
రిప్లయితొలగించండిఅరిసెలు తినినంత మరల తిరగబెట్టు
మేలు కీడులెంచకయె కామెర్లు గలుగ
నరిసెలం బెట్టి తినుమన్న నలుకఁ బూనె
వరసకు బావ స్నేహితుడు బందరు నుండరుదెంచుచుండగా
తొలగించండిగురుతర మిత్ర భావమున కోడిని కూరగఁ జెయ్య గోరినన్
సరిసరి పల్కులాడి సతి చారును పప్పును బెండ కూరతో
నరిసెలు ముందుఁ బెట్టి తినుమన్నఁ గడుం గుపితుండు గాఁడొకో!!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపంచ భక్ష్య పాయసములు పర్వదినము
రిప్లయితొలగించండిప్రీతి గల లడ్డు జామాత పాత్రనందు
వేయకుండగ యత్తయు బెల్ల పాక
అరిసెలం బెట్టి తినుమన్న నలుకఁ బూనె
రిప్లయితొలగించండి
నిరతము తీపి వస్తువుల నెమ్మిని చూపెడి వాని తీరుకున్
రిప్లయితొలగించండిఅరిగిన దంతబిఱ్ఱునకు నాస్రవమొందుచు నంగలార్చగన్
అరిసెలు ముందుఁ బెట్టి తినుమన్నఁ గడుం గుపితుండు గాఁడొకో”
సరగున వైద్యులన్ కలయ సాధ్యము కాదని పండుగప్పుడున్
తే.గీ:అల్లు డను గౌరవమ్మునే యవల నుంచి
రిప్లయితొలగించండితనకు బెట్టక నెదురుగా తన తనయున
కెంతొ బ్రేమతో
నత్త సంక్రాంతి వేళ
నరిసెలం బెట్టి తినుమన్న నలుకఁ బూనె”
(అత్త తనకి పెట్టకుండా తన ఎదురుగా కొడుక్కి పెట్టి తినమంటే కోపం వచ్చింది.ఆంధ్రప్రాంతం లో సంక్రాంతి కాలం లో అరిసెలు,జంతికలు మొద లైన బియ్యపు పిండి వంట లెక్కువ చేస్తారు.)
చం:అరువది దాటి వృద్ధు డయి నందున నేదియు వెట్ట దంతముల్
రిప్లయితొలగించండికరకర వేగమే నవల గల్గునొ లేదొ ప్రభాత వేళ లో
నరిగెడు నిడ్లి కాని పెసరట్టును కాని యొసంగ ధర్మ మౌ
అరిసెలు ముందుఁ బెట్టి తినుమన్నఁ గడుం గుపితుండు గాఁడొకో!”
(అరిసెలు పెట్టటం మర్యాదే కానీ నమల లేని పెద్దాయనకి,ఉదయం టిఫెన్ గా అరిసెలు పెడితే ఏం బాగుంటుంది?.)
(3)తే.గీ:వినుము ధృతరాష్ట్ర నృప!మామ!వినయ మొప్ప
రిప్లయితొలగించండిపాండుసూను లై దూళ్లకే పట్టు విడువ
నీ కొమరు డింక సంధికి నీల్గు చుండె
నరిసెలం బెట్టి తినుమన్న నలుకఁ బూనె”
(రాయబారానికి వెళ్లిన శ్రీకృష్ణుడు ప్రొటో కాల్ ప్రకారం "నృపా!" అన్నాడు.ప్రేమతో "మామా!" అనీ అన్నాడు.ఐదూ ళ్లిస్తే చాలని పాండవులు అన్నారంటే అది నీ కొడుక్కి అరిసెలు పెట్టినంత సాయం అని ,నీ కొడుకు మూర్ఖుడు కనుక సంధికి ఒప్పుకోవటం లేదని అన్నాడు.దుర్యోధనుడు ఐదూళ్లు ఇస్తే అది వాడి దాతృత్వ మేమీ కాదని ఐదూళ్లతో సరిపెట్టుకోవటం పాండవులే ఇచ్చే అరిసె ముక్క లని అనటం శ్రీకృష్ణుని దౌత్యం లోని చాకచక్యం.వినయం గా ప్రదర్శించే దర్పం.)
వాని మాటల వేదన మానసమున
రిప్లయితొలగించండినాఁటె బెట్టిదముగ నరనాథుఁ డంతఁ
గోల ఘాతమ్ము రుచి చూడు కొంచె మనుచు
నరి సెలం బెట్టి తిను మన్న నలుకఁ బూనె
[సెల = బాణము]
తర తమ భేద మెంచకయు ధర్మము నెంచక సుంత యేనియుం
దిరిపె మొసంగు నట్లకట దిట్ట తనమ్మున నక్కజమ్ముగం
దరుణము మించ వచ్చినను దారుణ రీతినిఁ బాసి నట్టివౌ
యరిసెలు ముందుఁ బెట్టి తిను మన్నఁ గడుం గుపితుండు గాఁడొకో
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
పిలిచి భార్యను భర్తయె ప్రేమ తోడ
వండు మేదైన కారపు పిండి వంట
యనగ సతియు నోపిక లేదటంచు పతికి
యరిసె లంబెట్టి తినమన్న నలుక బూనె.