రాముడు లేని వేళ పెను రక్కసి రావణుడేగి చోరుడై భూమిజ రామపత్నిఁ గొని పోవ జటాయువు పోరి కూలినన్ రాముడు ప్రేమతోఁ బులుగు రాజముఁ బట్టుకు కౌగిలించగన్ రాముని వక్షమందుఁ గన రక్తపదద్వయముద్రలొప్పెరా!!
నీమమునా సనాతనిని నిర్మల చిత్తుడు సఖ్య భక్తి దా వేమరు కుంకుమార్చన పవిత్ర విధానములందు గొల్చునా శ్యామల మూర్తి బాల యను నక్కున జేర్చును బుజ్జగించునౌ రా ముని వక్షమందుఁ గన రక్తపదద్వయముద్రలొప్పెరా
ఉ:రామకథన్ రసాత్మకత వ్రాసితి వీవు కవీంద్ర! అట్ట పై రాముని పేరు కిర్దెసల లక్ష్మణ సీతల పేర్ల జేర్చి యా నామము లెర్ర రంగుననె నాకు రుచించగ వేసినావు గా! రాముని వక్షమందుఁ గన రక్తపదద్వయముద్రలొప్పెరా!” (ఒక కవి సీతారామలక్ష్మణ చరిత్ర వ్రాసాడు.రాముని పేరుకి ఒక పక్క సీత పేరు,మరొక ప్రక్క లక్ష్మణుని పేరు ఎర్ర రంగు లో ఉన్నాయి.రక్తపదద్వయం అంటే ఎర్రని రెండు శబ్దాలు అని అర్థం.ఆ పదాలు రాముని వక్షస్థలం మీద వచ్చాయి.పదాలు రాస్తే మాత్రం వక్షస్థలం మీద రాస్తారా? అంటే రాసేవాడు భావచిత్రకారు డైతే ఆ ఇద్దరూ రాముడి హృదయం లో ఉంటా రనే భావం తో వ్రాయ వచ్చు.వాడి స్టైల్ వాడిది.)
రాముని భార్య జానకిని రావణుడెత్తుకు వెళ్ళుచుండ ధ్యో భూమి జటాయువప్పుడును పోరును సల్పుచు కూలిపోవగన్ ప్రేముడి తోడ రాముడును లేపుచు దానిని కౌగిలించగన్ రాముని వక్షమందుగన రక్తపదద్వయముద్రలొప్పెరా
సమస్య: రాముని వక్షమందుఁ గన రక్త పద ద్వయ ముద్రలొప్పెరా!”
ఉత్పలమాల:
రాముడు కొల్వు సేయ ఘన రాముని దాసుడు రామదాసుయే స్వామికి వేల భూషణలు చక్కగ చేసె నవాబు మాడలన్ గోమున మెచ్చడే రఘువు గోపన చేరెను బందిఖానకే రాముడు గీముడేడి నిక రాగము దీయకుమంచు గొట్టగన్ రాముని వక్షమందుఁ గన రక్తపదద్వయముద్రలొప్పెరా!”
క్షేమము కొరవడె నసురులు
రిప్లయితొలగించండినీమముగా మునిగణముల నిధనమొనర్పన్
హోమము సలుపఁగ నౌరౌ
రా! ముని వక్షమునఁ గనుఁడు రక్తపు ముద్రల్!
సౌమేధిని జేరిన యా
రిప్లయితొలగించండిభామిని వలలోన చిక్కి పరవశమున నా
కోమలి హత్తుకొనగ నౌ
రా! ముని వక్షమునఁ గనుఁడు రక్తపు ముద్రల్.
ప్రేముని యాజ్ఞతో సుఖద పృథ్విని జేరుచు గాధిజుండతో
కామవికారచేష్టలవి కామిని చూపుచు మౌని చిత్తమున్
బ్రేమను నాటి దీక్షకిక విఘ్నము సేసెను గాంచు మంటి నౌ
రా! ముని వక్షమందుఁ గన రక్తపదద్వ యముద్ర లొప్పెరా.
రాముడు లేని వేళ పెను రక్కసి రావణుడేగి చోరుడై
రిప్లయితొలగించండిభూమిజ రామపత్నిఁ గొని పోవ జటాయువు పోరి కూలినన్
రాముడు ప్రేమతోఁ బులుగు రాజముఁ బట్టుకు కౌగిలించగన్
రాముని వక్షమందుఁ గన రక్తపదద్వయముద్రలొప్పెరా!!
భామా మణి వేయగ శ్రీ
రిప్లయితొలగించండిరాముని చిత్తరువు రంగు రంగుల తోటిన్
యామినినబుడ్డి వొలకగ
రాముని వక్షమునఁ గనుఁడు రక్తపు ముద్రల్
ప్రేమగ రమణి మహీజను
రిప్లయితొలగించండిరాముడు కౌగిలిని గొన రక్తిమరంగౌ
నామము తాకిన కతమున
రాముని వక్షమునఁ గనుఁడు రక్తపు ముద్రల్
నీమమునా సనాతనిని నిర్మల చిత్తుడు సఖ్య భక్తి దా
రిప్లయితొలగించండివేమరు కుంకుమార్చన పవిత్ర విధానములందు గొల్చునా
శ్యామల మూర్తి బాల యను నక్కున జేర్చును బుజ్జగించునౌ
రా ముని వక్షమందుఁ గన రక్తపదద్వయముద్రలొప్పెరా
ఆమైథిలి చారికలే
రిప్లయితొలగించండికోమలి నెన్నుదుట రక్త కుంకుమ నిడగా
భామిని కౌగలి విడిచిన
రాముని వక్షమునఁ గనుఁడు రక్తపు ముద్రల్
రాముడు సీతకంఠమున రత్నపు హారమలంకరింపగా
భామిని హారమధ్యమున బంగరు చిల్కలు తొంగలించెరా
భామినిఁ గౌగిటన్ బిగియఁబట్టిన పిమ్మట లాంఛనమ్ముగా
రాముని వక్షమందుఁ గన రక్తపదద్వయముద్రలొప్పెరా
[రక్తపదము = చిలుక]
నీమముగా మునీశ్వరుడు నిశ్చల చిత్తముతో వనంబునన్
రిప్లయితొలగించండిహోమ మొనర్చుచుండ నొక హుండుడు జేరి దయావిహీనుడై
నామమడంచె మౌనివరు నాశమొనర్పగ నధ్వరమ్ము నౌ
రా! ముని వక్షమందుఁ గన రక్తపదద్వయ ముద్రలొప్పెరా
పామరుని భంగి యొ క్కదు
రిప్లయితొలగించండితామసు డై మంచి చెడ్డ తలచక ముని పై
వేమరు చల్లె రుధి ర మౌ
రా! ముని వక్షమున గనుడు రక్తపు ముద్రల్
కందం
రిప్లయితొలగించండికాముక దృష్టిని గాంచగ
భీమ పరాక్రమ మహిషుని భీతిలఁ ద్రొక్కన్
వేమరు కాళి, యసుర హు
ద్రాముని వక్షమునఁ గనుఁడు రక్తపు ముద్రల్
ఉత్పలమాల
కాముక దృష్టిమై కనఁగ కాళిక యా మహిషాసురాధమున్
భీమ పరాక్రమంబెగయ భీతిల వానిని గూలఁ ద్రొక్కఁగన్
వేమరు నార్తిఁ బాపఁ బ్రజ వేదనఁ దీరఁగ, దుష్ట శీల హు
ద్రాముని వక్షమందుఁ గన రక్తపదద్వయముద్రలొప్పెరా!
కం:భూమిని క్షత్రియు లందరి
రిప్లయితొలగించండినీమమ్ముగ నెంచి చంపు నిర్దయుడౌచున్
బ్రేమకె శత్రువగు పరశు
రాముని వక్షమునఁ గనుఁడు రక్తపు ముద్రల్”
ఉ:రామకథన్ రసాత్మకత వ్రాసితి వీవు కవీంద్ర! అట్ట పై
రిప్లయితొలగించండిరాముని పేరు కిర్దెసల లక్ష్మణ సీతల పేర్ల జేర్చి యా
నామము లెర్ర రంగుననె నాకు రుచించగ వేసినావు గా!
రాముని వక్షమందుఁ గన రక్తపదద్వయముద్రలొప్పెరా!”
(ఒక కవి సీతారామలక్ష్మణ చరిత్ర వ్రాసాడు.రాముని పేరుకి ఒక పక్క సీత పేరు,మరొక ప్రక్క లక్ష్మణుని పేరు ఎర్ర రంగు లో ఉన్నాయి.రక్తపదద్వయం అంటే ఎర్రని రెండు శబ్దాలు అని అర్థం.ఆ పదాలు రాముని వక్షస్థలం మీద వచ్చాయి.పదాలు రాస్తే మాత్రం వక్షస్థలం మీద రాస్తారా? అంటే రాసేవాడు భావచిత్రకారు డైతే ఆ ఇద్దరూ రాముడి హృదయం లో ఉంటా రనే భావం తో వ్రాయ వచ్చు.వాడి స్టైల్ వాడిది.)
ఆ మనుజాధీశునకున్
రిప్లయితొలగించండిరామునకును దప్ప లేదు రణఘాతములే
యా మనుజాశను చేతన్
రాముని వక్షమునఁ గనుఁడు రక్తపు ముద్రల్
భామను జంపి జానకినిఁ బన్నుగ నన్ను వరింపు మన్న యా
కామ వశాసు రాంగన వికారపు మాటల నాలకింపఁగా
భీమ వచోవిఘాతమునఁ బెన్నుర మందు జనింప మచ్చలే
రాముని వక్ష మందుఁ గన రక్తప ద ద్వయ ముద్ర లొప్పెరా
[రక్తప ద ద్వయ ముద్రలు = రక్తము త్రాగు దానిచే నొసఁగఁ బడిన రెండు మచ్చలు]
రాముని భార్య జానకిని రావణుడెత్తుకు వెళ్ళుచుండ ధ్యో
రిప్లయితొలగించండిభూమి జటాయువప్పుడును పోరును సల్పుచు కూలిపోవగన్
ప్రేముడి తోడ రాముడును లేపుచు దానిని కౌగిలించగన్
రాముని వక్షమందుగన రక్తపదద్వయముద్రలొప్పెరా
సమస్య:
రిప్లయితొలగించండిరాముని వక్షమందుఁ గన రక్త పద ద్వయ ముద్రలొప్పెరా!”
ఉత్పలమాల:
రాముడు కొల్వు సేయ ఘన రాముని దాసుడు రామదాసుయే
స్వామికి వేల భూషణలు చక్కగ చేసె నవాబు మాడలన్
గోమున మెచ్చడే రఘువు గోపన చేరెను బందిఖానకే
రాముడు గీముడేడి నిక రాగము దీయకుమంచు గొట్టగన్
రాముని వక్షమందుఁ గన రక్తపదద్వయముద్రలొప్పెరా!”
తామసబుద్ధిని కాకము
రిప్లయితొలగించండికోమలి సీతయెదలోనగ్రుచ్చిన నౌరా
నామగువ మేనిరుధిరము
రామునివక్షమునగనుడురక్తపుముద్రల్