6, మార్చి 2025, గురువారం

సమస్య - 5054

7-3-2025 (శుక్రవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కన్నె యెద్దునుఁ గలియఁగఁ గలిగెఁ జేప”
(లేదా...)
“కన్నియ యెద్దునుం గలియఁ గల్గెను చేపయె యెండ్రి మెచ్చఁగన్”

26 కామెంట్‌లు:

  1. ఎన్ని మార్లు చెప్పిన గూడ నెరుగవేమి ?
    ఏకజాతి యాడ మగల యిజ్యయె యిడు
    ఖాయముగ నదే తెగ బిడ్డ , గాని యెటుల
    కన్నె యెద్దునుఁ గలియఁగఁ గలిగెఁ జేప ?

    రిప్లయితొలగించండి
  2. కల్ల లను బల్కు వాడిట్లు కల్ల బొల్లి
    మాటలను జెప్పు తరుణా న మహిని బలికె
    కన్నె యెద్దును గలియ గ గలిగె చేప
    యనగ పక్కున నవ్విరి యంద రపుడు

    రిప్లయితొలగించండి
  3. వరుడు వృషభమ్ము కన్యయె వధువటంచు
    దారకర్మము జేయగన్ వారికపుడు
    మీనరాశిని జనియించె సూనుడనుచు
    కన్నె యెద్దునుఁ గలియఁగఁ గలిగెఁ జేప.


    ఎన్నగ తల్లిరాశియది యింపగు కన్నియ తండ్రి భద్రమై
    చెన్నగురూపి మీనమున జీవను డొక్కడు పుట్టె నంచు నో
    యన్నువ యెండ్రిరాశి ముదమందుచు భర్తకు చెప్పె నిట్టులన్
    కన్నియ యెద్దునుం గలియఁ గల్గెను చేపయె యెండ్రి మెచ్చఁగన్.

    రిప్లయితొలగించండి
  4. ఎండ్రిరాశిలో పుట్టిన తండ్రియొకడు
    కన్యరాశిలో పుట్టిన కన్య కొరకు
    వృషభరాశి వానినిఁ దెచ్చి పెండ్లిచేసె
    కన్నె యెద్దునుఁ గలియఁగఁ గలిగెఁ జేప

    కన్నియ రాశికన్యకకు కర్కటరాశి శరీరకర్త మే
    లన్న తలంపునన్ వృషభ రాశిని తోడ్కొని పెండ్లి చేయగా
    క్రన్నన పుట్టె నాత్మజుడు రమ్యముగానట మీన రాశిలో
    కన్నియ యెద్దునుం గలియఁ గల్గెను చేపయె యెండ్రి మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  5. అన్నులమిన్న బుట్టెనల హస్తను, రోహిణి నామె భర్త వా
    రెన్నిక నొక్కటైరి జనియించెను రేవతి నందు మన్మడున్
    పున్నెమటంచు బుష్యమిని బుట్టిన తాత ముదంబు జూడుమా
    కన్నియ యెద్దునుం గలియఁ గల్గెను చేపయె యెండ్రి మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
  6. కన్నియ కన్య కాగ మరి కర్కము తల్లికి జన్మనొందగన్
    కన్నెకు తొమ్మిదింటికిని కాంతగ పంపగ మోదమొందగన్
    కన్నెకు సప్తమంబుగను కాన్పునఁ బుట్టె సుతుండు రత్నమై
    కన్నియ యెద్దునుం గలియఁ గల్గెను చేపయె యెండ్రి మెచ్చఁగన్!!

    రిప్లయితొలగించండి
  7. అయ్యవారికి నమస్కారములు

    నిన్న నా బ్లాగ్ లో ఓ హరి లంఘించి ఈ ప్రశ్న వేసెను‌
    దయచేసి దీని భావార్థము తెలుపగలరు

    "ద్రుతగతి తరుమృగవరూధినీ నిరుధ్ధలంకావరోధ వేపధులాస్యలీలోపదేశదేశిక ధనుర్జ్యాఘోష," - ఏదో పజ్యాలు గిలికేస్తూ సొంత డబ్బా కొట్టుకోవటం కాదు,దమ్ముంటే దీని కర్ధం చెప్పు!"



    ఇట్లు
    హరి పంపున
    జిలేబి


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అయ్యా ఈ వాక్టమునకు సందర్భము బట్టి అర్థము. రాముని కోదండము యొక్క అల్లె త్రాడు వేగమైన గతితో నాట్యమాడగా అది చేయు ఘోష చెట్లు మృగములు సేనలను రక్షణకై అడ్డముగా పెట్టుకొని యున్న లంక అనే అవరోధమును భయముతో కంపింపజేయు లీలను ఉపదేశించి చెప్పు గురువువంటిది అని ఒక అర్థము. అన్వయము కొంత అటూ ఇటుగా జేసిన మరొక భావము చేత గురువుయొక్క బోధ అనే అర్థము కూడా తేవచ్చును.

      తొలగించండి
    2. పూర్తి పాఠమును బరిశీలించినఁ గాని భావమును నిర్ధారింపలేము. ఇక్కడ ధనుర్జ్యాఘోష కర్తయుఁ గావచ్చును. ఆ వింటి యల్లెనారి శబ్దము ద్రుత గతి (వ్యాపించినది) యని కూడఁ గావచ్చును. తరువులు, మృగములు, సైన్యములచే నిరోధింపఁబడు లంకానగరపు టవరోధమునకుఁ గంపము లను నాట్య క్రీడను బోధించు గురువు వింటి నారి ఘోషకు విశేషణము కావచ్చును.
      ఆ హరీశ్వరునిఁ బూర్తి పాఠమును వ్రాయ మనండి.

      పూర్వము నా మిత్రుఁ డొకఁడు నన్ను “వాగ్రణీ” యంటే యేమిటని యడిగినాఁడు. యెక్కడ చూచితి వని యడుగ నిందుఁ గలఁ డందు లేఁడని యన్న పద్యములో నని చెప్పిన నాకు నావ్వు వచ్చినది.

      తొలగించండి
    3. ఈ పాదము రఘువీర గద్యములోనిదని చెప్పినారు

      తొలగించండి
    4. ఓహో అలాగా!
      ద్రుతగతి తరుమృగ వరూధినీ నిరుధ్ధ లం కావరోధ వేపధు లాస్య లీ లోపదేశ దేశిక ధనుర్జ్యాఘోష జయ! జయ!

      త్వరిత గతి గల కోఁతుల (తరుమృగములు) సైన్యముచే బంధింపఁబడిన లంకా
      నగరపు టంతఃపుర కాంతలకు (అవరోధము) కంపనము లను నాట్య క్రీడను బోధించు నాట్యాచార్యా వింటి నారి ఘోష కలవాఁడా జయము జయము.

      తొలగించండి
    5. ధన్యవాదములు

      ఈ కందం ప్రయత్నించాను పై అర్థంతో

      సవరణ చేయగలరు

      త్వరితము చెట్టుమెకమ్ముల
      పరివారము నడిమె కట్టుపరచె భళారే
      పరితాపపు నాటవెలది
      గురువుల పలుకు విలువటిని కూక భళారే




      తొలగించండి
    6. పోచిరాజు వారి పాండితికి సాదర ప్రణామములు

      తొలగించండి
  8. పరగడుపున తిన్నందున పైత్యమేమొ!
    గాక వడదెబ్బ తగులుట కారణమ్మొ!
    వెఱ్ఱి వెంగలితనమున ప్రేలెనిట్లు
    "కన్నె యెద్దునుఁ గలియఁగఁ గలిగెఁ జేప"

    రిప్లయితొలగించండి
  9. వేలెడంతటివారలు కలుగుననుచు
    వీర బ్రహ్మేంద్ర స్పష్టత పరచియుండె
    కలియు గాంతము నందున కలుగ వచ్చు
    కన్నె యెద్దునుఁ గలియఁగఁ గలిగెఁ జేప

    రిప్లయితొలగించండి
  10. తేటగీతి
    పురుషపుంగవుని సతియై బొలతి కనియె
    కూతునొకదాని, శాస్త్రిని గూడియడుగ
    జాతకాలందరివి గని సణగె లోన
    "కన్నె యెద్దునుఁ గలియఁగఁ గలిగెఁ జేప"

    ఉత్పలమాల
    మున్నొక తండ్రియే పురుషపుంగవు భర్తగఁ జేసె కూతుకున్
    దిన్నగఁ బుత్రికన్ గనఁగ, తీరుగ నందరి జాతకంబులం
    దున్న చమత్కృతిన్ గనుచునూహ సమస్యను శాస్త్రి గూర్చగన్
    "కన్నియ యెద్దునుం గలియఁ గల్గెను చేపయె యెండ్రి మెచ్చఁగన్!"

    రిప్లయితొలగించండి
  11. తే.గీ:కన్నె యందమ్ము బెంచెను గాదె చేప
    కన్నె!మగ డెద్దు బోలును గాని వలచి
    కన్నె యెద్దునుఁ గలియఁగఁ గలిగెఁ జేప”
    కనుల చిన్నదియే తల్లి మనము మురియ
    (చేప కళ్ల చిన్నది ఎద్దు లాంటి వాణ్ని కలిసినా ఆమెకి చేప కన్నుల పిల్లే పుట్టింది.)

    రిప్లయితొలగించండి
  12. ఉ:కన్నెకు జూడ పొంతనయె గల్గెను లే వృషభమ్ము తోడ, నా
    చిన్నది మీన రాశి నొక జీవికి జన్మ నొసంగె, దానికిన్
    జెన్నుగ కర్కటోద్భవుడు చిక్కె చమత్కృతి తోడ జెప్పగా
    కన్నియ యెద్దునుం గలియఁ గల్గెను చేపయె యెండ్రి మెచ్చఁగన్”
    (ఆ అమ్మాయికి వృషభరాశితో జాతకం కలిసింది.వాళ్లకి మీనరాశి గల అమ్మాయి పుట్టింది.ఆ అమ్మాయికి కర్కాటకరాశి వాడితో పెళ్లి కుదిరింది.)

    రిప్లయితొలగించండి
  13. కన్నియ లగ్గమందు కనెఁ గన్యను తల్లిది యెండ్రి లగ్గమే
    చిన్నది యెద్దు లగ్గమున చెన్నుగ బుట్టినవాని గోరె తా
    కన్నియగానె గూడినది కామము కన్నుల గప్ప నాతనిన్
    కన్నియ యెద్దునుం గలియఁ గల్గెను చేపయె యెండ్రి మెచ్చఁగన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. (కన్యకది కన్యారాశి; వరునిది వృషభరాశి; బాలికది మీనరాశి; తల్లిది కర్కాటకరాశి)

      తొలగించండి
  14. వింతపడ నేల సుంతయు నంతరంగ
    మందు నొక్క రైతు గృహము నందు గోవు
    కన్నె యెద్దునుఁ గలియఁగఁ గలిగెఁ జేఁపఁ
    బాలు దానికి నొక దూడ పది నెలలకు


    అన్నుల మిన్న భాగ్యము నహా గణియింపఁ దరంబె యేరికిం
    గన్నుల కీయ హర్షమును గట్టున నెఱ్ఱగ నున్న పీతయే
    తన్ను వరించె లాభమె యుదమ్మున నుండఁగఁ జోద్య మందుచుం
    గన్నియ యెద్దునుం గలియఁ గల్గెను జేఁపయె యెండ్రి మెచ్చఁగన్

    [ఎండ్రిన్ మెచ్చఁగన్]

    రిప్లయితొలగించండి
  15. 3)తే.గీ:సలకమున్ జూచి,యవయవములను జూచి
    కొనిన రైతు లెల్లరు మెచ్చు కొనిన యావు
    కన్నె, యెద్దునుఁ గలియఁగఁ గలిగెఁ జేప
    తల్లి క్షీరమ్ము సొగసరి బుల్లి దూడ
    (రైతు ఆవు కన్నెని అనగా వయస్సులో ఉన్న ఆవుని సలకం చూసి కొన్నాడు.అది ఎద్దుని కలువగా తల్లి పొదుగుని చేపి పాలు తీయటానికి ఒక దూడ కలిగింది.)

    రిప్లయితొలగించండి
  16. కన్య వృషభ రాశివరుని కరముపట్టి
    పెద్దల అనుమతినిపొంది పెండ్లి యాడ
    రాజసమ్మొప్పగా మీనరాశిలోన
    కన్నె యెద్దును కలియగ కలిగె చేప

    రిప్లయితొలగించండి