11, మార్చి 2025, మంగళవారం

సమస్య - 5059

12-3-2015 (బుధవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఎవ్వఁ డెవ్వఁ డెవ్వఁ డెవ్వఁ డతఁడు”
(లేదా...)
“ఎవ్వఁడెవండె వాఁడెవఁడె యెవ్వఁడె యెవ్వఁడె యెవ్వఁ డెవ్వఁడే”

36 కామెంట్‌లు:

  1. పూరణ సలుపుటను మొదట యెవరు జేసె
    ఎవ్వఁ డెవ్వఁ డెవ్వఁ డెవ్వఁ డతఁడు
    వాని నామ మైన పరికించగనె నాకు
    తెలుపు మయ్య యోయి తెలగు వాడ

    రిప్లయితొలగించండి
  2. ఇవ్వన భూమిలోన తమకిష్టము
    వచ్చిన తీరుగా దరుల్
    సవ్వడి తెల్యికుండ కడు జాగ్రతతో
    డను నర్కుచుండగా
    నవ్వన రక్షకుండుగని యందరి
    నడ్గెను చెప్పుమంచు వా
    డెవ్వడె వాడెవండెవడె యెవ్వడె
    వాడెవ డెవ్వడెవ్వడే.

    రిప్లయితొలగించండి

  3. వెన్న మ్రుచ్ఛలింప వృత్రపు వేళలో
    వీధు లందు తిరుగు వెన్ను డంచు
    నిందవేయనేల? నిలయముల్ తిరుగువా
    డెవ్వఁ డెవ్వఁ డెవ్వఁ డెవ్వఁ డతఁడు.


    చివ్వను గోరి గొల్లలిట జేరుట న్యాయమె చిన్నవానిపై
    నివ్విధి నిందవేయ తగదెవ్వరి కైనను మీ సమాశ్రయ
    మ్మెవ్వడు జేరె మంథజము నెవ్వడు మ్రుచ్ఛిలి జేయబూనె వా
    డెవ్వఁడెవండె వాఁడెవఁడె యెవ్వఁడె యెవ్వఁడె యెవ్వఁ డెవ్వఁడే.

    రిప్లయితొలగించండి
  4. నవ్వుచు నేను కైపదము నవ్యపు రీతిగ
    నిచ్చినంతనే
    ఎవ్వఁడెవండె వాఁడెవఁడె యెవ్వఁడె యెవ్వఁడె యెవ్వఁ డెవ్వఁడే
    చివ్వున దాని పూ రణను జేసిన మాన్యుడు ?
    వాని నా మమున్
    అవ్వలకేగి నీవయిన నారయు చుండుచు నేర్వనొప్పుగా

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. ఆ॥ మగువ మానసమటు మధుర మనోజ్ఞత
      సంతరించు కొనఁగ చతుర గాన
      సుధల పరవశించ సుమశరుని తలఁపు
      నెవ్వఁ డెవ్వఁ డెవ్వఁ డెవ్వఁ డతఁడు

      ఉ॥ రవ్వలు పద్మరాగమణి రమ్యతఁ గాంచఁగ మేని పైననున్
      జివ్వున మానసమ్మతని స్నేహపు కాంక్షను సొక్కి తేలఁగన్
      మువ్వలఁ గట్టి నాట్యమును మోహన రాగము తోడఁ జేయు వాఁ
      డెవ్వఁడెవండె వాఁడెవడె యెవ్వడె యెవ్వడె యెవ్వడెవ్వడె

      తొలగించండి
    2. మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  6. బ్యాంకు ఖాతనందు పడవైచె లక్షయున్
    వేయి నోటు రద్దు వేళ సమయ
    ఎవ్వఁ డెవ్వఁ డెవ్వఁ డెవ్వఁ డతఁడు వేసె
    ఎంత తలచి జూడ తెలియకుండె

    రిప్లయితొలగించండి
  7. వెన్నమీగడలను ప్రియమార సేవింప
    దొంగిలించినట్టి దొంగ యెవడు
    తరుణుల వలువలను తస్కరించెనెవడు
    ఎవ్వఁ డెవ్వఁ డెవ్వఁ డెవ్వఁ డతఁడు

    ఎవ్వడనంత కల్పనకు హేతువనంబడు? నీశ్వరేశ్వరుం
    డెవ్వడు? సర్వలోకముల కెవ్వడు రక్షణ కల్గజేయునో?
    కవ్వపుకొండనెత్తి ఘనకార్యము సాధ్యముచేసెనెవ్వడో?
    ఎవ్వఁడెవండె వాఁడెవఁడె యెవ్వఁడె యెవ్వఁడె యెవ్వఁ డెవ్వఁడే

    రిప్లయితొలగించండి
  8. జనుల బాగు కోరి జననేత గా మెల్గి
    సతము పాటు పడె డు సజ్జ నుండు
    తనదు గొప్ప నెపుడు ధరణి లో తెలు ప బో
    డెవ్వ డెవ్వ డెవ్వ డెవ్వ డతడు?

    రిప్లయితొలగించండి
  9. ఎవ్వడు తాటకన్ దునిమె నెవ్వడు మౌని మఖమ్ముఁ బ్రోచె వా
    డెవ్వడు విల్లు ద్రుంచె ఘనుడెవ్వడు భార్గవ రామ సన్నుతుం
    డెవ్వడు కానకున్ వెడలె నెవ్వడు దైత్యులఁ జంపె నీశ్వరుం
    డెవ్వఁడెవండె వాఁడెవఁడె యెవ్వఁడె యెవ్వఁడె యెవ్వఁ డెవ్వఁడే!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొత్తం రామాయణమే చెప్పారుగా ఒక్క పద్యంలో. అద్భుతంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
  10. గొల్లవాడనుండు గోవుల కాపాడు
    కలువ రేకు వంటి కనులవాఁడు
    వెన్న దొంగిలించు వన్నెల చెలికాడు
    ఎవ్వఁ డెవ్వఁ డెవ్వఁ డెవ్వఁ డతఁడు

    రిప్లయితొలగించండి
  11. మంచి పేరు యున్న మాన్యుడు నతడేను
    తప్పు చేయకుండు తాను నెపుడు
    దమ్ముయున్నవాడు దండించ చెరసాల
    ఎవ్వఁ డెవ్వఁ డెవ్వఁ డెవ్వఁ డతఁడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'పేరు + ఉన్న, దమ్ము + ఉన్న' అన్నపుడు యడాగమం రాదు. *పేరు గలుగు మాన్యవరు డతండు... తాను సతము... దమ్ము గలుగువాడు...* అనండి.

      తొలగించండి
  12. 1)ఆ.వె:ఎవడు సృష్టి జేసె?నెవని నుండును జగ?
    మెవని యందు కలియు,నెవ్వ డీశు?
    డెవడు కారణమ్మొ ? ఈ బుద్ధి లేని వా
    డెవ్వఁ డెవ్వఁ డెవ్వఁ డెవ్వఁ డతఁడు?
    (ఎవ్వని చే జనించు పద్యాన్నే నాస్తికు డైతే ఇలా చెపుతాడు.)

    రిప్లయితొలగించండి
  13. (3)ఉ:సవ్వడి లేక యే దిశకు చచ్చితివో కద! గర్భమయ్యెగా!
    యి వ్విధి పెండ్లి లేకయె!వచింపవె యిట్టుల కొంప ముంచినా?
    డెవ్వడు? వాని యయ్య యెవ?డేకులమో?మతమేది?యట్టి తీట గా
    డెవ్వఁడెవండె వాఁడెవఁడె యెవ్వఁడె యెవ్వఁడె యెవ్వఁ డెవ్వఁడే”
    (పెళ్లి కాకుండా గర్భం తెచ్చుకున్న అమ్మాయిని వా డెవడో చెప్పమని అమ్మ,నాన్న అడిగినట్లు.)

    రిప్లయితొలగించండి
  14. అవ్వని రాధికన్ జెలియ లల్లరి వెట్టిరి యిట్టులన్ - "నినున్
    బువ్వులఁ గొట్టె, ముద్దులిడె బుగ్గల, మోవిరసమ్ముఁ ద్రావె, నీ
    నవ్వుల నవ్వె, నీ యెదను నాటె ముఖమ్మును, గౌగిలించె వా
    డెవ్వఁడెవండె వాఁడెవఁడె యెవ్వఁడె యెవ్వఁడె యెవ్వఁ డెవ్వఁడే"

    రిప్లయితొలగించండి
  15. ఆటవెలది
    శరణమన్న కరిని బిరబిరా రక్షించె
    పడతి కావు మనగ వలువలిచ్చె
    భక్తవత్సలుడను వాడు హరియె కాక
    యెవ్వఁ డెవ్వఁ డెవ్వఁ డెవ్వఁ డతఁడు!

    గోపికల నిందలు:

    ఉత్పలమాల
    అవ్వల నల్లపిల్లి వలెనందరి గేముల పాలువెన్నఁ దా
    నివ్వల గోపికామణులు నేడ్వగ కోకల దొంగలించుచున్
    సవ్వడిఁ జేయకే జనని చాటగు వెన్నుడు గొంటెకాక తా
    నెవ్వఁడెవండె? వాఁడెవఁడె? యెవ్వఁడె? యెవ్వఁడె? యెవ్వఁ డెవ్వఁడే?

    రిప్లయితొలగించండి
  16. ఎవ్వఁడు వాడు సాధుజనులెల్లరి యుల్లములందు నుండువా
    డెవ్వఁడు దీనరక్షణము నేర్పడఁగూర్చు దయామయుండు తా
    నెవ్వడు జీవజాలముల కేడుగడై విలసిల్లుచుండునో
    యెవ్వఁడెవండె వాఁడెవఁడె యెవ్వఁడె యెవ్వఁడె యెవ్వఁ డెవ్వఁడే

    రిప్లయితొలగించండి
  17. ఏక దివస కందుకేరిత క్రీడాంగ
    ణమున భారతోగ్ర నరవరేణ్యు
    ల కెదు రెవ్వఁ డుండుఁ బ్రకటింపుమా నాకు
    నెవ్వఁ డెవ్వఁ డెవ్వఁ డెవ్వఁ డతఁడు


    అవ్వన జాక్షు నెన్న మది హస్తి వరేణ్యున కప్రయత్నతన్
    నొవ్వున వెల్వడెన్ గిరలు నోటఁ బురాకృత పుణ్య రాశిచే
    నివ్వన చారి బంధము కరీంద్రున కెవ్వఁడు వాప నోపునో
    యెవ్వఁ డెవండె వాఁ డెవఁడె యెవ్వఁడె యెవ్వఁడె యెవ్వఁ డెవ్వఁడే

    రిప్లయితొలగించండి