11-3-2015 (మంగళవారం)ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“వేకువనె చిమ్మె సూర్యుఁడు చీఁకటులను”(లేదా...)“చీఁకటులన్ దివాకరుఁడు చిమ్మె దిశాంతములందు వేకువన్”
ఆయతనము నందెల్లడ నాతపమునువేకువనె చిమ్మె సూర్యుఁడు ; చీఁకటులనుతరపినంత పురజనులు దమ పనులనుజేసుకొనగ మొదలిడిరి శీలముగను
సింధునేమిని ముసిరిన చీకువాలుగాంచి భీతిల్లి పిలువగా ఖగమనములుప్రాగ్దిశాద్రుల యందున ప్రభవమందివేకువనె చిమ్మె సూర్యుఁడు చీఁకటులను.కాకర యస్తమించగనె కల్పము నంతయు నాక్రమింప నాచీకటి గాంచి భీతిలుచు స్తీర్విని చేరమటంచు పిల్చు నాయోకపు పిల్పునందుకుని యుర్వికి కాంతినొసంగ బుట్టుచున్ చీఁకటులన్ దివాకరుఁడు చిమ్మె దిశాంతములందు వేకువన్.
రోళ్లు పగుల కాలంబగు రోహిణీ న కోడి కూసిన వేళన వేడి శగలు వేకువనె చిమ్మె సూర్యుఁడు; చీఁకటులనుతరిమి వేసి సప్తాశ్వుడై తరలి వడిగ
తే॥ అంబరమునఁ గప్పి కొనఁగ నరుణ కాంతివేకువనె చిమ్మె సూర్యుఁడు, చీఁకటులనుపారదోలుచు మనుజులు ప్రజ్ఞఁ గనుచుఁదమ పనులఁ జేయ నెంచుచుఁ దపన పడఁగఉ॥ ప్రాకటనమ్ముగానటు ప్రభాతపు వేళను దూర్పుదిక్కునన్సోకుగ నింగిలో నరుణ శోభల నొందుచు తొంగిచూచుచున్జీఁకటులన్ దివాకరుఁడు చిమ్మె, దిశాంతములందు వేకువన్బైకొనుటన్ గనంగఁ బ్రజ ప్రజ్ఞను గాంచుచు సంచరించఁగన్ చిమ్ము ఊడ్చు (వృత్తములో నండి)పైకొను మీదికి వచ్చు (నిఘంటువు సహాయమండి)
తూర్పు కనుమల వెల్గుల దొంతరలనువేకువనె చిమ్మె సూర్యుఁడు, చీఁకటులనుపారదోలుచు నల్దెసల్ వసుధయందుతెల్లవారెను మేలుకో నల్లనయ్య!
ఆకసమందు నెల్లెడల నల్లుకొనంగ ప్రభాత దీధితుల్ప్రాకటమయ్యె ప్రాగ్దిశను భాతి పదంపడి పారదోలుచున్చీఁకటులన్ దివాకరుఁడు చిమ్మె దిశాంతములందు వేకువన్లోకములెల్ల మేలుకొనె బ్రోవగ లెమ్మిక లోకబాంధవా
వాకిలి జిమ్మి(1) యింతి యిడె వన్నెల చిన్నెల రంగవల్లులన్కాకము చిమ్మె(2) వృక్షఫల ఖాద్యము బల్కుచు కావుకావునన్మ్రాకున పుష్పముల్ విరిసి మంచిగ గంధముఁ జిమ్ము(3)వేళలోచీఁకటులన్ దివాకరుఁడు చిమ్మె(4) దిశాంతములందు వేకువన్!!1) చిమ్ము = దుమ్మును వెడలఁగొట్టు2) చిమ్ము = పొడుచు3) చిమ్ము = విసురు / చల్లు4) చిమ్ము = వెడలఁగొట్టు
పొకడ జేసె నెల్లెడల పూర్తిగ నిన్నటి రాత్రి నందలిన్చీఁకటులన్ దివాకరుఁడు ; చిమ్మె దిశాంతములందు వేకువన్వీకగ కాంతితో , కనుక వీలుగ వీడున నుండినట్టి యాలోకులు వారి కార్యముల లోపము లేకనె చక్కబె ట్టిరే
పూర్వ దిశ యందు కాంతితో పొడమి నంత వేకువ నె చీమ్మె సూర్య డు చీకట్లను లోక మంతయు మేల్కొని మో క రిల్లి మునిగె తమతమ పనులలో మోద మలర
చీకటి రాత్రి యంతమయి చిక్కని చక్కనికాంతి రేఖలేప్రాకటమయ్యె కన్గొనగ ప్రాగ్దిశ వెల్గులు పారనొత్తుచున్జీఁకటులన్, దివాకరుఁడు చిమ్మె దిశాంతములందు వేకువన్లోకము లోని ప్రాణులకు క్లుప్తముగా తగు శక్తినీయగా
ఉ.మా.రేకుల విచ్చు యత్నముల లేత ప్రసూనములుద్యమించగాఁ..,గోకిల గానమాధురులు కొండలు,కోనలు విస్తరించగా..,వాకిలులందు మ్రుగ్గులను బంకజనేత్రులు తీర్చి త్రోలగాఁ*జీఁకటులన్.., దివాకరుఁడు చిమ్మె దిశాంతములందు వేకువన్*
ఉ.మా.రేకుల విచ్చు యత్నముల లేత ప్రసూనములుద్యమించగాఁ..,గోకిల గానమాధురులు కొండలఁ,గోనల విస్తరించగా..,వాకిళులందు మ్రుగ్గులను బంకజనేత్రులు తీర్చఁ, ద్రోలగాఁ*జీఁకటులన్.., దివాకరుఁడు చిమ్మె దిశాంతములందు వేకువన్*
తే.గీ:వేసవియె వచ్చె నింతలో, విడెను చలియెవేయి దివ్వెల వేడిని వెరపు గొల్పవేకువనె చిమ్మె సూర్యుఁడు చీఁకటులనుపారద్రోలుచు నిద్రలన్ పారద్రోలి.
ఉ:ప్రాకట మయ్యె గ్రీష్మ మిక భగ్గున నెండలు సాగుచుండె గాలోకము భీతిజెంద,తృటిలోన కరమ్ముల నెట్టివేయుచున్ చీఁకటులన్, దివాకరుఁడు చిమ్మె దిశాంతములందు వేకువన్సోకగ వేడి గాడుపులు సొక్క బ్రజల్ కిరణాళి నెల్లెడన్.
తేటగీతినాడు 'నాదెండ్ల' పిలువఁగ నందమూరిఁబ్రజలు ముఖ్యమంత్రిగ చేసి రంజిలంగవెన్నపోటున గూల్చుచు వేదననిడివేకువనె చిమ్మె 'సూర్యుఁడు' చీఁకటులనుఉత్పలమాలమీకు ప్రజాబలమ్మదియె మేదినినుండగ మిక్కుటమ్ముగన్జేకురు రాజభోగమని చేసియు సిద్దము నందమూరినే!యాకట! వెన్నుపోటునిడి యందెను పీఠము భాస్కరుండహో!చీఁకటులన్ దివాకరుఁడు చిమ్మె దిశాంతములందు వేకువన్!
సూర్యుడు, దివాకరుడు = నాదెండ్ల భాస్కరరావు గారు.
తే.గీ:వరమహిమ జూడగా నవివాహిత యగుబాల ప్రార్థింప జాలియు నాలి లేకగర్భ మొసగి కుంతిని గడు గాసి వెట్టె*వేకువనెచిమ్మె సూర్యుడు చీకటులను*(కుంతి జీవితం లో సూర్యుడు చీకటిని చిమ్మాడు.)
జవముగా నరుదెంచుచు జగతి వెలుగువేకువన చిమ్మె సూర్యుడు చీకటులనుతొలగ చేయ జనుల కెల్ల తోషమొదవమొదలు పెట్టిరి పనులను భూరిగానుఆకసమందుజూడగను నంతయుశూన్యముగానుతోచనా*“చీఁకటులన్ దివాకరుఁడు చిమ్మె దిశాంతములందు వేకువన్”*కాకులుకావుకావుమన కార్యము లందున వేగమగ్నులైకోకలు సర్దుకొంచునటకోమలులెల్లరులేచిరొప్పుగన్
(4)తే.గీ;"గ్రహణమును కంటి తో జూడ రా" దనంగతెగువ నే యద్దమును లేక మగువ కాంచియంథు రాలయ్యె వెలుగిచ్చు నాతడయ్యు వేకువనె చిమ్మె సూర్యుఁడు చీఁకటులను”
పద్మ రాసుల కింపుగఁ బంచి వెలుగుఁ గలువ గముల మనము లందుఁ గరుణ లేక తూర్పు కొండపై నుదయించి తోరముగను వేకువనె చిమ్మె సూర్యుఁడు చీఁకటులను రూకల కాస నూన కెద లోనఁ దలంచి పరోపకారమున్ నాకపు మార్గ మందు నిజ నైపుణ మేర్పడఁ దిర్గు చుండి పల్పోకల సంతతమ్మును విరోచనుఁడే యుదయింప కింకయుం జీఁకటులన్ దివాకరుఁడు చిమ్మె దిశాంతము లందు వేకువన్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.ప్రాగ్దిశను కిరణాలతో ప్రభవమొందివేకువనె చిమ్మె సూర్యుడు; చీకటులనుపార దోల విశ్వమ్మున పరచి వెలుగుపశ్చిమాద్రిని గ్రుంకగ పరుగు లిడెను.
ఆయతనము నందెల్లడ నాతపమును
రిప్లయితొలగించండివేకువనె చిమ్మె సూర్యుఁడు ; చీఁకటులను
తరపినంత పురజనులు దమ పనులను
జేసుకొనగ మొదలిడిరి శీలముగను
సింధునేమిని ముసిరిన చీకువాలు
రిప్లయితొలగించండిగాంచి భీతిల్లి పిలువగా ఖగమనములు
ప్రాగ్దిశాద్రుల యందున ప్రభవమంది
వేకువనె చిమ్మె సూర్యుఁడు చీఁకటులను.
కాకర యస్తమించగనె కల్పము నంతయు నాక్రమింప నా
చీకటి గాంచి భీతిలుచు స్తీర్విని చేరమటంచు పిల్చు నా
యోకపు పిల్పునందుకుని యుర్వికి కాంతినొసంగ బుట్టుచున్
చీఁకటులన్ దివాకరుఁడు చిమ్మె దిశాంతములందు వేకువన్.
రోళ్లు పగుల కాలంబగు రోహిణీ న
రిప్లయితొలగించండికోడి కూసిన వేళన వేడి శగలు
వేకువనె చిమ్మె సూర్యుఁడు; చీఁకటులను
తరిమి వేసి సప్తాశ్వుడై తరలి వడిగ
తే॥ అంబరమునఁ గప్పి కొనఁగ నరుణ కాంతి
రిప్లయితొలగించండివేకువనె చిమ్మె సూర్యుఁడు, చీఁకటులను
పారదోలుచు మనుజులు ప్రజ్ఞఁ గనుచుఁ
దమ పనులఁ జేయ నెంచుచుఁ దపన పడఁగ
ఉ॥ ప్రాకటనమ్ముగానటు ప్రభాతపు వేళను దూర్పుదిక్కునన్
సోకుగ నింగిలో నరుణ శోభల నొందుచు తొంగిచూచుచున్
జీఁకటులన్ దివాకరుఁడు చిమ్మె, దిశాంతములందు వేకువన్
బైకొనుటన్ గనంగఁ బ్రజ ప్రజ్ఞను గాంచుచు సంచరించఁగన్
చిమ్ము ఊడ్చు (వృత్తములో నండి)
పైకొను మీదికి వచ్చు (నిఘంటువు సహాయమండి)
తూర్పు కనుమల వెల్గుల దొంతరలను
రిప్లయితొలగించండివేకువనె చిమ్మె సూర్యుఁడు, చీఁకటులను
పారదోలుచు నల్దెసల్ వసుధయందు
తెల్లవారెను మేలుకో నల్లనయ్య!
ఆకసమందు నెల్లెడల నల్లుకొనంగ ప్రభాత దీధితుల్
రిప్లయితొలగించండిప్రాకటమయ్యె ప్రాగ్దిశను భాతి పదంపడి పారదోలుచున్
చీఁకటులన్ దివాకరుఁడు చిమ్మె దిశాంతములందు వేకువన్
లోకములెల్ల మేలుకొనె బ్రోవగ లెమ్మిక లోకబాంధవా
వాకిలి జిమ్మి(1) యింతి యిడె వన్నెల చిన్నెల రంగవల్లులన్
రిప్లయితొలగించండికాకము చిమ్మె(2) వృక్షఫల ఖాద్యము బల్కుచు కావుకావునన్
మ్రాకున పుష్పముల్ విరిసి మంచిగ గంధముఁ జిమ్ము(3)వేళలో
చీఁకటులన్ దివాకరుఁడు చిమ్మె(4) దిశాంతములందు వేకువన్!!
1) చిమ్ము = దుమ్మును వెడలఁగొట్టు
2) చిమ్ము = పొడుచు
3) చిమ్ము = విసురు / చల్లు
4) చిమ్ము = వెడలఁగొట్టు
పొకడ జేసె నెల్లెడల పూర్తిగ నిన్నటి రాత్రి నందలిన్
రిప్లయితొలగించండిచీఁకటులన్ దివాకరుఁడు ; చిమ్మె దిశాంతములందు వేకువన్
వీకగ కాంతితో , కనుక వీలుగ వీడున నుండినట్టి యా
లోకులు వారి కార్యముల లోపము లేకనె చక్కబె ట్టిరే
పూర్వ దిశ యందు కాంతితో పొడమి నంత
రిప్లయితొలగించండివేకువ నె చీమ్మె సూర్య డు చీకట్లను
లోక మంతయు మేల్కొని మో క రిల్లి
మునిగె తమతమ పనులలో మోద మలర
చీకటి రాత్రి యంతమయి చిక్కని చక్కనికాంతి రేఖలే
రిప్లయితొలగించండిప్రాకటమయ్యె కన్గొనగ ప్రాగ్దిశ వెల్గులు పారనొత్తుచున్
జీఁకటులన్, దివాకరుఁడు చిమ్మె దిశాంతములందు వేకువన్
లోకము లోని ప్రాణులకు క్లుప్తముగా తగు శక్తినీయగా
ఉ.మా.
రిప్లయితొలగించండిరేకుల విచ్చు యత్నముల లేత ప్రసూనములుద్యమించగాఁ..,
గోకిల గానమాధురులు కొండలు,కోనలు విస్తరించగా..,
వాకిలులందు మ్రుగ్గులను బంకజనేత్రులు తీర్చి త్రోలగాఁ
*జీఁకటులన్.., దివాకరుఁడు చిమ్మె దిశాంతములందు వేకువన్*
ఉ.మా.
తొలగించండిరేకుల విచ్చు యత్నముల లేత ప్రసూనములుద్యమించగాఁ..,
గోకిల గానమాధురులు కొండలఁ,గోనల విస్తరించగా..,
వాకిళులందు మ్రుగ్గులను బంకజనేత్రులు తీర్చఁ, ద్రోలగాఁ
*జీఁకటులన్.., దివాకరుఁడు చిమ్మె దిశాంతములందు వేకువన్*
తే.గీ:వేసవియె వచ్చె నింతలో, విడెను చలియె
రిప్లయితొలగించండివేయి దివ్వెల వేడిని వెరపు గొల్ప
వేకువనె చిమ్మె సూర్యుఁడు చీఁకటులను
పారద్రోలుచు నిద్రలన్ పారద్రోలి.
ఉ:ప్రాకట మయ్యె గ్రీష్మ మిక భగ్గున నెండలు సాగుచుండె గా
రిప్లయితొలగించండిలోకము భీతిజెంద,తృటిలోన కరమ్ముల నెట్టివేయుచున్
చీఁకటులన్, దివాకరుఁడు చిమ్మె దిశాంతములందు వేకువన్
సోకగ వేడి గాడుపులు సొక్క బ్రజల్ కిరణాళి నెల్లెడన్.
తేటగీతి
రిప్లయితొలగించండినాడు 'నాదెండ్ల' పిలువఁగ నందమూరిఁ
బ్రజలు ముఖ్యమంత్రిగ చేసి రంజిలంగ
వెన్నపోటున గూల్చుచు వేదననిడి
వేకువనె చిమ్మె 'సూర్యుఁడు' చీఁకటులను
ఉత్పలమాల
మీకు ప్రజాబలమ్మదియె మేదినినుండగ మిక్కుటమ్ముగన్
జేకురు రాజభోగమని చేసియు సిద్దము నందమూరినే!
యాకట! వెన్నుపోటునిడి యందెను పీఠము భాస్కరుండహో!
చీఁకటులన్ దివాకరుఁడు చిమ్మె దిశాంతములందు వేకువన్!
సూర్యుడు, దివాకరుడు = నాదెండ్ల భాస్కరరావు గారు.
తొలగించండితే.గీ:వరమహిమ జూడగా నవివాహిత యగు
రిప్లయితొలగించండిబాల ప్రార్థింప జాలియు నాలి లేక
గర్భ మొసగి కుంతిని గడు గాసి వెట్టె
*వేకువనెచిమ్మె సూర్యుడు చీకటులను*
(కుంతి జీవితం లో సూర్యుడు చీకటిని చిమ్మాడు.)
జవముగా నరుదెంచుచు జగతి వెలుగు
రిప్లయితొలగించండివేకువన చిమ్మె సూర్యుడు చీకటులను
తొలగ చేయ జనుల కెల్ల తోషమొదవ
మొదలు పెట్టిరి పనులను భూరిగాను
ఆకసమందుజూడగను నంతయుశూన్యముగానుతోచనా
*“చీఁకటులన్ దివాకరుఁడు చిమ్మె దిశాంతములందు వేకువన్”*
కాకులుకావుకావుమన కార్యము లందున వేగమగ్నులై
కోకలు సర్దుకొంచునటకోమలులెల్లరులేచిరొప్పుగన్
(4)తే.గీ;"గ్రహణమును కంటి తో జూడ రా" దనంగ
రిప్లయితొలగించండితెగువ నే యద్దమును లేక మగువ కాంచి
యంథు రాలయ్యె వెలుగిచ్చు నాతడయ్యు
వేకువనె చిమ్మె సూర్యుఁడు చీఁకటులను”
పద్మ రాసుల కింపుగఁ బంచి వెలుగుఁ
రిప్లయితొలగించండిగలువ గముల మనము లందుఁ గరుణ లేక
తూర్పు కొండపై నుదయించి తోరముగను
వేకువనె చిమ్మె సూర్యుఁడు చీఁకటులను
రూకల కాస నూన కెద లోనఁ దలంచి పరోపకారమున్
నాకపు మార్గ మందు నిజ నైపుణ మేర్పడఁ దిర్గు చుండి ప
ల్పోకల సంతతమ్మును విరోచనుఁడే యుదయింప కింకయుం
జీఁకటులన్ దివాకరుఁడు చిమ్మె దిశాంతము లందు వేకువన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ప్రాగ్దిశను కిరణాలతో ప్రభవమొంది
వేకువనె చిమ్మె సూర్యుడు; చీకటులను
పార దోల విశ్వమ్మున పరచి వెలుగు
పశ్చిమాద్రిని గ్రుంకగ పరుగు లిడెను.