14, మార్చి 2025, శుక్రవారం

సమస్య - 5062

15-3-2015 (శనివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దుష్కృతమున స్వర్గమబ్బె దుర్మార్గునకున్”
(లేదా...)
“దుష్కృత మాచరించి యొక దుష్టుఁడు స్వర్గముఁ జేరెఁ బుణ్యుఁడై”

20 కామెంట్‌లు:

  1. కందం
    శుష్కంపు మాటలెందుకు!
    పుష్కలముగ పుణ్యమొంద పూజించిన నా
    విష్కృతముకానిదన నే
    దుష్కృతమున స్వర్గమబ్బె దుర్మార్గునకున్?


    ఉత్పలమాల
    శుష్కపు మాటలెందులకు? చూడగ భక్తులు నెందరెందరో
    పుష్కల పుణ్యకార్యముల మూగుచు సాగిన వారలొంద నా
    విష్కృతవైనదన్ ఋజువు వెల్వడ నీయని పాపముండ! నే
    దుష్కృత మాచరించి యొక దుష్టుఁడు స్వర్గముఁ జేరెఁ బుణ్యుఁడై?

    రిప్లయితొలగించండి
  2. నిష్కృతి లేదు వానికిల నిక్కము
    చేరెను నర్కలోకమున్
    దుష్కృతమాచరించి యొక దుష్టుడు,
    స్వర్గము జేరె పుణ్యుడై
    పుష్కల యోగ్య కార్యములు
    మోదముతో నొనరించి నిత్యమున్
    దుష్కృతమైన కార్యముల దుర్జన
    సంగతి వీడి యొక్కడున్

    రిప్లయితొలగించండి
  3. దుష్కృతములొనర్చి యొకఁడు
    పుష్కలముగ పరులసొమ్ము భుజియింపఁగ నా
    విష్కృతమయ్యె జగమ్మున
    దుష్కృతమున స్వర్గమబ్బె దుర్మార్గునకున్

    రిప్లయితొలగించండి
  4. దుష్కృతము జేసి యుండియు
    నిష్కృతి గోరి పురమందు నేతల ముందా
    విష్కృతము జేసిన కతన
    దుష్కృతమున స్వర్గమబ్బె దుర్మార్గునకున్

    రిప్లయితొలగించండి
  5. నిష్కృతి లేని దనిష్టము
    దుష్కృతము లొసగు నరకము దుర్మార్గులకున్
    నిష్కృష్టంబేయిది యే
    దుష్కృతమున స్వర్గమబ్బె దుర్మార్గునకున్

    దుష్కృత మాచరించి చని దుష్టులు గాంతురు రౌరవమ్మునే
    నిష్కృతి లేని పాపమనఁ నిక్కము నారకమంద్రు గాదె యా
    విష్కృతి వల్ల లభ్యమగు విశ్రమమేయని చెప్పుచుంద్రు యే
    దుష్కృత మాచరించి యొక దుష్టుఁడు స్వర్గముఁ జేరెఁ బుణ్యుఁడై

    రిప్లయితొలగించండి

  6. శుష్కపు మాటలవీడుము
    పుష్కలమగు పాపములవి భువి జేసెడి యా
    దుష్కర్మునకిల నెవ్విధి
    దుష్కృతమున స్వర్గమబ్బె దుర్మార్గునకున్.


    పుష్కలమైన లాభముల బొందగ నెంచుచు స్వార్థచిత్తుడే
    నిష్కృతి లేనిపాపములు నిత్యము జేసెడ కార్య కారియే
    మస్కరి మౌళినిన్ నిలిపి మానసమందున కొల్చినంతనే
    దుష్కృత మాచరించి యొక దుష్టుఁడు స్వర్గముఁ జేరెఁ బుణ్యుఁడై.

    రిప్లయితొలగించండి
  7. గుణనిధి కథ:-

    నిష్కృతి లేని పాపములు నేరములెన్నియొ చేసినంతటన్
    పుష్కర కాలమందు శివమూర్తికిఁ జేరువలోన క్షుత్తుతో
    శుష్క పరిస్థితిన్ నిదుర జోలికి వెళ్ళక పొట్ట నింపగన్
    దుష్కృత మాచరించి యొక దుష్టుఁడు స్వర్గముఁ జేరెఁ బుణ్యుఁడై!!

    రిప్లయితొలగించండి
  8. కం॥ ముష్కరులకు నూతమొసఁగు
    దుష్కృతమున స్వర్గమబ్బె దుర్మార్గునకున్
    నిష్కర్షగఁ బలుకఁగ నిటు
    దుష్కర్మలు దుర్గతిఁ గన దోహదపడవే!

    ఉ॥ దుష్కృత మాచరించి యొక దుష్టుఁడు స్వర్గముఁ జేరెఁ బుణ్యుఁడై
    ముష్కరు మూకకీ నుడుగు ముచ్చటఁ గొల్పద హీన కర్మలా
    విష్కరణమ్ముఁ జేయనిల భీతిని కాంచక ప్రోత్సహించదా !
    నిష్కృతి యుండఁ బోదు కడు నీచులు దుర్గతి పాలు తప్పదౌ


    మిత్రులు సూచించిన తప్పులు తిద్దిన పిదపనండి

    రిప్లయితొలగించండి
  9. శుష్కములైన నైహికపు స్యూమములందున రక్తితో వెసన్
    నిష్కృతిలేని దుర్గతిని నిక్కముగా చవిజూచెనీ భువిన్
    దుష్కృత మాచరించి యొక దుష్టుఁడు, స్వర్గముఁ జేరెఁ బుణ్యుఁడై
    పుష్కలమైన దానముల మోదముతోనిడి పేదవారికిన్

    రిప్లయితొలగించండి
  10. దుష్కృతము లెన్ని జేసిన
    పుష్కలముగ నబ్బె నధిక పుణ్యఫలంబున్
    పుష్కర స్నానమె హేతువు
    దుష్కృతమున స్వర్గమబ్బె దుర్మార్గునకున్

    రిప్లయితొలగించండి
  11. కం:ముష్కరు డన్యమతస్తుల
    నిష్కారుణ్యమున జంపి నిలబడె నురికిన్
    శుష్కావేశున కెటు లీ
    దుష్కృతమున స్వర్గమబ్బె దుర్మార్గునకున్”?
    (జిహాదీ లో స్వర్గం వస్తుం దని చివరికి ఉరిశిక్ష పాలయ్యాడు కానీ వాడికి స్వర్గం ఎలా వచ్చింది?)

    రిప్లయితొలగించండి
  12. దు ష్కృ తమున చేటు గలుగు
    దు ష్కృ తమున నరక మబ్బు దురితుల కెల్ల న్
    దు ష్కృ త మే వల దన నే
    దు ష్కృ త మున స్వర్గ మబ్బు దుర్మా ర్గు న కున్?

    రిప్లయితొలగించండి
  13. ఉ:"దుష్కర మైన యజ్ఞతతితో తరియించిరి పూర్వు" లంచు నా
    విష్కృతి నొందు వాదమును వించు దయామతి బౌద్ధు డిట్లనెన్
    నిష్కృతి లేని పాప మగు,నీచము జీవుల హింస, యెట్టులా
    దుష్కృత మాచరించి యొక దుష్టుఁడు స్వర్గముఁ జేరెఁ బుణ్యుఁడై”
    (యజ్ఞాలని సమర్థించే వాదాన్ని ఖండిస్తూ బౌద్ధుడు యజ్ఞం లోని హింస పాపాన్నిస్తుంది కానీ స్వర్గం ఎలా వస్తుంది? అన్నట్టు.)

    రిప్లయితొలగించండి
  14. దుష్కర మైనను బాప ప
    రిష్కార మొనర్ప శ్రీహరి పదార్చనలన్
    నిష్కపటపు దూరీకృత
    దుష్కృతమున స్వర్గ మబ్బె దుర్మార్గునకున్


    నిష్క చయార్జనార్థమ యనేక విధమ్ముల మోసపుచ్చుచున్
    శుష్క వచో నికాయమున సొమ్ముల మ్రుచ్చిలి యంత్య వేళ మ
    స్తిష్కమునన్ సుతుం దలఁచి శ్రీహరి నామము నుచ్చరింపఁగా
    దుష్కృత మాచరించి యొక దుష్టుఁడు స్వర్గముఁ జేరెఁ బుణ్యుఁడై

    రిప్లయితొలగించండి
  15. ఉత్పలమాల (షట్పది )

    నిష్కృతి లేని పాపముల నెన్నియొ చేసె యజామిళుండిలన్
    శుష్కపు మాటలే పలికి సూక్ష్మపు పున్నెము కూడబెట్టియున్
    పుష్కల ప్రీతిమీర తన పుత్రుల బెట్టెను శౌరి నామముల్
    దుష్కర సంచితంబులును దూదియు రాశిగ పేర నేమిలే
    ముష్కరుడంత్యకాలమున ముక్కియు మూలిగి పల్క నారయన్
    దుష్కృత మాచరించి యొక దుష్టుడు స్వర్గముజేరె బుణ్యుడై !

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    నిష్కృతియే యోచింపక
    దుష్కృత్యములెన్నొ చేయు దుష్టాత్మునకున్
    నిష్కృతి లేదందు రెటుల
    దుష్కృతమున స్వర్గమబ్బె దుర్మార్గునకున్?

    రిప్లయితొలగించండి
  17. దుష్కృతములొనర్చియుతా
    నిష్కృతినందెనుగతుదకునిర్మలమదితో
    శుష్కపుదేహుండౌచును
    *"దుష్కృతమున స్వర్గమబ్బె దుర్మార్గునకున్”*


    ముష్కరుడైమహిన్ సతతమున్ చరి యించుచు మున్గి ప్రేమలో
    పుష్కల ప్రీతిచూపుచును పుత్రుని పొందుచు విష్ణుపేరిడెన్
    *“దుష్కృత మాచరించి యొక దుష్టుఁడు స్వర్గముఁ జేరెఁ బుణ్యుఁడై”*
    నిష్కృతి కల్గె వానికిని నెమ్మిని పూనుచు తల్చవిష్ణువున్


    రిప్లయితొలగించండి