12, మార్చి 2025, బుధవారం

సమస్య - 5060

13-3-2015 (గురువారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కవి పండిత ధిక్కృతి శుభకర మగును గదా”
(లేదా...)
“కవులుం బండితులుం గళావిదుల ధిక్కారంబు శ్రేయం బిడున్”

6 కామెంట్‌లు:

  1. దివసపు వార్తల నెరుగక
    అవాస్తవములన్ని నమ్మి యాత్రుత తోడన్
    యవివేకముతో వ్రాసెడి
    కవి పండిత ధిక్కృతి శుభకర మగును గదా

    రిప్లయితొలగించండి
  2. కవులను పండితులను గౌ
    రవముగ సత్కృతి సలిపిన లగ్గగు, నటులే
    కవిగా మసలెడు కుత్సిత
    కవి పండిత ధిక్కృతి శుభకర మగును గదా

    రిప్లయితొలగించండి

  3. కవనమ్మందున నిత్యం
    బవివేకుల కొమ్ముకాచె డజ్ఞానమునే
    యవఘలమున్ వ్రాసెడి కా
    కవి పండిత ధిక్కృతి శుభకర మగును గదా.


    అవమానమ్ముల కోర్చి ధాత్రిగల మూఢాచారముల్ ద్రుంచుచున్
    నవభావమ్ముల నింపుచున్ జనుల జ్ఞానార్థుండ్రు గా మల్చగా
    కవనమ్మల్లెడి వారె యుత్తములు సత్కర్మమ్ము నేచేయకన్
    కవులుం బండితులుం గళావిదుల ధిక్కారంబు శ్రేయం బిడున్?

    రిప్లయితొలగించండి
  4. అవలంబించగ హైందవమ్మునది తప్పై పోవునెవ్వారికిన్
    సవరింపంగను కల్ల వ్రాత చరితన్ సంతాపమెవ్వారికిన్
    వివరంబేమియు లేక దేశ ఘనతన్ ద్వేషించు వారందరిన్
    కవులుం బండితులుం గళావిదుల ధిక్కారంబు శ్రేయం బిడున్!!

    రిప్లయితొలగించండి
  5. కవులందున్ గలరెందరో సుకవులీ కాలంబునన్ వారలే
    కవితా వైభవమున్ జనావళికి నుద్గాఢమ్ముగా పంచుచున్
    భువిలో తారలుగా వెలింగెదరు, యభ్యుత్థానముం జాఱ్చు కా
    కవులుం బండితులుం గళావిదుల ధిక్కారంబు శ్రేయం బిడున్

    రిప్లయితొలగించండి
  6. ధవుడొనరించు చెడుగులే
    స్తవనీయంబనుచు మెచ్చు చవటల్ మూర్ఖుల్
    భవితవ్యముకడ్డు నిలువ
    కవి పండిత ధిక్కృతి శుభకర మగును గదా

    స్తవనీయమ్మని దౌష్ట్యమున్ నిరతముత్కర్షించు తాళీకులున్
    నవనీతంబును బోలునట్టి పలుకుల్ నట్టేటముంచేటివై
    న విధానంబులతోడ గెల్చు ముకురుల్ నాదేశమందుండగా
    కవులుం బండితులుం గళావిదుల ధిక్కారంబు శ్రేయం బిడున్

    రిప్లయితొలగించండి