ఆ.వె:కథలు,నవల లల్ల,కావ్యమ్ములన్ వ్రాయ సాంఘికస్పృహకును స్థాన మిచ్చి, యట్టి వారి వదలి యవధానులకె గజా రోహణమును గవులు రోయుచుంద్రు” (ఎంతో సామాజికస్పృహ తో నవలలు,కావ్యాలు రాస్తే వాళ్లని పట్టించుకోక కేవల పాండిత్య చమత్కార ప్రదర్శన గా అవధానాలు చేసే వారికి గజారోహణలు చేయుస్తే పై కవులకి నచ్చదు.)
ఉ:స్నేహితు లంచు బోయి యట నేను పఠింప నుగాది కైత,నా యూహల,పద్యముల్ వినక యొక్కడు పల్కెను "మాల లల్లుటల్, మా హృది మెచ్చదయ్య,యిక మానుము నీ పులి జూదమున్, గజా రోహణమన్న సత్కవులు రోసెద, రెప్పుడు మారెదో కదా!"
(ఒక పద్యకవి ఉగాదికి పద్యకవిత్వం చెపితే నచ్చని వాడు నీ చంపకోత్పల మాటలు మాకు వద్దు.నీ పులి జూదము,గజారోహణము అనగా శార్దూల మత్తేభాలు మాకు నచ్చవు.నువ్వు ఎప్పుడు మారతావో కదా!అని జాలి చూపించాడు.)
ఆటవెలది
రిప్లయితొలగించండికలుపుచు యతి ప్రాస కవినంచు ఘోషించి
ధనముగొనెడు సంస్థ దరువువేసి
యుత్సవముగఁ జేయ నూర, కుకవి గజా
రోహణమును గవులు రోయుచుంద్రు!
ఉత్పలమాల
ఊహలఁ దేలుచున్ గవిగ నూరిన శబ్దములాలపించెడున్
దాహము మిక్కటమ్ము మదిఁ దానొక పండితుఁడన్న భావమై
మోహము మీర, విత్తమును బొందెడు వారలు సేసెడున్ గజా
రోహణమన్న, సత్కవులు రోసెదరెప్పుడు భాష సిగ్గిలన్!
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసత్కవివని యెంచి సన్మాన మొక్కటి
రిప్లయితొలగించండినీకు జేయదలచి నిలిచితి మిట
వలయు ఖర్చు మీరె భరియించు మన గజా
రోహణమును గవులు రోయుచుంద్రు.
వాహన యోగమన్న ప్రతివారికి మోదమె యందు కొసమై
యూహలలో విహారము మహోన్నతమౌ యనుభూతి యందురే
మోహమె గౌరవమ్మున ప్రబుధ్ధులు మెచ్చెడి బైసియౌ గజా
రోహణమన్న సత్కవులు రోసెద రెప్పుడనంగ సత్యమే?
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపండితులు రచించి ప్రజల కొసంగిన
రిప్లయితొలగించండిమేటి కావ్యములను మెచ్చుకొనగ
పేర్మి జూపుచు సలిపెడు గుంటిదగు గజా
రోహణమును గవులు రోయుచుంద్రు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆ॥ ప్రాఁత పద్ధతులను వలదని రిప్పుడు
రిప్లయితొలగించండిక్రొత్త వాహనములు కొసరు చుండ
నంద చందములను బొంది యటుల గజా
రోహణమును గవులు రోయు చుంద్రు
ఉ॥ వాహన సంచయమ్మునిడ ప్రాకటనమ్ముగ నుత్సవమ్ముకున్
మోహముఁ గాంచిరీ దినము మోదము మీరఁగఁ గ్రొత్తవాటిపై
దేహము డస్సి పోదనుట తెల్లమటంచు నెఱింగి నా గజా
రోహణమన్న సత్కవులు రోసెద రెప్పుడు భీతిఁ బొందుచున్
(ఈ మధ్య ఏనుగులు అదుపు తప్పుతున్న సందర్భాలు కూడ భీతి కలిగించగలవు కదండి)
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిమోహము మీరి కోరినను ముళ్లెలు ఖర్చుగఁ బెట్ట మీకును
రిప్లయితొలగించండిత్సాహము పెంచునట్లుగను సంబరమొంద కుటుంబమంత మీ
దాహము తీరు రీతి పెను దంతిని జూసెదమన్నచో గజా
రోహణమన్న సత్కవులు రోసెద రెప్పుడు వింతలింతలై!!
ఊహల లోకమందు మధురోహల పల్లకి మోతలెంచుచున్
రిప్లయితొలగించండిలోహపు గండపెండెరము రొక్కముపై తమ దృష్టినుంచుచున్
దాహముగొన్న పండితులు ధారుణిపై వెలుగొందగా గజా
రోహణమన్న సత్కవులు రోసెద రెప్పుడు చెప్పు మిత్రమా?
సాటివారి నడుమ సన్మానమందగా
కలలమున్గితేలు కవులుగాదె
తెలుగు కవులఁ జూచి తెలుపుమెచటగజా
రోహ ణమును గవులు రోయు చుంద్రు?
కవుల ప్రతిభ తెలిసి గౌర వించు ట బోయి
రిప్లయితొలగించండిరాజ కీయ మైన రంగు కలిగి
పొందు నట్టి కుకవి మోదంబు గని గజా
రోహ ణ మును గవులు రోయు చుంద్రు
కలమునుండి వచ్చు కావ్యాల రచనకు
రిప్లయితొలగించండికరము నందు స్వర్ణ కంకణ మును
కోరుకొనెడి తీర్చ కోర్కెగానిది, గజా
రోహణమును గవులు రోయుచుంద్రు
ఆహవమట్లు కావ్యముల నద్భుతరీతిని వ్రాసి సత్కవుల్
రిప్లయితొలగించండిదాహములేక సత్కృతుల దండిగనొందఁగ, నట్టివారినిన్
యూహలనైన దల్వక నయోగ్యుల నెంపిక చేయుచున్ గజా
రోహణమన్న సత్కవులు రోసెద రెప్పుడు, సాజమేకదా.
ప్రతిభగల్గు కవుల పట్టించుకొనకుండ
రిప్లయితొలగించండినస్మదీయులెక్క నందలమును
కృషినిజేయువారి తృష్ణనుగని గజా
రోహణమును గవులు రోయుచుంద్రు
ఆ.వె:కథలు,నవల లల్ల,కావ్యమ్ములన్ వ్రాయ
రిప్లయితొలగించండిసాంఘికస్పృహకును స్థాన మిచ్చి,
యట్టి వారి వదలి యవధానులకె గజా
రోహణమును గవులు రోయుచుంద్రు”
(ఎంతో సామాజికస్పృహ తో నవలలు,కావ్యాలు రాస్తే వాళ్లని పట్టించుకోక కేవల పాండిత్య చమత్కార ప్రదర్శన గా అవధానాలు చేసే వారికి గజారోహణలు చేయుస్తే పై కవులకి నచ్చదు.)
ఉ:స్నేహితు లంచు బోయి యట నేను పఠింప నుగాది కైత,నా
రిప్లయితొలగించండియూహల,పద్యముల్ వినక యొక్కడు పల్కెను "మాల లల్లుటల్,
మా హృది మెచ్చదయ్య,యిక మానుము నీ పులి జూదమున్, గజా
రోహణమన్న సత్కవులు రోసెద, రెప్పుడు మారెదో కదా!"
(ఒక పద్యకవి ఉగాదికి పద్యకవిత్వం చెపితే నచ్చని వాడు నీ చంపకోత్పల మాటలు మాకు వద్దు.నీ పులి జూదము,గజారోహణము అనగా శార్దూల మత్తేభాలు మాకు నచ్చవు.నువ్వు ఎప్పుడు మారతావో కదా!అని జాలి చూపించాడు.)
ఎక్కి నంత మాత్ర మిభము నెయ్యది దక్కు
రిప్లయితొలగించండిదక్కునె పరికింప నొక్క కాసు
చిక్కఁ గలది యెద్ది దక్క భయము గ జా
రోహణమును గవులు రోయు చుంద్రు
మోహ మనంగ రాదు మది మోదము గూర్చు జయమ్ము సద్యశో
దాహము లేని దెవ్వరికి ధాత్రి సముల్లస దంధ్ర దేశ భా
షాహవ కేళినిన్ గెలువ నర్హ విధమ్ముల గెల్చినన్ గ జా
రోహణ మన్న సత్కవులు రోసెద రెప్పుడు కౌతుకమ్మునన్
[రోయు = వెదకు]
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
కవిగ పేరు బడసె కావ్యమ్ము రచియించి
కావ్యమునకు మంచి ఖ్యాతి వచ్చె
గజము నెక్కు మనగ కాదనె,ఘన గజా
రోహణమును గవులు రోయుచుంద్రు.