18-3-2015 (మంగళవారం)ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“రావణునకు వాయుజుఁడు హారతినిఁ బట్టె”(లేదా...)“అనిలసుతుండు రావణున కారతి వట్టెను భక్తి నమ్రుఁడై”
తేటగీతిరామరావణ యుద్ధమ్ము రగులకొనుచుకడకు దాశరథి జయమ్ము ఖాయమగుచుజయము జయమన్న రావమ్ము జతపడ జితరావణునకు వాయుజుఁడు హారతినిఁ బట్టె
చంపకమాలజనకజ దుస్థితిన్ గనియు 'సద్గణ సోముని రామచంద్రునిన్, మనమున దల్చి', యా వనము మారుతి నాశము సేసినంత తోకను గొని నిప్పపెట్ట మది కాగగ నుద్ధృతు లంకగాల్చి నయ్యనిలసుతుండు రావణున కారతి వట్టెను, 'భక్తి నమ్రుఁడై'
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ధరణిజ నపహరించిన దనుజునిపయి గామగు కోపముండును గాని , యేలరావణునకు వాయుజుఁడు హారతినిఁ బట్టె ?కథను వివరించి పుణ్యము కట్టుకొనుమ
భీమరమునందు రాముడు విడచినట్టికరకు కోలలు ప్రాణాంతకములు గాఁగరావణునకు, వాయుజుఁడు హారతినిఁ బట్టెరామునకు జయమగునని రహి మిగులఁగ
చం॥ మనమున నిత్యమాశివుని మన్నన సేయుచు నిల్పి కొల్చెడిన్వినయముఁ గాంచి వైరియను భేదము నెంచక సద్గుణాఢ్యుఁడైయనిల సుతుండు రావణున కారతి వట్టెను భక్తి నమ్రుఁడై కనఁగను దుష్టబుద్ధి పరకాంతల పైననురక్తి రోసెనే
ఉగ్రముగ పోరి మరణించ నగ్రజుండువినయు డైమ్రొక్కె భక్తిఁ విభీషణుండురావణునకు, వాయుజుఁడు హారతినిఁ బట్టెరామునకు ఘనవిజయ సంప్రాప్తినరసివిననగు మంచిమాటలు విభీషణుడే వచియింప నచ్చునా?పెనగిన రావణాసురుడు వీడగ ప్రాణము యుద్ధభూమిలోవినయము తోడమొక్కుచు విభీషణుడచ్చటఁ, గాంచుచుండగాననిలసుతుండు, రావణున కారతి వట్టెను భక్తి నమ్రుఁడై
దేవేంద్రుడు - వాయుదేవుల మధ్య సంభాషణ:-ఘనముగ మేఘనాథుడట కష్టములెన్నియొ గూర్చె నాకు మీకును మరి యింద్రజిత్తనెడి కుత్సిత రాక్షస నామమందు దేవనగరి నాక్రమించి మన పాలన త్రుంచగ,తండ్రి మెచ్చడేఅనిల!సుతుండు రావణున కారతి వట్టెను భక్తి నమ్రుఁడై!!
జనకుని పుత్రి జానకిని జాటుగ నెత్థుకు పోవ దెల్సియున్ననిలసుతుండు రావణున కారతి వట్టెను భక్తి నమ్రుఁడై”యనుచును నీవు జెప్పగనె నామది కల్లగ దోచినందునన్వినుటకు కొద్ది కష్టముగ , వింతగ నుండిన నమ్మ నొప్పునే
నెత్తుకుపోవ
రమణి సీతను చెరపట్టె రావణుడనిసమరమందున చెలరేగి సంహరింపరమ్యగాత్రుడు శ్రీ రఘు రాముడు జితరావణునకు వాయుజుఁడు హారతినిఁ బట్టె.జనకుని పుత్రి రామసతి జానకి నిట్టుల బంధి సేయుచున్ పెనకువ గోర నీదు కులవిచ్చుతి తప్పదటంచు చెప్పెనే అనిలసుతుండు రావణున , కారతి వట్టెను భక్తి నమ్రుఁడై యని విజయమ్మునందినమహాత్ముడు రామున కంత తోషమున్.
యుద్ధ రంగాన పోరాడి యో ధు డ గుచు రాజ నీతిని తెల్పిన రావ ణు o డు వదలె ప్రా ణ o బు న య్యె డ సద యతోడ రావ ణు నకు వాయు జుడు హా ర తిని బ ట్టె
రణమున రావణాసురుని రాముడు నేలకు గూల్చినంతటన్కనుఁగొని మారుతాత్మజుఁడు క్రన్నన రావణు మ్రోలజేరె హెచ్చిన యనుకంపతో నతులు జేయుచు వాని శివార్చనమ్ములన్అనిలసుతుండు రావణున కారతి వట్టెను భక్తి నమ్రుఁడై
పెడచెవినపెట్టె నీతిని పేర్కొనంగ రావణునకు, వాయుజుఁడు హారతినిఁ బట్టెరామచంద్రమూర్తి తిరిగి రాజ్యమేల సమయ, రావణాసురుడుని సంహరించి
రఘు వరాన్వయ మహనీయు రామ చంద్రుకరుణఁ బట్టాభిషిక్తుండు గాఁగ మురిసి రవి తనయునకు శత్రు విద్రావణునకు వాయుజుఁడు హారతినిఁ బట్టెఁ బరమ భక్తి ఘన రిపు వాయు నందనునిఁ గయ్యమునం దపరాజితుండునై పెనఁగెడు వాని బంధితుని భీకర సంఖ్యను జేసి పిమ్మటం జని చని యబ్జజాస్త్ర సువిశారదుఁ డింద్రజితుండు కూలఁగాననిలసుతుండు రావణున కారతి వట్టెను భక్తి నమ్రుఁడై
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.జానకిని వీడమని నిండు సభను లంకయందు నుద్బోధ జేసెను నడలకుండరావణునకు వాయుజుడు; హారతిని బట్టెహనుమకు విభీషణు డపుడు హర్షమొంది.
భండనము నందు తనయెక్క బలము జూపెరావణునకు ,వాయుజుడు,హారతిని బట్టెరావణానుజు డతనికి రయము గానుప్రస్తుతించుచు నాతని రామ భక్తి
తేటగీతి
రిప్లయితొలగించండిరామరావణ యుద్ధమ్ము రగులకొనుచు
కడకు దాశరథి జయమ్ము ఖాయమగుచు
జయము జయమన్న రావమ్ము జతపడ జిత
రావణునకు వాయుజుఁడు హారతినిఁ బట్టె
చంపకమాల
తొలగించండిజనకజ దుస్థితిన్ గనియు 'సద్గణ సోముని రామచంద్రునిన్,
మనమున దల్చి', యా వనము మారుతి నాశము సేసినంత తో
కను గొని నిప్పపెట్ట మది కాగగ నుద్ధృతు లంకగాల్చి న
య్యనిలసుతుండు రావణున కారతి వట్టెను, 'భక్తి నమ్రుఁడై'
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిధరణిజ నపహరించిన దనుజునిపయి
రిప్లయితొలగించండిగామగు కోపముండును గాని , యేల
రావణునకు వాయుజుఁడు హారతినిఁ బట్టె ?
కథను వివరించి పుణ్యము కట్టుకొనుమ
భీమరమునందు రాముడు విడచినట్టి
రిప్లయితొలగించండికరకు కోలలు ప్రాణాంతకములు గాఁగ
రావణునకు, వాయుజుఁడు హారతినిఁ బట్టె
రామునకు జయమగునని రహి మిగులఁగ
చం॥ మనమున నిత్యమాశివుని మన్నన సేయుచు నిల్పి కొల్చెడిన్
రిప్లయితొలగించండివినయముఁ గాంచి వైరియను భేదము నెంచక సద్గుణాఢ్యుఁడై
యనిల సుతుండు రావణున కారతి వట్టెను భక్తి నమ్రుఁడై
కనఁగను దుష్టబుద్ధి పరకాంతల పైననురక్తి రోసెనే
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉగ్రముగ పోరి మరణించ నగ్రజుండు
రిప్లయితొలగించండివినయు డైమ్రొక్కె భక్తిఁ విభీషణుండు
రావణునకు, వాయుజుఁడు హారతినిఁ బట్టె
రామునకు ఘనవిజయ సంప్రాప్తినరసి
విననగు మంచిమాటలు విభీషణుడే వచియింప నచ్చునా?
పెనగిన రావణాసురుడు వీడగ ప్రాణము యుద్ధభూమిలో
వినయము తోడమొక్కుచు విభీషణుడచ్చటఁ, గాంచుచుండగా
ననిలసుతుండు, రావణున కారతి వట్టెను భక్తి నమ్రుఁడై
దేవేంద్రుడు - వాయుదేవుల మధ్య సంభాషణ:-
రిప్లయితొలగించండిఘనముగ మేఘనాథుడట కష్టములెన్నియొ గూర్చె నాకు మీ
కును మరి యింద్రజిత్తనెడి కుత్సిత రాక్షస నామమందు దే
వనగరి నాక్రమించి మన పాలన త్రుంచగ,తండ్రి మెచ్చడే
అనిల!సుతుండు రావణున కారతి వట్టెను భక్తి నమ్రుఁడై!!
రిప్లయితొలగించండిజనకుని పుత్రి జానకిని జాటుగ నెత్థుకు పోవ దెల్సియున్
ననిలసుతుండు రావణున కారతి వట్టెను భక్తి నమ్రుఁడై”
యనుచును నీవు జెప్పగనె నామది కల్లగ దోచి
నందునన్
వినుటకు కొద్ది కష్టముగ , వింతగ నుండిన నమ్మ
నొప్పునే
నెత్తుకుపోవ
తొలగించండిరమణి సీతను చెరపట్టె రావణుడని
రిప్లయితొలగించండిసమరమందున చెలరేగి సంహరింప
రమ్యగాత్రుడు శ్రీ రఘు రాముడు జిత
రావణునకు వాయుజుఁడు హారతినిఁ బట్టె.
జనకుని పుత్రి రామసతి జానకి నిట్టుల బంధి సేయుచున్
పెనకువ గోర నీదు కులవిచ్చుతి తప్పదటంచు చెప్పెనే
అనిలసుతుండు రావణున , కారతి వట్టెను భక్తి నమ్రుఁడై
యని విజయమ్మునందినమహాత్ముడు రామున కంత తోషమున్.
యుద్ధ రంగాన పోరాడి యో ధు డ గుచు
రిప్లయితొలగించండిరాజ నీతిని తెల్పిన రావ ణు o డు
వదలె ప్రా ణ o బు న య్యె డ సద యతోడ
రావ ణు నకు వాయు జుడు హా ర తిని బ ట్టె
రణమున రావణాసురుని రాముడు నేలకు గూల్చినంతటన్
రిప్లయితొలగించండికనుఁగొని మారుతాత్మజుఁడు క్రన్నన రావణు మ్రోలజేరె హె
చ్చిన యనుకంపతో నతులు జేయుచు వాని శివార్చనమ్ములన్
అనిలసుతుండు రావణున కారతి వట్టెను భక్తి నమ్రుఁడై
పెడచెవినపెట్టె నీతిని పేర్కొనంగ
రిప్లయితొలగించండిరావణునకు, వాయుజుఁడు హారతినిఁ బట్టె
రామచంద్రమూర్తి తిరిగి రాజ్యమేల
సమయ, రావణాసురుడుని సంహరించి
రఘు వరాన్వయ మహనీయు రామ చంద్రు
రిప్లయితొలగించండికరుణఁ బట్టాభిషిక్తుండు గాఁగ మురిసి
రవి తనయునకు శత్రు విద్రావణునకు
వాయుజుఁడు హారతినిఁ బట్టెఁ బరమ భక్తి
ఘన రిపు వాయు నందనునిఁ గయ్యమునం దపరాజితుండునై
పెనఁగెడు వాని బంధితుని భీకర సంఖ్యను జేసి పిమ్మటం
జని చని యబ్జజాస్త్ర సువిశారదుఁ డింద్రజితుండు కూలఁగా
ననిలసుతుండు రావణున కారతి వట్టెను భక్తి నమ్రుఁడై
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
జానకిని వీడమని నిండు సభను లంక
యందు నుద్బోధ జేసెను నడలకుండ
రావణునకు వాయుజుడు; హారతిని బట్టె
హనుమకు విభీషణు డపుడు హర్షమొంది.
భండనము నందు తనయెక్క బలము జూపె
రిప్లయితొలగించండిరావణునకు ,వాయుజుడు,హారతిని బట్టె
రావణానుజు డతనికి రయము గాను
ప్రస్తుతించుచు నాతని రామ భక్తి