9, మార్చి 2025, ఆదివారం

సమస్య - 5057

10-3-2025 (సోమవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మామకున్ మామ యైనట్టి మహితుఁ డతఁడు”
(లేదా...)
“మామకు మామయై యతఁడు మాన్యతనందెను మామ వింటివా”

16 కామెంట్‌లు:

  1. తేటగీతి
    మోహిని వగల జిక్కుచు మోహమొంది
    కౌగిలింతల జిక్కఁగ కాచుకొంటె!
    కడలి సుతఁగొని గంగ సాగరునకిడియు
    మామకున్ మామ యైనట్టి మహితుఁ డతఁడు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      భామినియంచు వెంట పడి వాలఁగ జూతువె కౌగిలింతలో
      నేమొకొ! క్షీరసాగరపు నింపగు కూతురు లక్ష్మినే గొనన్
      బ్రేమ సుపుత్రి గంగనిడి వింతగ సాగరు గౌరవించెడున్
      మామకు మామయై యతఁడు మాన్యతనందెను మామ వింటివా!

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. మామవు నీవు మాకు శశి! మా జనయిత్రికి సోదరుండవై!
      ప్రేమగ గంగ పుట్టి ఘన విష్ణు పదంబునఁ, జేరె సంద్రమున్!
      భామిని లక్ష్మి సింధువున బ్రాతిగఁ బుట్టుచుఁ జేరె విష్ణువున్!
      మామకు మామయై యతఁడు మాన్యతనందెను మామ! వింటివా!!

      తొలగించండి

  3. ధర్మ రక్షకుండతగాడు దానవారి
    పాలమున్నీటి యల్లుడు పద్మనాభు
    డచ్చరనది మామకు నిచ్చినట్టి హరియె
    మామకున్ మామ యైనట్టి మహితుఁ డతఁడు.


    మామ యటంచు పిల్తురని మస్కరి గర్వమదేల వీడుమా
    భామిని లిబ్బిగుబ్బెతను పంకజ నాభుని కిచ్చి మామయై
    వ్యోమతరంగిణిన్ సతిగ పొందిన సంద్రున కట్టి భూరియే
    మామకు మామయై యతఁడు మాన్యతనందెను మామ వింటివా.

    రిప్లయితొలగించండి
  4. చపలకు పతి కనుక నబ్ధి శ్వశరుడయ్యె
    మాధవుకు , వాని సుత గంగ మగడు వనధి ,
    వావి గన చక్రి జలధికి శ్వశరుడగుచు
    మామకున్ మామ యైనట్టి మహితుఁ డతఁడు

    రిప్లయితొలగించండి
  5. అమల నాథుడై జలపతికల్లుడయ్యె
    స్వజయగు భువనపావనిఁ జందునయకు
    నిచ్చి తానయ్యె మామగా కచ్చితముగ
    మామకున్ మామ యైనట్టి మహితుఁ డతఁడు

    రామ జనించి పాల్కడలి రక్కసిగొంగను కేకరించగా
    నా మకరాంకుడా క్షణము నంభుజనాభుని మామ యయ్యెగా
    తామరకంటితానొసగె దారిక గంగను తోయరాట్టుకున్
    మామకు మామయై యతఁడు మాన్యతనందెను మామ వింటివా

    రిప్లయితొలగించండి
  6. మామ! సుధాబ్ధిలో జననమందిన యుత్పలబాంధవా! గనన్
    మామయెగాదె సాగరుఁడు మాధవినొందిన విష్ణుమూర్తికిన్
    మామయె విష్ణుమూర్తి బహుమార్గగకున్ పతి తోయరాశికిన్
    మామకు మామయై యతఁడు మాన్యతనందెను మామ వింటివా

    రిప్లయితొలగించండి
  7. కూతు నొసగెను శివునకు కోర్కె మీర
    పరిణ యంబాడె జాబిల్లి వాంఛ తోడ
    దాని వలనను దక్షుండు దాను చంద
    మామ కున్ మామ యైనట్టి మహితు డతడు

    రిప్లయితొలగించండి
  8. మామయౌగాదె క్షీరాబ్ధి మాధవునకు
    విష్ణుపాదాల బుట్టుటన్ వేల్పుటేఱు
    సాగరుని మామయౌ గదా చక్రధరుడు
    మామకున్ మామ యైనట్టి మహితుఁ డతఁడు

    రిప్లయితొలగించండి
  9. తే.గీ:వరుడు వధువుకు తెలిపెను వరుస లిట్లు
    "మేన మామ యీయన,వీడు మేన బావ,
    వదిన యిది ,పెద్ద తనమునన్ వచ్చినట్టి
    మామకున్ మామ యైనట్టి మహితుఁ డతఁడు”
    (పెళ్లికొడుకు తన బంధువులని పెళ్లి కూతురికి పరిచయం చేయటం.)

    రిప్లయితొలగించండి
  10. ఉ:ప్రేమ గలట్టి తమ్మునకు బిడ్డ నొసంగగ గోర నమ్మ మా
    మామకు నక్క నిచ్చి తన మంచిని చాటెను నాన్న "ప్రేమయే
    సేమము కాని భూములును,శ్రీలును గా"దని సమ్నతించి మా
    మామకు మామయై యతఁడు మాన్యతనందెను మామ! వింటివా”
    ("మా అమ్మ మా అక్కని తన తమ్ముని కిచ్చి పెండ్లి చెయ్యమంటే మా నాన్న ఒప్పుకొని మా మేన మామకి అక్కయ్య నిచ్చి అతనికి మామ అయ్యాడు" అని ఒకతను తన మామ గారితో అన్నాడు.)

    రిప్లయితొలగించండి
  11. చంద్రమౌళికి మామ యై సకల సుర గ
    ణార్చితుండు నయ్యెను దక్షుఁ డంచితముగఁ
    జారు చంద్రికా కాంతులఁ జల్లు చంద
    మామకున్ మామ యైనట్టి మహితుఁ డతఁడు


    ఈ మహి దాన కర్ణునిగ నెన్నిక కెక్కెను మిక్కటమ్ముగా
    నేమఱ కుండ నుండు మెద నెన్నఁడు బంధము నెంచి చూడ నీ
    మామకు మామ యౌ నతఁడు మానిత మామక మాతృ దేవికిన్
    మామకు మామయై యతఁడు మాన్యత నందెను మామ వింటివా

    రిప్లయితొలగించండి
  12. హాస్య పూరణలండి. నిజానికి దక్షుడు గాని విష్ణువు గాని మామకు మామ కారు గదండి. అందుకే వైవిధ్యంగా ఉంటుందని మాత్రమే నండి

    తే॥ మామకున్ మామ యైనట్టి మహితుఁ డతఁడు
    కంది శంకరుల సమస్య కాదు నిజము
    దక్షుఁడైన మాధవుఁడైనఁ దప్పగుఁ గద
    మామకున్ మామ యనఁగ మాన్యులార

    ఉ॥ ఏమిది కందిశంకరుల కెవ్వరు తెల్పిరొ యీ సమస్యనున్
    మామకు మామయై యతఁడు మాన్యత నొందెను మామ వింటివా
    మామగ చందమామకటు మాన్యుఁడు దక్షుఁడు కాఁగ నందునా
    తామరకంటి యొప్పనుచుఁ దల్తున తప్పులు గాద యన్నియున్

    రిప్లయితొలగించండి
  13. పెండ్లి యాడెను వార్ధిజన్ విష్ణు మూర్తి
    తన కుమార్తెయౌ గంగను తానొసంగి
    మామకున్ మామయైనట్టి మహితుడతడు
    భక్తి తోడను కొలిచిన వరములొసగు.


    తామరనేత్రుపాదములతానుదయించినగంగభార్యకాన్
    మామయునయ్యెనాడచటమాధవు డొప్పుగ మోదమందుచున్
    మామయునయ్యెసాగరుడుమానిని లక్ష్మినొసంగి శ్రీశుకున్
    మామకుమామయైయతడుమాన్యతనొందెనుమామవింటివే


    రిప్లయితొలగించండి