16, మార్చి 2025, ఆదివారం

సమస్య - 5064

17-3-2025 (సోమవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మది నపుంసక మన్నట్టి మాట బొంకు”
(లేదా...)
“పోయి రమించె నా మది నపుంసక మంచును బంపఁ బాణినీ”

15 కామెంట్‌లు:

  1. మానవుని జీవితమునందు మారుకొనెడి
    వివిధ రకముల ఘటనలు వెలసినపుడు
    తగిన విధము నెంచుకొనుచు దలకు చుండు
    మది నపుంసక మన్నట్టి మాట బొంకు

    రిప్లయితొలగించండి

  2. నెచ్చెలి సొగసు గాంచిన నిలువ దయ్యె
    మనసు సరసమాడ వెడలి మరలి రాక
    బంధిగను మార్చె నన్ బ్రేమ వలను జూడ
    మది నపుంసక మన్నట్టి మాట బొంకు.


    తోయలి కన్నుమీటి తనతో సరసమ్ముల నాడ బిల్వగా
    నీ యపురూపమైన నుడినే నిజమంచును నమ్మి పంపగా
    నాయలి వేణినిన్ విడదె యన్నగళంబను మానసంబదే
    పోయి రమించె నా మది నపుంసక మంచును బంపఁ బాణినీ.

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    మది నపుంసక శబ్ధము చదువ భాష
    క్షితి మది తను సంబంధమై చెలఁగుననఁగ
    వ్యాకరణమునఁ గాకుండ వాస్తవమున
    మది నపుంసక మన్నట్టి మాట బొంకు

    ఉత్పలమాల
    కాయము మోహమున్ బడయ కారణమైనది మానసమ్మదే
    స్వీయ కృతంపు వ్యాకరణ విస్తృత శాస్త్రము నందు మీరలున్
    జేయఁగ లింగ వర్గముగ చెల్లునె? స్వప్నమునందు కాంతతో
    పోయి రమించె నా మది నపుంసక మంచును బంపఁ బాణినీ!

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. పాయక నేర్వలేదుకద వ్యాకరణమ్మును సంస్కృతంబునన్
      శ్రేయము గూర్చునే మదిని జేర్చ నపుంసకలింగమందునన్
      హేయము కాదు నెమ్మదిని హెచ్చిన కోర్కెలు సంగడించగా
      పోయి రమించె నా మది నపుంసక మంచును బంపఁ బాణినీ

      తొలగించండి
    2. వ్యాకరణ సూత్రములతోడ వాక్యముండు
      లింగ బేధము గలది తెలుంగు బాష
      లింగడను మాటఁ దలప పుల్లింగ వచన
      మది నపుంసకమన్నట్టి మాట బొంకు

      తొలగించండి
  5. తే॥ హృదిని నిచ్ఛా సుమమ్ముల హేల పరఁగ
    పరుగులిడుచు సతతమటు ఫలిత మెంచఁ
    గోరికల రమించు నెపుడు కొసరి కొసరి
    మది నపుంసక మన్నట్టి మాట బొంకు

    ఉ॥ న్యాయమ పల్కనిట్టులను నమ్మఁగ వ్యాకరణమ్ము నొక్కటే
    మాయను జేసె మానసము మానిని చెంతకు పంపినంతనే
    ప్రాయపు మాటు దాగుచును బాలనఁ జేయక నాదు విజ్ఞతన్
    బోయి రమించె నామది నపుంసక మంచును బంపఁ బాణినీ

    రిప్లయితొలగించండి
  6. మగువ తలపులు మదిలోన మరులు రేపు
    మదన తాపము దేహమం దెదుగుచుండు
    పాణినీ వ్యాకరణమున బలికినట్టి
    మది నపుంసక మన్నట్టి మాట బొంకు

    రిప్లయితొలగించండి
  7. లేని పదమును సృష్టించి లీల పలుకు
    టేల యనుచు శో ధింప గ నెందు నైన
    కాను పించని దానిని మాను టాప్పు
    మదిన పుంసక మన్నట్టి మాట బొంకు

    రిప్లయితొలగించండి
  8. ప్రాయమునందు భావజుడు బాయక పూశరముల్ గదించుచున్
    జేయ రణంబు ప్రేమికుల చేతము చంచలమౌట సాజమే
    యా యలివేణి సోయగము లారడిబెట్టగ నెమ్మనంబునన్
    బోయి రమించె నా మది నపుంసక మంచును బంపఁ బాణినీ

    రిప్లయితొలగించండి
  9. తే.గీ:"మది నపుంసకమే "యందు," మతి" యనంగ
    నమర భాషలో స్త్రీలింగ మగును కాని
    "మది" యనగ నాంధ్రమౌ గాదె! మామ! యెట్లు
    మది నపుంసక మన్నట్టి మాట బొంకు”
    (సంస్కృతం లో మతి శబ్దం స్త్రీలింగం కానీ అది మది అనే తెలుగు రూపాంతర మయ్యాక సంస్కృత వ్యాకరణం వర్తించదు. తెలుగు వ్యాకరణం ప్రకారం అది నపుంసకలింగమే.)

    రిప్లయితొలగించండి
  10. ఉ:ఏయది యాడుదో,మగది యేదొ,నపుంసక మేదొ నేర్వగా
    మాయగ నుండు సంస్కృతము,మన్మనమున్ దలపంగ పేడి దే
    గా యని నీదు శాస్త్రమును గాంచుచు నమ్మగ నామె వద్దకున్
    బోయి రమించె నా మది నపుంసక మంచును బంపఁ బాణినీ”
    (నీ సంస్కృతవ్యాకరణాన్ని నమ్మి మనస్సు అనేది నపుంసకం కదా!అనుకుంటే అది ఆమె దగ్గరికి పోయి రమిస్తోంది)

    రిప్లయితొలగించండి
  11. మేనునకె కాని యెన్నఁడు మానసమున
    కుండదు ముసలితన మను గండ మెన్న
    నిత్య యౌవనమునఁ గడు నివ్వటిల్లు
    మది నపుంసక మన్నట్టి మాట బొంకు


    పాయక నీదు సూత్రములు భావ గభీరత సంతరింపఁగాఁ
    దీయని రాగ సంచయ మతీతము వీనుల విందు సేయఁగా
    హాయి నొసంగు గీతముల నాతత రక్తిని నాలకించుచుం
    బోయి రమించె నా మది నపుంసక మంచును బంపఁ బాణినీ

    రిప్లయితొలగించండి
  12. (3)తే.గీ:నింద వేయకు మతని పై నిత్య మైన
    యాత్మ తత్త్వము గోరి సన్యాసి యయ్యె
    అతివతో బంధమున బడ దమ్మ! యతని
    మది, నపుంసక మన్నట్టి మాట బొంకు
    (సన్యాసి కి ఎవరో ఒకరు నపుంసకం అని పేరు పెట్టటం సహజం.అతని పై ఆ నింద వద్దు అన్నట్లు. )

    రిప్లయితొలగించండి
  13. మనసుచంచలమయ్యెనుమహిని నేడు
    బండరాయిగ మారిన బ్రతుకు నందు
    కురిసి పన్నీటి జల్లులు కూర్మినింపెఝ

    *“మది నపుంసక మన్నట్టి మాట బొంకు”*
    మాయలయందుచిక్కుకొనెమానస మియ్యది మానబోదుగా
    హేయమటంచెరింగియునుయెయ్యదొమోహము లాగుచుండగా
    ప్రాయము పొమ్ముపొమ్మనగ బానిస యౌచునువేగమయ్యదే
    *“పోయి రమించె నా మది నపుంసక మంచును బంపఁ బాణినీ”*

    రిప్లయితొలగించండి