22, మార్చి 2025, శనివారం

సమస్య - 5070

23-3-2025 (ఆదివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కారు వరుని కాల్గడిగియు కన్యనిచ్చె”
(లేదా...)
“కారు ముదంబునన్ వరుని కాళ్ళను గడ్గి యిడెం గుమారితన్”

16 కామెంట్‌లు:

  1. వరుని వ్యాపారమును జూడ పెరుగుచుండె
    వరుని తండ్రి తాతలఁ జూడ సిరి నిలయులు
    వరుని వర్తన జూడగ వహ్వ!షావు
    కారు వరుని కాల్గడిగియు కన్యనిచ్చె!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉద్యోగము చేసె అల్లుడు కంటే వ్యవసాయము చేసే అల్లుడే మేలు:-

      మారక తప్పునే కొలువు మాటికి మాటికి!రైతె మేలికన్
      కోరడు మామసాయమును కూటికి లోటది జూడ లేదులే
      సారపు భూమినందు వ్యవసాయము జేయగ పంట పండు ము
      క్కారు! ముదంబునన్ వరుని కాళ్ళను గడ్గి యిడెం గుమారితన్!!

      తొలగించండి
  2. తేటగీతి
    కలిమి లేదని మాన్యుని కాదనియును
    పంతమూనిన తనయతో వంతపాడి
    ప్రేమ గొప్పదనుచు కడు వేడ్క సావు
    కారు వరుని కాల్గడిగియు కన్యనిచ్చె!

    ఉత్పలమాల
    ఆ రజనీకరంపు ముఖమంచును యోగ్యుని లేమినుండినన్
    నీరజ నేత్ర మెచ్చి మది నిర్మల మంచు వివాహమెంచఁగన్
    మారొక మాటయున్ బలుక మాన్యము కాదని తండ్రి లేక యేఁ
    కారు ముదంబునన్ వరుని కాళ్ళను గడ్గి యిడెం గుమారితన్!

    రిప్లయితొలగించండి
  3. వంగసమున దానొక విశ్వబ్రాహ్మ ణుడను
    గాన దనవంశపు ధనము గల్గువాని
    సీమ యందున యెంపిక జేసి స్వర్ణ
    కారు వరుని కాల్గడిగియు కన్యనిచ్చె

    రిప్లయితొలగించండి
  4. అతడు చేయు వ్యాపారమునందు నెపుడు
    తోడు నీడగ నడయాడు వాడు వరుడు
    యింటియల్లునిగా జేయనెంచి షాహు
    కారు వరుని కాల్గడిగియు కన్యనిచ్చె

    రిప్లయితొలగించండి

  5. కులము ముఖ్యమ్ము కాదంచు గుణము చూసి
    పేద వానికి సుతనిచ్చి పెండ్లి సేయ
    దలచి యొకమేటి శుభ ముహూర్తమున షాహు
    కారు వరుని కాల్గడిగియు కన్యనిచ్చె.


    దారిక మెచ్చువాడు కడు దక్షుడటంచు నెఱంగి ధీత తా
    కోరినవాడెవండు కులగోత్రము లేమిటటంచు నెంచకన్
    బేరిమిజూపి యల్లునిగ పేదను మేకొని హ్లాదమందు పే
    ష్కారు ముదంబునన్ వరుని కాళ్ళను గడ్గి యిడెం గుమారితన్.

    రిప్లయితొలగించండి
  6. తాను వరియించితినటంచు తనయ తెలిపి
    ప్రేమి కుని కుటుంబము గూర్చి వివరమీయ
    తెలియ వచ్చెనుగద బంధువులని పరులు
    కారు వరుని కాల్గడిగియు కన్యనిచ్చె

    వేరొక వానితో తనకు పెండిలి కావలెనన్న పుత్రికే
    వారికి చూపెచిత్తరువు వారలకప్పుడు స్వాంతమందునన్
    భారము తేలిపోయె మరి బంధు గణంబది వారలన్యులే
    కారు ముదంబునన్ వరుని కాళ్ళను గడ్గి యిడెం గుమారితన్

    రిప్లయితొలగించండి
  7. నేరడు దుష్టవర్తనము నిక్కువమెప్పుడు వల్కుఁ దాఁ గనన్
    మారునిఁ బోలు రూపమున మన్నన చేకొనఁ దల్చెఁ బుత్త్రికన్
    బేరిమి పుత్త్రికేఛ్చ నెఱవేరుట తండ్రియె తోషబాష్పముల్
    కారు ముదంబునన్ వరుని కాళ్ళను గడ్గి యిడెం గుమారితన్

    రిప్లయితొలగించండి
  8. మారుని బోలు రూపసిని మానిని గాంచినతోడ నామెకున్
    కోరికబుట్టె వానిఁదన కూరిమి భర్తగనొంద తండ్రితో
    తీరుగ దెల్ప కోరికను దీవెనలిచ్చుచు కంట భాష్పముల్
    కారు ముదంబునన్ వరుని కాళ్ళను గడ్గి యిడెం గుమారితన్

    రిప్లయితొలగించండి
  9. వారు తనయను కష్టాలు పరచు వారు
    కారు, కన్నీరు కార్పించు వారు కారు
    కట్నకానుకల్ కోరెడి కల్ల వారు
    కారు, వరుని కాల్గడిగియు కన్యనిచ్చె
    నందముగనుండునెతలచి నంత తండ్రి

    రిప్లయితొలగించండి
  10. సుతకు పరిణయ మును జేయ చూచు చుండ
    నామె యువకుని ప్రేమించె ననుచు బలు క
    నను మ తించి న దండ్రియు నపుడు షాహు
    కారు వరుని కా ల్గడియు కన్య నిచ్చె

    రిప్లయితొలగించండి
  11. వాసుదేవుఁడు నల్లని వాఁడు కాఁడె
    యర్జునుండు నల్లని వాఁడు దుర్జయుండు
    కాఁడె యింక డెందమున శంక వలదంచుఁ
    గారు వరుని కాల్గడిగియు కన్య నిచ్చె

    [కారు = నలుపు]


    మూరిన సంతసమ్మునను బుత్తడి విత్తము లిచ్చి మక్కువన్
    దార యొసంగ సమ్మతము తద్దయుఁ ప్రీతిని గౌరవమ్ముగాఁ
    గోరఁగ మున్ను తన్ను తన కూఁతును దన్నగరంబునం దయ
    స్కారు ముదంబునన్ వరుని కాళ్లను గడ్గి యిడెం గుమారితన్

    రిప్లయితొలగించండి
  12. చాకచక్యముతోడను చక్క గాను
    పనులనాచరించుచునున్న వ్యక్తిని గని
    పేదవాడనియెంచక వేగ షావు
    *“కారు వరుని కాల్గడిగియు కన్యనిచ్చె”*


    కోరక కట్న మేమియును కూరిమి తోడను మాట లాడగన్
    తీరగు నాకృతిన్ గనుచు తేలుచు సంబర మంది తండ్రితా
    గారపుపట్టినిచ్చుచును కన్నుల పండువ గాను మోహనా
    *“కారు ముదంబునన్ వరుని కాళ్ళను గడ్గి యిడెం గుమారితన్


    రిప్లయితొలగించండి
  13. కం॥ ధనము సంపదలమితమై తనరు చుండి
    చదవు పదవీ గరిమమొప్పి చంద్రవదన
    నచ్చెనని యడుగ నపుడు నమ్మి షావు
    కారు వరుని కాల్గడియు కన్యనిచ్చె

    ఉ॥ వారిజనేత్రికెంచుచు వివాహముఁ జేయఁగఁ దల్లిదండ్రులున్
    గారపు పట్టి మెచ్చఁదగు కాంతుని వేటను గాంచు చుండఁగన్
    గోరఁగ సద్గుణాఢ్యుఁడటు కూరిమిఁ గాంచుచు నొప్పి వాంఛ యేఁ
    కారు ముదంబునన్ వరుని కాళ్ళను గడ్గి యిడెం గుమారుతన్

    ఏకారు మిక్కిలి కోరు ఉవ్విళూరు (నిఘంటువు సహాయమండి)

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ధనమునకు పేదయైనను గుణము గలిగి
    కులము కాకున్న నొకనిని వలచితినని
    తనయ చెప్ప విచారణ తండ్రి చేసి
    తనకు నచ్చెనటంచును ధనిక షావు
    కారు, వరుని కాల్గడిగియు కన్యనిచ్చె.

    రిప్లయితొలగించండి