14-3-2015 (శుక్రవారం)ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“హరి పత్నియె విఘ్నవిభున కమ్మై ప్రోచున్”(లేదా...)“హరికిం బట్టపురాణి విఘ్నపతి కమ్మై ప్రోచు లోకమ్ములన్”
వరములనిచ్చెడు వేలుపుహరి పత్నియె, విఘ్నవిభున కమ్మై ప్రోచున్గిరిరాజ తనయ, యిరువురినిరవుగ పూజింపనిత్తురిహపర సుఖముల్
ధరకార్ముకుడగు గంగాధరుడైన పినాకపాణి త్ర్యక్షుడతండేస్మరుడా వలరాయుని సంహరి పత్నియె విఘ్నవిభున కమ్మై ప్రోచున్.గరళమ్మయ్యది కంఠమందుగల పింగాక్షుండు భద్రేశుడాకరిచర్మాంబరధారి కూటకృతు డుగ్రాక్షుండతండే కదాసురపూజ్యుండగుచున్ జెలంగు భవుడా సూనాస్త్రుడా మార సంహరికిం బట్టపురాణి విఘ్నపతి కమ్మై ప్రోచు లోకమ్ములన్.
కరిముఖుడు దనివి నొందుచుపరమపదము సంగడముకు వడివడి జేరన్వరుసకు మాతులగ దలచుహరి పత్నియె విఘ్నవిభున కమ్మై ప్రోచున్
శరజన్మునకంబ యనగపరమేశ్వరి శైలపుత్రి భర్గుని సతియేసురసుందరి మన్మథ సంహరి పత్నియె విఘ్నవిభున కమ్మై ప్రోచున్ శరఘాతంబులతోడ నుప్పతిలగా స్వాంతమ్ములో ప్రేమ శంకరుడే పొందెను గౌరినే వధువుగా కందర్పుడే గెల్వగాశరజన్ముండను వేల్పు కంబ యనగా శర్వాణి కందర్ప సంహరికిం బట్టపురాణి విఘ్నపతి కమ్మై ప్రోచు లోకమ్ములన్
కం॥ కరుణఁ గని సంపదలొసఁగుహరి పత్నియె, విఘ్నవిభున కమ్మై ప్రోచున్శిరసా నమస్కరించఁగవరదాయని బ్రహ్మవిద్య భవమును బాపున్మ॥ వరదానంబిడి సంపదల్ గనుచు సద్భాగ్యంపు సంధాత్రియౌహరికిం బట్టపురాణి, విఘ్నపతి కమ్మై ప్రోచు లోకమ్ములన్గరుణన్ గాంచుచు సర్వదా ముదముతోఁ గాత్యాయణీ మాతయే!శిరమున్ వంచి నమస్కరించఁ దగు సుశ్రేయంబుతో నొప్పఁగన్
స్థిరమై పట్టెను పంతమంత శివునిన్ శీఘ్రమ్ము పెండ్లాడగన్ వరమున్ బొందెను సేసి ఘోర తపమున్ ఫాలాక్షు మెప్పొందగన్ మురిసెన్ దేహమనందు భాగమిడగన్ పుష్పాస్త్ర శోభాతనూ హరికిం బట్టపురాణి విఘ్నపతి కమ్మై ప్రోచు లోకమ్ములన్!!
వరములనిచ్చెడు వేలుపు
రిప్లయితొలగించండిహరి పత్నియె, విఘ్నవిభున కమ్మై ప్రోచున్
గిరిరాజ తనయ, యిరువురి
నిరవుగ పూజింపనిత్తురిహపర సుఖముల్
ధరకార్ముకుడగు గంగా
రిప్లయితొలగించండిధరుడైన పినాకపాణి త్ర్యక్షుడతండే
స్మరుడా వలరాయుని సం
హరి పత్నియె విఘ్నవిభున కమ్మై ప్రోచున్.
గరళమ్మయ్యది కంఠమందుగల పింగాక్షుండు భద్రేశుడా
కరిచర్మాంబరధారి కూటకృతు డుగ్రాక్షుండతండే కదా
సురపూజ్యుండగుచున్ జెలంగు భవుడా సూనాస్త్రుడా మార సం
హరికిం బట్టపురాణి విఘ్నపతి కమ్మై ప్రోచు లోకమ్ములన్.
కరిముఖుడు దనివి నొందుచు
రిప్లయితొలగించండిపరమపదము సంగడముకు వడివడి జేరన్
వరుసకు మాతులగ దలచు
హరి పత్నియె విఘ్నవిభున కమ్మై ప్రోచున్
శరజన్మునకంబ యనగ
రిప్లయితొలగించండిపరమేశ్వరి శైలపుత్రి భర్గుని సతియే
సురసుందరి మన్మథ సం
హరి పత్నియె విఘ్నవిభున కమ్మై ప్రోచున్
శరఘాతంబులతోడ నుప్పతిలగా స్వాంతమ్ములో ప్రేమ శం
కరుడే పొందెను గౌరినే వధువుగా కందర్పుడే గెల్వగా
శరజన్ముండను వేల్పు కంబ యనగా శర్వాణి కందర్ప సం
హరికిం బట్టపురాణి విఘ్నపతి కమ్మై ప్రోచు లోకమ్ములన్
కం॥ కరుణఁ గని సంపదలొసఁగు
రిప్లయితొలగించండిహరి పత్నియె, విఘ్నవిభున కమ్మై ప్రోచున్
శిరసా నమస్కరించఁగ
వరదాయని బ్రహ్మవిద్య భవమును బాపున్
మ॥ వరదానంబిడి సంపదల్ గనుచు సద్భాగ్యంపు సంధాత్రియౌ
హరికిం బట్టపురాణి, విఘ్నపతి కమ్మై ప్రోచు లోకమ్ములన్
గరుణన్ గాంచుచు సర్వదా ముదముతోఁ గాత్యాయణీ మాతయే!
శిరమున్ వంచి నమస్కరించఁ దగు సుశ్రేయంబుతో నొప్పఁగన్
స్థిరమై పట్టెను పంతమంత శివునిన్ శీఘ్రమ్ము పెండ్లాడగన్
రిప్లయితొలగించండివరమున్ బొందెను సేసి ఘోర తపమున్ ఫాలాక్షు మెప్పొందగన్
మురిసెన్ దేహమనందు భాగమిడగన్ పుష్పాస్త్ర శోభాతనూ
హరికిం బట్టపురాణి విఘ్నపతి కమ్మై ప్రోచు లోకమ్ములన్!!