30, జూన్ 2010, బుధవారం

సమస్యాపూరణం - 25

కవి మిత్రులారా,
స్వాగతం! ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ....

కాంతా రమ్మనెను యోగి కడు మోహమునన్.

26 కామెంట్‌లు:

  1. చింతా క్రాంతుం డగుచున్
    కాంతారమ్ మనెను యోగి, కడు మోహమునన్
    కాంతాలోలుగ తొల్లిటి
    భ్రాంతిల్లి బ్రతికిన కతన బాధలు సలుపన్

    రిప్లయితొలగించండి
  2. ఇంతిని ఁజూడగ కలిగె ఓ
    వింత పులకరింత నంత విందును చేయన్
    సంతాన దీక్ష నిచ్చెద
    కాంతా రమ్మనెను యోగి కడు మోహమునన్

    రిప్లయితొలగించండి
  3. నేను సమస్యను పురించుటలేదు కానీ మీ బ్లాగును బాగా ఎంజాయ్ చేస్తున్నాను శంకరయ్య గారు.

    రిప్లయితొలగించండి
  4. మొదటి పాదము తప్పును సరిచేస్తున్నాను

    ఇంతిని ఁజూడగ కలిగె ఓ = ఇంతిని ఁజూడ కలిగె ఓ

    రిప్లయితొలగించండి
  5. చెంతకు చేరెను మేనక
    వింతగ వలలోన వేసె విశ్వామిత్రున్
    ఇంతిని జూచిన తడవే
    కాంతా రమ్మనెను యోగి కడు మోహమునన్.

    రిప్లయితొలగించండి
  6. శాంతాకారుఁడు కృష్ణుఁడు
    భ్రాంతిగ వసియించె నాడు పడతుల తోడన్
    కాంతారమ్మున నిది యా
    కాంతారమ్మనెను యోగి కడు మోహమునన్.

    రిప్లయితొలగించండి
  7. ఎంతయు భక్తి కలిగి యే
    కాంతమున గొలువ సుభద్ర చెంతకు చేరన్
    కుంతీసుతుండు టక్కరి !
    కాంతా రమ్మనెను యోగి కడు మోహమునన్

    రిప్లయితొలగించండి
  8. నా పై పద్యము అర్జునుడు తీర్థ యాత్ర చేస్తూ ద్వారకకు చేరి అందు యోగి వలె కపట వేషధారియై సుభద్రను కలుసుకొను సందర్భమును వివిరించునది.

    రిప్లయితొలగించండి
  9. నిత్యానందుని సభలకు,
    పూజకు రాసాగె జనంబు నాలుగు దిశలన్;
    రంజిత సేవకు మెచ్చగ
    కాంతా రమ్మనెను యోగి కడు మోహమునన్

    రిప్లయితొలగించండి
  10. కంతలు దాచిన దాగునె?
    రంతుగ మారెనట హృదయ రంజిత తోడన్
    వింతగ నిత్యానందుడు
    కాంతా రమ్మనెను యోగి కడు మోహమునన్!!

    స్వాంతనమున లోకముఫై
    బ్రాంతులుఁబాసి మది నిలిపె పరదైవముపై
    అంత నియమమున దీక్షా
    కాంతా రమ్మనెను యోగి కడు మోహమునన్

    రిప్లయితొలగించండి
  11. వింతగు సంసారంబొక
    కాంతారమ్మనెను యోగి, కడు మోహమునన్
    ఎంతగ నందు తగుల్కొన
    అంతయె దరి కానరాదు అరయుండనియెన్.

    రిప్లయితొలగించండి
  12. నా పద్యం లో " పూజకు వచ్చిరి జనంబు పూనిన భక్తిన్" అని చదువుకోండి. తప్పు ప్రాస, గణం తొందరలో దొర్లాయి.

    రిప్లయితొలగించండి
  13. ౧.
    ఎంతయు నేర్చినఁ గానీ
    ఎంతయుఁ జూచినను గాని,ఎంతగు వారల్
    కాంతా దాసులనిఁ యెఱిఁగి
    కాంతా రమ్మనెను యోగి కడు మోహమునన్.
    ౨.
    కాంతా సిరి శ్రుతుడున్ త
    త్కాంతా కోమల కరార్థి కఱ్ఱి వెఱగునన్
    "ఎంతయు జేసి యయిననీ
    ఇంతిని జేబట్ట వలె"నని ఈప్సితమొప్పన్;

    వింత యతి రూపు దాలిచి
    సుంత మతి మరచి సుభద్రఁ జూచి వివశుఁడై
    యంతట పూజ నెపమునన్
    కాంతా రమ్మనెను యోగి కడు మోహమునన్

    ఫణి గారి ఆలోచనే నాకూ వచ్చింది. పై రెండు పద్యాలు అర్జునుడు మాయ యతి రూపులో సుభద్రను ఆకట్టుకొనే ఘట్టంలోనివి.

    ఈ రోజు పూరణలు రంజుగా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  14. కాంతల విడవాడి కాంతారమున యోగి
    చింతించు విధమును చెప్పెను "గిరి"
    సంతావ దీక్షను వింతగా నిడు మాట
    వ్రాసెను "భాస్కర రామిరెడ్ది"
    ఆ మేనకఁ గని విశ్వామిత్రుఁ డన్నట్లు
    నవ్యతన్ జెప్పె "దోర్నాల హరి"యు
    శౌరి వసించెఁ గాంతారమ్మె యిది యనె
    "రామకృష్ణారావు" రమ్యముగను
    ఆ సుభద్రను పిల్చె నర్జునుం డనెను "ఫ
    ణిప్రసన్న కుమారు" నీటుగాను
    ప్రాస తప్పెను కాని రాస లీలల యోగి
    పాటులన్ "వెంకటప్పయ్య" చెప్పె

    రెండు పూరణ లిచ్చెను రెచ్చిపోయి
    "జిగురు సత్య నారాయణ" సుగమముగను
    వింత సంసార కాంతార మంతు లేని
    దనుచు చెప్పె "అజ్ఞాత" నా మన మలరఁగ.

    రిప్లయితొలగించండి
  15. రవి గారూ,
    ఆలస్యమైనా అందమైన పూరణ లందించారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. RaPaLa గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. నా బ్లాగు నచ్చినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. కౌంతేయుడా యతిని గని
    ఇంతటి నీ బాధదీర్ప నేమిత్తుననన్
    కాంతులు వెలగగ శిఖియై
    కాంతారమ్మనెను యోగి కడు మోహమునన్

    రిప్లయితొలగించండి
  18. చదువరి గారు,
    మీ పూరణ "కాండవ దహనం" Concept తో బాగుంది.

    రిప్లయితొలగించండి
  19. చదువరి గారూ,
    ఖాండవ దహనోదంతము
    నొండొక పద్యమునఁ జెప్పి యొప్పించిన నీ
    మెండైన ప్రతిభ మెచ్చితి
    నిండగు యభినందనములు నీకె చదువరీ!

    ఇక నా పూరణ -
    సుంతైన సుఖము లేదని
    చింతించి పరమ్ముఁ గోరి చేసె తపమ్మున్
    స్వాంతము శాంతిఁ గనె నుమా
    కాంతా! రమ్మనెను యోగి కడు మోహమునన్.

    రిప్లయితొలగించండి
  20. శంకరయ్య గారూ, మీ పూరణా అద్భుతంగా ఉందండీ.

    రిప్లయితొలగించండి
  21. చాలా చాలా చాలా బాగున్నాయండీ అందరి పద్యాలు.

    రిప్లయితొలగించండి
  22. శంకరయ్య గారు,
    "కాంతా" శబ్దాన్ని పులింగ సంబోధనగా మార్చి పూరించటం బాగుంది.

    రిప్లయితొలగించండి
  23. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    శ్రీకృష్ణార్జునయుద్ధం సినిమాలో యతి వేషంలో నున్న అర్జునుని దరికి
    కృష్ణుడు సుభద్ర వేషంలో వచ్చినప్పటి సన్నివేశం :

    01)
    __________________________________

    ఎంతయొ భక్తిగ తననే
    చింతించిన పార్థు బ్రోవ - చేరిన బావన్
    చింతన మరచెను కృష్ణుని !
    కాంతా రమ్మనెను యోగి - కడు మోహమునన్ !
    __________________________________

    రిప్లయితొలగించండి
  24. చింతలు దీర్చగ కావలె
    కాంతారమ్మనెను యోగి; కడు మోహమునన్
    వింతల లోకము దగులక
    చింతనతో తపము జేయ చిట్టడవియె మేల్ !

    రిప్లయితొలగించండి
  25. కంతుని బాణము సైచక
    వంతలు చాలించు మనుచు భ్రాంతిని పడుచున్
    ఇంతిని మేనకను త్వరగ
    కాంతా! రమ్మనెను యోగి కడు మోహమునన్

    రిప్లయితొలగించండి