గన్నవరపు వారి అభిమానానికి ధన్య వాదములు + కృతజ్ఞతలు మిత్రులం దరు నన్నింత గా అభిమానించి గౌరవిస్తున్నందుకు నేనెంతొ ఋణపడి ఉన్నాను..నిజానికి నాకేమి రాదు .మీ అందరి మధ్యలొ నాపేరు కనబడటం నాaదృష్టం.నా జన్మ సుకృతం. అన్నిటికన్న మిన్న నా తల్లిదండ్రులు నాకు పెట్టిన " ఆ దేవి పేరు [ అసలు రాజరాజేస్వరి ].నేను మాటి మాటికి రాయడం కోసం షార్ట్ కట్ చేసుకున్నాను.కావున ఇదంతా ఆ దేవి దయ కృతజ్ఞతలతొ raajarajESwari
కోర్టు బయట జూడ "కో"యని పలికేరు
రిప్లయితొలగించండిసాక్షు లంచు మనకు సాదరముగ!
ఏల పాప పుణ్య గోలలు? "ఎందుకు
పదుగురాడు మాట పాపమగును?"
జనము నోటి మాట జగమంత వినిపించు
రిప్లయితొలగించండివినగ లేదు ప్రభుత వింత గాదె!
పవరు చెంత నుండ పాపియే ధరజెల్లు
పదుగు రాడు మాట పాప మగును.
చచ్చి బతుకుచున్న సంకీర్ణమిదిగాన
రిప్లయితొలగించండిమంత్రులందరెంతొ మంచివారు
పట్టపగలుదినెను ప్రజలధనమనుచు
పదుగురాడుమాటపాపమగును
నాకు ఊకదంపుడు గారి పూరణ నచ్చింది.
రిప్లయితొలగించండిప్రజ్ఞ లున్న నాడు ప్రాభవంబుఁ బొగిడి
రిప్లయితొలగించండిప్రజ్ఞ మరుగు నున్న బతితు డనగ
విజ్ఞులైన వారు విని యూరకుందురు
పదుగు రాడు మాట పాప మగును.
అనువు గాని చోట నణకువె మేలని
రిప్లయితొలగించండిపదుగు రాడు మాట, పాప మగును
రామ యనిన గూడ ప్రేమ లేనట్లైన!
పరిధి నెరిగి మసల వలెను జనులు.
టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
రిప్లయితొలగించండిపూరణ బాగుంది. అబినందనలు.
హరి గారూ,
పద్యం చక్కగా ఉంది. అభినందనలు.
ఊకదంపుడు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
పూరణ బాగుంది. అభినందనలు.
మిస్సన్న గారూ,
ఉత్తమమైన పూరణ. అభినందనలు.
ఆడువారి పలుకు కర్ధమ్ము వేఱన్న
రిప్లయితొలగించండిపదుగురాడు మాట పాపమగును
నేదునూరి నుడువు నిత్యమ్ము నిజమౌను
దీటు లేని యట్టి మేటి మాట !
అజ్ఞాత గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదములు.
-ఊకదంపుడు
గన్నవరపు వారి అభిమానానికి ధన్య వాదములు + కృతజ్ఞతలు మిత్రులం దరు నన్నింత గా అభిమానించి గౌరవిస్తున్నందుకు నేనెంతొ ఋణపడి ఉన్నాను..నిజానికి నాకేమి రాదు .మీ అందరి మధ్యలొ నాపేరు కనబడటం నాaదృష్టం.నా జన్మ సుకృతం. అన్నిటికన్న మిన్న నా తల్లిదండ్రులు నాకు పెట్టిన " ఆ దేవి పేరు [ అసలు రాజరాజేస్వరి ].నేను మాటి మాటికి రాయడం కోసం షార్ట్ కట్ చేసుకున్నాను.కావున ఇదంతా ఆ దేవి దయ కృతజ్ఞతలతొ raajarajESwari
రిప్లయితొలగించండిపాడి యైన మాట పగవాడు పలికినా,
రిప్లయితొలగించండివినగ తగును విధిగ విమల మతులు!
ఎదుగు బొదుగు లేని వదరు బోతులు నూట
పదుగు రాడు మాట పాప మగును !