5, నవంబర్ 2010, శుక్రవారం

ప్రహేళిక - 27

ఎవరీ బ్లాగరి?
ఆ.వె.
పడగ యున్న దొకటి పవిధారి యొకఁడు స
వర్ణదీర్ఘసంధి వలనఁ గలియ
నాంధ్ర పద్య కవిత కాచార్యుఁడై బ్లాగు
లందు మెరయు డాక్ట రతఁ డెవండు?

ఆ బ్లాగరి ఎవరో చెప్పండి.

13 కామెంట్‌లు:

 1. మిత్రు లందరికి దీపావళి శుభా కాంక్షలు

  " డా . ఆచార్య ఫణీంద్ర [ గారు ]" [ javaabu ]

  రిప్లయితొలగించండి
 2. ఆచార్య ఫణీంద్ర (ఫణి + ఇంద్ర)

  రిప్లయితొలగించండి
 3. ఇష్ట సఖి అధరమ్ము జూచి మోహించు
  నికృష్ట జీవుల రుధిరమ్ము గాంచి విలపించు
  కష్ట సుఖములకు స్పందించి కదలు
  ఉత్కృష్టమైన కలమెవరిదొ?

  అట్టివారె డాక్టర్ ఆచార్య ఫణీంద్ర.

  రిప్లయితొలగించండి
 4. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంశనివారం, నవంబర్ 06, 2010 7:33:00 AM

  డా.ఆచార్య ఫణీంద్ర
  - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

  రిప్లయితొలగించండి
 5. ఇప్పుడ చూచినాడను - ప్రహేళిక నొక్కటి నాదు పేరుపై
  అప్పటికప్పు డల్లి ఇటు లందగ జేసెను శంకరార్యుడున్ -
  చప్పున యుత్తరం బిడుచు చాటిరి ప్రేమను పండితోత్తముల్ -
  ఎప్పటి పుణ్యమో గదిది ! ఎల్లరకున్ తల వంచి మ్రొక్కెదన్!

  రిప్లయితొలగించండి
 6. మందాకిని గారూ,
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  రవి గారూ,
  నేదునూరి రాజేశ్వరి గారూ,
  చంద్రశేఖర్ గారూ,
  మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
  మీ అందరి సమాధానం సరియైనదే. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. కోడీహళ్ళి మురళీమోహన్ గారూ,
  మీకు ప్రత్యేకంగా అభినందనలు.

  రిప్లయితొలగించండి