సర్వ పాపముక్తుడగును నిర్వికార రుద్రుని భజించు వాడు,--,దరిద్రు(డగును శర్వు నింది౦చు వాడును సర్వ జన్మ లందు, నమ్ము సకలవేళ లందు శివుని! చంద్రశేఖర్ మనవి: మూడవ పాదంలో "వాడును" అని సరిజేశాను. కట్ అండ్ పేస్టు దోషము. గుంత గూగులు తింగరి గుంట, నమ్మకు దాని కులుకులు. నీ జాగ్రత్త, నీకు రక్ష!
అందరి పూరణలు బాగున్నాయి. అభినందనలు. చంద్ర శేఖర్ గారూ, మీరు అరసున్నకు బదులు బ్రాకెట్ కొడుతున్నారు. మీరు ఉపయోగించేది "లేఖిని" కాదా? లేఖినిలో @m కొడితే అరసున్నా వస్తుంది.
సర్వ పాపముక్తుడగును నిర్వికార
రిప్లయితొలగించండిరుద్రుని భజించు వా(డు,--,దరిద్రు(డగును
శర్వు నింది౦చు వాడు సర్వ జన్మ
లందు, నమ్ము సకలవేళ లందు శివుని!
సర్వ పాపముక్తుడగును నిర్వికార
రిప్లయితొలగించండిరుద్రుని భజించు వాడు,--,దరిద్రు(డగును
శర్వు నింది౦చు వాడును సర్వ జన్మ
లందు, నమ్ము సకలవేళ లందు శివుని!
చంద్రశేఖర్
మనవి: మూడవ పాదంలో "వాడును" అని సరిజేశాను. కట్ అండ్ పేస్టు దోషము. గుంత గూగులు తింగరి గుంట, నమ్మకు దాని కులుకులు. నీ జాగ్రత్త, నీకు రక్ష!
పునుక బువ్వ గుడుచు మేను బూది రాచు
రిప్లయితొలగించండిరుద్రుని భజించు వాడు దరిద్రు డగును
ధనము చింతయు తొలగిన మనము నందు
పరము తెలిసియొ తెలియకొ దరిని చేరు
ఐహికము నందు సుఖముల నంద గలిగి
రిప్లయితొలగించండియంత్య మందున శివునిలో నైక్య మగును
రుద్రుని భజించు వాఁడు! దరిద్రుఁ డగును
క్షుద్రుఁ డుభయములను శివ స్ఫురణ లేక!
యజ్ఞయాగములందైన, అంతరంగ
రిప్లయితొలగించండిమందుజేసెడి కీర్తనమందునైన
దక్షుడైన ధాత అయిన దలచి విడచి
రుద్రుని; భజించు వాఁడు దరిద్రుఁ డగును
( దలచి విడచి = కోరి విడచి, కావాలని విడచి )
అందరి పూరణలు బాగున్నాయి. అభినందనలు.
రిప్లయితొలగించండిచంద్ర శేఖర్ గారూ,
మీరు అరసున్నకు బదులు బ్రాకెట్ కొడుతున్నారు. మీరు ఉపయోగించేది "లేఖిని" కాదా? లేఖినిలో @m కొడితే అరసున్నా వస్తుంది.
నేను Google transliteration module వాడుతాను, మీరు సూచి౦చినాక అరసున్నాకి unicode కనుక్కొన్నాను. ఇకనుంచి రుద్రుని భజించు “వాఁడు” గానే వుంటాను.
రిప్లయితొలగించండిమీ,
చంద్రశేఖర్
చపల చిత్తముతోనెంత తపనజేయ
రిప్లయితొలగించండిగలుగ నేరదు సిద్దియు,కలిమిరాదు!
నిద్రమత్తులో మునిగిన ముద్రలోన
రుద్రుని భజించువాడు దరిద్రుడగును!
తే. గీ.
రిప్లయితొలగించండినిజము నిజమిది నరులార నియమ నిష్ట
తోడ యుపవాసముల నుండి మూడు కనుల
రుద్రుని భజించు వాడు దరిద్రుడగును
నాస్తికమ్మనియెడి యొక యాస్తిలేక!!
....
(నాస్తికము అనెడి ఆస్తిలేక దరిద్రుడగునని భావన)
- గానుగుల