3, నవంబర్ 2010, బుధవారం

వారాంతపు సమస్యా పూరణం - 14

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది .....
జారులు పూజ సేయఁ గని సాధుజనుల్ పులకించి రెల్లరున్.
దీనిని సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

18 కామెంట్‌లు:

  1. కవి మిత్రులకు మనవి,
    నేను ఏదో ఒక ఆలోచన వచ్చి కందంలోనో, తేటగీతిలోనో, ఆటవేలదిలోనో సరిపెట్టి కొన్ని మాటలు పంపుతుంటాను మాస్టారు గారికి. వారు దానికి మెరుగులు పెట్టి మంచి సమస్యగా మనందరికి అందిస్తున్నారు. దాని గుణ గణ విశేషాలన్నీ మాస్తారివే అని చెబుతూ,
    మీ,
    చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  2. శ్రీ రమణీయమై ; సుజన సేవితమై; నిజ భక్త సౌఖ్య సం
    పూరకమై : త్రయీ భువన పోషకమై: మహనీయ మంగళా
    కార విలాసమై వెలుగు గౌరికి కోవెలలోన భక్తి -పూ
    జారులు పూజసేయగని సాధుజనుల్ పులకించిరెల్లరున్!!!!

    రిప్లయితొలగించండి
  3. అజ్ఞాత గారూ,
    మీకు నా నమస్సుమాంజలి. ఇంత చక్కని పద్యాలు చెప్తూ అజ్ఞాతంగా ఉండడమెందుకు?

    ఏ తీరునఁ బరికించిన
    మా తరమా నినుఁ బొగడ? సమస్య యెదైనన్
    ఖ్యాతి కవులందు గలిగెడి
    రీతిని పూరించుచు నలరెద వజ్ఞాతా!

    రిప్లయితొలగించండి
  4. అఙ్ఞాతగారి అద్భుతమైన, పవిత్రమైన, మంగళప్రదమైన పూరణకు నా నమోవాకాలు.

    రిప్లయితొలగించండి
  5. శ్రీయుత కంది శంకరయ్య గారూ! !!
    పద్య రచనలోనే కాక పద్య విద్యా సంబంధిత పాథ్యాంశ నిర్వహణలో మీ చాతురి ప్రశంసనీయము!!!

    వర పద్యాకృతివై ; చిరంతన తపః ప్రాప్యైక వాగ్వైఖరీ
    స్థిర సంకల్పుడవై; గురూత్తముడవై: సిద్ధార్థ దీక్షాళువై:
    పరమానందము తోడ పాఠముల జెప్పంబూననీ శంకరా
    భరణంబున్ వహియించు మీ ధిషణ సంభావించి కైమోడ్చెదన్!!!!!
    ----------------- ------------------------ --------------------------

    మీ ఆదరాభిమానాలకి శతథా కృతజ్ఞుడను......!!!!!

    రిప్లయితొలగించండి
  6. శుభప్రదమైన "శ్రీ" శబ్దంతో మొదలపెట్టి హృద్యమమైన పది అందించారు అజ్ఞాత గారు. సమస్య ను చక్కగా మలిచారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. శ్రీ రమణీ మనోహరుని చిన్మయ రూపము జూడ గోరుచున్
    సారెకు శ్రీనివాస యని సన్నుతి జేయుచు కాలిబాటలో
    చేరిరి కొండ పైకి కని చెందిరి మోదము నట్టి పాదపుం-
    జారులు పూజసేయగని సాధుజనుల్ పులకించిరెల్లరున్!!!!

    రిప్లయితొలగించండి
  8. అజ్ఞాతగారూ పూరణ అద్భుతం. గురువుగారు మా అందఱి అభిప్రాయాలను అందమైన కందంలో చెప్పారు. మీకు, గురువుగారికి నమస్సులు.

    రిప్లయితొలగించండి
  9. ఊదం గారూ,
    సంస్కృతంలో నాకంత సీన్ లేదు. రాఘవ గారేమో కనుక్కోండి.

    రిప్లయితొలగించండి
  10. మిస్సన్న గారూ,
    జారులను పాదచారులను చేసారా? బాగుంది. పద్యం చక్కగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. అజ్ఞాతగారూ గురువుగారిని ప్రస్తుతించుతు మీరు వ్రాసిన పద్యము ఒళ్ళు పులకరింప చేస్తున్నది. ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  13. గౌరికుమారరార మము గావగ రాగదవేల? మేము మీ
    వారలమేర! మమ్ములను వర్ధిల జూడగ నేరమౌర?మా
    వారును వారివారి పరివారము వారల బ్రోవుమంచు,బం
    జారులు పూజ సేయగని సాధు జనుల్ పులకించి రెల్లరున్!

    పూరణ యన పదగమనము,
    పూరణ యన భావయుక్త పూరితవర్ణం,
    పూరణ యన అజ్ఞాతది,
    పూరణ యన పూర్ణచంద్ర పూర్ణిక జూడన్!

    రిప్లయితొలగించండి
  14. మంద పీతాంబర్ గారూ,
    జారులను బంజారులను చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. పోరుచు రాజకీయమున పొట్టలు కొట్టగ బీదసాదలన్
    కోరిక తీర టిక్కెటులు కోటులు పోయగ చేతికందగా
    బారులు తీరి కోవెలల బంధుల గూడుచు నాక్రమించుచున్
    జారులు పూజ సేయఁ గని సాధుజనుల్ పులకించి రెల్లరున్

    రిప్లయితొలగించండి