15, నవంబర్ 2010, సోమవారం

సమస్యా పూరణం - 151

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
చంద్రముఖిని జూచి జడిసె నయ్యొ!

12 కామెంట్‌లు:

  1. అమిత భక్తి తోడ అయ్యప్పనుభజించి
    దీక్ష బూని మెలగి దినము దినము
    స్వామిగొరకుబోయి శబరిమలకు -
    చంద్రముఖిని జూచి జడిసె నయ్యొ!

    ( ఈ మధ్య వస్తున్న వార్తల ఆధారంగా)

    రిప్లయితొలగించండి
  2. ఊకదంపుడు గారూ,
    మంచి భావంతో పద్యం చెప్పారు. అభినందనలు.
    మూడవ పాదంలో "శబరిమలకు" అంటే గణదోషం ఉంది. దానిని "శబరి శైలమునకు" అంటే సరిపోతుంది కదా!

    రిప్లయితొలగించండి
  3. సపరి చర్య చేయ సానుపుత్రిక చెంత
    మరుడు దాగి వేసె విరి శరమ్ము
    చంద్రమౌళి యెదను సందడి చెలరేగ
    చంద్రముఖిని జూచి జడిసె నయ్యొ!

    రిప్లయితొలగించండి
  4. గురువులు శిష్యులను క్షమించమనడం బాగో లేదండీ. మీరు మీ బ్లాగు ద్వారా మాకు విద్యా ఙ్ఞాన దానాలు చేస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  5. తాత గారి వెంట తాపీగ వెళ్ళెను
    సినిమ యనుచు బిడ్డ చిలిపిగాను;
    లకలకయన జ్యోతిక కకావికంబాయె
    చంద్రముఖిని జూచి జడిసెనయ్యొ

    రిప్లయితొలగించండి
  6. ముందు రెండో పాదంగా వేసి - తరువాత మూడో పాదంగా మార్చటమ్ వల్ల వచ్చిన దోషమండీ.
    సరిదిద్దినందులకు ధన్యవాదములు.
    భవదీయుడు
    ఊకదంపుడు

    రిప్లయితొలగించండి
  7. చెలియ మోము జూచి చంద్రబింబమె యనగ
    దరికి జేరి గనిన దడలు బుట్టె
    శిలలు గొప్పు లున్న శశిధరుని బోలిన
    చంద్రముఖిని జూచి జడిసెనయ్యొ !

    రిప్లయితొలగించండి
  8. మిస్సన్న గారూ,
    టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    రాజేశ్వరి నేదునూరి గారూ,
    మీ అందరి పూరణలు బాగున్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. రాజేశ్వరిగారి పద్యంలో భావం బలే తమాషాగా ఉంది.

    రిప్లయితొలగించండి
  10. నరుల హింస సేయు నరకాసురధముండు
    నల్లనయ్య తోడ ననికి యేగి
    ప్రభల తేజ కృష్ణ భాస్కరు సరసన
    చంద్రముఖిని జూచి జడిసె నయ్యొ

    రిప్లయితొలగించండి
  11. ఇంద్ర సఖుడుగాదు,ఇంతుల నెఱుగడు,
    వేదమంత్ర పఠన, వేల్పు కొలువు,
    వన్నెలాడి వలచి, వెన్నంటి వచ్చిన
    చంద్ర ముఖిని జూసి జెడిసెనయ్యొ !

    రిప్లయితొలగించండి