గురువుగారూ నమస్కారములు, నా పూరణ ;"చిలువకుఁ జిక్కెను నోతువుకలుగుకుఁ దాఁ జేరుచుండ కాటుకుఁ బడెనోకలవరమె" చిలుక సెప్పెను"ఎలుకం గని పిల్లి చచ్చె, నేనుఁగు పాఱెన్".
అలుపెరుగని రైతన్నలు,పలుపంటలు శ్రమలకోర్చి పండింపoగన్,పలురీతులతిను నాయక ఎలుకంగని పిల్లిచచ్చె నేనుగు పాఱెన్!
సలిపెను భీకర సమరము!నిలబెట్టెను భీష్మ యోధు! నీల్గిరి పెనువై రులు! అభిమన్యుడొ బాలుడు!ఎలుకం గని పిల్లి చచ్చె నేనుఁగు పాఱెన్.
కలవరమందియె 'శేషన్'పలుమార్పులుజేసె నడల "పార్టీ"లన్నీ; పలుకనిదెట్లన్నను చి ట్టెలుకంగని పిల్లి చచ్చె నేనుఁగు పాఱెన్.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,మంద పీతాంబర్ గారూ,మిస్సన్న గారూ,ఊకదంపుడు గారూ,మీ అందరి పూరణలూ బాగున్నాయి. ముఖ్యంగా మిస్సన్న, ఊకదంపుడు గారల పూరణలు ఉత్తమంగా ఉన్నాయి. అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
"కలియుగ మందున బుట్టును ఎలుకయె పిల్లికిని పంది కేనుగు" చెప్పన్ !కలిగెను యెకచో , వెంటనె ఎలుకం గని పిల్లి చచ్చె, నేనుఁగు పాఱెన్!!
నలుబది యడుగుల గణపతికెలుకయె వాహనము కాగ నేనుగు ముఖమైబిలబిల పరుగిడ వనముననెలుకం గని పిల్లి చచ్చె నేనుఁగు పాఱెన్
శాస్త్రి గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చెలరేగగ చంద్రుడిచట బలుపౌ కాంగ్రెసెయు నోడె భండన భీముం డల చంద్రుని యాశలుడిగె: "ఎలుకం గని పిల్లి చచ్చె నేనుఁగు పాఱెన్"
గురువుగారూ నమస్కారములు, నా పూరణ ;
రిప్లయితొలగించండి"చిలువకుఁ జిక్కెను నోతువు
కలుగుకుఁ దాఁ జేరుచుండ కాటుకుఁ బడెనో
కలవరమె" చిలుక సెప్పెను
"ఎలుకం గని పిల్లి చచ్చె, నేనుఁగు పాఱెన్".
అలుపెరుగని రైతన్నలు,
రిప్లయితొలగించండిపలుపంటలు శ్రమలకోర్చి పండింపoగన్,
పలురీతులతిను నాయక
ఎలుకంగని పిల్లిచచ్చె నేనుగు పాఱెన్!
సలిపెను భీకర సమరము!
రిప్లయితొలగించండినిలబెట్టెను భీష్మ యోధు! నీల్గిరి పెనువై
రులు! అభిమన్యుడొ బాలుడు!
ఎలుకం గని పిల్లి చచ్చె నేనుఁగు పాఱెన్.
కలవరమందియె 'శేషన్'
రిప్లయితొలగించండిపలుమార్పులుజేసె నడల "పార్టీ"లన్నీ;
పలుకనిదెట్లన్నను చి
ట్టెలుకంగని పిల్లి చచ్చె నేనుఁగు పాఱెన్.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిమంద పీతాంబర్ గారూ,
మిస్సన్న గారూ,
ఊకదంపుడు గారూ,
మీ అందరి పూరణలూ బాగున్నాయి. ముఖ్యంగా మిస్సన్న, ఊకదంపుడు గారల పూరణలు ఉత్తమంగా ఉన్నాయి. అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
"కలియుగ మందున బుట్టును
రిప్లయితొలగించండిఎలుకయె పిల్లికిని పంది కేనుగు" చెప్పన్ !
కలిగెను యెకచో , వెంటనె
ఎలుకం గని పిల్లి చచ్చె, నేనుఁగు పాఱెన్!!
నలుబది యడుగుల గణపతి
రిప్లయితొలగించండికెలుకయె వాహనము కాగ నేనుగు ముఖమై
బిలబిల పరుగిడ వనమున
నెలుకం గని పిల్లి చచ్చె నేనుఁగు పాఱెన్
శాస్త్రి గారూ,
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
చెలరేగగ చంద్రుడిచట
రిప్లయితొలగించండిబలుపౌ కాంగ్రెసెయు నోడె భండన భీముం
డల చంద్రుని యాశలుడిగె:
"ఎలుకం గని పిల్లి చచ్చె నేనుఁగు పాఱెన్"