2, నవంబర్ 2010, మంగళవారం

సమస్యా పూరణం - 141

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది
వెన్నెలలో తనువునుండి వెడలెను సెగలే.
దీనిని సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

17 కామెంట్‌లు:

  1. 'కన్నె'శకుంతల వేచెను
    కన్నుల అశ్రువులు దాచి, కలవరమున- యా
    యన్నుకు బయకలు మొదలై
    వెన్నెలలో తనువునుండి వెడలెను సెగలే
    (బయకలు=వేవిళ్లు)

    రిప్లయితొలగించండి
  2. పన్నుగ నృత్యము సలిపెను
    వెన్నుడు ఫణి ఫణము నెక్కి విలసిత మడరన్
    పన్నగము డస్సి క్రుంగెను
    వెన్నెలలో తనువు నుండి వెడలెను సెగలే !

    రిప్లయితొలగించండి
  3. వన్నెలవరూధిని గనియె,
    ఎన్నడు ఎఱుగని ప్రవరుని ఎదురుగ,నాడా
    పున్నమి చంద్రుని సాక్షిగ,
    వెన్నలలో తనువునుండి వెడలెను సెగలే!

    రిప్లయితొలగించండి
  4. కన్నె మనసు బహు చిలిపిది
    అన్నన్నా! ప్రియుడు లేక అతి విరహముతో
    చిన్నది కృశించిపోయెను;
    వెన్నెలలో తనువు నుండి వెడలెను సెగలే!!!

    రిప్లయితొలగించండి
  5. శంకరయ్య గారు,
    నిన్నటి పద్యం సరి చేసినందుకు ధన్యవాదములు.
    ఈ పద్యం చూడండి

    అన్నాతికివిరహముచే-
    వెన్నెలలో తనువునుండి వెడలెను సెగలే
    కన్నార్పదన్నమంటదు
    నన్నంపెనునీకుదెలుప నందకిశోరా!!

    రిప్లయితొలగించండి
  6. అన్నులమిన్నకు జడలో
    సన్నని జాజులను తురిమి- సరసుం డటుపై
    పన్నీరు చిలుకరింపగ
    వెన్నెలలో తనువు నుండి వెడలెను సెగలే!!!

    రిప్లయితొలగించండి
  7. కన్నయ్య ముద్దుల మొగముఁ
    గన్నుల కింపగు సుతనువు కారణమవగాఁ
    వన్నెల ఓ గోపెమ్మకు
    వెన్నెలలో తనువునుండి వెడలెను సెగలే.

    రిప్లయితొలగించండి
  8. మరో పూరణండీ,

    చిన్నదియౌ శూర్ఫణకును
    చిన్నయ్యయు చెక్కెనంట చెవులును ముక్కున్
    "అన్నా !" ఆక్రోశించెను
    వెన్నెలలో తనువు నుండి వెడలెను సెగలున్ !

    రిప్లయితొలగించండి
  9. సవరించానండీ ముందు పద్యము ప్రచురించ వద్దు.

    చిన్నదియౌ శూర్పణఖును
    చిన్నయ్యయు చెక్కెనంట చెవులును ముక్కున్
    "అన్నా1" ఆక్రోశించెను
    వెన్నెలలో తనువు నుండి వెడలెను సెగలే

    రిప్లయితొలగించండి
  10. అన్నుల మిన్నైన పడతి
    పున్నమి రోజున ప్రియునితొ పొందారంగన్
    తన్నుకు వచ్చెను మోహము
    వెన్నెలలో తనువునుండి వెడలెను సెగలే!!

    రిప్లయితొలగించండి
  11. అన్నుల మిన్నైన యతివ
    పున్నమి రాతిరి ప్రియునితొ పొందారంగన్
    తన్నుకు వచ్చెను మోహము
    వెన్నెలలో తనువునుండి వెడలెను సెగలే

    రిప్లయితొలగించండి
  12. రోహిణికార్తె ఎండలలో విజయవాడ లో పెళ్లిచేసుకొంటే యెట్లావుంటుందో, చెప్పలేము. అది అనుభవించి తీరాల్సిందే! పద్యంలో కన్నియ పరిస్థితి,
    కన్నియ రోహిణి కార్తెల
    గన్న విజయవాడ గ్రీష్మ గాడ్పుల మనువా
    డెన్నిక చోద్యము జంటకు
    వెన్నెలలో తనువునుండి వెడలెను సెగలే.

    రిప్లయితొలగించండి
  13. వన్నెల తారల జిలుగులు
    సన్నగ మదినిండ జేరి సరసములాడన్ !
    మిన్నగ కలవర పడెయెద
    వెన్నెలలో తనువు నుండి వెడలెను సెగలే !

    రిప్లయితొలగించండి
  14. నారాయణ గారూ,
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మంద పీతాంబర్ గారూ,
    అజ్ఞాత గారీ.
    ఊకదంపుడు గారూ,
    రవి గారూ,
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    నచికేత్ గారూ,
    చంద్రశేఖర్ గారూ,
    నేదునూరి రాజేశ్వరి గారూ,
    మీ అందరి పూరణలు బాగున్నాయి. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. "ఆషాఢస్య ప్రథమదివసే.."

    పన్నుగ పుట్టింటి కలల
    కన్నుల తడి యారకున్న కామాక్షికి యీ
    వన్నెల వేసవి పున్నమి
    వెన్నెలలో తనువునుండి వెడలెను సెగలే

    రిప్లయితొలగించండి
  16. వెన్నున సేండో బనియను
    తన్నుకు వచ్చెడి చెమటలు తడి చేయంగా
    చెన్నై బీచిని వేసవి
    వెన్నెలలో తనువునుండి వెడలెను సెగలే

    రిప్లయితొలగించండి