2, నవంబర్ 2010, మంగళవారం

ప్రహేళిక - 24

ఈ ఉద్యమం ఏమిటి?
తే.గీ.
ఆకుల రసమ్ము, విహరించునట్టివాఁడు,
గెలుపు, స్త్రీ, వైరి, స్వర్గము, చిలుక, తృటి, వి
మోచనమ్ము త్ర్యక్షర పదంబు లగు; నందుఁ
గన ద్వితీయాక్షరమ్ముల గాంధి గారు
నడిపినట్టి యుద్యమ; మది నుడువఁ గలరె?

ఆ ఉద్యమ మేమిటో చెప్పండి.

15 కామెంట్‌లు:

 1. పసరు,విహారి,జయము,వనిత,అరాతి,నాకము,కీరము,క్షణము,విముక్తి= సహాయ నిరాకరణము

  రిప్లయితొలగించండి
 2. పసరు, విహారి, జయము, వనిత, అరాతి, నాకము, కీరము, క్షణము, విముక్తి

  సహాయ నిరాకరణము

  రిప్లయితొలగించండి
 3. సహాయనిరాకరణము : పసరు,విహారి,జయము,వనిత,?,?,?,క్షణము,విముక్తి

  రిప్లయితొలగించండి
 4. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంమంగళవారం, నవంబర్ 02, 2010 11:12:00 AM

  ఆకుల రసమ్ము - పసరు
  విహరించునట్టివాఁడు - విహారి
  గెలుపు - జయము
  స్త్రీ - వనిత
  వైరి - అరాతి
  స్వర్గము - నాకము
  చిలుక - కీరము
  తృటి - క్షణము
  విమోచనమ్ము - విముక్తి
  గాంధీ గారి ఉద్యమం - సహాయనిరాకరణము
  - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

  రిప్లయితొలగించండి
 5. పసరు
  విహారి
  జయము
  వనిత
  పరాయి
  నాకము
  కీరము
  క్షణము
  విముక్తి
  సహాయనిరాకరణము

  రిప్లయితొలగించండి
 6. సహాయనిరాకరణము
  పసరు, విహారి, జయము, వనిత, సురారి, నాకము, ----, క్షణము,విముక్తి

  రిప్లయితొలగించండి
 7. పసరు, సహాయ
  జయము,వనిత
  అరాతి,నాకము,
  కీరము,క్షణము, విముక్తి
  సహాయనిరాకరణము

  రిప్లయితొలగించండి
 8. పసరు,విహారి,జయము,వనిత,అరాతి,నాకము,కీరము,క్షణము,విముక్తి.--- సహాయనిరాకరణము.

  రిప్లయితొలగించండి
 9. జవాబు " సహాయ నిరాకరణోద్యమం " అనుకుంటున్నాను

  రిప్లయితొలగించండి
 10. పసరు - విహారి - జయము - వనిత - అరాతి - నాకము - కీరము - క్షణము - విముక్తి

  సహాయనిరాకరణము

  రిప్లయితొలగించండి
 11. 1.పసరు2.విహారి .3.జయము .4.వనిత .5.అరాతి.6.నాకము.7.కీరము .8.క్షణము.9.విముక్తి ." అన్ని కలిపి జవాబు = సహాయ నిరాకరణము."

  రిప్లయితొలగించండి
 12. పసరు; విహారి; జయము; వనిత; అరాతి; నాకము; కీరము; క్షణము; విముక్తి.
  వెరసి సమాధానము: స-హా-య-ని-రా-క-ర-ణ-ము.

  రిప్లయితొలగించండి
 13. మంద పీతాంబర్ గారూ,
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  అనఘ గారూ,
  టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
  మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
  రవీందర్ గారూ,
  మందాకిని గారూ,
  ఊకదంపుడు గారూ,
  భమిడిపాటి సూర్యలక్ష్మి గారూ,
  నేదునూరి రాజేశ్వరి గారూ,
  కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
  చంద్రశేఖర్ గారూ,
  మీ అందరి సమాధానాలు సరిపోయాయి. అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి