22, నవంబర్ 2010, సోమవారం

సమస్యా పూరణం - 153

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
రమ్ము చేయగలదు ప్రాణరక్ష.

20 కామెంట్‌లు:

 1. గురువుగారూ! మీ అబ్బాయి పెళ్లి పరమేశ్వరానుగ్రహము వలన శుభప్రదంగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ముందటి పూరణను సీతా లక్ష్మణులను దృష్టిలో పెట్టుకొని పూరించాను. మీ మిత్రుని తమ్ముడు ఇంతవరకు రాకపోవడం చాల బాధాకరం.పద్యం మీకు బాగా నచ్చినందుకు సంతోషం.

  రిప్లయితొలగించండి
 2. సోదరీ!రాజేశ్వరీ! శుభయాత్రానుభవ ప్రాప్తిరస్తు.

  రిప్లయితొలగించండి
 3. గుండె అలసినంత కొడిగట్టు నీజన్మ
  యనెడు మాట నేడు యనృత మయ్యె
  'పేసుమేకర'నుచు పిలువబడు పరిక
  రమ్ము చేయగలదు ప్రాణరక్ష.

  రిప్లయితొలగించండి
 4. గురువుగారూ నమస్కారములు ,

  ప్రతిదినము నేను చేసే వైద్యహితబోధ :

  సత్యవాక్కు నిదియు సంగాతమున జెప్దు
  మద్యపాన గుణము మ్రాన్ప దగును
  సెగల పొగల విడుపు మిగులము శ్రేయస్క
  రమ్ము, చేయగలదు ప్రాణరక్ష.

  రిప్లయితొలగించండి
 5. లెమ్ము? హరిని నమ్ము! లేమిలో కలిమిలో,
  వమ్ము జేయ బోడు మిమ్ము,మమ్ము!
  వదల బోకు ధర్మ పదములు దరిచేర
  రమ్ము!చేయ గలదు ప్రాణరక్ష!

  రిప్లయితొలగించండి
 6. అన్న పానములును కన్నవారునులేక;
  ఆకలేసినేను అలమటించ,
  వారమివ్వజనము, వరమాయె,యాయవా
  రమ్ము, చేయగలదు ప్రాణ రక్ష!

  రిప్లయితొలగించండి
 7. ధనము గాదు, కాదు దైత,సుతులు గారు
  వైద్య మదియు గాదు, విద్య గాదు
  స్థిరము, చిరము, నిజము శివభక్తియేసత్వ
  రమ్ముచేయగలదు ప్రాణ రక్ష!


  ( కార్తీక సోమవారం, భక్త మార్కండేయుని కధ ఆధారం గా)

  రిప్లయితొలగించండి
 8. గురువుగారూ! మీ అబ్బాయి పెళ్లి పరమేశ్వరానుగ్రహము వలన శుభప్రదంగా జరిగినందుకు చాలా సంతోషమండీ.


  భవదీయుడు
  ఊకదంపుడు

  రిప్లయితొలగించండి
 9. పవన సుతుడు మ్రొక్కి ప్రార్థింప నోషధుల్
  పలికె నిట్లు రామభక్త హనుమ!
  రమ్ము! చేయగలదు ప్రాణ రక్షణ లక్ష్మ-
  ణునకు సంజివనిని గొనుము వేగ.

  (గురువుగారూ ఈ తరహా పూరణ పండిత సమ్మతమవునో కాదో తెలియదు. దయచేసి చెప్పండి.)

  రిప్లయితొలగించండి
 10. సీ.
  పరిక"రమ్ము"గ మార్చి బాగుగా "హరి" చెప్పె
  రమ్ము నారోగ్యకరమ్ము గాగ
  శ్రేయస్క"రమ్ము"గాఁ జెప్పె "గన్నవరపు
  నరసింహ మూర్తి" సుందరముగాను
  చేర "రమ్ము" హరినిఁ జేకొను నని చెప్పె
  "మంద పీతాంబరు" డందముగను
  యాయవా"రమ్ము"తో ననె "టేకుమళ్ళ వం
  శ్యుఁడు వెంకటప్పయ్య" శోభనముగ
  తే.గీ.
  సత్వ"రమ్ము"గఁ బ్రోచును శశిధరుఁడనె
  "నూకదంపుడు" సత్కవిలోక నుతుఁడు
  "రమ్ము" రమ్మనె "మిస్సన్న" రామభక్త
  హనుమనిం గూర్చి సుకవితామృతఝరి.

  రిప్లయితొలగించండి
 11. ఎంత భాగ్యశాలి నయితి నీ దినమున!
  నొకరి మించిన పూరణ లొకరు పంపి
  నన్నుమురిపింపఁ జేసిన నవ్య కవుల
  కెల్ల వందనములఁ జేతు నుల్ల మలర.

  రమ్ము, మా సమస్యాపూరణమ్ము సుమధు
  రమ్ము సుమ్మని వినిపింప నెమ్మనము క
  రమ్ము సంతృప్తి నొందఁగ వ్రాసి సత్వ
  రమ్ముగాఁ బంపు కవుల కార్యమ్ము ఘనము.

  రిప్లయితొలగించండి
 12. కాస్త చలికి జనము కంగారు పడుదురే,
  ఇచటి చలితొ నేను ఎటుల జేతు?
  కాళ్ళు జేతులెళ్ళ గడ్డలు కరచగా
  రమ్ము చేయగలదు ప్రాణరక్ష.
  (ఫిన్లాండులో ఇప్పుడు -10 డిగ్రీలు)

  రిప్లయితొలగించండి
 13. నచికేత్ గారూ,
  రమ్మును రమ్ముగానే చూసింది మీ రొక్కరే. పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. మిస్సన్న గారూ,
  సమస్యగా ఇచ్చిన పద్య పాదాన్ని పద్యంలో ఎక్కడైనా ప్రయోగించవచ్చు. ఆ స్వాతంత్ర్యం అవధానికి ఉంటుంది. ఈ తరహా పూరణ సర్వజన సమ్మతమే.

  రిప్లయితొలగించండి
 15. మిస్సన్న గారూ,
  ఊకదంపుడు గారూ,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 16. mee blog chuda chakkaga,saralamga, bahu prashamsa neeyamga, malli malli chadvinchela vunnadi. sahithi priyulaku mee blog oka varame ante athisham kadu suma! meeranna.. mee sahityamanna abhimaniche..mee abhimani balu-balaji.

  రిప్లయితొలగించండి
 17. గురువుగారూ,
  మీ సీసపద్యము, తేటగీతి పద్యాలు చాలా చాలా బాగున్నాయి. మీకు మా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 18. mee yatra shubhapradam-sukhavantham kavalani, chiranjeevulu nuthana vadhu varulu anyonymga ayurarogyalatho,iswaryavanthuly jeevanam gadapalani akakshisthu..balaji-pune. balaji darshanam bhavi vivahiha jeevithaniki vanne thevalani koruthu venkannanu vedukuntunnanu.

  రిప్లయితొలగించండి
 19. అక్షరమ్ము లన్ని అటునిటుగా జేర
  మంత్రమగును గాదె; మరణమైన
  పారు నిజము, జూడ పంచాక్షరికి, "అక్ష
  రమ్ము చేయగలదు ప్రాణరక్ష."

  రిప్లయితొలగించండి