8, నవంబర్ 2010, సోమవారం

ప్రహేళిక - 28

ఈ వాహనం ఏమిటి?
తే.గీ.
లక్ష్మి కూతురు సవతి బాలకుని తండ్రి
భక్తుని సహోదరునకు నభయ మొసంగు
వాని తమ్ముని గాచినవాని జనకు
పట్టి కగ్రజు తండ్రికి వాహనంబు.

ఆ వాహనం ఏమిటో చెప్పండి.

6 కామెంట్‌లు:

  1. మీ ఇంటిలో జరిగిన శుభకార్యము సందర్భముగ మీకు శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  2. డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    మీ సమాధానం సరియైనదే. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. గురువు గారు నమస్కారములు. మీ అబ్బాయి వరపూజ సందర్భం గా శుభా కాంక్షలు.." లగ్న పత్రికను " బ్లాగు లొ ఉంచితె చూసి ఆనందించ గలము.. "

    రిప్లయితొలగించండి
  4. లక్ష్మి కూతురు = గంగ(?)
    గంగ సవతి = గౌరి(పార్వతి)
    ఆమె బాలకుడు = గణపతి లేదా కుమారస్వామి
    అతని తండ్రి = శివుడు
    అతని భక్తుడు = రావణుడు
    అతని సహోదరుడు= విభీషణుడు
    అతనికి అభయ మొసంగువాడు= రాముడు
    వాని తమ్ముడు = లక్ష్మణుడు
    వాని గాచినవాడు = హనుమతుడు
    వాని జనకుడు= వాయువు
    అతని పట్టి = భీముడు
    అతనికి అగ్రజుడు= ధర్మరాజు
    అతనితండ్రి= యమధర్మరాజు
    అతనికివాహనంబు= దున్నపోతు.

    రిప్లయితొలగించండి