మిస్సన్నగారూ మంచి పద్యాలతో మతాబులు కాల్చి,చిచ్చుబుడ్లు వెలిగించి, జువ్వలు వదలి సిసింద్రీలతో ఆడి నూతన వెల్గులు సదా వెలిగిస్తున్నందులకు కృతజ్ఞతలు. గురువుగారికి, మిత్రులకు, అందఱి కుటుంబాలకు శుభాకాంక్షలు.
శంకరయ్య గారూ, గత కొద్ది కాలం గా మీ బ్లాగ్ చూస్తున్నాను, చాలా బాగుంటోంది. నాకు సాహిత్యంలో ఎంతో అభిరుచి వున్నా, ప్రవేశం మాత్రం లేదు. ఇప్పుడిప్పుడే ప్రయత్నిస్తున్నాను. భావం కుదిరితే ఛందస్సు, ఛందస్సు కుదిరితే భావం దెబ్బ తింటున్నాయి. అయినా, ప్రయత్నం సాగుతోంది. ఒక చిన్న సందేహం తీరుస్తారని ఆశిస్తున్నాను. అచ్చు కి హల్లు తో యతి వేయటం వుంది కాని, హల్లు కి అచ్చు తో యతి వేయ వచ్చునా? విద్యాసాగర్ అందవోలు.
విద్యాసాగర్ గారూ, 'శంకరాభరణం' బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది. బ్లాగు నచ్చినందుకు ధన్యవాదాలు. ఇక మీ ప్రశ్నకు సమాధానం .... అచ్చుకు హల్లుతో యతి వేయడం హకార, యకారాలకు మాత్రమే చెల్లుతుంది. ఉదాహరణకు ... అ,ఆ,ఐ,ఔ, య,యా,యై,యౌ, హ,హా,హై,హౌ. ఇ,ఈ,ఋ,ౠ,ఎ,ఏ, యి,యీ,యృ,యౄ,యె,యే,హి,హీ,హృ,హౄ.హె,హే. ఉ,ఊ,ఒ,ఓ,యు,యూ,యొ,యో,హు,హూ,హొ,హో. ఇక మిగిలిన హల్లులను యతిస్థానంలో వేసినప్పుడు వాటి అచ్చులు కూడా మైత్రిని పాటించాలి. ఉదాహరణకు .... క,ఖ,గ,ఘ,క్ష - క,కా,కై,కౌ,ఖ,ఖా,ఖై,ఖౌ,గ,గా,గై,గౌ,ఘ,ఘా,ఘై,ఘౌ,క్ష,క్షా,క్షై,క్షౌ. కి,కీ,కృ,కౄ,కె,కే,ఖి,ఖీ,ఖృ,ఖౄ,ఖె,ఖే,గి,గీ,గృ,గౄ,గె,గే,ఘి,ఘీ,ఘృ,ఘౄ,ఘె,ఘే.క్షి,క్షీ,క్షృ, క్షె,క్షే. కు,కూ,కొ,కో,ఖు,ఖూ,ఖొ,ఖో,గు,గూ,గొ,గో,ఘు,ఘూ,ఘొ,ఘో.క్షు,క్షూ,క్షొ,క్షో. అన్నట్టు "క్ష" ప్రత్యేక హల్లు కాదు. అది కకార,షకారాల సంయుక్తాక్షరం. కాబట్టి "క్షా కు చ,ఛ,జ,ఝ,శ,ష,స లతోను యతి చెల్లుతుంది. కొద్ది కాలం తర్వాత నేను ప్రారంభించబోయే "ఛందస్సు నేర్చుకుందామా?" శీర్షికలో ఛందోపాఠాలను చూడండి.
చంద్రశేఖర్ గారూ, మంచి విషయాన్నే ఎత్తుకున్నారు. కాని రెండవ పాదంలో యతి తప్పింది. "స్వర్భాను" అన్నప్పుడు "స్వ" గురువై గణదోషం సంభవిస్తున్నది. దోషాలను సవరించి ఈ పద్యాన్ని మళ్ళీ పోస్ట్ చేయండి
దివ్వెల కాంతులు, వెల్గుల భ్రాంతులు, తేజము నిండగ నెల్లెడలన్
రిప్లయితొలగించండిరివ్వున జువ్వలు, రవ్వల రువ్వులు, రిక్కలు పొంగగ నింగి పయిన్
దవ్వుల, దాపుల, సవ్వడి, సందడి దద్దరిలంగను నల్దిశలున్
నవ్వుల పువ్వులు, తియ్యని బువ్వలు నల్వురు మెచ్చగ రమ్యముగన్!
గురువర్యులకూ, సాటి మిత్రులకూ దీపావళి శుభా కాంక్షలు.
గురువుగారికి, మిత్రులందఱికీ దీపావళి శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిసౌరతేజులు స్వాతంత్ర్యధీర దీప్తి
రాజ్యవిభవము క్షీణించి రాణి తొలఁగె
భరతరశ్ములు ప్రభలిడి నిరత మనెడి
భానుఁ డస్తమించఁగ సుప్రభాతమయ్యె !!!
మిస్సన్నగారూ మంచి పద్యాలతో మతాబులు కాల్చి,చిచ్చుబుడ్లు వెలిగించి, జువ్వలు వదలి సిసింద్రీలతో ఆడి నూతన వెల్గులు సదా వెలిగిస్తున్నందులకు కృతజ్ఞతలు. గురువుగారికి, మిత్రులకు, అందఱి కుటుంబాలకు శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిఅమృత పానమొనర్చి యహంకరించి
రిప్లయితొలగించండిసింహికాసూనుడా తమోరిపుని మ్రింగ
మఘవు వజ్రాయుధవఘాత మంది నాస్వ
ర్భానుఁ డస్తమించఁగ సుప్రభాత మయ్యె.
మనవి:సింకాసూనుడు=రాహువు; తమోరిపుడు=సూర్యుడు; మఘవుడు=ఇంద్రుడు; స్వర్భానుడు=రాహువు
సత్యభామతో పోరాడి సమరమందు
రిప్లయితొలగించండినరక భూప నామ జగద్వినాశ దైత్య
భాను డస్తమించగ సుప్రభాతమయ్యె -
ప్రజ జరిపిరి ’దీపావళి’ పర్వ దినము!
కవి మిత్రులు శ్రీ కంది శంకరయ్య గారు!
మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ బ్లాగు వీక్షకులకు,
అశేషాంధ్ర తెలుగు ప్రజలకు
దీపావళి పర్వదిన శుభాశంసలు!
శ్రీనివాసుని కిష్టమౌ సేవలివ్వి
రిప్లయితొలగించండిపవలు తిరుమంజనమ్మును, పవ్వళింపు
భానుఁ డస్తమించఁగ, సుప్రభాత మయ్యె
నుదయ మందున, నెప్పుడు నూంజలమ్ము.
నరసింహ మూర్తిగారూ! మీ వ్యాఖ్యకు నా నమస్కృతులు. మీ పద్యాలు యెంతో హృద్యంగా ఉంటూ చక్కని ఆనందాన్ని కలిగిస్తూంటాయి.
రిప్లయితొలగించండియతి-గణ దోషాలూ సవరించిన తరువాత:
రిప్లయితొలగించండిఅమృత పానమొనర్చి యహంకరించి
సింహికాసూను డర్కుని చీరి మ్రింగ
కొండసూను ఘాతములనా ముండశేష
భానుఁ డస్తమించఁగ సుప్రభాత మయ్యె.
మాస్టారూ, నాల్గవ పాదం కొంచెం మార్చాను. ఇది వేయండి బాగుంటుంది. ముందుది తీసివేయండి.
రిప్లయితొలగించండిధరణికటుగ తరణినిండె, తమస మల్లు
కొనెనిటు తగుదునంచును గుర్తు, మనకు
భాను(డస్త మించ(గ,--సుప్రభాతమయ్యె
వారి కినికాల చక్ర౦పు పరిధి లోన !
పైన నా వ్యాఖ్యలో "అశేషాంధ్ర తెలుగు ప్రజలకు" అంటూ, ’ఆంధ్ర’, ’తెలుగు’ పునరుక్తి ప్రయోగం అనుకోకుండా దొరలినందుకు క్షంతవ్యుడను
రిప్లయితొలగించండిభావ వివరణ యీ విధముగా బాగుంటుందేమో :
రిప్లయితొలగించండిసౌరతేజులు స్వాతంత్ర్యధీర దీప్తి
ప్రజ్వలింపగ, ప్రభువుల ప్రజ్ఞ లుడిగె
భరతరశ్ములు ప్రభలిడ నిరత మనెడి
భానుఁ డస్తమించఁగ సుప్రభాతమయ్యె !!!
శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిగత కొద్ది కాలం గా మీ బ్లాగ్ చూస్తున్నాను, చాలా బాగుంటోంది. నాకు సాహిత్యంలో ఎంతో అభిరుచి వున్నా, ప్రవేశం మాత్రం లేదు.
ఇప్పుడిప్పుడే ప్రయత్నిస్తున్నాను. భావం కుదిరితే ఛందస్సు, ఛందస్సు కుదిరితే భావం దెబ్బ తింటున్నాయి. అయినా, ప్రయత్నం సాగుతోంది.
ఒక చిన్న సందేహం తీరుస్తారని ఆశిస్తున్నాను. అచ్చు కి హల్లు తో యతి వేయటం వుంది కాని, హల్లు కి అచ్చు తో యతి వేయ వచ్చునా?
విద్యాసాగర్ అందవోలు.
విద్యాసాగర్ గారూ,
రిప్లయితొలగించండి'శంకరాభరణం' బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది. బ్లాగు నచ్చినందుకు ధన్యవాదాలు.
ఇక మీ ప్రశ్నకు సమాధానం ....
అచ్చుకు హల్లుతో యతి వేయడం హకార, యకారాలకు మాత్రమే చెల్లుతుంది.
ఉదాహరణకు ...
అ,ఆ,ఐ,ఔ, య,యా,యై,యౌ, హ,హా,హై,హౌ.
ఇ,ఈ,ఋ,ౠ,ఎ,ఏ, యి,యీ,యృ,యౄ,యె,యే,హి,హీ,హృ,హౄ.హె,హే.
ఉ,ఊ,ఒ,ఓ,యు,యూ,యొ,యో,హు,హూ,హొ,హో.
ఇక మిగిలిన హల్లులను యతిస్థానంలో వేసినప్పుడు వాటి అచ్చులు కూడా మైత్రిని పాటించాలి.
ఉదాహరణకు ....
క,ఖ,గ,ఘ,క్ష -
క,కా,కై,కౌ,ఖ,ఖా,ఖై,ఖౌ,గ,గా,గై,గౌ,ఘ,ఘా,ఘై,ఘౌ,క్ష,క్షా,క్షై,క్షౌ.
కి,కీ,కృ,కౄ,కె,కే,ఖి,ఖీ,ఖృ,ఖౄ,ఖె,ఖే,గి,గీ,గృ,గౄ,గె,గే,ఘి,ఘీ,ఘృ,ఘౄ,ఘె,ఘే.క్షి,క్షీ,క్షృ, క్షె,క్షే.
కు,కూ,కొ,కో,ఖు,ఖూ,ఖొ,ఖో,గు,గూ,గొ,గో,ఘు,ఘూ,ఘొ,ఘో.క్షు,క్షూ,క్షొ,క్షో.
అన్నట్టు "క్ష" ప్రత్యేక హల్లు కాదు. అది కకార,షకారాల సంయుక్తాక్షరం. కాబట్టి "క్షా కు చ,ఛ,జ,ఝ,శ,ష,స లతోను యతి చెల్లుతుంది.
కొద్ది కాలం తర్వాత నేను ప్రారంభించబోయే "ఛందస్సు నేర్చుకుందామా?" శీర్షికలో ఛందోపాఠాలను చూడండి.
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిమంచి విషయాన్నే ఎత్తుకున్నారు.
కాని రెండవ పాదంలో యతి తప్పింది.
"స్వర్భాను" అన్నప్పుడు "స్వ" గురువై గణదోషం సంభవిస్తున్నది. దోషాలను సవరించి ఈ పద్యాన్ని మళ్ళీ పోస్ట్ చేయండి
డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
రిప్లయితొలగించండిసమయానుకూలమైన పూరణతో అలరించారు. ధన్యవాదాలు.
మిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిఅద్భుతమైన పూరణ నందించారు. ధన్యవాదాలు.
చంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిదోషాలు సవరించాక మీ పద్యం ఆణిముత్యమయింది.
మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
రిప్లయితొలగించండిపూరణ బాగుంది. అభినందనలు.