ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
వినతాసుతుఁ డాగ్రహించి విష్ణువుఁ జంపెన్.
మిత్రులకు గమనిక .....నూతన దంపతులతో తిరుమలేశుని దర్శనానికి వెళ్తున్నాము. అలాగే తిరుపతిలో ఒక పెళ్ళికూడ ఉంది. ఆదివారం వరకు బ్లాగు చూడడం వీలు పడక పోవచ్చు. వీలుంటే సమస్యలను పోస్ట్ చేస్తాను. లేకుంటే పునర్దర్శనం సోమవారం నాడు.
దనుజవరుల దర్ప మణచె
రిప్లయితొలగించండివినతా సుతుఁ డాగ్రహించి:విష్ణువు చంపెన్
జనుదెంచు నరకదనుజుని
ఘనరీతిని జక్రహతిని గరుడుడు మెఱవన్
గన్నవరపు నరసింహమూర్తి గారూ,
రిప్లయితొలగించండిమంచి భావంతో పద్యం వ్రాసారు. బాగుంది. అభినందనలు.
మీరు "విష్ణువు చంపినాడు" అనే అర్థంలో చెప్పారు. కాని నేను ఇచ్చిన సమస్యలో విష్ణువును చంపినాడు అనే అర్థంలో "విష్ణువుఁ జంపెన్" అన్నాను. మీరు అరసున్నాను గమనించలేదు కాబోలు.
మరో ప్రయత్నం చేసి చూడండి.
హైదరాబాద్ కూకట్ పల్లిలో కాస్త టైం దొరికితే నెట్ కేఫ్ కు వచ్చి బ్లాగు చూస్తున్నాను.
కనితనపొత్తమునందున
రిప్లయితొలగించండి"వినతాసుతునాగ్రహము భువి హరిని జంపెన్"
యని,బాలుడు దలచెనిటుల
"వినతాసుతుఁ డాగ్రహించి విష్ణువుఁ జంపెన్."
కంటిని సున్నను గంటిని
రిప్లయితొలగించండిగంటిని నరసున్నఁ గంటిఁ గంటిని 'జంపెన్ '
బంటుని, విష్ణుని భక్తుని
గంటకమై విష్ణుఁ జంపఁ గంటినొ దెఱవున్ !
ఊకదంపుడు గారు కూడా దొడ్డిదారిలో పూరించారు, కాకపోతే, ఆయన నా కంటే తెలివైనవారు. దంచిపడేస్తూ ఉత్తిత్తినే "ఊక " అంటూంటారు. మిస్సన్న గారు యేమి చెప్పారో అని చూడబోతే గురువుగారి వ్యాఖ్య కనిపించింది. మధ్యాహ్నము వీలు చూసుకొని మరో పూరణ చేస్తాను. మిస్సన్నగారు, పురణం బ్రహ్మ చంద్రశేఖరులు కూడా యేమి చెప్తారో చూద్దాము.
గురువుగారేమో చాలా క్లిష్టమైన సమస్యనిచ్చి కొండనెక్కి కూర్చున్నారు. నరసింహ మూర్తి గారేమో తమాషాగా వ్యాఖ్యానించి నవ్వు తెప్పించినట్లే తెప్పించి సవాలు విసిరారు. ఏదో కంద లక్షణాలు సరిపెట్టేనుగాని ఏమీ తృప్తిగా లేదు.
రిప్లయితొలగించండి******************
వినవే కంసుని కథనము
వినతా సుతుఁడా! గ్రహించి విష్ణువుఁ, జంపెన్
కనికరము లేక శిశువుల,
తన మృత్యువు హరికి మృత్యు దండన మనుచున్!
గురువుగారూ,
రిప్లయితొలగించండినమస్కారములు. ప్రయాణము మధ్యలో చిక్కిన సమయములో కూడా శంకరాభరణము మీద ధ్యాసతో మా పై అనురాగము వెదజల్లే మీకు ప్రత్యేక ధన్యవాదములు. కవి మిత్రులకు అందఱికీ ధన్యవాదములు. ఈ దినము యిక్కడ "ధన్యవాదముల దినము". మరి పూరణకు అమెరికా మార్గము పట్టాను
పెను బరువు దలచె నేమో
వినతా సుతుఁ డాగ్రహించి విష్ణునిఁ జంపెన్
దన జింతఁ, జేరె నమెరిక
యనురాగము నొంది రాష్ట్ర యండజ మయ్యెన్ !
గరుత్మంతుడు అమెరికా రాష్ట్ర పక్షి. తన వాహనమును వెదకుతూ వెంకట రమణ పిట్సుబర్గు చేరుకొన్నాడు. చలికాలంలో మాత్రము తిరుపతిలోనే ఉంటాడు. గురువుగారికి, నూతన వధూవరులకు ,వారి బంధు మిత్రులకు,భక్తులకు సులభ సుదీర్ఘ దర్శనము నియ్యగలడు.
మిస్సన్నగారూ,మీ పద్యము చాలా చాలా బాగుంది. చంద్రశేఖరులు పురాణం బ్రహ్మ. అచ్చు తప్పుకి మన్నించగలరు. పీతాంబర్ గారు, అజ్ఞాత గారు మీ పూరణలను చదివి నేను చాలా ఆనందిస్తాను. రాజేశ్వరి గారూ, బహామాస్ ఎలా ఉందో తిరిగి రాగానే మాకు వర్ణించండి.
రిప్లయితొలగించండినరసింహమూర్తి గారూ,
రిప్లయితొలగించండినమస్కారములు.
ఈ పద్యం కూడా చూడండి.
కనుగొనలగని పిరుదుకొనె
వినతా సుతుఁ డాగ్రహించి విష్ణునిఁ; జంపెన్
దననాధుడటమకరమును
వినుతింపగభక్తగజము విశ్వేశ్వరునిన్.
[తనవెంటన్ సిరి ...]
[సేవచేసుకొనే అవకాశం ఇవ్వకుండా, స్వామి తనంతతానుగా పయనం అవ్వటమ్ వల్ల కోపం వచ్చింది అని కవిసమయం]
ఇది కూడా చూడండి, మీరు జెప్పిన అమెరికా మార్గానికీ , మన "గురుర్ బ్రహ్మ..." కు ముడివేశాను
రిప్లయితొలగించండిఘనమౌ "గన్నుల" సీమది
కననౌ ప్రతివారివద్ద "కాంపస్" లోనన్
గొనిగురువునుగొట్టనగును
వినతా సుతుఁ డాగ్రహించి విష్ణునిఁ జంపెన్.
'ఊక ' యిలా ఉంటే అసలు ఎలా ఉంటుందా అని అలోచిస్తున్నా !
రిప్లయితొలగించండినరసింహమూర్తి గారూ మీరన్నది నిజం. ఊకదంపుడు గారు కాదాయన. "పోక దంపుడు గారు".
రిప్లయితొలగించండిఈ మధ్యన మన చంద్రశేఖరుగారు కనపడటం లేదేమిటి? దక్షిణామూర్తి లాగా మౌనముద్ర వహించినట్లున్నారు. మౌనం వీడండి స్వామీ!
రిప్లయితొలగించండికవిమిత్రులకి వందనాలు, ధన్యవాదాలు. మిత్రులు మిస్సన్నగారూ, మూర్తి గారూ నన్ను ములగ చెట్టు ఎక్కించేస్తున్నారు. "మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్త్వం..." అది శ్రీదక్షిణామూర్తి విలక్షణత. మరి నేనో పద్యం వ్రాయటం రాక గింజుకొని మౌనం వహించిన వాడిని. మూర్తి గారయితే అచ్చు తప్పులు జేసి మరీ మెచ్చుకొం'తు'న్నారు. నేను నిజంగానే "పురణి౦చు (=వర్దిల్లు,upcoming)" వాడిని కాబట్టే వారు పురణ బ్రహ్మ అన్నారు. అంతకు ముందు "పురాణాల పురుగు" అన్నారు. పురుగు కూడా వ్యాసుల వారిని అడ్డుకొని మెప్పించిన భారత కథ తెలిసిందే కదా. అన్నీ ఆశిస్సులే.
రిప్లయితొలగించండిఇకపోతే, "వినతాసుతుడాగ్రహించి" న మీదట ఛందో బద్ధంగా పద్యం ఎక్కడనుంచి వస్తుంది? మరి "ఛందో మయేన గరుడేన.." అన్న వ్యాస భాగవత వాక్కు నిజం కదా!
అసలు విషయం, పని వత్తిడి వల్ల కొంత వ్యస్తత, అంతే.
హైదరాబాదుకు వెళ్ళే తొందరలో సమస్యను చూసాను, కాని విషయ అవగాహన లేమి వల్ల " లోతు తెలియ కుండ,నూతిలో దిగినట్లు" అవుతుందని పూరణకు పూను కోలేదు .కవి మిత్రుల
రిప్లయితొలగించండిపూరణలు నేడు చూసాను .చాలా బావున్నాయి.
పీతాంబర్గారూ! ఈసారి గురువుగారు అందరికీ మంచి ఝలక్ ఇచ్చేసారు. అందరి పరిస్థితీ ఇలాగే ఉంది.
రిప్లయితొలగించండిమిత్రులందరికీ నమస్కృతులు.
రిప్లయితొలగించండిమా తిరుమల తిరుపతి యాత్రను సుఖంగా, ఆనందంగా, ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా పూర్తి చేసుకొని క్షేమంగా ఇల్లు చేరాము.
దారిలో బుగ్గ రామేశ్వరం, ఒంటిమిట్ట రామాలయం దర్శించి పునీతుల మయ్యాము.
తిరుపతిలో కాని, దారిలో మరెక్కడ కాని ఇంటర్ నెట్ చూసే అవకాశం దొరకలేదు.
ఇల్లు చేరి నా బ్లాగును తెరిచి చూస్తే ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. నా అనుపస్థితిలో మీ మీ పూరణలమీద ఆసక్తికరమైన చర్చ జరగడం చూసి మీ కందరికీ నా బ్లాగు మీద ఎంత ఆసక్తి, ఆదరణ ఉందో తెలిసికొని ధన్యతను పొందాను. ఇకముందు కూడ బ్లాగులోని కవిమిత్రుల పూరణల గుణదోషాలను విశ్లేషిస్తూ వ్యాఖ్యలను పంపి మీ మద్య స్నేహాన్ని పెంచుకోన వలసిందిగా విన్నపం.
త్వరలోనే మళ్ళీ ప్రహేళిక, గళ్ళనుడికట్టు శీర్షికలను కొనసాగిస్తాను. అప్పుడు వ్యాఖ్యలను మాడరేషన్ లో పెట్టినా అందరి వ్యాఖ్యలను తప్పకుండా ప్రకటిస్తాను. మీరు మొహమాటం లేకుండా వ్యాఖ్యలను పంపించవచ్చు.
అందరి పూరణలు, వాటి మీద మిగిలినవారి స్పందనలు బాగున్నాయి. అందరికీ ధన్యవాదాలు.
ఇక నా పూరణ .....
ఘన నాగుల నెవఁ డెటుఁ జం
పెను? కరి కాపాడు మనుచు వేడిన దెవనిన్?
దనుజుల నే మొనరిచె హరి?
వినతాసుతుఁ డాగ్రహించి, విష్ణువుఁ, జంపెన్.
గురువుగారూ మీ తిరుపతి యాత్ర శుభప్రదంగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ బ్లాగు ద్వారా మేము జరిపిన చర్చలు మీకు ఆనందాన్ని కలిగించండం మీలో ఉన్న శిష్య వాత్సల్యాన్ని వ్యక్తపరుస్తోంది. మీ బ్లాగును వ్యాకరణంలో స్వల్ప పరిజ్ఞానం కలిగిన మాబొంట్లను ప్రోత్సహించడానికి ఉపయోగించడం మా అదృష్టం. మీ గురుసహృదయతకు మేము వందనాలు చేస్తున్నాము.
రిప్లయితొలగించండిమీ పూరణ అద్భుతంగా ఉంది. సమస్యను క్రమాలంకారంలో పూరించవచ్చు నాన్న ఊహ నాకు తట్టనందుకు సిగ్గుపడుతున్నాను. మరొక్కసారి నమస్కృతులు. సెలవు.
మాష్టారు గారు, నాదొక విన్నపము. ఇక ముందు కూడా, మా పూరణలు పరిశీలించిన తరువాత మీరు అదే సమస్యకి మీ పూరణ కూడా పోస్టు చేస్తే, మాకు మార్గదర్శకంగా వుంటుంది. మీ వీలు.
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
చంద్రశేఖర్ గారూ,
న్యాయంగా చూస్తే నేనిచ్చిన ప్రతి సమస్యకూ నా పూరణ కూడ ఇవ్వాలి. మొదట్లో అలాగే నా పూరణలను ఇచ్చేవాణ్ణి. ఈ మధ్యకాలంలో సమయాభావం వల్ల, నే ననుకున్న భావంతో ఎవరో ఒకరు సమస్యను పూరించడం వల్ల, తదితర కారణాల వల్ల నా పూరణలు ఉండడం లేదు. ఇకనుండి తప్పనిసరిగా నా పూరణలను ప్రకటిస్తాను. సూచనకు ధన్యవాదాలు.
గురువు గారూ,
రిప్లయితొలగించండిమీ అబ్బాయి వివాహం, మీకు తిరుమలేశుని దర్శనం శుభప్రదం గా జరిగినందుకు శుభాకాంక్షలు.
మీ శిష్యగణం లో ఒకడి గా అందరి పూరణలూ ఆస్వాదిస్తున్నాను.
పూరణలలో పాల్గోవటానికి మీ ఛందస్సు పాఠాల కొరకు ఎదురు చూస్తూ...
- మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం
గురువుగారూ నమస్కారములు. మీ పూరణ సుందరంగా ఉంది. మీ యాత్ర సుఖంగా జరిగినందులకు సంతోషము. మీకు సుస్వాగతము.
రిప్లయితొలగించండిమంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు.
మా అబ్బాయి పెళ్ళి తర్వాత ఛందస్సు పాఠాలు మొదలు పెడతానన్నాను కదా. త్వరలోనే ప్రారంభిస్తాను.
'ఊక ' యిలా ఉంటే అసలు ఎలా ఉంటుందా అని అలోచిస్తున్నా
రిప్లయితొలగించండి-->
నరసింహ మూర్తి గారూ, అసలు కొసరూ కూడ ఇదేనండి. దాచిందేమీలేదు, దాచటానికీ ఏమీ లేదు :)
మిస్సన్న గారూ, మీరన్నది కూడా నిజమేనండి, నోట వక్కలు లేకపోతే పద్యం కాదు కదా పాదం కూడా రాయలేను.
ధన్యవాదాలు.
భవదీయుడు
పినవయసున వాహనమై
రిప్లయితొలగించండిచనుచును నద్వానినకట! చట్కున కూల్చెన్
కనుమా యిదియెట్లన్నన్:
"వినతాసుతుఁ డాగ్రహించి విష్ణువుఁ జంపెన్"