8, నవంబర్ 2010, సోమవారం

సమస్యా పూరణం - 145

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది .....
సరసము దెలియని మగనిని సతి మెచ్చుకొనెన్.
దీనిని పంపించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

13 కామెంట్‌లు:

  1. పరిణయ పూర్వము తరుణిరొ,
    పరిపరి విధముల కనుగొనె ప్రణయపు తీరుల్,
    వరునకు లేవని,పరసతి
    సరసము దెలియని మగనిని సతి మెచ్చుకొనెన్!

    రిప్లయితొలగించండి
  2. పరువపుయువతులవెంబడి
    యరుదెంచిన ఋష్యశృంగు ననఘున్, విప్రున్
    వరునిగ విభునిగ బొందీ,
    సరసము దెలియని మగనిని సతి మెచ్చుకొనెన్.

    రిప్లయితొలగించండి
  3. పీతాంబర్ గారూ,
    నిజమే. పరసతితో సరసం తెలియని మగనిని మెచ్చుకొనని సతి ఉంటుందా? బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. నిరతము చదువుల మునిగెడి
    సరసముఁ దెలియని మగనిని సతి మెచ్చుకొనెన్
    సరిగమలు,సరస రీతులు
    మురిపంబుగ నేర్పె ముదిత ముదములు పొంగన్

    రిప్లయితొలగించండి
  5. ఊకదంపుడు గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. నిరతము జపములు చేయుచు
    పరదారను పలుకరింప ప్రవరుని వలెనన్
    మురియుచు గరువము నొందుచు
    సరసము తెలియని మగనిని సతి మెచ్చుకొనెన్

    రిప్లయితొలగించండి
  7. సరసము సుతిమెత్తనగా
    పరిణతి నొందించ దగును ప్రణయము నెదలన్
    'విరసముగా వికటించెడు
    సరసము' దెలియని మగనిని సతి మెచ్చుకొనెన్.

    రిప్లయితొలగించండి
  8. తమాషాగా, పూరణ:
    వరసన విషయము లేకన్
    సరసము విరసము కొరకని సాకులు చెప్పెన్
    కరివంటిమగడు, హతవిధి !
    సరసము దెలియని మగనిని సతి మెచ్చుకొనెన్!

    రిప్లయితొలగించండి
  9. గన్నవరపు నరసింహ మూర్తి గారు "చదువుల్లో మునిగి సరసం మరచిన మగని గురించి చెప్పారు.
    నేదునూరి రాజేశ్వరి గారు ప్రవరునిలా పరదారలతో సరసం తెలియని మగని గురించి చెప్పారు.
    మిస్సన్న గారు విరసంగా వికటించే మోటు సరసం తెలియని మగని గురించి చెప్పారు.
    చంద్రశేఖర్ గారు విషయం లేక సాకులు చెప్పే మగణ్ణి ప్రస్తావించారు. మరి అలాంటి వాణ్ణి సతి ఎలా మెచ్చుకుంది?
    అందరి పూరణలు బాగున్నాయి. అభినందనలు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. అందుకే "హతవిధి!" అన్నాను కదండీ, మాష్టారు గారూ. పెళ్ళాం కూడా అంతేతెలివయిందన్న మాట.
    పోనీ, "కరివంటి మగడు, యెక్కడ
    సరసము దెలియని మగనిని సతి మెచ్చుకొనెన్??" అందాము, నవ్వుతూ.

    రిప్లయితొలగించండి
  11. పరుషపు మాటలు పలుకక
    ధరలడుగక కంకణముల ధర్మాత్ముండై
    వరకట్న మడుగక, మొరటు
    సరసము దెలియని మగనిని సతి మెచ్చుకొనెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రి గారూ,
      మోటు సరసంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  12. తరచుగ నింటికి వచ్చెడి
    పరుగిడి పేకాటలోన పాల్గొను నెపమున్
    పొరిగింటి పిల్ల తోడను
    సరసము దెలియని మగనిని సతి మెచ్చుకొనెన్

    రిప్లయితొలగించండి