2, జనవరి 2014, గురువారం

సమస్యాపూరణం - 1281 (భార్య పదములన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
భార్య పదములన్ భక్తితోఁ బట్టఁదగును.
ఈ సమస్యను సూచించిన వినోద్ కుమార్ గారికి ధన్యవాదాలు.

38 కామెంట్‌లు:

  1. అయ్యా! శుభాశీస్సులు.
    సమస్యను ఇచ్చేరు. బాగుగ నున్నది. తేటగీతి పాదము వలె నున్నది. యతి మైత్రి కనుపడలేదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    తప్పకుండా ప్రతీ భర్త ప్రతీ రోజూ చెయ్యవలసిన కనీస విధి యిది :

    01)
    __________________________________

    బంధు మిత్రుల నందరి - వదలి వచ్చి
    భర్త సుఖమదె తనయొక్క - భాగ్యమనుచు
    బడలికన్నది యెరుగక - పవలు రేలు
    బ్రతుకు తెల్లార్చు కొనుచుండు - పరమ సాధ్వి
    భార్య పదములపైఁ దలఁ - వాల్చదగును
    పూజ సలుపుచు భక్తితో - పూలతోడ
    భర్త లందరు మరువక - ప్రతి దినంబు !
    __________________________________

    రిప్లయితొలగించండి
  3. "భార్య పదములపైఁబడి బ్రతుకవచ్చు(దగును)" అందాం. కొంచెం హాస్యభరిత పూరణలు వస్తాయేమో:-)

    రిప్లయితొలగించండి
  4. పండిత నేమాని వారికి,
    నమస్కృతులు.
    యతి గమనించకుండా ఇచ్చాను. మన్నించండి.
    సవరించాను.
    *
    వసంత కిశోర్ గారూ,
    సమస్యకు మీ సవరణ బాగున్నది. ‘తల వాల్చు’ అన్నప్పుడు మధ్యలో అరసున్నా అవసరం లేదు.
    అందరినీ భార్యావిధేయులను కమ్మంటారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    మీ సూచన బాగున్నది. కానీ ఈలోగా వినోద్ కుమార్ గారే ఫోన్ ద్వారా సవరణను సూచించారు.

    రిప్లయితొలగించండి
  5. చంద్రశేఖర్ గారూ శుభోదయం తమ ఆసక్తి మేరకు : పదపదమున పాఠక హృది పరవశించు
    హారి పోట్టరుఁ బోలిన హంగులుండు
    కథల వ్రాసెడు మేథావి కలికి భర్త
    భార్య పదముల పైఁబడి బ్రతుక వచ్చు

    రిప్లయితొలగించండి
  6. సహదేవుడు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ఇంతకీ హారీపోటర్ రచయిత్రి మళ్ళీ పెళ్ళి చేసుకుందా? ఆమె రచనావ్యాసంగం మొదలుపెట్టకముందే విడాకులు తీసుకున్నదని విన్నాను.

    రిప్లయితొలగించండి
  7. మారెళ్ళ వామనకుమార్ గారూ,
    సవరించిన ‘భార్య పదములన్ భక్తితోఁ బట్టఁదగును’ అన్న పాదమే ఫైనల్...

    రిప్లయితొలగించండి
  8. పొద్దున్నే మా యావిడ ఇచ్చిన కాఫీ తాగి కూర్చొని వ్రాస్తున్నాను. అంతా అయిన తరువాత చూస్తే ఒక పాదం ఎక్కువ వచ్చినట్లు తెలిసింది. ఏ వాక్యాన్నీ తీసేయాలనిపించలేదు. తప్పో, తడికో; పోస్ట్ చేసేస్తున్నాను. పెద్దలు మన్నించ ప్రార్థన.

    (సీస పద్యం అంటే నాలుగు పాదాలు మాత్రమే ఉండాలా, ఎనిమిది వ్రాయకూడదా అనేది కూడా నాకు తెలియదు )

    ఉదయంబునను ఇంటినూడ్చి ముగ్గులు వెట్టి
    నిద్రించు శ్రీవారి నిద్ర లేపు
    వారి సేవలు జేసి వరుస పిల్లల లేపి
    విడివిడిగ పనులన్ని విధిగ జేయు
    పతికి కాఫీ ఇచ్చి, పాలు పిల్లలకిచ్చి
    ఒక చుక్క తానోట ఒంపుకొనును
    స్నానాలు పానాలు సాంతముగ నవజేసి
    ఆగకుండ వార్ని సాగనంపు
    వంటపాత్రలు తోమి, బట్టలన్నీ ఉతికి
    పొదుపుగా దేవునికి పూజ చేయు
    అపరాహ్ణ సమయాన యందరికి భోజనం
    బందించి చివర తానటు భుజించు
    సాయంత్రమందున చాయ, కాఫీలు శ్రీ
    వారి మిత్రుల తోటి వారికిచ్చు
    మిగులు పాత్రలనంత మెరుపుగా తోమేసి
    మరల వంట పనులు మారు జేయు
    రాత్రి భోజనమంత రంజుగా తినిపించి
    తరుణి యలసిపోయి తల్లడిల్లు

    ఉదయమున లేచి ఇంటిపనులోర్పు నెరపి
    వైనవైనంబు భోజ్యములు వండి పెట్టి
    ఆగకుండగ పనిచేయునతివ గాన
    భార్య పదములన్ భక్తితో పట్టదగును.

    రిప్లయితొలగించండి
  9. తనకు నాథుడె ప్రత్యక్షదైవమనుచు
    విశ్వసించుచు హర్షాన వివిధగతుల
    చేరి యాతని పరిచర్య చేయునపుడు
    భార్య పదములన్ భక్తితో పట్టదగును.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...
    సరదాగా
    ============*=============
    అర్థ బాగమునిడి హృదయమ్ము నందు
    భార్య పదములన్ భక్తితో పట్టదగును
    నీతి శతకము జదివెను ఖ్యాతి గాను
    తప్పు గాదు పతులు కెల్ల తరుణీ యనుచు

    రిప్లయితొలగించండి
  11. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    సగము దేహమునిచ్చెను సతికి శివుడు
    గుండె స్థానమ్ము లచ్చికి కుస్తుభుండు
    దారి జూపిరి బ్రతుకులు ధన్యమవగ
    భార్య పదములన్ భక్తితో బట్టదగును

    రిప్లయితొలగించండి
  12. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

    చిత్ర కవితల నల్లగా శ్రీవిరించి
    భాగ్యలక్ష్మిని పొందగా పద్మనాభు
    కడగి కైలాసమునుజేరగా కపర్ధి
    భార్య పదములన్ భక్తితో బట్టదగును

    రిప్లయితొలగించండి
  13. మరియొక పూరణ సరదాగా
    ============*============
    అడ్డ దారి యందు నిలిచి యడ్డ ముగను
    పదవులను పొందగ నెంచు వాడు,వరుని
    భార్య పదములన్ భక్తితో బట్టదగును.
    తప్పు గాదు నధములకు ధరణి యందు!

    (వరుడు = బాస్ )

    రిప్లయితొలగించండి
  14. గురువుగారికి మరియు శ్రీ వరప్రసాదు గారికి నమస్సులు.
    నా పద్యానికి శ్రీ వరప్రసాదు గారు చెప్పిన సవరణలతో మరలా పోస్ట్ చేస్తాను.
    మన్నింప ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  15. ముక్తి కాంక్షించు నరునకు ముదముతోడ
    సకలలోకైకనాథుడై సర్వజగతి
    రక్ష చేసెడి దశరథరామవిభుని
    భార్య పదములన్ భక్తితో బట్టదగును.

    రిప్లయితొలగించండి
  16. గురువుగారికి ధన్యవాదములు.
    హార్రీ పొట్టర్ రచయిత్రి గురించి వివరాలు పూర్తిగా తెలియవండి స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. మరియొక పూరణ
    ============*============
    సిరులు లేకయున్నను నేడు ఖరము లనెడు
    ఖలులు మెండుగా నున్న కలియుగమున,
    కరిని రక్షించి గాచిన కరి వరధుని
    భార్య పదములన్ భక్తితో బట్టదగును.
    సిరులు కొరకు ముదము తోడ చెలువమలర,
    తప్పు గాదు సుమతులకు ధరణి యందు

    రిప్లయితొలగించండి
  18. భార్య చెప్పిన మంచి మాటల వినదగునను భావంతో:
    కోరని వరము లొసగుచు కూర్మి తోడ
    యత్త మామల తగురీతి యాద రించి
    బ్రతుకు బాగుండు మాటల పలికె నేని
    భార్య పదములన్ భక్తితో బట్టదగును.

    రిప్లయితొలగించండి
  19. తాల్మిలో ధర, కార్యేషు దాసి పత్ని,
    యింటి దీపము, పిల్లల కంటి పాప,
    అత్త మామల బ్రేమతో నరయు నట్టి
    భార్య పదములన్ భక్తితో బట్ట తగును.

    రిప్లయితొలగించండి
  20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  21. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    మరియొక పూరణ:భర్త కన్నను భార్య తా వయసునందు
    పిన్నకావున యామెను ప్రేమ మీర
    ఆదరించుట యుక్తమౌ నట్లగాక
    “భార్య పదములన్ భక్తీ తో బట్టదగును”
    [న ]య [న ]గనాయుస్సు క్షీణి౦చు టగును కాదె ?

    రిప్లయితొలగించండి
  22. భార్య పదములన్ భక్తితో బట్టదగును
    భర్తృసేవలో నవ్విధి పరమ సుఖము
    బొందుచుందురు సతులను స్ఫూర్తి నొసగు
    నిందిరా దేవి కొనరింతు వందనములు

    రిప్లయితొలగించండి
  23. భార్య పదములన్ భక్తితో బట్ట దగును
    నేమి దౌర్భాగ్య మీయది యింత బ్రదుకు
    బ్రదికి నిటులుగా జేయంగ పరమ పురుష !
    మృడు ని పదములన్ బట్టిన మోక్ష మబ్బు

    రిప్లయితొలగించండి
  24. మరో పూరణ :
    పతికి సేవల నిష్టగా భాగ్య లక్ష్మి
    శేష శయనుని దరిఁజేరి చేయ లేదె
    భర్త సేద దీరెడు వేళ పట్టు మనినఁ
    భార్య , పదములన్ భక్తితో పట్ట వచ్చు

    రిప్లయితొలగించండి
  25. ఉదయమ్మునను నింటినూడ్చి ముగ్గులు బెట్టి
    నిద్రించు శ్రీవారి నిద్ర లేపి
    వారి సేవ జేసి వరుస పిల్లల లేపి
    విడివిడి పనులన్ని విధిగ జేసి
    పతికి కాఫీ ఇచ్చి, పాలు పిల్లలకిచ్చి
    యొక చుక్క తానోట నొంపుకొనుచు
    స్నానాలు పానాలు సాంతము నవజేసి
    ఆగకుండగ వార్ని సాగనంపి

    పాత్రలన్నీ తోమి, బట్టలన్నీ ఉతికి
    పొదుపుగా దేవుని పూజ చేసి
    అపరాహ్ణ సమయాన యందర్కి భోజనం
    బందించి చివర తానటు భుజించి
    సాయంత్రమందున చాయ, కాఫీలు శ్రీ
    వారి మిత్రుల తోటి వారికిచ్చి
    మిగులు పాత్రలనంత మెరుపుగా తోమేసి
    మరల వంట పనులు మారు జేసి
    రాత్రి భోజనమంత రంజుగా తినిపించి
    తరుణి యలసిపోయి తల్లడిల్లు

    ఉదయమే లేచి ఇంటిపనులోర్పు నెరపి
    వైనవైనంబు భోజ్యము వండి పెట్టి
    ఆగకుండగ పనిచేయునతివ గాన
    భార్య పదములన్ భక్తితో పట్టదగును.

    రిప్లయితొలగించండి

  26. అయిదవతనము నిచ్చెడి యాదిదేవు
    భార్య పదములన్ భక్తితోఁ బట్టఁదగును
    సిరుల నిచ్చెడు మాతల్లి శ్రీహరి తొలి
    భార్య పదములన్ భక్తితోఁ బట్టఁదగును

    పలుకుల నిచ్చేటి దేవియౌ బ్రహ్మ దేవు
    భార్య పదములన్ భక్తితోఁ బట్టఁదగును
    సతులకెల్ల ధర్మముజెప్పు సతియు,నత్రి
    భార్య పదములన్ భక్తితోఁ బట్టఁదగును

    రిప్లయితొలగించండి
  27. వామన్ కుమార్ గారూ,
    మీరు వ్రాసిన సీసమాలికలో దోషం లేదు. అలా ఎన్ని పాదాలతోనైనా సీసపద్యాన్ని వ్రాయవచ్చు.
    ఒక గృహిణి దైనందిన కార్యక్రమాన్ని చాలా చక్కగా వివరించారు. బాగుంది. అభినందనలు.
    సవరించిన మీ పద్యంలోను కొన్ని లోపాలు.... నా సవరణలు...
    ‘ఉదయమ్మునను ఇంటి.. - ఉదయమ్ముననె యింటి..’, ‘వారి సేవ జేసి - వారి సేవలు జేసి’, ‘సాంతమ్ము నవజేసి- సాంతమ్ముగా జేసి’. ‘ఆగకుండగ వార్ని - ఆగక వారిని’, ‘పాత్రలన్నీ - పాత్రలన్నియు’, ‘బట్టలన్నీ ఉతికి - బట్టలన్నియు నుతికి’, ‘సమయాన యందర్కి భోజనం బందించి - సమయాన నందరకును తిండి యందించి’, ‘తోమేసి - తోమియు’, ‘ఉదయమే లేచి ఇంటిపనులోర్పు నెరపి - ‘ఉదయమున లేచి పనులలో నోర్పు నెరపి’.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ మూడు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణ చివర ‘తరుణీ’ అని టైపాటు దొర్లినట్లుంది.
    మూడవ పూరణ రెండవ పాదంలో గణదోషం. ‘మెండుగా నున్నట్టి’ అంటే సరి. ‘సిరుల కొరకు’ అన్నది ‘సిరులు కొరకు’ అని టైపయింది.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘పద్మనాభు’ అని అసంపూర్ణ పదాన్ని ప్రయోగించారు. ‘పద్మనాభు/ డలరి కైలాసమును జేర నా కపర్ది’ అందాం.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ తాజా పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘పలుకుల నిచ్చేటి’ని ‘పలుకుల నొసంగు’ అనండి.

    రిప్లయితొలగించండి
  28. ఇల్లరికములోని సుఖమునెన్న గలమె
    విధులు సున్న విత్తము మిన్న; విడుపు గోర-
    చేయదగునత్తమామల సేవ మరియు
    భార్య పదములన్ భక్తితోఁ బట్టఁదగును.

    రిప్లయితొలగించండి
  29. శ్రీమతి లక్ష్మీదేవి గారూ / శ్రె శంకరయ్య గారూ!

    అయిదవతనముకు బదులు అయిదువతనము అనాలి.
    విష్ణుమూర్తి యొక్క మొదటి భార్య జ్యేష్టా దేవి అనుకొంటాను.
    రెండవ భార్య లక్ష్మి.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  30. రామకృష్ణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    నేమాని వారి సూచనలను గమనించారా?
    *
    పండిత నేమాని వారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  31. అలుక దీర్చగ సతి జేరి బ్రతిమి లాడ
    పట్టు వదలని గారమ్ము బెట్టు జేయ
    కాఫి నీళ్ళకు నోచక కలత జెంది
    భార్య పదములన్ భక్తితో బట్ట దగును

    రిప్లయితొలగించండి
  32. గురువుగారు,
    ధన్యవాదములు.
    పెద్దవారి సూచనలను గమనించినాను.
    పలుకుల నొసంగు దేవి ,
    అయిదువతనము వ్రాయుటలో పొరబాటు గ్రహించినాను.
    ధన్యవాదములు.
    కానీ, లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని పట్టమహిషి అనే ఇంతవరకూ నమ్మియున్నాను. జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి కి అక్క అని విన్నాను కానీ నారాయణుని పత్ని గా ఎప్పుడూ వినలేదు. పెద్దలు శ్రమ అనుకోక ఈ విషయములో మరికొంత విశదీకరించగలరని ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  33. లక్ష్మీదేవి గారూ,
    నాకు తెలిసినంత వరకు విష్ణువు పెద్ద భార్య లక్ష్మి, రెండవ భార్య భూదేవి. జ్యేష్ఠాదేవి లక్ష్మికి అక్క. అంతేకాని విష్ణువు భార్య కాదు. క్రింది వివరణ చూడండి (ఆంధ్రభారతి నుండి...)
    జ్యేష్ఠాదేవి : పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య)
    వరుణుని భార్యలలో ఒకతె. ఈమె ధాతృవిధాతలతోఁ గూడ పుట్టింపఁబడిన బ్రహ్మమానసపుత్రిక. ఈమె చెలియలు లక్ష్మి. ఈమె వరుణునివలన అధర్ముఁడు అను సుతుని పడసెను. ఈజ్యేష్ఠాదేవినే కాళికాదేవి అనియు అందురు.

    రిప్లయితొలగించండి
  34. శ్రీ కంది శంకరయ్య గారికి శుభాశీస్సులు.
    జ్యేష్టాదేవి గురించి వివరములను దెలిపి మా సంశయమును దీర్చినందులకు సంతోషము.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  35. విను మహాశివరాత్రికి విశ్వనాథు
    బిల్వదళముల బూజించి పిల్వదగును
    పరగ విజయదశమినాడు పరమ శివుని
    భార్య పదములన్ భక్తితోఁ బట్టఁదగును.

    రిప్లయితొలగించండి