కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
శుష్కవేదాంతమును జెప్పె శుకమహర్షి.
ఈ సమస్యను సూచించిన నాగరాజు రవీందర్ గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
శుష్కవేదాంతమును జెప్పె శుకమహర్షి.
ఈ సమస్యను సూచించిన నాగరాజు రవీందర్ గారికి ధన్యవాదాలు.
తనదు ప్రజ్ఞచే సారవంతమ్మొనర్చె
రిప్లయితొలగించండిశుష్క వేదాంతమును, చెప్పె శుక మహర్షి
హరి కథామృత సార సంభరితమైన
భాగవతము ముముక్షువౌ భారతునకు
ప్రాజ్ఞుల వచో విశేషాది ప్రాభవమ్ము
రిప్లయితొలగించండిపసగరగొనున ట్లగుపడు పామరులకు
కొంపఁ గా(గూ)ల్చు వారిటులను కొనెద రేమొ
శుష్క వేదాంతమును జెప్పె శుక మహర్షి!
గీత సారము నంతయు బోధ జేసి
రిప్లయితొలగించండిశుష్క వేదాంతమును , జెప్పె శుక మహర్షి
విష్ణు రాతుడు కోరిన కృష్ణ పదము
నిష్ట తోడను వినిపొందె కష్ట మనక
ఏడుదినముల వ్యవధిలో నింపుమీర
రిప్లయితొలగించండిచేరి సద్భక్తుడౌ పరీక్షిత్తునకును
పరమపదమును జేర్చెడు భాగవతము
శుష్కవేదాంత! మును జెప్పె శుకమహర్షి.
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
శ్రీ మన్మోహన్ సింగ్ గారికి నాలుగు రాష్ట్రముల ప్రజలు బుద్ధి జెప్ప మీడియా ముందుకు వచ్చి ముసలి కన్నీరు కార్చుతూ నేడు ప్రజలు అవినీతి మరచినారు.మళ్ళా మాకే పట్టము గట్టుదురని బలుకుచుండె !
===============*==============
బాధ లొంది జనులు జేరి వాతలన్ను
బెట్టగన్ వడిగ పెదవి విప్పి నేడు
నీతి యందు నిండుగ నవినీతి గలువ,
జనులు నీతి మరచి జేరు ఘనుల వద్ద
కనుచు తన తప్పులను గప్పి ఘనము గాను
శుష్క వేదాంతమును చెప్పె శుక మహర్షి
(శుక మహర్షి= మన్మోహన్ సింగ్)
ముక్తి కలిగించు రీతిగా బోధ జేసి
రిప్లయితొలగించండిశుష్కవేదాంతమును జెప్పె శుకమహర్షి
యేడు దినముల భక్తితో యింపు గూర్చు
భాగవతమును కోరగా పాండుసుతుడు.
కన్ను లున్నను గనలేని కలుష జనులు
రిప్లయితొలగించండివీను లున్నను వినలేని వెర్రివారు
మనసు యున్నను మతిలేక పలుకు రిటుల
శుష్క వేదాంతమును జెప్పె శుక మహర్హి!
మిత్రులారా!
రిప్లయితొలగించండిఈనాటి సమస్యకు మంచి పూరణలు వచ్చుచున్నవి. అందరికి అభినందనలు. కొందరికి సూచనలు:
శ్రీమతి రాజేశ్వరి గారు:
మీ పద్యము బాగుగ నున్నది. మొదటి పాదములో యతిని గమనించ లేదు. సమస్యను ఎట్లు పరిష్కరించారో తెలియుట లేదు.
శ్రీ వరప్రసాద్ గారు:
మీ పద్యము బాగుగ నున్నది. వాతలన్నుకి బదులుగా వాతలెన్నొ అనండి.
అవినీతి గలువ కి బదులుగా అవినీతి జేర్చి అనండి.
శ్రీమతి లక్ష్మీ దేవి గారు:
మీ పద్యము బాగుగ నున్నది.
భక్తితో + ఇంపు అనుచోట నుగాగమము వలన భక్తితో నింపు అగును.
శ్రీమతి శైలజ గారి పద్యమును ఇలాగ మార్చుదాము:
కన్నులున్నను గనలేని కలుష మతులు
..................
మనసు గల్గియు మతిలేక యనెద రిటుల
...................
స్వస్తి
పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
శుష్క వేదాంతమును జెప్పె శుక మహర్షి
భాగవతమున కతలుగా ప్రజల కొరకు
పామరులు మెచ్చ కథలను భక్తి ప్రబలె
జ్ఞాని గ్రహియించె వేదా౦తసార మహిమ
వేదవేదాంగములజెప్పి విశదపరచి
రిప్లయితొలగించండియాత్మ పరమాత్మసంధానమరయజేసి
సారమగు బ్రహ్మమనుచు సంసార భీత
శుష్క! వేదాంతమును జెప్పె శుక మహర్షి.
సంసారభీత శుష్క = సంసారముచే భయపడి శుష్కించినవాడా !
విన్నవింతురు నాస్తికుల్ వినకుడంచు
రిప్లయితొలగించండిసార హీనమ విశ్వాస భాగవతపు
శుష్క వేదాంతమును చెప్పె శుక మహర్షి,
యాధునిక కాల మునకది యనవసరము
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగిట్టు మనుజుడు తప్పక గిట్టు ననుచు
రిప్లయితొలగించండిశుష్క వేదాంత మును జెప్పె శుక మహర్షి
యనుట సత్య దూరము గద యార్య !శుకుడు
భాగవతమును బోధించె బండితులకు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివిన్నవింతురు నాస్తికుల్ వినకుడంచు
రిప్లయితొలగించండిప్రాజ్య హీనమ విశ్వాస భాగవతపు
శుష్క వేదాంతమును చెప్పె శుక మహర్షి,
యాధునిక కాల మునకది యనవసరము
గురువుగారు,
రిప్లయితొలగించండిపొరబాటుకు మన్నించండి. ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిపండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
శంకరయ్య గారికి వందనములు
మరియొకపూరణ:తగదు సుకవుల కీరీతి తగదు పల్క
శుష్క వేదాంతమును జెప్పె శుక మహర్షి
యనగ కించ పరచుట గదా ఋషులను
మనకు సుజ్ఞాన మున్నదా ?యనఘులార
శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
రిప్లయితొలగించండిసవరణలతో
============*==============
బాధ లొంది జనులు జేరి వాతలెన్నొ
బెట్టగన్ వడిగ పెదవి విప్పి నేడు
నీతి యందు నిండుగ అవినీతి జేర్చి,
జనులు నీతి మరచి జేరు ఘనుల వద్ద
కనుచు తన తప్పులను గప్పి ఘనము గాను
శుష్క వేదాంతమును చెప్పె శుక మహర్షి
శ్రీ శంకరయ్య గారికి నమస్సులు
రిప్లయితొలగించండిభోగమనుభవించి వచించె యోగి యొకడు
చొచ్చి పరకాయమున బల్కవచ్చెనొకడు
సూక్ష్మగతి దెల్పె సారము శుక్కుతోడ
శౌనకాదులకందించి మౌనియొకడు
శుష్క వేదాంత మయ్యెనా ముష్కరులకు ?
శుష్క వేదాంతమును జెప్పె శుకమహర్షి !
జన్మ మెత్తగానె పరమ జ్ఞానియయ్యె
రిప్లయితొలగించండిసర్వమెరిగియు వేదాంత సారమిడక
యోగి యైయెటుల నిరుపయోగ మైన
శుష్క వేదాంతమును జెప్పె శుకమహర్షి?
శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
రిప్లయితొలగించండిశ్రీ మన్మోహన్ సింగ్ గారు నాపై ఎటు వంటి వత్తిడి లేదనుట!
=============*==============
శునకమును గాను పెద్దింట కనకము దిన,
కనకము దిను వారికి పెద్ద కావలి నని
శుష్క వేదాంతమును చెప్పె శుక మహర్షి
వినుడు జనులార!వీనుల విందు గాను!
బొగ్గు ఘనులు దినుచు పుడమిపై దిరుగెడి
రిప్లయితొలగించండిగ్రద్దలకు ఘనముగ బుద్ది జెప్పు
పెద్ద ననుచు శుష్క వేదాంతమును చెప్పె
శుక మహర్షి నేడు సొగసు గాను!
నృపుని హృది యజ్ఞగుండము, నిష్ఠ వహ్ని,
రిప్లయితొలగించండిభక్తిహవ్యము నిండార వైచి, వ్రేల్చి
శుష్కవేదాంతమును, జెప్పె శుకమహర్షి
బ్రహ్మయై నిల్చి వేదము భాగవతము
ఈనాటి సమస్యకు చక్కని పూరణలందించిన కవిమిత్రులు...
రిప్లయితొలగించండిపండిత నేమాని వారికి,
చంద్రశేఖర్ గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
వరప్రసాద్ గారికి,
లక్ష్మీదేవి గారికి,
శైలజ గారికి,
కెంబాయి తిమ్మాజీ రావు గారికి,
సంపత్ కుమార్ గారికి,
గండూరి లక్ష్మినారాయణ గారికి,
సుబ్బారావు గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
భాగవతుల కృష్ణారావు గారికి,
బొడ్డు శంకరయ్య గారికి,
ఆదిత్య గారికి,
అభినందనలు, ధన్యవాదాలు.
*
నాగరాజు రవీందర్ గారూ,
శుష్కవేదాంతాన్ని చెప్పే సూక్తి అనడంలోని అసంగతమైన విషయంతో మీరు పంపిన సమస్య అన్ని విధాలా తగినట్లే ఉన్నది. తీరా ఇచ్చే సమయంలో కొద్దిగా మార్చితే బాగుంటుందని స్వతంత్రించాను మీ అనుమతి లేకుండా. మన్నించండి.