మిత్రులారా! శుభాశీస్సులు. ఈనాటి సమస్యను పూరించుటకు నెక్కువ అవకాశములు లేవు. శ్రీ హరి వెంకట సత్యనారాయణ మూర్తి గారు 3 విధములుగా పూరణలను ప్రదర్శించిరి. పూరించిన వారందరికి అభినందనలు. స్వస్తి.
పండిత నేమాని వారూ, సమస్యను విఱిచి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు. * హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ, మీ మూడు పూరణలూ వైవిధ్యంగా ఉండి అలరించాయి. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘రావణాసురు ననుజుడు...’ అనండి. * భాగవతుల కృష్ణారావు గారూ, క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగుంది. అభినందనలు. * బొడ్డు శంకరయ్య గారూ, బాగున్నది మీ పూరణ. అభినందనలు. ‘రావణాసుర + అనుజుడు’ అన్నప్పుడు సంధి జరుగుతుంది. యడాగమం రాదు. అక్కడ ‘రావణాసురు ననుజుడు’ అనండి. ‘తండ్రి + ఐనట్టి’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ ‘తండ్రి యయిన పాండురాజు’ అనండి. * శైలజ గారూ, మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణలో ‘పగలు రేయిలు’ అన్నదాన్ని ‘పగలు రేలును’ అనండి. ‘మురియు రిలను’ అన్నచోట ‘మురియుదు రిల’ అనండి. రెండవ పూరణలో ‘రావణాసుని తమ్ముడు’ అన్నదాన్ని ‘రావణాసురు తమ్ముడు’ అనండి. * నాగరాజు రవీందర్ గారూ, మీ పూరణ వైవిధ్యంగా ఉంది. పాండురాజు రూపసి కాదు అనడం బాగుంది. అభినందనలు.
కవిమిత్రులకు నమస్కృతులు. రేపు ఉదయం మా మనుమని పుట్టువెండ్రుకలు తీయించడానికి వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధికి వెళ్తున్నాము. రేపు, ఎల్లుండి బ్లాగుకు అందుబాటులో ఉండను. రెండు రోజుల సమస్యలను షెడ్యూల్ చేశాను. అసౌకర్యానికి మన్నించండి. * పండిత నేమాని వారూ, మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు. * వరప్రసాద్ గారూ, బాగున్నవి మీ రెండు పూరణలు. అభినందనలు. రెండవ పూరణలో ‘మాతు’ శబ్దాన్ని ప్రయోగించారు. చదరంగంలో భటునితో కాకుండా మిగిలినవానితో రాజుకు చెక్ పట్టడాన్ని మాతు అంటారు. మీరే అర్థంలో ప్రయోగించారు? చివర కొంత సవరణ... ... మాట గురుతువచ్చె! * నాగరాజు రవీందర్ గారూ, రూపసిని స్త్రీ వాచ్యంగా చేసిన మీ మొదటి పూరణ బాగుంది. అభినందనలు. రెండవ పూరణ కూడా బాగుంది, కాని మొదటి వాక్యం అర్థం కాలేదు. * రాజేశ్వరి అక్కయ్యా, కొద్దిరోజులుగా మీ పద్యాలు లేని లోటు కనిపించింది. మీ ఆరోగ్యం బాగుంది కదా! మీ పూరణ (టైపు దోషాలను మినహాయిస్తే) బాగుంది. అభినందనలు.
గురువులకు ధన్య వాదములు .నా ఆరోగ్యం బాగుంది .కొద్ది రోజులు బోస్టన్ వెళ్ళాము . మరికొన్ని రోజులుగా నా సిస్టం అలిగింది ఇప్పుడే కొత్తది వచ్చింది ఇంకా అలవాటు కాలేదు. . నిజమే రూపసికి బదులు సూరుదు అని వ్రాసాను .చాల అందంగా సమర్ధించారు ధన్య వాదములు .సెలవు
రావణుని సహజన్ముండు రాక్షసుండు
రిప్లయితొలగించండికుంభకర్ణుండు, రూపసి కుంతిమగడు
పాండురాజు భరతవంశ పార్థివుండు
ప్రథిత గుణశీలశాలి దీవ్యద్విభవుడు
శ్రీ వసంత కిశోర్ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీరు సమస్యను తేటగీతిలొ నింపలేదు. సరిజేయండి. స్వస్తి.
అతిశయోక్తులు, హాస్యంబు, లద్భుతములు
రిప్లయితొలగించండిపలుకవలసిన స్పర్థలో బాలుడొకడు
పలికె యమునకు కర్ణుండు బావ మరియు
కుంభకర్ణుండు రూపసి కుంతిమగడు.
నాగపురమున భారత నాటకమున
రిప్లయితొలగించండికుంభకర్ణాఖ్యు డొక్కడు కూర్మిమీర
నటన చేయగ జేరెను నమ్ముడందు
కుంభకర్ణుండు రూపసి కుంతిమగడు.
చదువు నేర్వగ వచ్చెను ఛాత్రు డొకడు,
రిప్లయితొలగించండిగురుడు నాతని సామర్ధ్య మరయ దలచి
ఉక్తలేఖనమందున నొసగెనిట్లు
కుంభకర్ణుండు, రూపసి, కుంతి, మగడు.
పోలికేమియు లేదులే పోల్చి చూడ
రిప్లయితొలగించండివాదమెందుకు వినగదే వారిజాక్షి
కనగనుదరంబు పెద్దగా గలుగు వాడు
కుంభకర్ణుండు, రూపసి కుంతిమగడు.
రావణాసురి యనుజుడు రాక్షసుండు
రిప్లయితొలగించండికుంభ కర్ణుండు, రూపసి కుంతి మగడు
పాండు రాజునా బఱగుచు భ్రాత బదులు
రాజ్య పాలన గావించె రమ్యముగను
శ్రీ శంకరయ్య గారికి నమస్సులు
రిప్లయితొలగించండిరావణానుజుడెవ్వడు రాలెననిని
సుందరాంగుని యేమని యందురిలను
పొందనాలిని నాశన మొందెనెవడు
కుంభకర్ణుండు రూపసి కుంతి మగఁడు.
మిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఈనాటి సమస్యను పూరించుటకు నెక్కువ అవకాశములు లేవు. శ్రీ హరి వెంకట సత్యనారాయణ మూర్తి గారు 3 విధములుగా పూరణలను ప్రదర్శించిరి. పూరించిన వారందరికి అభినందనలు. స్వస్తి.
లంకకు ప్రభువు మిగుల భయంకరుడగు
రిప్లయితొలగించండిరావణాసుర యనుజుండు రక్కసుండు
కుంభకర్ణుండు, రూపసి కుంతి మగడు
పాండవులకు తండ్రైనట్టి పాండురాజు.
పగలు రేయిలు పవళించు బలుడెవండు?
రిప్లయితొలగించండిముద్దు గుమ్మల నేమని మురియు రిలను?
సతుల తాకిన మృతినొందు సామి యెవరు?
కుంభకర్ణుండు రూపసి కుంతి మగడు
రావణాసుని తమ్ముడు రక్కసుండు
రిప్లయితొలగించండికుంభకర్ణుడు, రూపసి కుంతి మగడు
పంచ పాండవులకుతండ్రి పాండురాజు
ధర్మ బద్దుడు సదయుడు దానశీలి
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిసమస్యను విఱిచి చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
*
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ మూడు పూరణలూ వైవిధ్యంగా ఉండి అలరించాయి. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘రావణాసురు ననుజుడు...’ అనండి.
*
భాగవతుల కృష్ణారావు గారూ,
క్రమాలంకార పద్ధతిలో మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
బొడ్డు శంకరయ్య గారూ,
బాగున్నది మీ పూరణ. అభినందనలు.
‘రావణాసుర + అనుజుడు’ అన్నప్పుడు సంధి జరుగుతుంది. యడాగమం రాదు. అక్కడ ‘రావణాసురు ననుజుడు’ అనండి. ‘తండ్రి + ఐనట్టి’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ ‘తండ్రి యయిన పాండురాజు’ అనండి.
*
శైలజ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో ‘పగలు రేయిలు’ అన్నదాన్ని ‘పగలు రేలును’ అనండి. ‘మురియు రిలను’ అన్నచోట ‘మురియుదు రిల’ అనండి.
రెండవ పూరణలో ‘రావణాసుని తమ్ముడు’ అన్నదాన్ని ‘రావణాసురు తమ్ముడు’ అనండి.
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ వైవిధ్యంగా ఉంది. పాండురాజు రూపసి కాదు అనడం బాగుంది. అభినందనలు.
మిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఈనాటి పూరణ లన్నియు నలరించు చున్నవి. అందరికి అభినందనలు.
శ్రీ సుబ్బా రావు గారు:
మీ పద్యములో: రావణాసురు ననుజుడు అని మార్చుదాము.
శ్రీ భాగవతుల కృష్ణా రావు గారు: నమస్కారములు.
మీ పద్యములో: సుందరాంగుని యేమని కి బదులుగా సుందరాంగుని నేమని అందాము.
శ్రీ బొడ్డు శంకరయ్య గారు:
మీ పద్యములో: రావణాసురు ననుజుండు అందాము.
పాండవులకు దండ్రియగును పాండురాజు అందాము.
శ్రీమతి శైలజ గారు:
మీ 1వ పద్యములో:
అనిశమున్ బవళించెడు నసురు డెవడు? అందాము.
అందగత్తెల నేమందు రాదరమున? అందాము.
2వ పద్యములో:
రావణాసురు తమ్ముండు రక్కసుండు అందాము.
శ్రీ నాగరాజు రవీందర్ గారు:
మీ పద్యములో: నిరవధికముగ లంకలో నిదురవోవు అందాము.
స్వస్తి.
రిప్లయితొలగించండిపండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
శంకరయ్య గారికి వందనములు
పది తలలు గలవాని ,శూర్ప నఖకన్న
సుందరాంగుడు కాబోలు జూడ జూడ
కుంభకర్ణుండు. రూపసి కుంతి మగడు
పాండు వర్ణమ్ము కలిగిన పాండురాజు
నాదు మిత్రుండు చూడు మీ నాటకమున
రిప్లయితొలగించండికుంభ కర్ణుండు, రూపసి!, కుంతి మగఁడు
గా మునుపు నొప్పె భారత గాథ లోన
పాత్ర లేవైన బండించు పరులు పొగడ!
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కుంభకర్ణుడు రూపసి, కుంతి మగడు
రిప్లయితొలగించండినిరత భార్యా విలోలుడు, నీతిపరుడు
ధార్తరాష్ట్రాగ్రజుండని దంభములను
చెప్పగా నేల? నగుబాటు చెందనేల?
శ్రీ పండిత నేమాని గురుదేవులకు,
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు వందనములు
స్వగ్రామమునకు వెళ్ళి యుంటిని,నెట్ సౌకర్యములేక బ్లాగునకు దూరమైతిని గురువుగారు.
=============*================
ఆరు మాసాలు నిద్రించు నసురుడు ఘన
కుంభ కర్ణుండు,రూపసి కుంతి మగడు
గాడు,బ్రహ్మ శాపమునకు గాసినొంద,
రావణుడు వేడ,బ్రతికిన రాక్షసుండు!
శ్రీ పండిత నేమాని గురుదేవులకు,
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు వందనములు
=============*================
రామబాణపురుచి జూచి రణము నందు
కుంభ కర్ణుండు, రూపసి కుంతి మగడు
శాపమును మరచి దిరుగ జచ్చె ననుచు
గురువు గారు జెప్పిన మాతు గురుతు నుండె!
గురుదేవులిర్వురు సూచనలకు ధన్యవాదములు, సవరణతో..
రిప్లయితొలగించండిలంకకు ప్రభువు మిగుల భయంకరుడగు
రావణాసురు కనుజుండు రక్కసుండు
కుంభకర్ణుండు, రూపసి కుంతి మగడు
పాండవులకు దండ్రియగును పాండురాజు.
రామ రావణాసుర ఘోర రణము నందు
రిప్లయితొలగించండికుంభ కర్ణుండు,రూపసి కుంతి మగడు
తనదు ముని శాపము మరచి మణిగిరనుచు
గురువు గారు జెప్పిన మాతు గురుతు నుండె!
అసుర సంధ్యను జన్మించే నసురు డనగ
రిప్లయితొలగించండిఆరు వందల దనువుల వీరు డతడు
కుంభ కర్ణుడు , సూరుడు కుంతి మగడు
పాండు రాజను నాతడు పాండు రోగి
సోదరు లందరికీ శుభా కాంక్షలు .
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండిరేపు ఉదయం మా మనుమని పుట్టువెండ్రుకలు తీయించడానికి వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి సన్నిధికి వెళ్తున్నాము. రేపు, ఎల్లుండి బ్లాగుకు అందుబాటులో ఉండను. రెండు రోజుల సమస్యలను షెడ్యూల్ చేశాను. అసౌకర్యానికి మన్నించండి.
*
పండిత నేమాని వారూ,
మీ తాజా పూరణ బాగుంది. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
బాగున్నవి మీ రెండు పూరణలు. అభినందనలు.
రెండవ పూరణలో ‘మాతు’ శబ్దాన్ని ప్రయోగించారు. చదరంగంలో భటునితో కాకుండా మిగిలినవానితో రాజుకు చెక్ పట్టడాన్ని మాతు అంటారు. మీరే అర్థంలో ప్రయోగించారు? చివర కొంత సవరణ...
... మాట గురుతువచ్చె!
*
నాగరాజు రవీందర్ గారూ,
రూపసిని స్త్రీ వాచ్యంగా చేసిన మీ మొదటి పూరణ బాగుంది. అభినందనలు.
రెండవ పూరణ కూడా బాగుంది, కాని మొదటి వాక్యం అర్థం కాలేదు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
కొద్దిరోజులుగా మీ పద్యాలు లేని లోటు కనిపించింది. మీ ఆరోగ్యం బాగుంది కదా!
మీ పూరణ (టైపు దోషాలను మినహాయిస్తే) బాగుంది. అభినందనలు.
గురువులకు ధన్య వాదములు .నా ఆరోగ్యం బాగుంది .కొద్ది రోజులు బోస్టన్ వెళ్ళాము . మరికొన్ని రోజులుగా నా సిస్టం అలిగింది ఇప్పుడే కొత్తది వచ్చింది ఇంకా అలవాటు కాలేదు. . నిజమే రూపసికి బదులు సూరుదు అని వ్రాసాను .చాల అందంగా సమర్ధించారు ధన్య వాదములు .సెలవు
రిప్లయితొలగించండినేను బ్లాగు లోనికి రాగానే మంచి శుభ వార్త విన్నాను మనవడికి , మరదలికి , మీకు కోడలికి అబ్బాయికి , అందరికీ ,శుభా శీస్సులు
రిప్లయితొలగించండి