20, జనవరి 2014, సోమవారం

త్యాగరాజ స్తుతి


త్యాగరాజ స్తుతి
 పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

శ్రీరామచంద్ర సంసేవా పరాయణ

......ప్రాప్త సాహిత్య సంపద్విభవుడు

భారతీ సత్కృపాభర కటాక్ష విశేష

......లబ్ధ సంగీత కళామయుండు

భక్తి భావాఢ్య శోభాపూర్ణ బహువిధ

......సరస గీతా విలసద్యశుండు

ప్రముఖ కర్ణాటక వాగ్గేయకారుండు

......యోగివరేణ్యుండు త్యాగరాజు 

వెలసె కారణజన్ముడై తెలుగునాట

వ్యాప్తమొనరించె సంగీత భవ్య కళను

భద్రశీలి నాదబ్రహ్మ భక్తవరుడు

వాని కొనరింతు సాదర వందనములు.

5 కామెంట్‌లు:

  1. పుట్టి కారణ జన్ముడై పుడమి యందు
    వ్యాప్త మొనరించె సంగీత భవ్య కళను
    యోగి గణములో శ్రేష్టుడీ త్యాగరాజు
    వంద నంబులు వానికి వందలాది

    రిప్లయితొలగించండి
  2. నాదబ్రహ్మ త్యాగరాజు గురించిన మీ స్తుతి మనోహరంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. శ్రీ కంది శంకరయ్య గారికి శుభాశీస్సులు.
    మా పద్యము గురించి ప్రశంస చేసినందులకు చాల సంతోషము.

    రిప్లయితొలగించండి
  4. అత్యద్భుతకృతి యిది సం
    స్తుత్యము సుమనోహరమ్ము సుందరమనుచున్
    నిత్యానందద మార్యా
    సత్యంబుగ త్యాగరాజు సంతసముగొనున్!

    రిప్లయితొలగించండి
  5. "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి