18, జనవరి 2014, శనివారం

సమస్యాపూరణం - 1297 (ముక్కంటిం దూఱు నెడల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ముక్కంటిం దూఱు నెడల మోక్షము గలుగున్.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

32 కామెంట్‌లు:

 1. అక్కట! తగు శాస్తి కలుగు
  ముక్కంటిని దూరునెడల, మోక్షము గలుగున్
  మిక్కుటమగు భక్తి మెయిన్
  ముక్కంటిని గొలుచు నెడల బుధజనవంద్యా!

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !
  అలరింప నున్నవి !

  మురారిని పూజించినా,ముక్కంటిని ద్వేషించినా
  మోక్షం కలుగుననుకోవడమే గదా వైష్ణవం :

  01)
  ________________________________

  నిక్కువమగు వైష్ణవుడే
  చక్కగ తలపోయునిట్లు - " చక్రిని గొలువన్
  చుక్కలరాయని దాల్చెడి
  ముక్కంటిం దూఱు నెడల - మోక్షము గలుగున్ " !
  ________________________________

  రిప్లయితొలగించండి
 3. మిక్కుటమగు హర్షంబున
  ముక్కంటిని దూరునెడల మోక్షము గలుగున్
  గ్రక్కున రండని మూర్ఖుం
  డొక్కడు తా బిలుచుచుండె నూరిజనాలన్.

  రిప్లయితొలగించండి
 4. ఇక్కట్టులు గలిగెడు భువి
  ముక్కంటిని దూరునెడల, మోక్షము గలుగున్
  మిక్కుటమగు యశమబ్బును
  నిక్కము, కీర్తింతురేని నిష్ఠాగరిమన్.

  రిప్లయితొలగించండి
 5. చిక్కులు కొనితెచ్చుకొనును
  ముక్కంటిని దూఱునెడల, మోక్షము గలుగన్
  మక్కువతోసేవించిన
  ఇక్కట్టులుతొలగిపోవు ఈశుని గొలువన్

  రిప్లయితొలగించండి
 6. పండిత నేమాని వారూ,
  దూఱుట, కొలుచుటల వ్యత్యాసాన్ని తెలియజేస్తున్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  వైష్ణవుని మాటగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  హరి వేంకట సత్యనారాయణ గారూ,
  మూర్ఖుని వాక్యంగా మొదటి పూరణ, విరుపుతో రెండవ పూరణ బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణలో ‘ఊరిజనమ్మున్’ అనండి.
  *
  శైలజ గారూ,
  విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. బుక్కెడిది విషము, దిగ్గజ
  త్వక్కును బట్టట, స్మశానవాటిక వాసం
  బక్కట విషమనయనుడని
  ముక్కంటిని దూరునెడల మోక్షము గలుగున్!!

  రిప్లయితొలగించండి
 8. అక్కట యర్థము తెలియక
  నొక్కడు "కోరుట '" యనుకొనెనోమరి " దూఱున్ "
  నొక్కుచు చెప్పెను తానిటు
  ' ముక్కంటిం దూఱు నెడల మోక్షము గలుగున్. '

  రిప్లయితొలగించండి
 9. "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
  వ్యాజనిందారూపమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘దిగ్గజ త్వక్కు’ అన్నప్పుడు ‘జ’ గురువై గణదోష ప్రమాదం ఉంది కదా. అయినా శివుడు ధరించింది గజచర్మమే కాని దిగ్గజ చర్మం కాదు కదా. అక్కడ ‘ద్విరద త్వక్కు’ అంటే ఎలా ఉంటుంది?
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ప్రమాదవాక్కుగా మీ పూరణ బాగుంది అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. నాగరాజు రవీందర్ గారూ,
  శివనింద శునకజన్మకు కారణమన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. మక్కెలు విఱు గం గొట్టుదు
  ముక్కం టిం దూ ఱు నెడల, మోక్షము గలుగున్
  జక్కగ బూజలుసేసిన
  ముక్కం టికి ననుదినమ్ము మురిపము తోడన్

  రిప్లయితొలగించండి
 12. దక్కను శివు కారుణ్యము
  నిక్కముగను బూజ జేయ నిర్మల హృదితో
  ధిక్కార స్వర భక్తిని
  ముక్కంటిం దూఱు నెడల మోక్షము గలుగున్.

  రిప్లయితొలగించండి
 13. శ్రీ శంకరయ్య గారికి నమస్సులు

  పెక్కగు భక్తిని పొందక
  ముక్కంటిం దూఱు నెడల మోక్షము గలుగున్.
  చక్కని పాశుపతమ్మును
  ముక్కంటినెదిర్చి పొందె మును పార్ధివుడే

  రిప్లయితొలగించండి
 14. సుబ్బారావు గారూ,
  మనవాళ్ళు గానీ, పరాయివాళ్ళు గానీ మనదేవుళ్ళను కించపరిచినా తరతరాలుగా సహనాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాం.
  మనదేవుళ్ళను దూఱినవాళ్ళ మక్కెలు విఱుగగొట్టుమన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  వైరభక్తిని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. భాగవతుల కృష్ణారావు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  అయినా అర్జునుడు ఒక ఆటవికుడనుకొని ఎదుర్కొన్నాడు కాని శివుణ్ణి దూషించలేదు కదా!

  రిప్లయితొలగించండి
 16. నాగరాజు రవీందర్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  అక్కట!దక్షుడు జావడె
  ముక్కంటిని దూరునెడల. మోక్షము కల్గున్
  స్రుక్కు వడి మ్రొక్కు లిడగా
  బుక్కపుమెడ తోడ బ్రతికి పోహణ సేయన్

  రిప్లయితొలగించండి
 18. శ్రె భాగవతుల కృష్ణా రావు గారు! నమస్కారములు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
  పార్థివుడు అంటె రాజు అని అర్థం. కానీ మీరు అర్జునుడు అనే అర్థముతో ప్రయోగించేరు. పార్థుడు అంటే అర్జునుడు కదా.
  పెక్కగు భక్తి -- పెక్కును బహువచనములో నుపయోగించాలి కదా. చూడండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 19. అక్కజము గొల్పు మాటలు
  "ముక్కంటిని దూరునెడల మోక్షము గలుగున్,
  మ్రొక్కిన సౌఖ్యమడంగెడు
  నిక్కుంభినిలోన"ననుట యెక్కాలమునన్.

  రిప్లయితొలగించండి
 20. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  ధన్యవాదాలు. కృష్ణారావు గారి పద్యంలో లోపాలను నేను గమనించలేదు. ‘పార్థివుడే’ అన్నదానిని ‘పార్థుండే’ అంటే సరి.
  *
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 21. గుండా సహదేవుడు గారి పూరణ...

  చక్కగ సుఖాసనంబున
  మక్కువఁ గరముల్ కలుపుచు మనసు చెదరక
  న్నిక్కముగ నాసికాగ్రపు
  ముక్కంటిం దూరు నెడల మోక్షము కలుగున్

  రిప్లయితొలగించండి
 22. సహదేవుడు గారూ,
  మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని ‘నాసికాగ్రపు ముక్కంటిని దూఱుట’ అర్థం కాలేదు.

  రిప్లయితొలగించండి
 23. శ్రీ సహదేవుడు గారు! శుభాశీస్సులు.
  మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. ఒక సూచన.
  చెదరక అనునది కళ - ద్రుతప్రకృతికము కాదు. అందుచేత చెదరకన్ అను రూపము రాదు. పరిశీలించండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 24. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు
  మరియొక పూరణ

  ఒక్కక్రిమి చాలు కొబ్బెర
  ముక్కంటిని దూరునెడల .మోక్షము కల్గున్
  చిక్కని గుజ్జుకు నీటికి
  గ్రక్కున నిల పయిని రాలు కాయ కృశింపన్

  రిప్లయితొలగించండి
 25. గుండా సహదేవుడు గారి వ్యాఖ్య......
  గురుదేవులకిరువురకు ధన్యవాదములు. నాసిక అగ్ర భాగాన గల మూడో కంటిలో మనసు
  నిలపడమనే భావంతో కూర్చిన పద్యం.
  శ్రీ నేమాని గురుదేవుల సూచిత సవరణతో:
  చక్కగ సుఖాసనంబున
  మక్కువ గా చెదరనీక మదితో నొకటై
  నిక్కముగ నాసికాగ్రపు
  ముక్కంటిం దూరు నెడలమోక్షము కలుగున్.

  రిప్లయితొలగించండి
 26. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ తాజా పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  సవరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 27. ఎక్కువ భక్తిని గలిగిన
  చిక్కిన భక్తులను గనుచు చిలిపితనముతో
  నిక్కుచు నాస్తికు లందురు
  ముక్కంటిం దూఱు నెడల మోక్షము గలుగున్

  రిప్లయితొలగించండి
 28. నమస్సులు శంకరయ్య గారు.
  దిక్కులు అంబరంగా గలవాడు కాబట్టి దిగ్గజ అన్న పదం వాడాను.
  సరిచేసిన పూరణ:

  మెక్కెడిది విషము, ద్విరద
  త్వక్కును బట్టట, స్మశానవాటిక వాసం
  బక్కట విషమనయనుడని
  ముక్కంటిని దూరునెడల మోక్షము గలుగున్!!

  రిప్లయితొలగించండి
 29. పెక్కుగ పూజలు జేయుచు
  నిక్కముగా శివునియందు నిలిపి హృదయమున్
  మ్రొక్కుచు పరవశమున నా
  ముక్కంటిం దూఱు నెడల మోక్షము గలుగున్

  రిప్లయితొలగించండి
 30. మిక్కిలి తూపులు వేయగ
  గ్రక్కున శామీలమైన రతిపతి వోలెన్
  చక్కగ నిటలాక్షు నొనరి,
  ముక్కంటిం దూఱు నెడల, మోక్షము గలుగున్

  రిప్లయితొలగించండి
 31. అమిత్ షా ఉవాచ:

  దిక్కులు తోచక మదినిన్
  నిక్కమ్ముగ చావుగోరి నేడో రేపో
  వెక్కుచు పాకుల శూరులు
  ముక్కంటిం దూఱు నెడల మోక్షము గలుగున్

  రిప్లయితొలగించండి