పండిత నేమాని వారూ, గుండ్రాతిపురంలో బండ్రెడ్డి వారి పెళ్ళి! చక్కని పూరణ. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, విరుపుతో బాగున్నది మీ పూరణ. అభినందనలు. ‘రెండ్రోజులు గడపఁ బంపె’ అంటే అన్వయం చక్కగా కుదురుతుంది. * హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ, ఈండ్రాప్రాసతో ఒక్క పద్యాన్ని వ్రాయడమే కష్టమౌతుందనుకున్నాను. మీరు ఏకంగా మూడు పూరణలు చేశారు. సంతోషం. గుండ్రేటిపురంలో పండ్రెండు సంవత్సరాల నివాసపు మొదటి పూరణ, రెండ్రోజులు గుండ్రాళ్ళ నేరిన రెండవ పూరణ, కాండ్రించి వాదు తెప్పించిన మూడవ పూరణ... అన్నీ బాగున్నవి. అభినందనలు. * చంద్రశేఖర్ గారూ, మీ కండ్రిగ జాతరకు కొండ్రాజును పిలిచిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సమస్యాపూరణం లో “oడ్రా”ప్రాస లేకుండా కందపద్యము లోనే సమస్యను పూరణ చేశాను చిత్తగించండి.పూరణ ఏరా నాపిల్లలతo డ్రీ రమ్మనుచు పిలిచె తరు*ణి తనపతిన్!సు స్మేరాననయై పల్లెకు[స్కూలుకు] తీరుగ పిల్లలను బంప తెలియద?మగడా!
నాగరాజు రవీందర్ గారూ, మీ ‘ఆండ్రాయిడ్’ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు. * వరప్రసాద్ గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * శైలజ గారూ, బాగున్నవి మీ మూడు పూరణలు. అభినందనలు. * కెంబాయి తిమ్మాజీ రావు గారూ, ఇలాంటి దుష్కరప్రాసకు తరుణోపాయాన్ని బోధించారు మీ పూరణతో. మీ రెండవ పూరణ కూడ బాగున్నది. అభినందనలు. * సుబ్బారావు గారూ, మీ పూరణ బాగున్నది. అభినందనలు. * భాగవతుల కృష్ణారావు గారూ, బాగున్నది మీ పూరణ. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉన్నది. అభినందనలు.
మాస్టారూ, నేనూ మొదట అలానే ఆలోచించాను. కానీ వారి ప్రయత్నంలో పాద భేదం చేసి పాద ప్రథమాక్షరం మార్చారు కాబట్టి యతి నియమం కూడా మారుతుందను కొన్నాను. మారదని అర్థమయింది. ధన్యవాదాలతో-చంద్రశేఖర్
మొద్దబ్బాయిని గురువు దగ్గర జేర్చ గా భార్య భర్త ను రమ్మన్నట్లు... గండ్రలు బలుకకు తనయుని గుండ్రేవుల గురువు తీర్చు గొలువున నిడగా బండ్రాయిఁ బోలు పుత్రుని తండ్రీ , రమ్మనుచు బిలిచె తరుణి తన పతిన్!
బండ్రెడ్డి వారి పెండ్లికి
రిప్లయితొలగించండిగుండ్రాతిపురమ్ము చేరుకొనవలె వడిగా
తండ్రీ! సొగసుల సౌమ్యుని
తండ్రీ! రమ్మనుచు బిలిచె తరుణి తన పతిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉండ్రాళ్ళు జేస్తి నీకని
రిప్లయితొలగించండితండ్రీ రమ్మనుచు బిలిచె దరుణి , తన పతిన్
ఉండ్రాజ వరము నందున
రెండ్రోజులు గడప వలెను రేయిం బవలున్
పండ్రెండు వత్సరంబులు
రిప్లయితొలగించండిగండ్రేటి పురమ్మునందు క్రమముగ మా మా
తీండ్రల్ దీర్చిన పిల్లల
తండ్రీ! రమ్మనుచు బిలిచె తరుణి తనపతిన్. 1.
రెండ్రోజులు మనమిచ్చట
గుండ్రాళ్ళేరంగవలయు కూర్చొన కీవున్
పౌండ్రక! రా నాపిల్లల
తండ్రీ! రమ్మనుచు బిలిచె తరుణి తనపతిన్. 2.
కాండ్రించి యుమియ నాతడు
వాండ్రకు, వీండ్రకును పెద్ద వాదయ్యె, కనన్
పాండ్రంగ! దీనజనముల
తండ్రీ! రమ్మనుచు బిలిచె తరుణి తనపతిన్. 3.
కండ్రిగ జాతర గణపతి
రిప్లయితొలగించండికుండ్రాళ్ళ నిడవలె బేగి నురుకుచు లేరా
కొండ్రాజు మొగడ! కొడుకుల
తండ్రీ! రమ్మనుచుఁ బిలిచెఁ దరుణి తన పతిన్.
తీండ్రించు కనుల శివుఁ గని
రిప్లయితొలగించండిగాండ్రించెడి వ్యాఘ్రమెక్కు గౌరి మురిసె “నో
యుండ్రాళ్ళఁ దినెడి పుత్రుని
తండ్రీ! ర” మ్మనుచుఁ బిలిచెఁ దరుణి తన పతిన్.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిగుండ్రాతిపురంలో బండ్రెడ్డి వారి పెళ్ళి! చక్కని పూరణ. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
విరుపుతో బాగున్నది మీ పూరణ. అభినందనలు.
‘రెండ్రోజులు గడపఁ బంపె’ అంటే అన్వయం చక్కగా కుదురుతుంది.
*
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
ఈండ్రాప్రాసతో ఒక్క పద్యాన్ని వ్రాయడమే కష్టమౌతుందనుకున్నాను. మీరు ఏకంగా మూడు పూరణలు చేశారు. సంతోషం.
గుండ్రేటిపురంలో పండ్రెండు సంవత్సరాల నివాసపు మొదటి పూరణ, రెండ్రోజులు గుండ్రాళ్ళ నేరిన రెండవ పూరణ, కాండ్రించి వాదు తెప్పించిన మూడవ పూరణ... అన్నీ బాగున్నవి. అభినందనలు.
*
చంద్రశేఖర్ గారూ,
మీ కండ్రిగ జాతరకు కొండ్రాజును పిలిచిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
అలరింప నున్నవి !
ఏదడిగినా చెప్పడు ! సరిగ్గా చదవడు ! రెండు బాదితే మంచిదేమో ?
మీరొచ్చి వీడి సంగతి చూడండని కొడుకుపై భార్య ఫిర్యాదు :
01)
_____________________________
"హండ్రెడ్ హండ్రెడ్సెంతగు
తండ్రీ "? --- రమ్మనుచు బిలిచె - తరుణి తన పతిన్
హండ్రెడ్ హండ్రెడ్సడిగిన
బండ్రాయి వలెను పలుకడు - బాదుట మేలౌ ?
_____________________________
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండి‘హండ్రెడ్’ పర్సెంట్ బాగున్నది మీ పూరణ. అభినందనలు.
శంకరార్యా ! శుభోదయం !
రిప్లయితొలగించండిమీ
"యుండ్రాళ్ళఁ దినెడి పుత్రుని తండ్రీ "!
అహో ! అద్భుతం !
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిసంతోషం! ధన్యవాదాలు.
ఊరిపెద్ద బండ్రాజు వద్దకు ఫిర్యాదు చేయడానికి రమ్మని
రిప్లయితొలగించండికొడుకులను భర్తను పిలుస్తున్న భార్య :
02)
_____________________________
బండ్రాజు గారి యింటికి
రండ్రా ! నా తనయు లార - రాజదె తేల్చున్
బండ్రాయి కేసి కొట్టునొ
తండ్రీ ? రమ్మనుచు బిలిచె - తరుణి తన పతిన్ !
_____________________________
ఆర్యా!
రిప్లయితొలగించండిధన్యవాదములు.
"ఉండ్రాళ్ళు దినెడి పుత్రుని తండ్రి"ని పిలిపించిన మీ పూరణ అత్యద్భుతముగా నున్నది.
పన్నెండేళ్ళ క్రితం మొక్కిన
రిప్లయితొలగించండిఅమ్మవారి మొక్కు దీర్చడానికి వెళ్దాం రమ్మని
కొడుకునూ భర్తనూ భార్య పిలుస్తున్న వైనం :
03)
_____________________________
చండ్రమ్మ మొక్కు దీర్చగ
గుండ్రముగా దిరుగ వలెను ! - గుడిలో మొక్కుల్
పండ్రెండేడులు గడచెను
తండ్రీ ! రమ్మనుచు బిలిచె - తరుణి తన పతిన్ !
_____________________________
ఒక పక్క గింజలు తినకురా పీతలు వండుతున్నాను
రిప్లయితొలగించండిఅని కొడుకుపై విసుక్కుంటూనే
పిల్లాడికి బొట్టు(నామం) పెట్టడానికి
రమ్మని పిల్లాడి తండ్రిని పిలుస్తున్న భార్య :
04)
_____________________________
ఎండ్రలు దినుటయె తప్పది !
ఎండ్రికనే వండి పెడుదు - నేచకు నన్నున్ !
పుండ్రమ్మును దీర్చ , సుతుని
తండ్రీ , రమ్మనుచు బిలిచె - తరుణి తన పతిన్ !
_____________________________
ఎండ్ర = తృణవిశేషము(గింజ)
ఎండ్రిక = పీత
ఏచు = బాధించు(విసిగించు)
ఓ రాముడి తండ్రీ !
రిప్లయితొలగించండిపిల్లాడికి ముఖం ఉబ్బింది ! గురక పెడుతున్నాడు !
మళ్ళీ ఎప్పుడు కళకళ లాడతాడో
ఒకసారి వచ్చి చూడయ్యా
అని భార్య పిలుస్తున్న వైనం :
05)
_____________________________
గోండ్రించు చున్న వాడదె
గాండ్రించిన ముఖము తోడ - గఱగఱ మనుచున్ !
తీండ్రించు నెపుడు ? రాముని
తండ్రీ , రమ్మనుచు బిలిచె - తరుణి తన పతిన్ !
_____________________________
గోండ్రించు = కూయు (గురక)
గాండ్రించు = ఉబ్బు
గఱగఱ = గరుకుగా నున్న వస్తువును స్పృశించుటలో అగు అనుకరణము.
తీండ్రించు = ప్రకాశించు
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిబండ్రాజు గారింటికి, చండ్రమ్మ మొక్కు తీర్చడానికి, కొడుక్కి పుండ్రములు తీర్చి, తీండ్రిస్తూ రమ్మన్న మీ తాజా నాలుగు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
*
హరి వారూ,
ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఉండ్రాజవరపు బిడ్డడ
పుండ్రమ్ముల దాల్చువాడ పురుషోత్తముడా
పండ్రెండు యేండ్ల బిడ్డడి
తండ్రీ , రమ్మనుచు బిలిచె తరుణి తన పతిన్.
శంకరార్యా ! ధన్యవాదములు !
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిహండ్రెడ్ పర్సెంట్ క్యూరగు
చుండ్రును వదిలించవచ్చు , చూడుము షాంపూ
గాండ్రింపులేల కవలల
తండ్రీ , రమ్మనుచు బిలిచె తరుణి తన పతిన్.
రిప్లయితొలగించండిమాస్టరు గారూ ! సమస్యను చూడగానే ఉండ్రాళ్ళు తినెడి పుత్రుని తో పూరిద్దామనుకున్నాను..ఈ లోపు మీ పూరణ చూశాను..చాలా బాగుంది..
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
రిప్లయితొలగించండిఉండ్రాజపురపు పుండ్రాలు దాల్చే బిడ్డడి గురించి, చుండ్రును వదిలించే షాంపూను గురించీ మీరు వ్రాసిన పూరణలు రెండూ బాగున్నవి. అభినందనలు.
‘పండ్రెండు + ఏండ్లు’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘పండ్రెండ్లేండ్ల సుపుత్రుని/ తండ్రీ...’ అందామా?
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
ఈ రోజు నిజమైన పండుగ రోజు,మంచి మంచి పూరణలు వచ్చినవి.
"భామ్మమాట బంగారు బాట"సినిమాలో శ్రీ భానుమతి గారు పూజ జేయుచు ఇంటి పనులు జూచును,అటులనే మరియొక శ్రీ మతి .
=============*================
తండ్రివి తల్లివి నీవే,
తండ్రీ!రమ్మనుచు బిలిచె తరుణి తన పతిన్
ఉండ్రాళ్ళను దిన మనుచును
కండ్రిక బోవలెను నామ కరణమ్మునకున్!
గురువుగారికి ప్రణామములు..మీ ఉండ్రాళ్ళ పూరణ చాలా చాలా భాగుంది..
రిప్లయితొలగించండితోండ్రంగివారి విందుకు
ఆండ్రకు పోవలెనువేగ నందరమిపుడున్
తాండ్రను గొనవలె రామయ!
తండ్రీ! రమ్మనుచుబిలిచె తరుణి తన పతిన్
సమస్యాపూరణం లో “oడ్రా”ప్రాస లేకుండా కందపద్యము లోనే సమస్యను పూరణ చేశాను
రిప్లయితొలగించండిచిత్తగించండి.పూరణ
ఏరా నాపిల్లలతo
డ్రీ రమ్మనుచు పిలిచె తరు*ణి తనపతిన్!సు
స్మేరాననయై పల్లెకు[స్కూలుకు]
తీరుగ పిల్లలను బంప తెలియద?మగడా!
ఉండ్రాళ్ళ తద్ది దినమున
రిప్లయితొలగించండిఉండ్రాళ్ళను బోసి పిలిచె నూ రంత యునున్
తండ్రిని భర్తను జూచుచు
తండ్రీ రమ్మనుచు బిలిచె దరుణి తన పతిన్
శ్రీ శంకరయ్య గారికి నమస్సులు
రిప్లయితొలగించండిపుండ్రములను నుదుటను గని
తండ్రి యతండని దలచుచు తాండవములతో
తీండ్ర మతి భ్రమణమ్మున
తండ్రీ రమ్మనుచుఁ బిలిచెఁ దరుణి తన పతిన్.
గుండ్రటి తొక్కుడు లడ్లును
రిప్లయితొలగించండిహండ్రెడు నేతియరిసెలును హల్వయు వడిగా
దండ్రికి గొనవలె తనయుని
తండ్రీ! రమ్మనుచు బిలిచె తరుణి తన పతిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ తిమ్మాజీ రావు గారి ప్రయోగము ప్రశంసనీయము. అభినందనలు.
రిప్లయితొలగించండిమిత్రులారా!
రిప్లయితొలగించండిఈనాటి సమస్య దుష్కర ప్రాసతో నీయబడినది. అయినను ఎక్కువ పూరణలు కావించుట అభినందనీయము. అందరి పూరణలు అలరించు చున్నవి. స్వస్తి.
ఉండ్రాళ్ళు జేసి గణపతి
రిప్లయితొలగించండితండ్రీ రమ్మనుచు బిలిచె తరుణి, తన పతిన్
గుండ్రాయినీయమనుచున్
హండ్రెడు కోకోనటులను ఆమెయె గొట్టెన్
పండిత నేమానిగారికి పూజ్య గురుదేవులు శoకరయ్యగారికి వందనములు
రిప్లయితొలగించండిమరియొక పూరణ :గోoడ్రిoపువిని భయమ్మున
తoడ్రీ రమ్మనుచు పిలిచె తరుణి తనపతిన్
యీoడ్రము[బాధ]నొందకు మనుచును
గాండ్రి౦చిన పులిని జంపె కాకుత్సు డటన్
గాండ్రించె పులి; గని సుతుడు
రిప్లయితొలగించండితండ్రీ రమ్మనుచుఁ బిలిచెఁ; దరుణి తన పతిన్
గుండ్రాతినొసగి పంపగ
తండ్రి చని పులి బరిమార్చె దక్షతతోడన్.
నాగరాజు రవీందర్ గారూ,
రిప్లయితొలగించండిమీ ‘ఆండ్రాయిడ్’ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
శైలజ గారూ,
బాగున్నవి మీ మూడు పూరణలు. అభినందనలు.
*
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
ఇలాంటి దుష్కరప్రాసకు తరుణోపాయాన్ని బోధించారు మీ పూరణతో.
మీ రెండవ పూరణ కూడ బాగున్నది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
భాగవతుల కృష్ణారావు గారూ,
బాగున్నది మీ పూరణ. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉన్నది. అభినందనలు.
మాస్టరుగారూ ! ధన్యవాదములు...మీరు చూపిన సవరణతో...
రిప్లయితొలగించండిఉండ్రాజవరపు బిడ్డడ
పుండ్రమ్ముల దాల్చువాడ పురుషోత్తముడా
పండ్రెండేండ్ల సుపుత్రుని
తండ్రీ , రమ్మనుచు బిలిచె తరుణి తన పతిన్.
గుండ్రని బొట్టును దిద్దియు
రిప్లయితొలగించండిచండ్రీ దుస్తులు ధరించి సరసములాడన్
గుండ్రాళ్ళవంటి బిడ్డల
తండ్రీ! రమ్మనుచు బిలిచె తరుణి తన పతిన్.
బొడ్డు శంకరయ్య గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘చండ్రీ’ దుస్తులని ప్రత్యేకంగా ఉన్నాయా? నేనెప్పుడూ వినలేదు.
తిమ్మాజీరావుగారి ప్రయత్నం ప్రశంసనీయము. సందేహం - "డ్రీ" కి "ణి" కి యతి కలుస్తుందా? కలిస్తే ఏ రకమైన యతి?
రిప్లయితొలగించండిచంద్రశేఖర్ గారూ,
రిప్లయితొలగించండిఅది ప్రసిద్ధమైన యతిభేదమే. బిందుయతి. బిందుపూర్వక వర్గాక్షరాలకు ఆయా వర్గాల పంచమాక్షరంతో యతి చెల్లుతుంది.
ంట, ంఠ, ండ, ంఢ, ణ లకు యతి చెల్లుతుంది.
తండ్రీ లోని బిందుపూర్వక డకారానికి ణకారం(ణి)తో యతి చెల్లింది.
మాస్టారూ, నేనూ మొదట అలానే ఆలోచించాను. కానీ వారి ప్రయత్నంలో పాద భేదం చేసి పాద ప్రథమాక్షరం మార్చారు కాబట్టి యతి నియమం కూడా మారుతుందను కొన్నాను. మారదని అర్థమయింది. ధన్యవాదాలతో-చంద్రశేఖర్
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గురుదేవులకు నమస్కారములు, చండ్రీ= అద్దిన బట్ట( ఆంధ్రభారతి నిఘంటువు)లో చూసి వ్రాయడం జరిగింది గురువు గారూ.
రిప్లయితొలగించండిమొద్దబ్బాయిని గురువు దగ్గర జేర్చ గా భార్య భర్త ను రమ్మన్నట్లు...
రిప్లయితొలగించండిగండ్రలు బలుకకు తనయుని
గుండ్రేవుల గురువు తీర్చు గొలువున నిడగా
బండ్రాయిఁ బోలు పుత్రుని
తండ్రీ , రమ్మనుచు బిలిచె తరుణి తన పతిన్!
క:
రిప్లయితొలగించండితండ్రీ దశరథ తనయా
తండ్రీ రఘురామ యనుచు ధరణీ జనముల్
తండ్రిగ తలచు కుశలవుల
తండ్రీ రమ్మనుచు బిలిచె దరుణి తన పతిన్
asnreddy
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిక: తండ్రీ దశరథ తనయా
రిప్లయితొలగించండితండ్రీ రఘురామ యనుచు ధరణీ జనముల్
తండ్రిగ తలచు కుశలవుల
తండ్రీ రమ్మనుచు బిలిచె దరుణి తన పతిన్
asnreddy
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఉండ్రా! అటుకులు జేసెద
రిప్లయితొలగించండిపుండ్రమ్ముల నేరి కూర్చి పురుహూతి కిడన్;
పండ్రెండు ధవళ ఖరముల
తండ్రీ! రమ్మనుచుఁ బిలిచెఁ దరుణి తన పతిన్
పుండ్రము = పురుగు
పురుహూతి = హరి
రిప్లయితొలగించండిబాండ్రు మనుచు కాపాడన్ ,
తండ్రీ రమ్మనుచుఁ బిలిచెఁ దరుణి, తన పతిన్,
గాండ్రుమని కేశి వెనుపడ
వేండ్రము గా శరణుగోరి వేంకట రమణున్ !
జిలేబి