5, జనవరి 2014, ఆదివారం

సమస్యాపూరణం - 1284 (గోవర్ధనపర్వతమును)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
గోవర్ధనపర్వతమును గోమలి యెత్తెన్.

39 కామెంట్‌లు:

 1. గోవుల గాచుచు ముదముగ
  గోవిందుని పైన భక్తి గోకుల మందున్
  భావము చెదరక ప్రియముగ
  గోవర్ధన పర్వతమును గోమలి యెత్తెన్

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  గోవత్సము చాటు నుండి - ఒక గోపిక ఓరచూపులతో :

  01)
  _________________________________

  గోవుల గావగ నిలిపిన
  గోవర్ధనపర్వతమును ; - గోమలి యెత్తెన్
  గోవత్సము వెనుక నిలచి,
  గోవర్థన గిరిని మోయు - గోపుని మనమున్ !
  _________________________________
  కోమలి = గొల్లభామ
  ఎత్తు = గ్రహించు
  గోపుఁడు = గొల్లవాఁడు = రాజు = గోవులకధిపతి = అనేక గ్రామముల కధిపతి = రక్షించువాడు(కృష్ణుడు)

  రిప్లయితొలగించండి
 3. ఈ సందర్భంలో మంచి పాట గుర్తుకు వస్తోంది !
  మరి మీరు కూడా విని ఆనందించండి !
  దిస్తారు కదూ !

  http://www.youtube.com/watch?v=NzBE1Ojopc8

  *****
  చిత్రం : అమెరికా అమ్మాయి
  సంగీతం : GK వెంకటేష్
  గానం : G ఆనంద్
  రచన : మైలవరపు గోపి

  ఒక వేణువు వినిపించెను - అనురాగ గీతిక
  ఒక రాధిక సంధించెను - నవరాగ మాలిక
  ఒక వేణువు వినిపించెను - అనురాగ గీతిక

  సిరివెన్నెల తెలబోయెను - జవరాలి చూపులో
  సిరివెన్నెల తెలబోయెను - జవరాలి చూపులో
  నవమల్లిక చినవోయెను
  నవమల్లిక చినవోయెను - చిరు నవ్వు సొగసులో

  ఒక వేణువు వినిపించెను - అనురాగ గీతిక

  వన రాణియె అలివేణికి - సిగ పూలు తురిమెను
  వన రాణియె అలివేణికి - సిగ పూలు తురిమెను
  రేరాణియె నా రాణికి
  రేరాణియె నా రాణికి - పారాణి పూసెను

  ఒక వేణువు వినిపించెను - అనురాగ గీతిక

  ఏ నింగికి ప్రభవించెనొ - నీలాల తారక
  ఏ నింగికి ప్రభవించెనొ - నీలాల తారక
  నా గుండెలొ వెలిగించెను
  నా గుండెలొ వెలిగించెను - శృంగార దీపిక

  ఒక వేణువు వినిపించెను - అనురాగ గీతిక
  ఒక రాధిక సంధించెను - నవరాగ మాలిక
  ఒక వేణువు వినిపించెను - అనురాగ గీతిక

  రిప్లయితొలగించండి
 4. అయ్యా ! యిదీ
  ఆ కోమలి చేష్టలకు కృష్ణుని మనసులో కలిగిన కలవరం !
  How is it ???

  రిప్లయితొలగించండి
 5. విరిగిన బొమ్మల నతికించే క్రమంలో ఒక అమ్మాయి :

  02)
  _________________________________

  బావదె తెచ్చిన బొమ్మను
  యీవిధి ముక్కలను జేసి - యెవ్విధినైనన్
  గోవులను క్రింద బేర్చగ
  గోవర్ధన పర్వతమును - గోమలి యెత్తెన్ !
  _________________________________

  రిప్లయితొలగించండి
 6. బొమ్మలు తుడవాలనే వంకతో ,బొమ్మలతో ఆడుకునే అమ్మాయి
  సంజీవిపర్వతంతోసహాపావనినీ, గోవర్ధన గిరితో సహా గోకులాన్నీఎత్తేస్తుంది అవలీలగా :

  03)
  _________________________________

  ఠీవగు బొమ్మల కొలువున
  సావాసము జేయు నెపము - సంజీవనితో
  పావనినీ, యవలీలగ
  గోవర్ధన పర్వతమును - గోమలి యెత్తెన్ !
  _________________________________

  రిప్లయితొలగించండి
 7. నాటకంలో కృష్ణుని వేషంలో నున్న అమ్మాయి
  మాయా(అట్ట)పర్వతాన్ని అందరూ చూస్తుండగా :

  04)
  _________________________________

  గోవా నందొక కృష్ణుని
  గా, వేషము వేయు వేళ - గనుచుండ జనుల్
  దేవేంద్రు నడ్డ , మాయా
  గోవర్ధన పర్వతమును - గోమలి యెత్తెన్ !
  _________________________________

  రిప్లయితొలగించండి
 8. ఇంటి ముందు దిమ్మ మీద నున్న గోవర్ధనగిరిధారి విగ్రహానికి
  బంగారు రంగు వేయుటకు కిందకు దించడంకోసమని :

  05)
  _________________________________

  సౌవర్ణ సొంపు నింపగ
  నావాసము నెదుట నున్న - నాకృతి దించన్
  సావాసి తోడు గూడగ
  గోవర్ధన పర్వతమును - గోమలి యెత్తెన్ !
  _________________________________
  ఆకృతి = శిల్పము

  రిప్లయితొలగించండి
 9. హరికథను విన్న "కువలయ" అనే ఒక యువతి..

  దేవాలయమున చెప్పిన
  గోవిందుని కథను విన్న కువలయ కలలో
  నావిషయమె స్మరియించుచు
  గోవర్ధనపర్వతమును గోమలి యెత్తెన్.

  రిప్లయితొలగించండి
 10. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
  శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...
  శ్రీ వసంత కిషోర్ గారు ఉదయాన్నే మంచి పద్యములను పాటను అందించిన మీకు ధన్యవాదములతో...

  సరదాగా గురువుగారు,నేడు చరిత్రను వక్రీకరించు వారు పెరిగిరిపొయినారు,వారు
  ================*===============
  బావను రక్షింప వడిగ
  గోవర్ధన పర్వతమును గోమలి యెత్తెన్
  భూవరుని గొలుచు వారలు
  గోవర్ధన గిరిని యెత్తె గోపాలుడనెన్!

  రిప్లయితొలగించండి

 11. మావాడ బొమ్మలాటను
  భావమ్మున గొంతునెత్తిపాడుచు కనగా
  నావేణు నాథుడొక్కడు
  గోవర్ధన పర్వతమును గోమలి యెత్తెన్

  రిప్లయితొలగించండి
 12. శ్రీవాసుడు చిత్రించెను
  గోవర్ధనపర్వతమును, గోమలి యెత్తెన్
  సేవాభావము జూపుచు
  పోవిడిచిన రంగు, కుంచె, పుల్లల నపుడున్.

  రిప్లయితొలగించండి
 13. నిన్నటి సమస్యకు నా పూరణ.

  చిద్రము గల హృదయమునకు
  భద్రముగా వైద్య మిడుచు బాగుగ జేసే
  హృద్రోగ నిపుణు లుండెడు
  హైద్రాబా దెంత దూర మయ్య కడపకున్?

  రిప్లయితొలగించండి
 14. గోవుల కాపరి యెత్తెను
  గోవర్ధనపర్వతమును గోమలి యెత్తెన్
  గోవుల మలమును మూత్రము
  నోవనజా! యీవిషయము నోపుదె వినగన్

  రిప్లయితొలగించండి
 15. ఆ వంశీధరు డెత్తెను
  గోవర్ధన పర్వతమును; గోమలి యెత్తెన్
  గోవుల కాపరి యిచ్చిన
  పూవును,సంతసము నంది ముడిచెను సిగలో.

  రిప్లయితొలగించండి
 16. గోవిందుడు గోటనిలుప
  గోవర్ధన పర్వతమును, గోమలి యెత్తెన్
  బూవులఁ దాల్చిన శిరమును
  మూవల కృష్ణుని సుమధుర మూర్తిని జూడన్!

  రిప్లయితొలగించండి
 17. జీవించె బాలకృష్ణుని
  పావనమగు పాత్రయందు బాలనటీ "శ్రీ
  దేవి" - "యశోదా కృష్ణ"ను!
  గోవర్ధన పర్వతమును గోమలి యెత్తెన్

  రిప్లయితొలగించండి


 18. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  కావిరి బాలుడు యెత్తెను
  గోవర్ధన పర్వతమును. గోమలి యెత్తెన్
  గావిరి బాలుని బ్రీతి య
  దావిది గా దిష్టి తీసి తాయెతు గట్టెన్

  రిప్లయితొలగించండి
 19. గోవిందా! నేనెత్తెద
  గోవర్ధన గిరినటంచు కొంటెతనముతో
  నావల నొక పటమునగల
  గోవర్ధన పర్వతమును కోమలి యెత్తెన్

  రిప్లయితొలగించండి
 20. శ్రీ కంది శంకరయ్య మరియు శ్రీ పండిత నేమాని గురువరులకు వందనములు
  అంతర్జాలములో అంతరాయము జరిగినందున నిన్నటి మరియు ఈ రోజు
  పద్యములను పూరించి పంపిస్తున్నాను. ధన్యవాదములు

  మద్రాసు కంటె నెక్కువ
  హైద్రాబా దెంతదూర మయ్య కడపకున్?
  భాద్రపద శుక్ల చవితికి
  రుద్రుని సుతు వేడ్క గన నరుగుద మటకే

  బ్రోవగ గోవుల నెల్లను
  గోవర్ధన పర్వతమును గోమలి! యెత్తెన్
  శ్రీ వెన్నుడు, జనులతి స
  ద్భావనతో గొలిచిరంత తన్మయు లగుచున్.

  రిప్లయితొలగించండి
 21. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ ప్రయత్నం ప్రశంసనీయమే. కాని సమస్య పరిష్కరింపబడినట్లు లేదు.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ ఐదు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  అమెరికా అమ్మాయి చిత్రంలోని పాటను తెలియజేసినందుకు ధన్యవాదాలు. నాకేమో ఆ చిత్రంలోని ‘పాడనా తెలుగుపాట...’, ‘ఆనందతాండవ మాడే శివుడు..’ పాటలు చాలా ఇష్టం.
  *
  హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ (నిన్నటిది కూడా) బాగున్నది. అభినందనలు.
  నిన్నటి పూరణలో ‘చేసే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. అక్కడ ‘బాగుగ జేయన్’ అందామా?
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
  చక్కని పూరణ నందించారు. అభినందనలు.
  ‘నటీ’ అని దీర్ఘాంతంగా కాకుండా ‘నటియె’ అంటే బాగుంటుందేమో!
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  (నిన్నటి దానితో సహా) మీ పూరణలు బాగున్నవి. ముఖ్యంగా నేటి పూరణలో కోమలి శబ్దాన్ని సంబోధనగా చేయడం వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. రావుల పాలెపు పావని
  గోవిందునిపాత్రదాల్చిగూర్చెనుశోభన్
  దేవేంద్రునిదర్పమణచ
  గోవర్ధనపర్వతమును గోమలియెత్తెన్ !!!

  రిప్లయితొలగించండి
 23. హా! విరహమెసగి చేరియె
  గోవర్ధన పర్వతమును, గోమలి యెత్తెన్
  బూవిలుకానిపతాకము
  గోవిందుడు చూచి చేరి కోర్కుల దీర్చన్.

  రిప్లయితొలగించండి
 24. మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  రామకృష్ణ గారూ,
  బాగున్నది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 25. శంకరయ్య గారు!

  "నటి" ఈకారాంత శబ్దమే! సమాసం చేస్తే అలాగే ప్రయొగిస్తాం కదా! ఉదా: నటీనటులు. అయితే తెలుగు చేసినప్పుడు - "నటి" అని ప్రయోగించినా తప్పు లేదు. అలాగని "నటీ" అనడం కూడా తప్పు కాదు. పండితులు ఉభయ రీతుల ప్రయోగించవచ్చని తేల్చారు.

  రిప్లయితొలగించండి
 26. "నటియె" అంటూ "యె" అనే వ్యర్థాక్షరాన్ని జోడించే బదులు "నటీ" అనడమే ఉత్తమమని నా అభిప్రాయం. అందుకే అలా ప్రయోగించాను.

  రిప్లయితొలగించండి
 27. డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
  మీ వివరణ సంతృప్తి నిచ్చింది. స్వస్తి!

  రిప్లయితొలగించండి
 28. హావము, భావములన్ని ప్ర
  భావము జూపెడు నటనను బలికించుచు తా
  నా వేదికపై హరి వలె
  గోవర్ధన పర్వతమును గోమలి యెత్తెన్.

  రిప్లయితొలగించండి
 29. చిద్రము గల హృదయమునకు
  భద్రముగా వైద్య మిడుచు బాగుగ జేసే
  హృద్రోగ నిపుణు లుండెడు
  హైద్రాబా దెంత దూర మయ్య కడపకున్?"
  ------------------------
  Shankaraiah Boddu గారూ -- వావ్

  రిప్లయితొలగించండి
 30. లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  లక్కరాజు వారూ,
  ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 31. పావని ఇందిర గాంధీ
  ఠీవిగ బంగ్లాను బ్రోచి ఢిల్లీ నెత్తెన్;
  జీవులు పండుగ జేయగ
  గోవర్ధనపర్వతమును గోమలి యెత్తెన్

  రిప్లయితొలగించండి


 32. ఆ వాసుదేవుడెత్తెను
  గోవర్ధనపర్వతమును ;గోమలి యెత్తెన్
  తా వాసము కై జోతలు
  రావా కనరావ యనుచు రారాజు సభన్ !

  జిలేబి

  రిప్లయితొలగించండి
 33. పోవుచు నమేఠి కడకున్
  ఠీవిగ మీసమును త్రిప్పి ఢీఢీ కొట్టన్
  చావగ రాహులుడచ్చట
  గోవర్ధనపర్వతమును గోమలి యెత్తెన్

  రిప్లయితొలగించండి


 34. ఆవల నెత్తగ కన్నడు
  గోవర్ధన పర్వతమును, గోమలి యెత్తెన్
  నీవే గిరిధర దిక్కని
  కైవల్య పదమును గోరి కరముల సుదతీ!


  జిలేబి

  రిప్లయితొలగించండి