15, జనవరి 2014, బుధవారం

సమస్యాపూరణం - 1294 (తొయ్యలిఁ దునుమాడినట్టి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
తొయ్యలిఁ దునుమాడినట్టి దొరను నుతింతున్.

26 కామెంట్‌లు:

 1. నెయ్యమును జూపి చిరు క
  న్నయ్యకు చన్నిచ్చి వాని యసువుల గొనబో
  చయ్యన మోసము గని యా
  తొయ్యలి దునుమాడినట్టి దొరను నుతింతున్

  రిప్లయితొలగించండి
 2. అయ్యదనున దుష్టాత్మక
  యియ్యదియని గురుడు పలుక నింతి యటంచున్
  నెయ్యము తలపక దనుజుల
  తొయ్యలి దునుమాడినట్టి దొరను నుతింతున్.

  రిప్లయితొలగించండి
 3. అయ్యారే పూతనతన
  కియ్యమ్మాయని పిల్లవాని కీయగ పాలన్
  చయ్యన బీలిచి ప్రాణము
  తొయ్యలి దునుమాడినట్టి దొరను నుతింతున్.

  ఇయ్యడవి దీనియాగడ
  మియ్యదియని తెలుపలేను యీక్షణమే రా
  మయ్యా చంపుమనగురుడు
  తొయ్యలి దునుమాడినట్టి దొరను నుతింతున్.

  రిప్లయితొలగించండి
 4. గురుదేవులకు, బ్లాగు కవిమిత్రులకు మరియు వీక్షకులకు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు.
  నిన్నటి పూరణ:
  కమనీయంబగు దృశ్యమై సుజల మాగాణమ్మ కోస్తా, సదా
  రమణీయంబగు క్షేత్ర రాజముల నారాధించ సీమాదితో
  గమనం బన్నది చూపు భాగ్యనగరాగారం తెలంగాణ తో
  సమకూర్చున్ సకలాంధ్ర , సజ్జనులకున్ సంక్రాంతి శ్రీసౌఖ్యముల్!
  నేటి పూరణ:
  అయ్యా! మేమీ నరకుని
  మొయ్యగ లేమయ్య! ద్రుంచి బ్రోవుమనంగన్
  చయ్యన వెంట నడువ నా
  తొయ్యలి, దునుమాడి నట్టి దొరను నుతింతున్

  రిప్లయితొలగించండి
 5. గురువులకు, పెద్దలకు, కవిమిత్ర బృందానికీ మకర సంక్రమణ పుణ్యాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 6. శంకరయ్య గురదేవులకు, నేమాని గురుదేవులకు ప్రణమిల్లుతూ, కనుమ పండుగ శుభాకాంక్షలతో...

  రయ్యన కృష్ణుని జంపగ
  నెయ్యముతో మాటలాడు నెలతనుజూడన్
  అయ్యది వంచన గనుగొని
  తొయ్యలి దునుమాడినట్టి దొరను నుతింతున్

  రిప్లయితొలగించండి
 7. అయ్యో యని రాజులు న-
  మ్మయ్యో యని పౌరులనగ హరుచాపమ్మున్
  వ్రయ్యలుగా, కన ప్రియమౌ
  తొయ్యలి, దునుమాడినట్టి దొరను నుతింతున్

  రిప్లయితొలగించండి
 8. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 9. అయ్యా ! వినుడీ సంగతి
  కయ్యము,నకు సిద్ధ బడగ కన్నడు గనుచు
  న్నయమ దా టకి జంపగ
  తొయ్యలి దునుమాడి నట్టి దొరను నుతింతున్

  రిప్లయితొలగించండి
 10. ఉయ్యెలలోపడుకొను కృ
  ష్ణయ్యకు జనుపాల నిచ్చి చంపుట కొరకై
  నెయ్యము జూపుచు వచ్చిన
  తొయ్యలి దునుమాడినట్టి దొరను నుతింతున్.

  రిప్లయితొలగించండి
 11. సయ్యాటలాడు తన క
  న్నయ్యను జిక్కించుకొనెడి నాటకమందున్
  గయ్యాళి తనముఁ జూపుచు
  తొయ్యలి దునుమాడినట్టి దొరను నుతింతున్.

  తొయ్యలి = సత్యభామ
  దునుమాడు = నిందించు

  రిప్లయితొలగించండి
 12. నెయ్యిగ నయ్యెను దక్షజ
  చయ్యన మిన్నంటె శివుని జ్వాలేక్షణముల్
  అయ్యాగ్రహమును మాన్పగ
  తొయ్యలిఁ దునుమాడినట్టి దొరను నుతింతున్.

  రిప్లయితొలగించండి
 13. మిత్రులారా! శుభాశీస్సులు.
  అందరికి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. అందరి పూరణలు అలరించు చున్నవి. అభినందనలు.

  శ్రీ హరి...మూర్తి గారు:
  తాటక సంహారము గూర్చి మీ పూరణ చాల బాగుగ నున్నది.

  శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
  మీ 2 పద్యములు -- 1. పూతన మరియు 2. తాటక గురించి బాగుగ నున్నవి.
  1వ పద్యము 2వ పాదములో గణభంగమును సవరించ వలెను.

  శ్రీ నాగరాజు రవీందర్ గారు:
  తాటక సంహారమును గురించి మీ పద్యము బాగుగ నున్నది. అన్వయము ఇంకను స్పష్టముగా నుండుట మంచిది.

  శ్రీ సహదేవుడు గారు:
  మీ పూరణ బాగుగ నున్నది. మొయ్యగ లేము అనుట వ్యావహారికము.

  శ్రీమతి శైలజ గారు:
  మీ పూరణ బాగుగ నున్నది. అన్వయము స్పష్టముగా లేదు.

  శ్రీ మిస్సన్న గారు:
  నరకాసుర వధ గూర్చి మీ పూరణ వినూత్నముగా నున్నది.

  శ్రీ సుబ్బా రావు గారు:
  మీ పద్యము బాగుగ నున్నది. 3వ పాదములో ప్రాస నియమము లోపము కలదు - గణభంగము కలదు. అన్వయము స్పష్టముగా లేదు.

  శ్రీ లక్ష్మీనారాయణ గారు:
  పూతన గురించి మీ పద్యము చాల బాగుగ నున్నది.

  శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారు:
  మీ పద్యము సత్యభామా దేవి గురించి వినూత్నముగ నున్నది - అన్వయము ఇంకను స్పష్టముగా నున్నచో బాగుండును.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 14. గురువర్యా ! ధన్యవాదములు. గణ దోష సవరణ చేయుచున్నాను.

  అయ్యారే పూతనతన
  చెయ్యందించుచును పాలు చేరిచి కుడుపన్
  చయ్యన బీలిచి ప్రాణము
  తొయ్యలి దునుమాడినట్టి దొరను నుతింతున్.

  రిప్లయితొలగించండి
 15. వయ్యారపు పలుకులతో
  నెయ్యము జేయుచు మగువల నెట్టి పడుపునన్
  చయ్యన తప్పుక తిరుగెడు
  తొయ్యలిఁ దునుమాడినట్టి దొరను నుతింతున్.

  రిప్లయితొలగించండి

 16. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు

  అయ్యా! పైడిర్రిని రా
  మయ్యా!పెంచెదను నేను యందనిచో చం
  పయ్యా యని మోజు పడెను
  తొయ్యలి !దునుమాడి నట్టి దొరను నుతింతున్

  రిప్లయితొలగించండి
 17. సాహితీ మిత్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ నాటి సమస్యలో కొందరు అరసున్న వదిలివేసి సమస్యను పూరించారు. నాకున్న పరిమిత జ్ఞానంలో అరసున్న వదిలివేస్తే అర్థం మారిపోతుంది. అట్లా పూరించటం సరియేనా?

  రిప్లయితొలగించండి
 18. శ్రీ చంద్రశేఖర్ గారి సందేహము నాకూ వచ్చింది. ఆ ప్రకారము అన్వయం కొఱకు సవరించిన పూరణ:
  అయ్యా! మేమీ నరకుని
  మొయ్యగ లేమయ్య! ద్రుంచి
  బ్రోవుమనంగన్
  చయ్యన తనతో గొని యా
  తొయ్యలిఁ, దునుమాడి నట్టి
  దొరను నుతింతున్
  (గురుదేవులు పరిశీలించ ప్రార్థన. శ్రీ మిస్సన్న గారి నరకాసుర వధ పద్యం బ్లాగులో కనిపించ లేదు.)

  రిప్లయితొలగించండి
 19. శ్రీ నేమని గురుదేవులకు ధన్యవాదములు. తమరి సూచన మరియు శ్రీచంద్రశేఖర్ గారి సందేహము ప్రకారం సవరించిన పద్యం:
  అయ్యా! తమరీ నరకుని
  రయ్యన ద్రుంచుమని వేడ, రక్కసు గూల్చన్
  చయ్యన తనతో గొని యా
  తొయ్యలిఁ, దునుమాడి నట్టి
  దొరను నుతింతున్

  రిప్లయితొలగించండి
 20. పూజ్యులు నేమానివారికి, మిత్రులు శంకరయ్యగారికి, సాహితీమిత్రులందరికి మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మన తెలుగు చంద్రశేఖర్‍గారూ,తమరి సందేహములో సామంజస్యమున్నది. సమస్యలో..."తొయ్యలిన్+తునుమాడినట్టి దొరను నుతింతున్" అని తొయ్యలిన్...శబ్దము ద్వితీయాంతము! ద్వితీయాంతముగ పూరించిన మిత్రులందరి పూరణములు సరియైనవనవలెను. ప్రథమాంతముగ పూరించిన మిత్రులు సవరించుకొనవలసియుండునని నా అభిప్రాయము.
  అరసున్నా విషయములో మన మిత్రులు వ్యాకరణమును, అర్థముననుసరించి పూరణచేయవలయును.
  తమరు గమనించినందులకు అభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 21. మిత్రులారా! శుభాశీస్సులు.
  శ్రె చంద్రశేఖర్ గారు అరసున్న గురించి విలువైన సూచన చేసేరు. పిదప శ్రీ గుండు మధుసూదన్ గారు మరికొంత వివరణ చేసేరు. చాల బాగుగ నున్నది. సంతోషము. దాని ననుసరించి కొందరు మిత్రులు కొన్ని సవరణలతో మళ్ళీ పూరణలు చేసేరు -- శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు, శ్రీ సహదేవుడు గారు, శ్రీ నాగరాజు రవీందర్ గారు. అన్ని పూరణలును బాగుగ నున్నవి.

  శ్రీ ఆదిత్య గారు: మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. పద్యము ముగింపులోని భావము మాకందుట లేదు.

  శ్రీ బొడ్డు శంకరయ్య గారు: వారకాంతల వీధులలోని మోసకత్తెలను గురించి వినూత్నంగా చెప్పేరు. బాగుగ నున్నది పద్యం. అభినందనలు.

  శ్రీ తిమ్మాజీ రావు:మీ పూరణ బాగుగ నున్నది. అభినందనలు. కాని సమస్యను ద్వితీయాంతముగా మీరు తీసికొనలేదు.

  స్వస్తి

  రిప్లయితొలగించండి
 22. నేమాని పండితార్యా! నా పూరణ శివ ధనుర్భంగమును గూర్చి చేశాను. నరకాసుర వధ కాదు.

  అరసున్నను దృష్టిలో పెట్టుకొని సవరణ:

  అయ్యో యని రాజులు న-
  మ్మయ్యో యని పౌరులనగ హరుచాపమ్మున్
  వ్రయ్యలుగా, గొన ప్రియమౌ
  తొయ్యలిఁ, దునుమాడినట్టి దొరను నుతింతున్

  రిప్లయితొలగించండి

 23. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
  శంకరయ్య గారికి వందనములు


  మరియొకపూరణ:కయ్యమ్ముకు కాల్దువ్వ్వుచు
  దయ్యమువలె దుముకుచున్న దానవి లంకన్
  కుయ్యోమనంగ మోదుచు
  తొయ్యలి దునుమాడినట్టి దొరను నుతింతున్

  రిప్లయితొలగించండి
 24. తియ్యని బాల్యస్మృతులను
  బియ్యపుటటుకులు పిడికెడు బిరబిర తేగా
  నెయ్యముతో దారిద్ర్యపు
  తొయ్యలిఁ దునుమాడినట్టి దొరను నుతింతున్

  రిప్లయితొలగించండి
 25. తియ్యగ నవ్వుచు బోసిగ
  కయ్యము జేయుచును మెండు గారము తోడన్
  దయ్యపు శృంఖల మనబడు
  తొయ్యలిఁ దునుమాడినట్టి దొరను నుతింతున్

  రిప్లయితొలగించండి