అమ్మా! శ్రీమతి లక్ష్మీ దేవి గారూ! మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. న + ఇష్టము = అనిష్టము అగును, మరొక విధముగా నేష్టము అగును. అయిష్టము అనరాదు. స్వస్తి.
అయ్యా! శ్రీ వరప్రసాద్ గార్! శుభాశీస్సులు. మీ 2 పద్యములను చూచితిని. అభినందనలు. కొన్ని సవరణలు: 1వ పద్యములో 3వ పాదమునకు సరియైన అర్థము లేదు. ఇలాగ మార్చుదాము: "వైరితతికేని వరమిడు భద్రమూర్తి" 2వ పద్యములో 2వ పాదమును ఇలాగ మార్చుదాము: "పెండ్లి యాడెను వేడ్కతో విష్ణుమూర్తి"
అయ్యా! శ్రీ నాగరాజు రవీందర్ గారూ! శుభాశీస్సులు. మీ 2 పద్యములును బాగుగ నున్నవి. అభినందనలు. మర్త్యులార! అను సంబోధనకి బదులు మనుజులార! అంటే బాగుండును. మర్త్యులార అంటే మరణించు స్వభావము గలవారూ అని అర్థము. స్వస్తి.
పండిత నేమాని వారూ, ఇప్పుడే ఇల్లు చేరాను. మీరు బ్లాగుపట్ల చూపుతున్న ఆదరానికి ధన్యవాదాలు. పాశురముల ప్రాశస్త్యాన్ని తెలియజేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. * హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ, మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు. * రాజేశ్వరి అక్కయ్యా, మీ పూరణ బాగున్నది. అభినందనలు. గురువులు నేమాని వారి సవరణను గమనించారు కదా! * నాగరాజు రవీందర్ గారూ, మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. నేమాని వారి సూచనను గమనించండి. * ‘అష్టావధాని’ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ, చాలా కాలానికి మాపట్ల దయచూపించారు. సంతోషం. మీ పూరణ బాగున్నది. అభినందనలు. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * వరప్రసాద్ గారూ, మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు. నేమాని వారి సవరణలను గమనించండి. * లక్ష్మీదేవి గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు. నేమాని వారి సూచన ననుసరించి మొదటి పాదాన్ని ‘ఇష్టము ననిష్ట మనునవి యేమి లేని’ అనండి. * శైలజ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘పాశురము’లను ‘పాసురము’ లన్నారు. అలాకూడా అంటారేమో నాకు తెలియదు. రెండవ పాదం చివర గణదోషం. ఆ పాదాన్ని ‘పాశురముల పఠనము శుభప్రదమ్ము’ అందాం.
శ్రీ బొడ్డు శంకరయ్య గారూ! శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. శిష్యులను స్త్రీలు - అని అన్నారు కదా. శిష్యులు అంటే స్త్రీలింగము కాదు. శిష్యురాండ్రు స్త్రీలింగము అగును. అందుచేత శిష్య రమణుల బొందుచు అని మార్చుదామా? స్వస్తి.
భూతదయలేక, స్వార్థైకపూర్ణుడగుచు,
రిప్లయితొలగించండిమానవత్వంబు కోల్పోయి, మత్సరించి
సతము చరియించుచుండెడి జనుడుచదువు
పాశురములను హరి యిష్టపడుట కల్ల.
తులసి వనమున లభియించె కలికి గోద
రిప్లయితొలగించండిఎదను ధరియించి మాలను ముదము నొసగె
రంగ నాధుడు గెలిచిన భోగి కంటె
పాశుర ములను హరియిష్ట పడుట కల్ల
భోగి = గోదా దేవి భగ వంతునిలో ఐక్య మైన రోజు భోగి గనుక
పాశురములను హరి యిష్టపడుట కల్ల
రిప్లయితొలగించండికాదు, సత్యంబు మార్తాండు డాదరమున
ధనువు నందుండు మాసాన జనుడెవండు
పఠన చేయునొ సౌఖ్యంబు వానికబ్బు.
పాశురంబుల రచియించి భక్తి మెరయ
రిప్లయితొలగించండిధన్యయయ్యెనుగాదె వదాన్య "గోద"
పాశురములను హరియిష్ట పడుట కల్ల
గాదు; మిక్కిలి ప్రీతియే కనగ నిజము!!
చిత్తమందున భక్తి కించిత్తులేక
రిప్లయితొలగించండిదానధర్మాదిసద్గుణాధారుడవక
స్వార్థ చింతన జేయుచు పలుకునట్టి ( పాడునట్టి )
పాశురములను హరి యిష్టపడుట కల్ల.
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
=============*===========
పాశురములను హరియిష్ట పడుట కల్ల
యనుట కష్టము జనులార! అవని యందు
వైరి తతికి వరము లిచ్చు భక్త వరుడు,
హరి యనిన జాలు గావగ పరుగు లిడగ!
ఇష్టమునయిష్టమనునది యేమి లేని
రిప్లయితొలగించండివాడు శ్రీహరి యనుమాట పరమ సత్య
మయిన చెప్పదగు మనకు ననెద నేను -
పాశురములను హరి యిష్టపడుట కల్ల.
సకల వేదాంత విజ్ఞాన సౌరభములు
రిప్లయితొలగించండిదనరు సుమహారములె యవి యనుచు బొంగు
పాశురములను హరి, యిష్ట పడుట కల్ల
కల్ల బొల్లి విచిత్రముల్ కలుగు కథలు
అమ్మా! శ్రీమతి లక్ష్మీ దేవి గారూ!
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
న + ఇష్టము = అనిష్టము అగును, మరొక విధముగా నేష్టము అగును. అయిష్టము అనరాదు.
స్వస్తి.
రిప్లయితొలగించండిపాశురములు పణతి పాడ పరవశించి
పెండ్లి యాడె!కరివరద!విష్ణు మూర్తి!
పాశురములను హరియిష్ట పడుట కల్ల
గాదు!వినుడు సుజనులార!కలియుగమున!
అమ్మా! శ్రీమతి రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
రంగనాథుడు గెలిచిన భోగి కంటె - అను పాదములో యతి మైత్రి లేదు. ప్రాస యతి కూడా సరిపోదు. ఇలాగ మార్చుదాము:
"పుష్కరాక్షుడు గెలిచిన భోగి కంటె"
స్వస్తి.
అయ్యా! శ్రీ వరప్రసాద్ గార్! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ 2 పద్యములను చూచితిని. అభినందనలు. కొన్ని సవరణలు:
1వ పద్యములో 3వ పాదమునకు సరియైన అర్థము లేదు. ఇలాగ మార్చుదాము:
"వైరితతికేని వరమిడు భద్రమూర్తి"
2వ పద్యములో 2వ పాదమును ఇలాగ మార్చుదాము:
"పెండ్లి యాడెను వేడ్కతో విష్ణుమూర్తి"
స్వస్తి.
అయ్యా! శ్రీ నాగరాజు రవీందర్ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ 2 పద్యములును బాగుగ నున్నవి. అభినందనలు.
మర్త్యులార! అను సంబోధనకి బదులు మనుజులార! అంటే బాగుండును.
మర్త్యులార అంటే మరణించు స్వభావము గలవారూ అని అర్థము.
స్వస్తి.
చి. పార్వతీశ్వర శర్మ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండినీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
ధన్య యయ్యెను గాదె వదాన్య గోద అనే పాదమును ఇలాగ మార్చుదాము:
"ధన్య యయ్యెను గాదె పద్మముఖి గోద"
స్వస్తి.
పాసురంబులు పాడెను పడతి గోద
రిప్లయితొలగించండిపాసురములను చదువగ పరమ పుణ్యం
పాసురములనుహరి యిష్టపడుట కల్ల
కాదు పరమప్రీతిహరికి గానమనిన
శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
రిప్లయితొలగించండిసవరణలతో
=============*================
పాశురములను హరియిష్ట పడుట కల్ల
యనుట కష్టము జనులార!అవని యందు
వైరితతికేని వరమిడు భద్రమూర్తి
హరి యనిన జాలు గావగ పరుగు లిడగ!
పాశురములు పణతి పాడ పరవశించి
పెండ్లి యాడెను వేడ్కతో విష్ణు మూర్తి!
పాశురములను హరియిష్ట పడుట కల్ల
గాదు!వినుడు సుజనులార!కలియుగమున!
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిఇప్పుడే ఇల్లు చేరాను.
మీరు బ్లాగుపట్ల చూపుతున్న ఆదరానికి ధన్యవాదాలు.
పాశురముల ప్రాశస్త్యాన్ని తెలియజేసిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
గురువులు నేమాని వారి సవరణను గమనించారు కదా!
*
నాగరాజు రవీందర్ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
నేమాని వారి సూచనను గమనించండి.
*
‘అష్టావధాని’ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
చాలా కాలానికి మాపట్ల దయచూపించారు. సంతోషం.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
నేమాని వారి సవరణలను గమనించండి.
*
లక్ష్మీదేవి గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
నేమాని వారి సూచన ననుసరించి మొదటి పాదాన్ని ‘ఇష్టము ననిష్ట మనునవి యేమి లేని’ అనండి.
*
శైలజ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘పాశురము’లను ‘పాసురము’ లన్నారు. అలాకూడా అంటారేమో నాకు తెలియదు.
రెండవ పాదం చివర గణదోషం. ఆ పాదాన్ని ‘పాశురముల పఠనము శుభప్రదమ్ము’ అందాం.
ఇష్టముననిష్టము అని అనవచ్చునాండీ?
రిప్లయితొలగించండిగురువు గారు, ధన్య వాదములు. మీ వ్యాఖ్య ఇప్పుడే చూసినాను.
రిప్లయితొలగించండిధన్యవాదములు గురువుగారు,..పాసురములని నేనే తప్పుగా టైపు చేసాను..
రిప్లయితొలగించండిపాశురంబులు పాడెను పడతి గోద
పాశురముల పఠనము శుభప్రదమ్ము
పాశురములనుహరి యిష్టపడుట కల్ల
కాదు పరమప్రీతిహరికి గానమనిన
పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
అమెరికానందు శ్రీ హరి యవతరించె.
నమరె పాశ్యాత్యనాట్య భంగిమల జోరు;
భక్తి శ్రద్ధలపూజలు బడసె. నింక
పాశురములను హరి యిష్ట పడుట కల్ల
యనుట. భావ్యము కాదని మనవిసేతు
+
గోద త్రికరణ శుద్ధిగఁ గోరి ప్రభుని
రిప్లయితొలగించండిముక్త మాలల సేవించ మోద మంది
పరవశమున గోవిందుడె వచ్చె,యెటుల
పాశురముల హరియిష్టపడుట కల్ల?
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములతో...
రిప్లయితొలగించండి============*==============
పాశురములు "గోద" పాడ పరవశించి రంగడా
దేశము నిడె భక్తునకును తెమ్ము తులసి మాలలన్
పాశురములు పాడుచున్న పడచు పరిణయమునకున్
పాశురములను హరియిష్ట పడుట కల్ల గాదు నిజముగన్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభక్తి పేరున గురువులు బాగుగాను
రిప్లయితొలగించండిసొమ్ములను కూడ బెట్టుచు సొగసుగాను
శిష్యులగు స్రీల బొందుచు చేయు భజన
పాశురములను హరి యిష్టపడుట కల్ల
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
‘అమెరికా యందు’ అనండి.
*
సహదేవుడు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
ఉత్సాహంతో ఉరకలు వేసే నడకతో మీ పూరణ మనోరంజకంగా ఉంది. అభినందనలు.
*
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
పూజ్య గురువులకు ప్రణా మములు
రిప్లయితొలగించండిపొర పాటును తెలిపి నందులకు ధన్య వాదములు
శ్రీ బొడ్డు శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
శిష్యులను స్త్రీలు - అని అన్నారు కదా. శిష్యులు అంటే స్త్రీలింగము కాదు. శిష్యురాండ్రు స్త్రీలింగము అగును. అందుచేత శిష్య రమణుల బొందుచు అని మార్చుదామా?
స్వస్తి.
శ్రీవరప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ ఉత్సాహము బాగుగ నున్నది. అభినందనలు. 4వ పాదములో అక్షరములు ఎక్కువగా నున్నవి.
స్వస్తి.
గురుదేవులు పండిత నేమాని గారికి సమీక్షకు కృతజ్ఞతలు, సవరణతో.........
రిప్లయితొలగించండిభక్తి పేరున గురువులు బాగుగాను
సొమ్ములను కూడ బెట్టుచు సొగసుగాను
శిష్యురాండ్రను బొందుచు చేయు భజన
పాశురములను హరి యిష్టపడుట కల్ల.
సూర్యుడుదయించుటకుమును స్తుతులు జేయ
రిప్లయితొలగించండిలేక నిదురకు లొంగుటన్, లేదు భేద
మనెడు భ్రాంతి రాత్రములందుఁ అలసి పాడు
పాశురములను హరి యిష్టపడుట కల్ల