అగ్ని ప్రమాదములో ఒళ్ళంతా కాలి ముఖం వికృతంగా మారి దిన దిన గండం నూరేళ్ళాయుష్షు లాంటి పరిస్థితిలో బాధను భరిస్తూ,సిగ్గు పడుతూ, భయపడుతూ బ్రతకడం కన్నా, యమునిష్టపడడమే మేలు గదా !
పూర్వం తెరచాప పడవ లుండేవి ! దాని దిశను మార్చడానికి తెడ్డు నుపయోగించే వారు ! నదిలో నీళ్ళు వేగంగా ప్రవహిస్తుంటాయి ! గాలికూడా గట్టిగానే వీస్తుంటుంది ! అకస్మాత్తుగా గాలి దిశ మారుతుంది ! అంతే పడవ ఒక పక్కకు ఒరిగిపోయి ప్రయాణిస్తుంది ! ఎంత ఒరుగుతుందంటే పడవ పై అంచు నీటికి తాకేటంతగా ! ప్రయాణీకుల గుండెలు ముందు గుబగుబలాడి , గబ గబా కొట్టుకోవడం మొదలౌతుంది ! కాని ఎవ్వరూ కదలకూడదు ! ఎక్కడి వారక్కడే స్థిరంగా ఉండాలి ! కంగారు పడి కదిలారో !!! పడవ తిరగబడి పోతుంది ! గజ ఈతగాళ్ళైతే తప్ప బ్రతికి బట్టకట్ట లేరు ! ఆ పరిస్థితిలో అందరూ కోరుకునేదీ,ప్రార్థించేదీ నిరపాయ స్థితినే గదా :
వసంత కిశోర్ గారూ, అనునయమును, యముని, సహాయమును, నిరపాయమును ఇష్టపడుతున్న మీ అయిదు పూరణలూ బాగున్నవి. అభినందనలు. మొదటి పూరణలో ‘అందించు + అనునయము’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘అందించు ననునయము’ అనాలి. రెండవ పూరణలో ‘వికృతి జెందన్’ అన్నచోట గణభంగం. అక్కడ ‘వికృతము గాఁగన్’ అంటే సరి. * హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ, సాయము, న్యాయము, ధ్యేయములతో మీరు చెప్పిన మూడు పూరణలూ బాగున్నవి. అభినందనలు. * లక్ష్మీదేవి గారూ, ‘సమవర్తి’ పదాన్ని సార్థకంగా ప్రయోగించారు. పూరణ బాగున్నది. అభినందనలు. * శైలజ గారూ, జయము నిష్టపడిన మీ పూరణ బాగున్నది. అభినందనలు. * గోలి హనుమచ్ఛాస్త్రి గారూ, మంచి భావంతో సాయము నిష్టపడిన మీ పూరణ బాగుంది. కాని ప్రాస తప్పింది (సంపత్ కుమార్ శాస్త్రి గారు చెప్పకుంటే నేను గమనించకపోయేవాణ్ణి సుమా!) ప్రాసను సరిచేస్తూ మీ పద్యానికి నా సవరణ.... తమ తమ కిష్టమ్మగు కా లము లేకన్ భయము నిడుములను పడి తుద వే గమునను తొలగింపగ సా యము నిష్టపడంగ నొప్పు నఖిలప్రాణుల్. * సంపత్ కుమార్ శాస్త్రి గారూ, ప్రాయముతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు. ‘కోడె ప్రాయము’ అన్నప్పుడు ‘డె’ గురువు కాదు. దానితో గణభంగ. అక్కడ ‘తరుణప్రాయము’ అందాం. * నాగరాజు రవీందర్ గారూ, ప్రేమమయంగా మీరు చెప్పిన పూరణ బాగున్నది. ‘జగతిని’ అనడం సాధువు. ‘స్వాభావ్యమునన్’ అన్నచోట ‘స్వాభావికమై’ అంటే బాగుంటుందేమో. * భాగవతుల కృష్ణారావు గారూ, హితనికాయముతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు. * పండిత నేమాని వారూ, ‘సర్వే జనాస్సుఖినో భవంతు’ అన్నట్టు జనశ్రేయమును కోరిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు. * సుబ్బారావు గారూ, సాయము నిష్టపడుతూ చెప్పిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
శ్రీ కంది శంకరయ్య గారికి శుభాశీస్సులు. వ్యతిరేకార్థక పదములు కళలే కదా. లేకన్ అని వాడరాదనుకొంటాను. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారి పద్యమును సవరించుచు మీరు చెప్పిన పద్యములో లేకన్ అనే పదము తప్పుగా దొరలినది. చూడండి. స్వస్తి.
శ్రీ సంపత్ కుమార శాస్రి గారూ! శుభాశీస్సులు. మీ పద్యములో కోడె ప్రాయము అనుట కుసంధి కాదు. సమాసములో మొదటి పదంగా తెలుగు పదమును వాడవచ్చును. మొదటి పదము సంస్కృతము అగునప్పుడు 2వ పదమును తెలుగు పదమును వాడరాదు. స్వస్తి.
శ్రీమతి శైలజ గారూ! శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. 3వ పాదములో టైపు పొరపాటు దొరలినట్లున్నది. కువయము అను పదము లేదు కదా. చూడండి. స్వస్తి.
పండిత నేమాని వారూ, ధన్యవాదాలు. నిజమే. అక్కడ తప్పు చేశాను. ‘లేకన్’ అన్నదాన్ని ‘లేకయె’ అని చదువుకొనమని మనవి. * శైలజ గారూ, మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు. మూడవ పాదంలో ‘కువల’ లో ‘ల’ టైపు కాలేదు.
కెంబాయి తిమ్మాజీ రావు గారూ, ప్రాయపు దశలను వివరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు. * మిస్సన్న గారూ, మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు. ‘సంయమి’ శబ్దం ఉన్నది కానీ ‘సంయముడు’ శబ్దం ఉన్నట్టు వినలేదు!
మిస్సన్న గారూ, ఆ పదాన్ని నేనూ చూశాను. ‘అమరసంయముడు, అమరసంయమనుడు’ అని రెండు విధాలుగా ఉంది. కాని కేవల ‘సంయముడు’ అన్న పదం నేను వెదకిన తెలుగు, సంస్కృత నిఘంటువులలో దొరకలేదు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరింప నున్నవి !
ఆపదలో నున్నప్పుడు అనునయము అందరికీ అవసరమే గద :
01)
______________________________
అమితమగు నష్ట మొనరిన
కుమిలెడి వేళ , దరి జేరి - కుందును దీర్చన్
మమతగ నందించెడి , యనున
యము నిష్ట పడంగ నొప్పు - నఖిల ప్రాణుల్ !
______________________________
శ్రీ వసంత కిశోర్ గారూ!
రిప్లయితొలగించండిశుభాశీస్సులు.
మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. 3వ పాదములో ఒక మాత్ర ఎక్కువగా నున్నది. చూడండి. స్వస్తి.
మమతం జూపుచు సతతం
రిప్లయితొలగించండిబమలినభావంబుతోడ నాదరమొప్పన్
తమవా రందించెడి సా
యము నిష్టపడంగ నొప్పు నఖిలప్రాణుల్.
సమతా దృక్పథమున తర
రిప్లయితొలగించండితమభేదంబులను వీడి ధరవారలకున్
మమతం బంచెడిదౌ న్యా
యము నిష్టపడంగ నొప్పు నఖిలప్రాణుల్.
నేమాని వారికి ధన్యవాదములతో :
రిప్లయితొలగించండిఆపదలో నున్నప్పుడు అనునయము అందరికీ అవసరమే గద :
01అ)
______________________________
అమితమగు నష్ట మొనరిన
కుమిలెడి వేళ , దరి జేరి - కుందును దీర్చన్
మమతగ నందించు,యనున
యము నిష్ట పడంగ నొప్పు - నఖిల ప్రాణుల్ !
______________________________
తమతమ వాగ్దానంబుల
రిప్లయితొలగించండిగ్రమముగ నాచరణ జూపు ఘననాయకస
త్తములగు వారల యా ధ్యే
యము నిష్టపడంగ నొప్పు నఖిలప్రాణుల్.
అగ్ని ప్రమాదములో ఒళ్ళంతా కాలి
రిప్లయితొలగించండిముఖం వికృతంగా మారి
దిన దిన గండం నూరేళ్ళాయుష్షు లాంటి పరిస్థితిలో
బాధను భరిస్తూ,సిగ్గు పడుతూ, భయపడుతూ
బ్రతకడం కన్నా, యమునిష్టపడడమే మేలు గదా !
02)
______________________________
కమలిన కాయము పూర్తిగ
విమలంబుగ నున్న ముఖము - వికృతి జెందన్
కుములుచు నోర్చుట కంటెను
యము నిష్ట పడంగ నొప్పు - నఖిల ప్రాణుల్ !
______________________________
కమలు = కాలు = తగలబడు
ప్రయాణ వేళల, సర్వం పోయినప్పుడు మిత్రుల సహాయం ఎంతైనా అవసరం :
రిప్లయితొలగించండి03)
______________________________
గమనమున నున్న వేళల
సమయంబును జూచి దొంగ - సర్వము సడపన్
సమయానికి మిత్ర సహా
యము నిష్ట పడంగ నొప్పు - నఖిల ప్రాణుల్ !
______________________________
సడపు = దొంగిలించు
పూర్వం తెరచాప పడవ లుండేవి !
రిప్లయితొలగించండిదాని దిశను మార్చడానికి తెడ్డు నుపయోగించే వారు !
నదిలో నీళ్ళు వేగంగా ప్రవహిస్తుంటాయి !
గాలికూడా గట్టిగానే వీస్తుంటుంది !
అకస్మాత్తుగా గాలి దిశ మారుతుంది !
అంతే పడవ ఒక పక్కకు ఒరిగిపోయి ప్రయాణిస్తుంది !
ఎంత ఒరుగుతుందంటే పడవ పై అంచు నీటికి తాకేటంతగా !
ప్రయాణీకుల గుండెలు ముందు గుబగుబలాడి , గబ గబా కొట్టుకోవడం మొదలౌతుంది !
కాని ఎవ్వరూ కదలకూడదు !
ఎక్కడి వారక్కడే స్థిరంగా ఉండాలి !
కంగారు పడి కదిలారో !!!
పడవ తిరగబడి పోతుంది !
గజ ఈతగాళ్ళైతే తప్ప బ్రతికి బట్టకట్ట లేరు !
ఆ పరిస్థితిలో అందరూ కోరుకునేదీ,ప్రార్థించేదీ నిరపాయ స్థితినే గదా :
04)
______________________________
అమితమగు వేగ జలముల
గమనము జేసెడి పడవదె - గడబిడ బడినన్
నమసము జేయుచు నిరపా
యము నిష్ట పడంగ నొప్పు - నఖిల ప్రాణుల్ !
______________________________
నమసము = నమస్కారము(దేవునకు)
*****
యిది తెరచాప పడవలో ప్రయాణించిన వారికే అర్థమౌతుంది !
మిత్రు లెవరికైనా ఆ అనుభవం ఉందా ?
మమతా పాశములనియెడు
రిప్లయితొలగించండిభ్రమలనుఁ ద్రుంచుచు నసువుల బాపునటంచున్
సమవర్తినిఁ బోలునెడల
యము నిష్టపడంగ నొప్పు నఖిలప్రాణుల్.
భ్రమలనుఁ ద్రుంచుటకే యతడు యసువుల బాపునని తెలిసినయెడల , సమవర్తిని పోలు బుద్ధి గలిగిన వారైతే యమునిష్టపడతారు.
కాన్సరు ముదిరితే యముడే గతి గదా :
రిప్లయితొలగించండి05)
______________________________
అమరిన కాన్సరు, జీవిత
గమనమ్మున కడ్డు పడుచు - గత్తర సేయన్
మనమందు కుంది, చివరకు
యము నిష్టపడంగ నొప్పు - నఖిల ప్రాణుల్ !
______________________________
శ్రమనొందిచేయుకార్యము
రిప్లయితొలగించండిక్రమముగతగుఫలితమీయకలుగును ముదమున్
విమలమగుయశమునిచ్చుజ
యము నిష్టపడంగ నొప్పు నఖిల ప్రాణుల్
ప్రియమగు కాలము లేకను
రిప్లయితొలగించండిభయముగ కష్టమ్ములెన్నొ ' పడగను ' మీదన్
రయమున తొలగింపగ సా
యము నిష్టపడంగ నొప్పు నఖిల ప్రాణుల్
మమతానురాగములు న
రిప్లయితొలగించండిర్థము సౌఖ్యవిహారకేళి రాజిల్లుచు భో
గములుండెడు కోడెప్రా
యము నిష్టపడంగ నొప్పు నఖిల ప్రాణుల్.
శ్రీ హనుమచ్చాస్త్రిగారూ,
రిప్లయితొలగించండి"ప్రాస" ??
శ్రీ శంకరయ్య గారికి నమస్సులు
రిప్లయితొలగించండియమ నియమ సంయమమ్ములు
సమాజ జీవన సరళిని సమకూర్చినచో
సమధికమగు హితుల నికా
యము నిష్టపడంగ నొప్పు నఖిలప్రాణుల్.
అమలిన భావాన్విత హృద
రిప్లయితొలగించండియములో పరమాత్మ తత్త్వ మనవరతము ధ్యే
యము గాగ సకల జన శ్రే
యము నిష్ట పడంగ నొప్పు నఖిల ప్రాణుల్
రిప్లయితొలగించండిమమతల తోడన మెలగుచు
విమలంబగు మనసు తోడ ,వీడని ప్రేమన్
దమవా రందఱు నిడుసా
యము నిష్ట పడంగ నొప్పు నఖిల ప్రాణుల్
వసంత కిశోర్ గారూ,
రిప్లయితొలగించండిఅనునయమును, యముని, సహాయమును, నిరపాయమును ఇష్టపడుతున్న మీ అయిదు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో ‘అందించు + అనునయము’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘అందించు ననునయము’ అనాలి.
రెండవ పూరణలో ‘వికృతి జెందన్’ అన్నచోట గణభంగం. అక్కడ ‘వికృతము గాఁగన్’ అంటే సరి.
*
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
సాయము, న్యాయము, ధ్యేయములతో మీరు చెప్పిన మూడు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
*
లక్ష్మీదేవి గారూ,
‘సమవర్తి’ పదాన్ని సార్థకంగా ప్రయోగించారు. పూరణ బాగున్నది. అభినందనలు.
*
శైలజ గారూ,
జయము నిష్టపడిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మంచి భావంతో సాయము నిష్టపడిన మీ పూరణ బాగుంది. కాని ప్రాస తప్పింది (సంపత్ కుమార్ శాస్త్రి గారు చెప్పకుంటే నేను గమనించకపోయేవాణ్ణి సుమా!) ప్రాసను సరిచేస్తూ మీ పద్యానికి నా సవరణ....
తమ తమ కిష్టమ్మగు కా
లము లేకన్ భయము నిడుములను పడి తుద వే
గమునను తొలగింపగ సా
యము నిష్టపడంగ నొప్పు నఖిలప్రాణుల్.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
ప్రాయముతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
‘కోడె ప్రాయము’ అన్నప్పుడు ‘డె’ గురువు కాదు. దానితో గణభంగ. అక్కడ ‘తరుణప్రాయము’ అందాం.
*
నాగరాజు రవీందర్ గారూ,
ప్రేమమయంగా మీరు చెప్పిన పూరణ బాగున్నది. ‘జగతిని’ అనడం సాధువు. ‘స్వాభావ్యమునన్’ అన్నచోట ‘స్వాభావికమై’ అంటే బాగుంటుందేమో.
*
భాగవతుల కృష్ణారావు గారూ,
హితనికాయముతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
‘సర్వే జనాస్సుఖినో భవంతు’ అన్నట్టు జనశ్రేయమును కోరిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
*
సుబ్బారావు గారూ,
సాయము నిష్టపడుతూ చెప్పిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
ధన్యవాదములు గురువుగారూ,
రిప్లయితొలగించండికోడె అనే పదము తెలుగు, ప్రాయము - సంస్కృతము అవటమువలన డ గురువు కాదనుకుంటాను ( కుసంధి ).
మీ సవరణ సర్వదా శిరోధార్యము. ధన్యోస్మి.
సుమధురమౌభాషణములు
రిప్లయితొలగించండిసుమములు హిమశీకరములు సుందర సీమల్
మమతా సమతగలకువ
యము నిష్ట పడంగ నొప్పు నఖిల ప్రాణుల్
శ్రీ కంది శంకరయ్య గారికి శుభాశీస్సులు.
రిప్లయితొలగించండివ్యతిరేకార్థక పదములు కళలే కదా. లేకన్ అని వాడరాదనుకొంటాను. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారి పద్యమును సవరించుచు మీరు చెప్పిన పద్యములో లేకన్ అనే పదము తప్పుగా దొరలినది. చూడండి. స్వస్తి.
శ్రీ సంపత్ కుమార శాస్రి గారూ! శుభాశీస్సులు.
మీ పద్యములో కోడె ప్రాయము అనుట కుసంధి కాదు. సమాసములో మొదటి పదంగా తెలుగు పదమును వాడవచ్చును. మొదటి పదము సంస్కృతము అగునప్పుడు 2వ పదమును తెలుగు పదమును వాడరాదు. స్వస్తి.
శ్రీమతి శైలజ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. 3వ పాదములో టైపు పొరపాటు దొరలినట్లున్నది. కువయము అను పదము లేదు కదా. చూడండి. స్వస్తి.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిధన్యవాదాలు. నిజమే. అక్కడ తప్పు చేశాను. ‘లేకన్’ అన్నదాన్ని ‘లేకయె’ అని చదువుకొనమని మనవి.
*
శైలజ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో ‘కువల’ లో ‘ల’ టైపు కాలేదు.
పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
అమరును ప్రతి జీవికి బా
ల్యము కౌమారమ్ము కోడె ప్రాయము వార్ధ
క్యము నా దశ లoదున ప్రా
యము నిష్టపడంగ నొప్పు నఖిల ప్రాణుల్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితమతమ జాతి సహజ వై-
రిప్లయితొలగించండిరములను విడనాడి జంతు రాశి మెలగునా
శ్రమమున, వశిష్టుడను సం-
యము నిష్టపడంగ నొప్పు నఖిలప్రాణుల్.
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిప్రాయపు దశలను వివరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
మిస్సన్న గారూ,
మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
‘సంయమి’ శబ్దం ఉన్నది కానీ ‘సంయముడు’ శబ్దం ఉన్నట్టు వినలేదు!
పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
మరియొక పూరణ:
గమనించు చుంద్రు యమనిల
యము జేరుట ప్రాణు లన్ని యహరహములు గా
ని మహి నశాశ్వతమగు కా
యము నిష్టపడంగ నొప్పు నఖిల ప్రాణుల్
కమలముల వంటి కన్నులు
రిప్లయితొలగించండిసుమముల వలె బూసినట్టి సొగసులతో దే
హము గల పిల్లల లేబ్రా
యము నిష్ట పడంగ నొప్పు నఖిల ప్రాణుల్.
గురువుగారికి,శ్రీ నేమాని గురువుగారికి ప్రణామములు.కువలయము లో ల టైపు కాలేదు, నేను చూసుకోకుండా పోస్టు చేసాను ..మన్నించవలెను..ధన్యవాదములతో..
రిప్లయితొలగించండిసుమధురమౌభాషణములు
సుమములు హిమశీకరములు సుందర సీమల్
మమతా సమతగలకువల
యము నిష్ట పడంగ నొప్పు నఖిల ప్రాణుల్
శ్రీనేమాని గురువర్యులకు ధన్యవాదములు. సందేహనివృత్తి చేశారు.
రిప్లయితొలగించండికెంబాయి తిమ్మాజీ రావు గారూ,
రిప్లయితొలగించండిమీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
*
బొడ్డు శంకరయ్య గారూ,
మీ లేబ్రాయపు పూరణ బాగున్నది. అభినందనలు.
గురువుగారూ నిఘంటువులో అమరసంయముడు అంటే దేవర్షి నారదుడు అని ఉన్నదండీ.
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ,
రిప్లయితొలగించండిఆ పదాన్ని నేనూ చూశాను. ‘అమరసంయముడు, అమరసంయమనుడు’ అని రెండు విధాలుగా ఉంది. కాని కేవల ‘సంయముడు’ అన్న పదం నేను వెదకిన తెలుగు, సంస్కృత నిఘంటువులలో దొరకలేదు.
సుమసునిశిత శైశవమున
రిప్లయితొలగించండిసమయానికి వడిని జేర్చి సంబాళించన్
నిమురుచుఁ దల్లి నొసఁగు స్త
న్యము నిష్ట పడంగ నొప్పు నఖిల ప్రాణుల్
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమాతృస్తన్యమును గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
సంపత్కుమార్ గారూ ! ధన్యవాదములు. కార్యాలయమునకు వెడలు తొందరలో పొరపాటు చేశాను.చూసుకోలేదు.
రిప్లయితొలగించండిమాస్టరుగారూ ! చక్కని సవరణకు ధన్యవాదములు.
నా మరియొక పూరణ.....
రిప్లయితొలగించండియమకష్టము మీదకు సమ
యములేకను వచ్చి వాల హతవిధి యనుచున్
యమహాయిని గూర్పెడు సా
యము నిష్టపడంగ నొప్పు నఖిల ప్రాణుల్
శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. 3వ పాదములో తల్లి + ఒసగు = తల్లియొసగు (యడాగమము) అగును. స్వస్తి
కమనీయమైన పదవియు
రిప్లయితొలగించండిజమఖర్చులడగని విభుడు, జవురుట కొరకై
రమణీయంబగు నాదా
యము నిష్టపడంగ నొప్పు నఖిలప్రాణుల్
రిప్లయితొలగించండిసముచితమగు సుఖ శాంతుల
సమూహము నెలకొన మేలు సద్భావనల
న్నమలమగు రీతిని సహా
యము నిష్టపడంగ నొప్పు నఖిలప్రాణుల్ !
జిలేబి
కమలపు పార్టియు వారలు
రిప్లయితొలగించండితిమురుచు పలికిరి మరిన్ని తిట్టుల తోడన్:
"మమతను జూడగ పరిపరి
యము నిష్టపడంగ నొప్పు నఖిలప్రాణుల్"