4, జనవరి 2014, శనివారం

సమస్యాపూరణం - 1283 (హైద్రాబా దెంతదూరము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
హైద్రాబా దెంతదూర మయ్య కడపకున్?

31 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అమ్దరి పూరణలూ అలరింప నున్నవి !

    కడపలో బస్సెక్కిన ఒక బట్టల వ్యాపారి పక్క వానితో :

    01)
    _____________________________

    మద్రాసు నుండి వచ్చితి
    భద్రంబుగ నింత దనుక - బట్టల నమ్మన్
    నిద్రదె వచ్చుచు నున్నది
    హైద్రాబా దెంతదూర - మయ్య కడపకున్?
    _____________________________

    రిప్లయితొలగించండి
  2. భద్రాచలమున కేగుచు
    బద్రీనాథుండు మిత్రవర్యుని తోడన్
    రుద్రా! చెప్పుము నాకనె
    హైద్రాబా దెంతదూర మయ్య కడపకున్

    రిప్లయితొలగించండి
  3. కాద్రా యను మాంత్రి కుడట
    రౌద్రా కారముగ నుండి రక్షణ జేయన్
    శూద్రకు డను మిత్రు నడిగె
    హైద్రా బాదెం తదూర మయ్య కడపకున్

    రిప్లయితొలగించండి

  4. ఓ 'ద్ర' ను ప్రాసగ యుంచుచు
    భద్రముగా పూరణొకటి పలుకండనుచున్,
    'రుద్రులు' ఇచ్చె సమస్యను
    "హైద్రాబాదెంతదూర మయ్యకడపకున్?" :-)

    'రుద్రులు' = శ్రీ శంకరార్యులు

    రిప్లయితొలగించండి
  5. భద్రాచలమును చూచితి
    భద్రముగ తిరుమల కాణిపాకము జూస్తిన్
    నిద్రించి రేపు బోయెద
    హైద్రాబా దెంతదూరమయ్య కడపకున్?

    రిప్లయితొలగించండి
  6. మొన్నటి సమస్యకు నా పూరణ...

    విను మహాశివరాత్రికి విశ్వనాథు
    బిల్వదళముల బూజించి పిల్వదగును
    పరగ విజయదశమినాడు పరమ శివుని
    భార్య పదములన్ భక్తితోఁ బట్టఁదగును.

    రిప్లయితొలగించండి
  7. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...

    భద్ర మిత్రుడు శ్రీకాంత్ రాత్రి పూట మేప్ జూచుట గమనించి,ఉదయమున భద్ర శ్రీ కాంత్ ను హైద్రాబాదెంతదూర మయ్య కడపకున్? నని యడుగ,తెలుగు సినిమా హిరో వలె భద్రునకు చేతి వాటము ఎక్కువ దానితో భయపడుచు శ్రీ కాంత్.
    ==============*===============
    భద్రు డడిగె శ్రీకాంతుని
    హైద్రాబా దెంతదూర మయ్య కడపకున్?
    నిద్ర సమయమున గొలిచితి
    భద్రా! యది జానె డనుచు భయమున దెలిపెన్ !

    రిప్లయితొలగించండి
  8. ఓ 'ద్ర' ను ప్రాసగ యుంచుచు
    భద్రముగా పూరణొకటి పలుకండనుచున్,
    'రుద్రులు' ఇచ్చె సమస్యను
    "హైద్రాబాదెంతదూర మయ్యకడపకున్?"
    --------------------------
    పుష్యం గారూ సమస్యను సమస్యగానే పూరణ చేశారు. బాగుంది.

    రిప్లయితొలగించండి
  9. హృద్రోగపీడితుండయి
    భద్రుడు వైద్యార్థ మేగవలెనని యిట్టుల్
    మద్రాసు మిత్రునడిగెను
    హైద్రాబాదెంత దూరమయ్య కడపకున్.

    నిద్రించనేల మిత్రమ!
    యీ ద్రవ మొకయింత త్రాగు మీమార్గమునన్
    భద్రముగా జేరెదమిక
    హైద్రాబాదెంత దూరమయ్య కడపకున్.

    రిప్లయితొలగించండి
  10. విద్రోహ చర్య వలనన్
    ఛిద్రంబయె కాలు చేయి శ్రీమతికిచటన్
    హైద్రాబాద్ వెడల మనిరి
    హైద్రబాదెంత దూరమయ్య కడ
    పకున్

    రిప్లయితొలగించండి
  11. భద్రాచల మున కేగితి
    హైద్రా బాదునకు నేగ నవసర మయ్యె
    న్నయ్యా చెప్పుడు మీరలు
    హైద్రా బాదెంత దూరమయ్య కడపకున్ ?

    రిప్లయితొలగించండి
  12. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పుష్యం గారూ,
    ‘ద్ర’ మరీ దుష్కరప్రాస కాదనుకుంటా.
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘ప్రాసగ నుంచును’ అనండి. ‘పూరణ + ఒకటి’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘పూరణమును పలుకుండనుచున్’ అంటే సరి. ‘రుద్రులు + ఇచ్చె’ అన్నప్పుడు సంధి నిత్యం. ఆ పాదాన్ని ‘రుద్రుఁడు సమస్య నిచ్చెను’ అందామా?
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘చూస్తిన్’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. అక్కడ ‘కాణిపాకము గంటిన్’ అంటే సరి.
    *
    వరప్రసాద్ గారూ,
    హైద్రాబాద్, కడపల మధ్య దూరం జానెడా? వైవిధ్యమైన పూరణ. బాగుంది. అభినందనలు.
    ‘నిద్రాసమయము’ అనాలనుకుంటాను.
    *
    లక్కరాజు వారూ,
    ధన్యవాదాలు.
    *
    సహదేవుడు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మూడవ పాదంలో ప్రాస తప్పింది. నా సవరణ... ‘అవసర మయ్యెన్, భద్రయ్య తెలియజెప్పుము...’

    రిప్లయితొలగించండి
  13. నాగరాజు రవీందర్ గారూ,
    బాగుంది మీ తాజా పూరణ. అభినందనలు. ‘పోవుచున్న’ను ‘పోవుచుంటి’ అనండి.

    రిప్లయితొలగించండి
  14. శ్రీ శంకరయ్య గురుదేవులకు సవరణలకు ధన్యవాదములతో...

    సరదాగా పురించితిని గురువుగారరు
    ==========*=============
    భద్రు డడిగె శ్రీకాంతుని
    హైద్రాబా దెంతదూర మయ్య కడపకున్?
    నిద్రా సమయము గొలిచితి
    భద్రా! యది జానె డనుచు భయమున దెలిపెన్!

    రిప్లయితొలగించండి

  15. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శంకరయ్య గారికి వందనములు

    హైద్రాబాదుయెజీవిక
    హైద్రాబాదే కడపకు నాశ్రయ మవగా
    భద్రా !తగదుర నడుగగ
    హైద్రాబాదెంత దూరమయ్య కడపకున్?

    రిప్లయితొలగించండి
  16. కడప బాంబులతో హైదరాబాదులో విధ్వంసం చెయ్యబూనిన పాకిస్థానీ ఫోన్లో :

    02)
    _____________________________

    ఛిద్రము జేయగ వలెనట
    భద్రంబుగ నున్న జనుల - బాంబుల తోడన్
    విద్రోహపు కూడలి యగు
    హైద్రాబా దెంతదూర - మయ్య కడపకున్?
    _____________________________

    రిప్లయితొలగించండి

  17. మాస్టారు గారూ !ధన్యవాదములు. మీరు చూపిన సవరణ తో..

    భద్రాచలమును చూచితి
    భద్రముగ తిరుమల కాణిపాకము గంటిన్
    నిద్రించి రేపు బోయెద
    హైద్రాబా దెంతదూరమయ్య కడపకున్?

    రిప్లయితొలగించండి
  18. శంకరార్యా,

    'ద్ర' దుష్కరప్రాస కాకపోయినా సమయాభావము వలన సులభమార్గము త్రొక్కవలసి వచ్చినది.
    సవరణలకు ధన్యవాదములు.

    లక్కరాజు గారు,
    పూరణ నచ్చినందుకు ధన్యవాదములు.


    రిప్లయితొలగించండి
  19. భద్రుని నే దొలి కడపకు
    హైద్రాబాదునకు మధ్య నామడలడుగన్
    భద్రుడెదురాడె నిట్టుల
    "హైద్రాబా దెంతదూర మయ్య కడపకున్?"

    రిప్లయితొలగించండి

  20. భద్రాచలమును చూచితి
    భద్రముగ తిరుమల కాణిపాకము గంటిన్
    ---------------------------
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  21. చిద్రము గల హృదయమునకు
    భద్రముగా నైద్య మిడుచు బాగుగ జేసే
    హృద్రోగ నిపుణులుండెడు
    హైద్రాబా దెంత దూర మయ్య కడపకున్.

    రిప్లయితొలగించండి
  22. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
    దయచేసి దోషములను సవరించ మనవి...
    మద్రాసు రైలు యందున
    భద్రముగా బెర్తు నెక్కి బడుకొని యొకడున్
    నిద్రించి మేల్కొని యడిగె
    హైద్రాబాదెంత దూరమయ్య కడపకున్.

    రిప్లయితొలగించండి
  23. ముద్రించ బూనితిని నా
    దీ "ద్రాక్షారామ చరిత", దీనుడ నయ్యా!
    భద్రుడు జగనుని వేడెద;
    హైద్రాబా దెంతదూర మయ్య కడపకున్?

    రిప్లయితొలగించండి


  24. భాద్రపద మాస మందున
    హద్రతు సాయెబు జిలేబి యంగడి గానన్
    బద్రము గా యడిగె సుమా
    హైద్రాబా దెంతదూర మయ్య కడపకున్?

    జిలేబి
    బిలేజీ దుకాణము
    C/o ఆర్టీసీ బస్టాండు
    కడప :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శంకరాభరణంలో నేను విదూషకుడునని చెప్పుకుంటుంటాను. "విదూషకుడు" కు స్త్రీలింగం ఏమిటోనని ఆంధ్రభారతిని అడిగితే కొట్టినంత పని చేసినది. "విదూషకి" కనబడ లేదు. "విదూషిక" ఉన్నదంటే సంబర పడ్డాను. తీరా చూస్తే దాని అర్ధం:

      "పొట్టి కాకర" !!!

      తొలగించండి

    2. విదూషకి ! క్రొత్త పదావిష్కరణ కు జేజేలు జీపీయెస్ వారికి :)


      ఓయి! విదూషకుడా ! గీ
      గీ ! యెలమిగ మీ "విదూషకి" నిఘంటువులో
      ఖాయమగు గాక క్రొత్తగ
      మైయెఱుగుదురిక స్వభావమై స్త్రీత్వంబై :)

      జిలేబి

      తొలగించండి