కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
తాటకిని జంపె భరతుఁడు తపసి కనఁగ.
ఈ సమస్యను పంపిన నాగరాజు రవీందర్ గారికి ధన్యవాదాలు.
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది......
తాటకిని జంపె భరతుఁడు తపసి కనఁగ.
ఈ సమస్యను పంపిన నాగరాజు రవీందర్ గారికి ధన్యవాదాలు.
భరతు డనువాడు రాముని పాత్ర వేసె
రిప్లయితొలగించండినొక్క నాటకమున దాని నొకడు జూచి
పల్కె నీరీతి వ్యంగ్య వైభవము మెరయ
తాటకిని జంపె భరతుడు తపసి కనగ
రామచంద్రుండు గురుకార్యరక్షణమున
రిప్లయితొలగించండితాటకిని జంపె, భరతుడు తపసి కనగ
నగ్రజన్ముని పాదుకలందుకొనుచు
హర్షమునుబూని త్యజియించె నందలమును.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిభరతుడిని నటుడిగా చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
అందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
విశ్వామిత్రుని మాటపై భరతుడు(రాముడు) :
01)
_________________________________
దారి గాచుచు జనుల ,న - ధర్మముగను
తల్లడిల్లగ జేయుచు , - దలల ద్రుంచి
చంపి తినుచున్న రాకాసి ,- జంపుమన్న
గురుని మాటను తలదాల్చి - ఘోరముగను
తాటకిని జంపె భరతుఁడు - తపసి కనఁగ !
_________________________________
భరతుడు = ఆయుధ ధారిగా జీవించేవాడు.(రాముడు)
భరతుడు : పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010
[హిందూ] వైదిక వాఙ్మయంలో వినవచ్చే పేరు.
నానార్థాలలో కొన్ని :
రాముడి తమ్ముడు, దుష్యంతుని కొడుకు,
ఋషభ దేవుని పెద్ద కొడుకు (ఇతడు భారత వర్ష ప్రసిద్ధికి కారకుడు),
నాట్య శాస్త్ర కర్త, నట్టువుడు, సాలెవాడు (బోయవాడు), అగ్నిపుత్రుడు,
ఆయుధ ధారిగా జీవించేవాడు.
గురువు నాజ్ఞను జవదాట నెరుగ నట్టి
రిప్లయితొలగించండిరామ చంద్రుడు శంకించె రమణి యనుచు
తాటకిని జంపె , భరతుడు తపసి కనగ
ముకు జెవులు గోసి విడచెను ముచ్చ టనగ
ఘన శకారులు నేడేమొ కనగ హెచ్చె
రిప్లయితొలగించండిప్రశ్నలడుగగ చెబుదురు బదులునిట్లు
రామచరితము వ్యాసుండు వ్రాసినాడు
తాటకిని జంపె భరతుఁడు తపసి కనఁగ.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిదైవ భక్తి ముందు కుల మత జాతి వివక్షత లేదు. ఎంతో మంది అజ్ఞానులను జ్ఞానులుగాను, అవిద్యావంతులను విద్యావంతులు గాను మార్చిన కథలు ఎన్నో ఉన్నాయి. వారిని పరీక్షించటానికి మునులు, ఋషులు, సాక్షాత్తు భగవంతుడు కూడా అనేక రకాల పరీక్షలు పెట్టిన సందర్భాలు మనం చదువుకున్నాము. అలాగే ఒక మగ్గపు పని చేయువానిని గురించి ఊహించి వ్రాసిన పద్యం
రిప్లయితొలగించండినేతగాడొకడీ భువి నిరతముగను
మునుల బూజించి నిత్యము మ్రొక్కుచుండ
యంత నొకనాడు మునియొక్కడబ్బురముగ
భవ్యమౌ నేతపని జేయు భరతు జేరి
సవ్యముగ బొంది సేవలు సంతసించి
అడిగెనప్పుడు యొక ప్రశ్ననబ్బురముగ
“రామబాణంబు మహిమను రమ్యముగను
తెలుపుమీవేళ మాకును ధన్యజీవి!”
“రామబాణంబు సూర్యాగ్ని రశ్మివోలె
తాటకిని జంపె”; భరతుడు తపసి కనగ
చెప్పెనీ వాక్యమప్పుడు; చిరునగవున
అమిత ఆనందమందుచు యపుడు మౌని
“యశము గొనుమ”ని యాశీస్సులందజేసె.
(భరతుడు = మగ్గపు పని చేయువాడు)
గురువుగారికి నమస్కారములతో.................
రిప్లయితొలగించండిఏగితి స్వస్థలంబునకునిన్నిదినంబులు నిచ్చగించి యా
భోగముగాగ బొందితినపూర్వ విధంబుగ శాంతిసౌఖ్యముల్
బ్లాగుకు దూరమైతినను బాధకలుంగగ నేడు మీదు బా
గోగుల గూర్చి కోరితి గురూత్తమ దెల్పుమ దివ్య చిత్తమా!!
కవిమిత్రులకు......
వందనమర్పించెద మీ
కందరకును పద్య విద్యకాధారులకున్
ముందరి దినముల విధముగ
సందర్భము జూచి మంచి సవరణలీరే !
ఇక నా పూరణ....
యాగరక్షణ కొఱకు తన్ననుమతింప
తరలి రాముండు కోదండధరుడు గాగ
భీకరాకరమై నిల్చి భీతి గొల్పు
తాటకిని జంపె - భరతుఁడు, తపసి కనఁగ.
భరతుడు = ఆయుధ ధారిగా జీవించేవాడు ( లక్ష్మణుడు )
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరామచంద్రుడు గురువుకై రక్కసియగు
రిప్లయితొలగించండితాటకిని జంపె; భరతుఁడు తపసి కనఁగ
కాననమునకు జని యన్న కాలు మ్రొక్కి
పాదరక్షల గైకొనె పావనుడుగ.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితండ్రి నొప్పించి రాముడు తరలి వెళ్లి
రిప్లయితొలగించండియాగ రక్షణ గావింప నడ్డగించు
తాటకిని జంపె, భరతుడు తపసి కనగ
రామ పాదుక సేవించి వసుధ నేలె
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములతో...
==============*=================
తపసి యాగము గాచగన్ దశరధుండు
పుత్రులన్ బంప రాముడు ముందు నిలిచి
తాటకిని జంపె,భరతుఁడు తపసి కనఁగ
రామ లక్ష్మణుల నడిగె ప్రేమతోడ !
తండ్రి పంపున రాముడు తరలి వనికి
రిప్లయితొలగించండిమునుల యాగము జెడగొట్టు మూర్ఖ రాలు
తాటకిని జంపె; భరతుఁడు, తపసి, కనఁగ
సంతసించిరి రాక్షసి యంతమునకు.
శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. రామ చరితము వ్యాసుడు వ్రాసినాడు - అనుట నిజమే. వ్యాసుడు వ్రాసిన 18 పురాణములలో రామ కథ ఉన్నది. ప్రత్యేకముగా బ్రహ్మాండ పురాణములో "అధ్యాత్మ రామాయణము" చాల విపులముగా నున్నది. అందుచేత దానిని శకారి వాక్యముగా అన నక్కరలేదు. స్వస్తి.
శ్రీమతి శైలజ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. కొన్ని సూచనలు:
1. రాముడు తండ్రి పంపున విశ్వామిత్రునికి సహాయముగా వెడలెను. తండ్రిని ఒప్పించలేదు.
2. తాటక సంహారము యజ్ఞ సంరక్షణ కంటె ముందుగనే జరిగినది. యజ్ఞమునకు విఘ్నములను కల్పించిన వారు మారీచ సుబాహులు.
స్వస్తి.
శ్రీ సుబ్బా రావు గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. కొన్ని సూచనలు.
1వ పాదములో గణభంగము కలదు. 4వ పాదములో యతి మైత్రి లేదు. రామ అంటే స్త్రీ అనే అర్థము ఉన్నది కానీ తాటకిని "రామ" అనుట కంటే మరొక పదము వాడితే బాగుగ నుండును.
స్వస్తి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగురుని యాజ్ఞను పొంది క్రుద్ధుడై శ్రీరాము
రిప్లయితొలగించండి........డెద్దాని నేర్చినా డింతియనక?
కోరక వరియించు కువలయేశత్వంబు
........గడ్డిపోచగ ద్రోచు ఘనుడెవండు?
తనవెంట వచ్చిన దశరథాత్మజులకు
........నస్త్రవిద్యలు నేర్పు నతడెవండు?
"చూడగ" ననుటకు సూటిగా నింకొక్క
........పర్యాయ మేమందు రార్యులార?
చెప్పు డీప్రశ్న లన్నింటి కొప్పుమీర
నుత్తరంబుల నంచాడ నుత్తమముగ
చెప్పవచ్చును వరుసగా చేర్చి యిటుల
తాటకిని జంపె, భరతుడు, తపసి, కనగ.
పండిత నేమాని వారూ,
రిప్లయితొలగించండిబ్లాగు మిత్రుల పట్ల మీరు వాత్సల్యాన్ని చూపిస్తూ వారి పూరణ గుణదోష విచారణ చేస్తూ, తగిన సలహాలను ఇస్తున్నందకు ధన్యవాదాలు.
నేను అనుకోకుండా మా అక్కయ్య ఊరికి బయలుదేరాను. రేపు ఉదయానికి స్వస్థలం చేరుకుంటాను. దయచేసి ఈ నాటి పూరణల సమీక్షను కొనసాగించవలసిందిగా సవినయంగా మనవి చేస్తున్నాను.
రేపటి సమస్యను షెడ్యూల్ చేసి ఉంచాను.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఋషి వరుడు విశ్వామిత్రు డెలమి తోడ
రిప్లయితొలగించండితపము జేయ నడ్డంకులు తగులకుండ
రాముడు సహస్ర గజబల రాక్షసి యగు
తాటకిని జంపె, భరతుడు తపసి గనక
రంజిలె నపు డగ్రజుని పరాక్రమునకు.
శ్రీ తిమ్మాజీ రావు గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీరు గాధి అనే పదమును వాడేరు. విశ్వామిత్రుడు గాధి నందనుడు కాని గాధి కాడు. అందుచేత గాధికి బదులుగా మౌని అని మార్చుదాము. స్వస్తి.
రామ భద్రుడు కోపాన లేమ యైన
రిప్లయితొలగించండితాటకిని జంపె, భరతుడు తపసి కనగ
రామ చంద్రుని పాదముల్ రమ్య మలర
హత్తు కొనియెను శిరమున హర్ష మొదవ
ధర్మ సూక్ష్మమ్ము నెరిగిన దాశరథియె
రిప్లయితొలగించండితాటకినిజంపె: భరతుడు తపసిగ నగ
రమును వీడెనాకేలయీ రాజ్యమనుచు
పట్టమును గట్టె శ్రీరామ పాదుకలకు !!!
పండిత నేమాని గారికి వందనములు
రిప్లయితొలగించండిమహాపరాధముజరిగినది క్షమించ వలెను మీసవరణతో పద్యము : బాలుడైన రాముడు తండ్రి పనుప మౌని
యాగరక్షణ కేగుచు యాత్రలోన
తాటకిని జంపె.భరతుడు,తపసి గనగ
రామపాదుకల్ రాజుగా రాజ్యమేలె
మిత్రులారా! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిఈనాటి కొన్ని పూరణలను చూద్దాము. అందరికీ అభినందనలు.
శ్రీ వసంత కిశోర్ గారు: భరతుడు అంటే ఆయుధధారి అనే భావంతో మీ పూరణ బాగుగ నున్నది.
శ్రీమతి రాజేశ్వరి గారు: భరతుడు ముకు చెవులు కోయలేదు - లక్ష్మణుడు కదా కోసెను. పద్యము బాగుగ నున్నది.
శ్రీ మారెళ్ళ వామన్ కుమార్ గారు: మీ 3 పద్యములు బాగుగ నున్నవి.
అప్పుడు + ఒక అను చోట అప్పుడొక అని సంధి యగును. యడాగమము రాదు.
అమిత + ఆనందము = సంధి వలన అమితానందమగును. యడాగమము రాదు.
అందుచు + అపుడు = నుగాగమము వచ్చి అందుచు నపుడు అగును.
శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు: మీ పద్యములు బాగుగ నున్నవి.
శ్రీమతి లక్ష్మీ దేవి గారు: మీ పద్యము బాగుగ నున్నది. గురువు + కై అనుచోట గురువునకై అని వాడవలెను.
శ్రీమతి శైలజ గారు: మీ పద్యము బాగుగ నున్నది. 4వ పాదములో యతి మైత్రిని గమనించ లేదు.
శ్రె వరప్రసాద్ గారు: మీ పద్యము బాగుగ నున్నది.
శ్రీ గండూరి లక్ష్మీనారాయణ గారు:
మీ పద్యము బాగుగ నున్నది. మూర్ఖురాలు అనవలెను. టైపు పొరపాటు అనుకొంటాను.
శ్రీ హరి వెం. స. నా. మూర్తి గారు: మంచి సీస పద్యములో క్రమాలంకారమును వాడేరు. బాగుగ నున్నది.
శ్రీ తిమ్మాజీ రావు గారు: మీరు సవరించిన పద్యము బాగుగ నున్నది. 2వ పాదములో "సం" అనే అక్షరమును తొలగించినచో గణభంగము ఉండదు.
శ్రీ బొడ్డు శంకరయ్య గారు: మీ పద్యము బాగుగ నున్నది.
శ్రీ సుబ్బా రావు గారు: మీ 2వ పద్యము బాగుగ నున్నది.
స్వస్తి.
శ్రీ మంద పీతాంబర్ గారు: శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమంచి విరుపుతో తపసిగ నగరమును వీడె ననుట చాల బాగుగ నున్నది. అభినందనలు.
శ్రీ తిమ్మాజీ రావు గారు: శుభాశీస్సులు.
మీరు సవరించి వ్రాసిన పద్యము చాల బాగుగ నున్నది.
గురువుగారూ, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిరాముడొక్క గురువునకై రక్కసియగు
తాటకిని జంపె; భరతుఁడు తపసి కనఁగ
కాననమునకు జని యన్న కాలు మ్రొక్కి
పాదరక్షల గైకొనె పావనుడుగ.
శ్రీమతి లక్ష్మీ దేవి గారూ!
రిప్లయితొలగించండిశుభాశీస్సులు. మీరు సవరించి వ్రాసిన పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
శ్రె నాగరాజు రవీందర్ గారూ!
శుభాశీస్సులు. మీరు క్రమాలంకారముతో వ్రాసిన పద్యము బాగుగ నున్నది. అభినందనలు.
మిత్రులారా! శుభాశీస్సులు.
సమస్యలను పూరించు నప్పుడు వేరొక అవకాశము లేని యప్పుడు మాత్రమే క్రమాలంకారమును ఆశ్రయించ దగునని మా గురువు గారు అనెడి వారు. క్రమాలంకారమునకు ఎక్కువ గుర్తింపు లేదు అని పెద్దలు అందురట.
స్వస్తి.
మంధర కైకతో అన్న మాటలు:
రిప్లయితొలగించండిరాముడు కఠినుడు! నిను భరతుని జంపు!
ఆడుదని చూడక యడవినందు కొట్టి
తాటకిని జంపె ! భరతుడు తపసి గాన
కరుణనేలు ప్రజలను! కైకమ్మ వినుమ!
శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఆడువారిని జంపుట పాపమన్న రామునితో విశ్వామిత్రుడు
=============*============
లోక కళ్యాణము కొరకు కాకులవలె
జంప వచ్చు నఘము గాదు,శరము బట్టు
రాఘవ! వడి వడిగ నన రక్కసి యగు
తాటకిని జంపె భరతుఁడు తపసి కనఁగ
తెలుగు పంతులమ్మ వగచి పలికె
రిప్లయితొలగించండినిన్నటి పరీక్షఁ దప్పొప్పు లెన్నమనగ
పిల్ల లెల్ల రొప్పనిరి యీకల్ల నకట!
తాటకిని జంపె భరతుడు తపసి కనగ
శ్రీ ఆదిత్య గారూ!
రిప్లయితొలగించండిశుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. కాని మీరు సమస్యను మార్చినట్లున్నది. తపసి కనగ అనే సమస్యను తపసి గానక అని మార్చేరు. ఆరీతిగ సమస్యను మార్చరాదు కదా.
శ్రీ వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
మీ తాజా పూరణ కూడా బాగుగ నున్నది. అభినందనలు.
శ్రీ శంకరయ్యగారికి నమస్సులు
రిప్లయితొలగించండిరాముడడవిని గాంచగ రక్కసి యని
తాటకిని జంపె; భరతుడు "తపసి కనగ
మిగుల నానంద మున్బొంది మెచ్చె" ననుచు
నెరిగి తలిదండ్రులకు దెల్పి యరిగె జూడ
1283 వ సమస్యకు పూరణ
నిద్రాహరములు విడిచి
భద్రముగా నాంధ్రనేల పావులు కదుప
న్నద్రిని శివునిగ నుండగ
హైద్రాబా దెంతదూర మయ్య కడపకున్?
1284 వ సమస్యకు పూరణ
గోవుల కాపరి యెత్తగ
గోవర్ధన పర్వతమును; గోమలి యెత్తెన్
గోవుల గాచెడు బాలుని,
దేవుడె యతడంచు తనకు తెలియని కతనన్
1285 వ సమస్యకు పూరణ
మిగుల పులిసిన నిలవున్న తెగులు గలిగి
యూరవేసిన యుసిరిక లుసురు దీయ
కోరి క్రుళ్ళిన బొండాము నీరు గలుప
నారికేళజలమ్ము ప్రాణమ్ము దీయు
నమస్కారములు
రిప్లయితొలగించండిగురువులు క్షమించాలి భరతుణ్ణేం చెయ్యాలో తెలియక అలావ్రాసాను
గురువు నాజ్ఞను జవదాట నెరుగ నట్టి
రామ చంద్రుడు శంకించె రమణి యనుచు
తాటకిని జంపె...భరతుడు తపసి కనగ
పాదుకలు శిరము నదాల్చి భక్తి గొలిచె .....అని వ్రాస్తె సరిపోతుం దనుకుంటాను
ఋషి వరుడు విశ్వామిత్రు డెలమి తోడ
రిప్లయితొలగించండితపము జేయ నడ్డంకులు తగులకుండ
రాముడు సహస్ర గజబల రాక్షసి యగు
తాటకిని జంపె, భరతుడు తపసి కనఁగ
రంజిలె నపు డగ్రజుని పరాక్రమునకు.
గురువుగారికి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండినిజమే చూడడంలో పొరబడ్డాను. అయితే ఆ పదం మార్చినా భావం సరిపోతోందనే అనుకుంటున్నాను. దయచేసి చెప్పగలరు.
మంధర కైకతో అన్న మాటలు:
రాముడు కఠినుడు! నిను భరతుని జంపు!
ఆడుదని చూడక యడవినందు కొట్టి
తాటకిని జంపె ! భరతుడు తపసి కనగ!
కరుణనేలు ప్రజలను! కైకమ్మ వినుమ!