శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..... శ్రీ శంకరయ్య గురుదేవులకు సవరణలకు ధన్యవాదములతో...
1982 నుంచి 1990 వరకు శ్రీ ఉషశ్రీ గారి వ్యహార శైలి పై( ఛలోక్తులు )హాస్యము పండించెడి వారు. వారు బ్రతికి యున్న ఈ పూరణను వారు జెప్పు విధమున సరదాగా పురించితిని,వారు ముందుగా బలికెడి పలుకు జూడు నాయనా యనుచు ! ============*============== పెండ్లి కాని వారలకె వేవిళ్ళు గలుగు ననుచు రామాయణపు కాల మందు మునులు వేద విద్యార్థులకు జెప్పి,విపినములకు పంపిరని జెప్పుచున్నవి భారతమ్ము !
కవిమిత్రులకు నమస్కృతులు. నిన్న సాయంత్రం సమస్యను షెడ్యూల్ చేశాను. ఉదయం ఎన్ని పూరణలు వచ్చాయా అని చూస్తే అసలు సమస్యే పోస్ట్ కాలేదు. ఎందుకో అర్థం కాలేదు. వెంటనే సమస్యను మళ్ళీ పోస్ట్ చేశాను. * గండూరి లక్ష్మినారాయణ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. * భాగవతుల కృష్ణారావు గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. అయితే కుంతి, శకుంతలల ఉదాహరణలు చెప్పి పెళ్ళికానివాళ్ళందరికీ అని సార్వజనీనం చేయడం బాగుండదేమో కదా! ఇక సమస్య విషయానికి వస్తే ‘వారలకె’ అని నిశ్చయార్థంగా ఉంది. అంటే పెండ్లి అయిన వాళ్ళకు కాదనే కదా! సమస్య ఎప్పుడూ అసహజమూ, అసంబద్ధమూ, అసత్యమూ అయిన అర్థం లోనే ఉంటుంది. దానిని సమర్థంగా పరిష్కరించడమే కదా సమస్యాపూరణము. * వరప్రసాద్ గారూ, మీ పూరణ బాగుంది. అభినందనలు. ‘చెప్పుచున్నది భారతమ్ము’ అనాలనుకుంటాను.
నేటి సమస్యలో పెండ్లైన వారికి వేవిళ్ళు గలుగవు అన్న భావం అంతర్గతంగా స్ఫురిస్తున్నది. సమస్యను '' పెండ్లి లేకున్న రావె వేవిళ్ళు స్త్రీకి '' గా సవరించిన సమంజసముగా ఉంటుందేమోనని నా భావన. ఈ సూచన చేసినందుకు క్షంతవ్యుడను.
శ్రీ రామకృష్ణ గారూ! శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. ఒక సూచన: పాఠశాల నందలి అని నుగాగమము రాదు. పాఠశాల యందలి అని యడాగమము చేయదగును. స్వస్తి.
పెండ్లి కాని వారలకె వేవిళ్ళు కలుగు
రిప్లయితొలగించండినంచు బలుకుట మిక్కిలి యనుచితంబు
పెండిలైనను కాకున్న నిండు వయసు
తరుణి కూడిన పురుషుని దనుకు నవియు.
శ్రీ కంది శంకరయ్య గారికి నమస్సులు
రిప్లయితొలగించండిపెండ్లి కాకనె కుంతికో బిడ్డపుట్ట
పెండ్లి కాక శకుంతల బిడ్డను గన
పెండ్లికాకున్న వీరు వేవిళ్ళు పొంద
పెండ్లికాని వారలకె వేవిళ్ళుగలుగు
అనుబంధ వ్యాఖ్య
పెండ్లి కాని వారలకె వేవిళ్ళు గలుగు అనునపుడు
పెండ్లి జరిగిన వారలకు విధిగా వేవిళ్ళు వస్తాయని చెప్పగలమా ?
ఈ సందేహ నివృత్తి చేయగలరు
శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో.....
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గురుదేవులకు సవరణలకు ధన్యవాదములతో...
1982 నుంచి 1990 వరకు శ్రీ ఉషశ్రీ గారి వ్యహార శైలి పై( ఛలోక్తులు )హాస్యము పండించెడి వారు. వారు బ్రతికి యున్న ఈ పూరణను వారు జెప్పు విధమున సరదాగా పురించితిని,వారు ముందుగా బలికెడి పలుకు జూడు నాయనా యనుచు !
============*==============
పెండ్లి కాని వారలకె వేవిళ్ళు గలుగు
ననుచు రామాయణపు కాల మందు మునులు
వేద విద్యార్థులకు జెప్పి,విపినములకు
పంపిరని జెప్పుచున్నవి భారతమ్ము !
కవిమిత్రులకు నమస్కృతులు.
రిప్లయితొలగించండినిన్న సాయంత్రం సమస్యను షెడ్యూల్ చేశాను. ఉదయం ఎన్ని పూరణలు వచ్చాయా అని చూస్తే అసలు సమస్యే పోస్ట్ కాలేదు. ఎందుకో అర్థం కాలేదు. వెంటనే సమస్యను మళ్ళీ పోస్ట్ చేశాను.
*
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
అయితే కుంతి, శకుంతలల ఉదాహరణలు చెప్పి పెళ్ళికానివాళ్ళందరికీ అని సార్వజనీనం చేయడం బాగుండదేమో కదా!
ఇక సమస్య విషయానికి వస్తే ‘వారలకె’ అని నిశ్చయార్థంగా ఉంది. అంటే పెండ్లి అయిన వాళ్ళకు కాదనే కదా! సమస్య ఎప్పుడూ అసహజమూ, అసంబద్ధమూ, అసత్యమూ అయిన అర్థం లోనే ఉంటుంది. దానిని సమర్థంగా పరిష్కరించడమే కదా సమస్యాపూరణము.
*
వరప్రసాద్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘చెప్పుచున్నది భారతమ్ము’ అనాలనుకుంటాను.
శ్రీ శంకరయ్య గురుదేవులకు సవరణలకు ధన్యవాదములతో...
రిప్లయితొలగించండిటైపు జేసిన తరువాత చదువకుంటిని మన్నించ ప్రార్థన ,
-------------*------------
పెండ్లి కాని వారలకె వేవిళ్ళు గలుగు
ననుచు రామాయణపు కాల మందు మునులు
వేద విద్యార్థులకు జెప్పి, విపినములకు
పంపిరని చెప్పుచున్నది భారతమ్ము !
పశ్చిమపు సంస్కృతీ బాట పట్ట నేడు
రిప్లయితొలగించండిస్త్రీ పురుష సహజీవన తీరు ముదిరి
సాంప్రదాయము మనదిట సన్నగిల్ల
పెండ్లి కాని వారలకె వేవిళ్ళు గలుగు
సహదేవుడు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
పెండ్లి కానివారలకె వేవిళ్ళు గలుగు
రిప్లయితొలగించండిపెండ్లి తోబంధము మఱి వే విళ్లకు నిల
కలుగ బోదార్య ! నిజమిది కనుము నీవు
కుంతి మొదలగు మహిళల గూర్చి యికను
శ్రీ సహదేవుడు గారు: శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యమును చూచేను. అభినందనలు. కొన్ని సూచనలు:
1. సంస్కృతీ బాట : సమాసమునకు బదులుగా సంస్కృతి పథము అనండి.
2. సహజీవన తీరుకి బదులుగా సహజీవన స్థితులు అనండి.
స్వస్తి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీ భాగవతుల కృష్ణా రావు గారికి నమస్కారములు.
రిప్లయితొలగించండిమీ పద్యమును చూచేను. అభినందనలు.
కుంతికో బిడ్డ అనుట సాధు ప్రయోగము కాదు. ఒక బిడ్డ అనవలెను కదా.
స్వస్తి.
సుబ్బారావు గారూ,
రిప్లయితొలగించండిమీ పూరణ బాగుంది. అభినందనలు.
*
పండిత నేమాని వారూ,
ధన్యవాదాలు.
అనుబంధ వ్యాఖ్య 2
రిప్లయితొలగించండినేటి సమస్యలో పెండ్లైన వారికి వేవిళ్ళు గలుగవు అన్న భావం అంతర్గతంగా స్ఫురిస్తున్నది. సమస్యను '' పెండ్లి లేకున్న రావె వేవిళ్ళు స్త్రీకి '' గా సవరించిన సమంజసముగా ఉంటుందేమోనని నా భావన. ఈ సూచన చేసినందుకు క్షంతవ్యుడను.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపెండ్లి కాని వారలకె వేవిళ్ళు గలుగు
రిప్లయితొలగించండినర్హతలు లేని వారికే యబ్బు పదవి
వార్ధి యుప్పొంగు కద యమావాస్య నాడె
వింతలే నిజమగుచుండును పృథ్వి యందు
చిత్రమైనట్టి కలవచ్చె చెప్పుచుంటి
రిప్లయితొలగించండివింత లోకంబు కలదొండు వినగ నందు
పురుషులకు వచ్చు గర్భంబు సురుచిరముగ
పెండ్లి కానివారలకె వేవిళ్ళు కలుగు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
రిప్లయితొలగించండిశంకరయ్య గారికి వందనములు
పెండ్లికానివారికె వేవిళ్ళు కలుగు
ననుట భావ్యము కాదని మనవిసేతు
చానపురుషుల కలయిక సఫల మవగ
పెండ్లితో పని లేక వేవిళ్ళుకలుగు
రిప్లయితొలగించండిపాఠశాల నందలి తోటి బాల యొకొతె
పెళ్ళి కుదిరినటుల జెప్ప వింత కలుగు
పెండ్లికాని వారలకె; వేవిళ్లు కలుగు
చున్న వార్త క్రన్నన విని చోద్యమనరె?
శ్రీ నేమాని గురుదేవుల సవరణలకు ధన్యవాదములతో..
రిప్లయితొలగించండిపశ్చిమపు సంస్కృతి పథము పట్ట నేడు
స్త్రీ పురుష సహజీవన స్థితులు ముదిరి
సాంప్రదాయము మనదిట సన్నగిల్ల
పెండ్లి కాని వారలకె వేవిళ్ళు గలుగు
శ్రీ రామకృష్ణ గారూ! శుభాశీస్సులు.
రిప్లయితొలగించండిమీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. ఒక సూచన:
పాఠశాల నందలి అని నుగాగమము రాదు. పాఠశాల యందలి అని యడాగమము చేయదగును.
స్వస్తి.
రిప్లయితొలగించండిపండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
శంకరయ్య గారికి వందనములు
మరియొక పూరణ :తాళి కట్టెద రెవరికుద్వాహమందు ?
కడుపుతో నున్న కలికి కి కలుగు నేవి ?
ఎలుక నివసించు స్థానమ దేమొ ?చెపుమ
పెండ్లి కాని వారలకె.వేవిళ్ళు. కలుగు
ఇతర దేశము లందున వెతలు మరచి
రిప్లయితొలగించండికలసి దిరుగుచు నుందురు చెలిమి గాను
వలపు పరవశ మందున యిలను మరచి
పెండ్లి కాని వారలకె వేవిళ్ళు గలుగు
పండిత నేమాని వారికి నమస్సులు. ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమీరు సూచించిన మేరకు పద్యము సవరించుచున్నాను.
పాఠశాల యందలితోటి బాల యొకొతె
పెళ్ళి కుదిరినటుల జెప్ప వింత కలుగు
పెండ్లికాని వారలకె; వేవిళ్లు కలుగు
చున్న వార్త క్రన్నన విని చోద్యమనరె?
భవదీయుడు